Stocks to watch 27 October 2022: ఇవాళ్టి ట్రేడ్‌లో చూడాల్సిన స్టాక్స్ ఇవి - స్పాట్‌లైట్‌లో Hero Motocorp, DLF
మన మార్కెట్ ఇవాళ పాజిటివ్‌గా ప్రారంభం అవుతుందని SGX నిఫ్టీ సూచిస్తోంది.
![Stocks to watch 27 October 2022: ఇవాళ్టి ట్రేడ్‌లో చూడాల్సిన స్టాక్స్ ఇవి - స్పాట్‌లైట్‌లో Hero Motocorp, DLF Stocks to watch in todays trade 27 October 2022 todays stock market shares share market Stocks to watch 27 October 2022: ఇవాళ్టి ట్రేడ్‌లో చూడాల్సిన స్టాక్స్ ఇవి - స్పాట్‌లైట్‌లో Hero Motocorp, DLF](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2022/10/27/da2446ea69104381f3fe1901c7c1d7891666839108039545_original.jpg?impolicy=abp_cdn&imwidth=1200&height=675)
Stocks to watch today, 27 October 2022: ఇవాళ (గురువారం) ఉదయం 7.45 గంటల సమయానికి, సింగపూర్ ఎక్సేంజ్‌లో నిఫ్టీ ఫ్యూచర్స్ (SGX నిఫ్టీ ఫ్యూచర్స్) 100 పాయింట్లు లేదా 0.56 శాతం గ్రీన్ కలర్‌లో 17,938 వద్ద ట్రేడవుతోంది. మన మార్కెట్ ఇవాళ పాజిటివ్‌గా ప్రారంభం అవుతుందని SGX నిఫ్టీ సూచిస్తోంది.
ఇవాళ Q2 ఫలితాలు ప్రకటించనున్న మేజర్ కంపెనీలు: SBI కార్డ్స్ అండ్ పేమెంట్ సర్వీసెస్, ఇండస్ టవర్స్, టాటా కెమికల్స్, REC, ఆదిత్య బిర్లా సన్ లైఫ్ AMC, వి గార్డ్ ఇండస్ట్రీస్, బాలాజీ అమైన్స్, అనుపమ్ రసాయన్ ఇండియా, తమిళనాడు మర్కంటైల్ బ్యాంక్, PNB హౌసింగ్, లాటెంట్ వ్యూ అనలిటిక్స్, CE ఇన్ఫోసిస్టమ్స్
నేటి ట్రేడ్‌లో చూడాల్సిన స్టాక్స్ ఇవి:
హీరో మోటోకార్ప్: ఫిలిప్పీన్స్‌లోనూ బిజినెస్ ప్రారంభించే ప్రణాళికలను హీరో మోటోకార్ప్ ప్రకటించింది. టెర్రాఫిర్మా మోటార్స్ కార్పొరేషన్ (Terrafirma Motors Corporation) ఫిలిప్పీన్స్‌లో హీరో మోటోకార్ప్ మోటార్‌సైకిళ్ల ప్రత్యేక అసెంబ్లర్ & పంపిణీదారుగా ఉంటుంది.
గ్లాండ్ ఫార్మా: సెప్టెంబర్‌తో ముగిసిన రెండో త్రైమాసికంలో అల్ప అమ్మకాలు, అధిక వ్యయాల కారణంగా ఈ ఫార్మాస్యూటికల్ కంపెనీ ఏకీకృత నికర లాభం 20.14 శాతం క్షీణించి రూ.241.24 కోట్లకు చేరుకుంది. గత ఆర్థిక సంవత్సరం ఇదే కాలంలో కంపెనీ ఏకీకృత నికర లాభం రూ.302.08 కోట్లుగా ఉంది.
డాబర్ ఇండియా: అధిక ద్రవ్యోల్బణం కారణంగా సెప్టెంబర్ త్రైమాసికంలో స్వదేశీ FMCG మేజర్ ఏకీకృత నికర లాభం 2.85 శాతం క్షీణించి రూ.490.86 కోట్లకు పడిపోయింది. ఏడాది క్రితం జూలై-సెప్టెంబర్ త్రైమాసికంలో కంపెనీ రూ.505.31 కోట్ల నికర లాభాన్ని నమోదు చేసింది.
