(Source: ECI/ABP News/ABP Majha)
Stocks To Watch 02 November 2023: ఈ రోజు మార్కెట్ ఫోకస్‌లో ఉండే 'కీ స్టాక్స్' Adani Ent, Tata Moto, Tata Steel
మన స్టాక్ మార్కెట్ ఇవాళ పాజిటివ్‌గా ప్రారంభం అవుతుందని GIFT NIFTY సూచిస్తోంది.
Stock Market Today, 02 November 2023: యుఎస్ ఫెడ్ ఫలితాలకు ముందు ఇన్వెస్టర్లు జాగ్రత్తగా వ్యవహరించడంతో, ఇండియన్ ఈక్విటీలు బుధవారం పడిపోయాయి. మార్కెట్ అంచనాలకు అనుగుణంగా ఫెడ్ వడ్డీ రేటులో మార్పు లేదు. అయితే, ఫెడ్ ఛైర్ వ్యాఖ్యలకు అనుగుణంగా మార్కెట్లు ఈ రోజు ప్రతిస్పందిస్తాయి.
లాభాల్లో అమెరికన్ స్టాక్స్
U.S. ఫెడరల్ రిజర్వ్ వడ్డీ రేట్లను మార్చకపోవడంతో వాల్ స్ట్రీట్ ప్రధాన సూచీలు బుధవారం లాభాల్లో ముగిశాయి. నాస్‌డాక్ 1.6% అడ్వాన్స్‌తో లీడ్ చేసింది.
పెరిగిన ఆసియా షేర్లు
ఫెడరల్ రిజర్వ్ పాలసీ సైకిల్ ఆగిపోవచ్చన్న సంకేతాలు రావడంతో, యూఎస్ స్టాక్స్ & బాండ్స్‌కు ఫాలో అవుతూ ఆసియా మార్కెట్లు పచ్చగా కళకళలాడాయి.
ఈ రోజు ఉదయం 8.00 గంటల సమయానికి గిఫ్ట్ నిఫ్టీ (GIFT NIFTY) 28 పాయింట్లు లేదా 0.15 శాతం గ్రీన్ కలర్‌లో 19,213 వద్ద ట్రేడవుతోంది. ప్రస్తుత పరిస్థితిని బట్టి, మన స్టాక్ మార్కెట్ ఇవాళ పాజిటివ్‌గా ప్రారంభం అవుతుందని GIFT NIFTY సూచిస్తోంది.
ఈ రోజు Q2 FY24 ఫలితాలు ప్రకటించనున్న కంపెనీలు: అదానీ ఎంటర్‌ప్రైజెస్, టాటా మోటార్స్, అదానీ పవర్, డాబర్. ఈ కంపెనీ షేర్లు ఈ రోజు మార్కెట్ ఫోకస్‌లో ఉంటాయి.
ఇవాళ్టి ట్రేడ్‌లో చూడాల్సిన స్టాక్స్ ఇవి:
రిలయన్స్ ఇండస్ట్రీస్: బ్లూమ్‌బెర్గ్ రిపోర్ట్ ప్రకారం, రిలయన్స్ ఇండస్ట్రీస్ బాండ్ల జారీ ద్వారా రూ. 15,000 కోట్లు సమీకరించే ఆలోచనలో ఉంది.
హీరో మోటోకార్ప్: టూ వీలర్ మార్కెట్ లీడర్ హీరో మోటోకార్ప్, 2023 సెప్టెంబర్ త్రైమాసికంలో, రూ.1,054 కోట్ల లాభం సంపాదించింది. గత ఏడాదితో పోలిస్తే (YoY) ఇది 47% పెరిగింది.
త్రివేణి టర్బైన్: సెప్టెంబర్‌తో ముగిసిన త్రైమాసికంలో త్రివేణి టర్బైన్ రూ. 64 కోట్ల నికర లాభాన్ని ప్రకటించింది. కార్యకలాపాల ద్వారా రూ. 388 కోట్ల ఆదాయం సంపాదించింది.
ఫినో పేమెంట్స్ బ్యాంక్: Q2 FY24లో ఫినో పేమెంట్స్ బ్యాంక్ రూ.19.5 కోట్ల నికర లాభాన్ని ఆర్జించింది.
JK టైర్: సెప్టెంబర్ క్వార్టర్‌లో JK టైర్స్ నికర లాభం అనేక రెట్లు పెరిగి రూ. 242 కోట్లకు చేరుకుంది. కార్యకలాపాల ద్వారా ఈ టైర్ కంపెనీ రూ.3,897 కోట్ల ఆదాయం సంపాదించింది.
గెయిల్: మహారాష్ట్రలోని ఉసార్‌లో ఏర్పాటు చేయబోయే పెట్రో కెమికల్ ప్లాంట్ కోసం, 15 సంవత్సరాల పాటు ప్రొపేన్ సరఫరా కోసం GAIL (ఇండియా) BPCLతో ఒప్పందం కుదుర్చుకుంది.
గోద్రెజ్ కన్స్యూమర్: 2023 జులై-సెప్టెంబర్ కాలంలో గోద్రెజ్ కన్స్యూమర్ వాల్యూమ్స్ 11% వృద్ధి చెందాయి, ఈ కంపెనీకి రూ.433 కోట్ల నికర లాభం వచ్చింది.
LIC హౌసింగ్: సెప్టెంబర్ త్రైమాసికంలో ఎల్‌ఐసీ హౌసింగ్ నికర లాభంలో అనేక రెట్లు పెరిగింది. NII రూ.2,107 కోట్లుగా నమోదైంది.
టాటా స్టీల్: సెప్టెంబర్ క్వార్టర్ ఫలితాలను టాటా స్టీల్ బుధవారం ప్రకటించింది, 6,196 కోట్ల రూపాయల నికర నష్టాన్ని రిపోర్ట్ చేసింది.
బ్రిటానియా: 2023 మూడో త్రైమాసికంలో బ్రిటానియా రూ. 588 కోట్ల నికర లాభాన్ని ప్రకటించింది, మార్కెట్ అంచనాల కంటే రూ. 533 కోట్లు ఎక్కువ సంపాదించింది.
Disclaimer: ఈ వార్త కేవలం సమాచారం కోసం మాత్రమే. మ్యూచువల్ ఫండ్లు, స్టాక్ మార్కెట్, క్రిప్టో కరెన్సీ, షేర్లు, ఫారెక్స్, కమొడిటీల్లో పెట్టే పెట్టుబడులు ఒడుదొడుకులకు లోనవుతుంటాయి. మార్కెట్ పరిస్థితులను బట్టి ఆయా పెట్టుబడి సాధనాల్లో రాబడి మారుతుంటుంది. ఫలానా మ్యూచువల్ ఫండ్, స్టాక్, క్రిప్టో కరెన్సీలో పెట్టుబడి పెట్టాలని లేదా ఉపసంహరించుకోవాలని 'abp దేశం' చెప్పడం లేదు. పెట్టుబడి పెట్టే ముందు, లేదా ఉపసంహరించుకునే ముందు అన్ని వివరాలు పరిశీలించడం ముఖ్యం. అవసరమైతే సర్టిఫైడ్ ఫైనాన్షియల్ అడ్వైజర్ల నుంచి సలహా తీసుకోవడం మంచిది.
మరో ఆసక్తికర కథనం: నవంబర్‌లో బ్యాంకులకు 15 రోజులు తాళం, మీకేదైనా పనుంటే ముందు ఈ లిస్ట్ చూడండి
Join Us on Telegram: https://t.me/abpdesamofficial