DLF: సెప్టెంబర్ 30తో ముగిసిన త్రైమాసికంలో, ఈ రియాల్టీ మేజర్ రెంటల్ విభాగం DCCDL ఆర్జించిన ఆఫీసుల అద్దె ఆదాయం (రెంటల్ ఇన్‌కమ్) 14 శాతం పెరిగి రూ. 801 కోట్లకు; రిటైల్ ప్రాపర్టీల ద్వారా ఆదాయం 54 శాతం వృద్ధితో రూ.184 కోట్లకు పెరిగిందని నివేదించింది. DLF లిమిటెడ్ & సింగపూర్ సావరిన్ వెల్త్ ఫండ్ GIC జాయింట్ వెంచర్ ఈ DLF సైబర్ సిటీ డెవలపర్స్ (DCCDL),
గ్లెన్‌మార్క్ ఫార్మాస్యూటికల్స్: బడ్డీలో ఉన్న గ్లెన్ ఫార్మా మ్యానిఫ్యాక్చరింగ్ ఫెసిలిటీని US హెల్త్ రెగ్యులేటర్ USFDA ఇంపోర్ట్ అలెర్ట్‌లో పెట్టింది. బడ్డీ యూనిట్‌లో ఉత్పత్తి అయిన ఔషధాలను ఇప్పుడు పరీక్షలతో సంబంధం లేకుండానే జప్తు చేయవచ్చు.
క్రాంప్టన్ గ్రీవ్స్ కన్స్యూమర్ ఎలక్ట్రికల్స్: కంపెనీ ఏకీకృత నికర లాభం సెప్టెంబరు త్రైమాసికంలో 17.69 శాతం క్షీణించి రూ. 130.71 కోట్లకు చేరుకుంది. వినియోగదారుల డిమాండ్ బలహీనంగా ఉండడం ప్రధాన కారణం. ఏడాది క్రితం జూలై-సెప్టెంబర్ త్రైమాసికంలో కంపెనీ రూ.158.81 కోట్ల నికర లాభాన్ని ఆర్జించింది.
CSB బ్యాంక్: 'నోమురా సింగపూర్' ఈ ప్రైవేట్ రంగ రుణదాతలో 1.52 శాతం వాటా లేదా 26,39,673 షేర్లను ఓపెన్ మార్కెట్ ద్వారా అమ్మేసింది. ఒక్కో షేరును సగటు ధర రూ.232.3 చొప్పున మొత్తం రూ.61.31 కోట్లకు డంప్ చేసింది. మేబ్యాంక్ సెక్యూరిటీస్ పీటీఈ (Maybank Securities Pte) అదే ధరకు షేర్లను కొనుగోలు చేసింది.
జమ్మూ అండ్ కాశ్మీర్ బ్యాంక్: బ్యాలెన్స్ షీట్‌ను మెరుగుపరిచేందుకు రూ.960 కోట్ల మేరకు నిరర్థక ఆస్తులను విక్రయించనున్నట్లు బ్యాంక్ వర్గాలు తెలిపాయి. ఈ నిరర్థక ఆస్తులను నేషనల్ అసెట్ రీకన్‌స్ట్రక్షన్ కంపెనీకి (NARCL) విక్రయించే ప్రక్రియ ఈ నెలలోపు పూర్తవుతుందని భావిస్తున్నారు.
Disclaimer: ఈ వార్త కేవలం సమాచారం కోసం మాత్రమే. మ్యూచువల్ ఫండ్లు, స్టాక్ మార్కెట్, క్రిప్టో కరెన్సీ, షేర్లు, ఫారెక్స్, కమొడిటీల్లో పెట్టే పెట్టుబడులు ఒడుదొడుకులకు లోనవుతుంటాయి. మార్కెట్ పరిస్థితులను బట్టి ఆయా పెట్టుబడి సాధనాల్లో రాబడి మారుతుంటుంది. ఫలానా మ్యూచువల్ ఫండ్, స్టాక్, క్రిప్టో కరెన్సీలో పెట్టుబడి పెట్టాలని లేదా ఉపసంహరించుకోవాలని 'abp దేశం' చెప్పడం లేదు. పెట్టుబడి పెట్టే ముందు, లేదా ఉపసంహరించుకునే ముందు అన్ని వివరాలు పరిశీలించడం ముఖ్యం. అవసరమైతే సర్టిఫైడ్ ఫైనాన్షియల్ అడ్వైజర్ల నుంచి సలహా తీసుకోవడం మంచిది.
టాప్ హెడ్ లైన్స్
ట్రెండింగ్ వార్తలు
![ABP Premium](https://cdn.abplive.com/imagebank/metaverse-mid.png)
![Nagesh GV](https://cdn.abplive.com/imagebank/editor.png)