Stocks to watch 23 February 2023: ఇవాళ్టి ట్రేడ్‌లో చూడాల్సిన స్టాక్స్ ఇవి - Zee-Sony ఒప్పందానికి ఎదురుదెబ్బ
మన స్టాక్ మార్కెట్ ఇవాళ పాజిటివ్‌గా ప్రారంభం అవుతుందని SGX నిఫ్టీ సూచిస్తోంది.
![Stocks to watch 23 February 2023: ఇవాళ్టి ట్రేడ్‌లో చూడాల్సిన స్టాక్స్ ఇవి - Zee-Sony ఒప్పందానికి ఎదురుదెబ్బ Stocks to watch in todays trade 23 February 2023 todays stock market todays share market Stocks to watch 23 February 2023: ఇవాళ్టి ట్రేడ్‌లో చూడాల్సిన స్టాక్స్ ఇవి - Zee-Sony ఒప్పందానికి ఎదురుదెబ్బ](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2023/02/23/d03c24458741c10e216d5e5eb41d8e181677119185771545_original.jpg?impolicy=abp_cdn&imwidth=1200&height=675)
Stocks to watch today, 23 February 2023: ఇవాళ (గురువారం) ఉదయం 7.30 గంటల సమయానికి, సింగపూర్ ఎక్సేంజ్‌లో నిఫ్టీ ఫ్యూచర్స్ (SGX Nifty Futures) 57 పాయింట్లు లేదా 0.32 శాతం గ్రీన్ కలర్‌లో 17,614 వద్ద ట్రేడవుతోంది. మన స్టాక్ మార్కెట్ ఇవాళ పాజిటివ్‌గా ప్రారంభం అవుతుందని SGX నిఫ్టీ సూచిస్తోంది.
ఇవాళ్టి ట్రేడ్‌లో చూడాల్సిన స్టాక్స్ ఇవి:
గుజరాత్ గ్యాస్: కంపెనీ చైర్మన్‌గా IAS అధికారి రాజ్ కుమార్ నియామకానికి డైరెక్టర్ల బోర్డు ఆమోదం తెలిపింది. ఫిబ్రవరి 21 నుంచి ఇది అమల్లోకి వచ్చింది.
లెమన్ ట్రీ: భోపాల్‌లో 47 గదులున్న హోటల్ కోసం లెమన్ ట్రీ లైసెన్స్ ఒప్పందాన్ని పూర్తి చేసింది. డిసెంబర్, 2023 నాటి నుంచి ఈ హోటల్‌లో వ్యాపారం ప్రారంభమవుతుందని భావిస్తున్నారు. హోటల్‌లో 47 చక్కటి గదులు, రెస్టారెంట్, బాంకెట్, జిమ్, పబ్లిక్ ఏరియాలు ఉంటాయి.
ఓరియంట్ సిమెంట్: మహారాష్ట్రలోని తిరోడాలో సిమెంట్ గ్రైండింగ్ యూనిట్‌ను స్థాపించేందుకు కేటాయించిన భూమిని సద్వినియోగం చేసుకునేందుకు అదానీ పవర్ మహారాష్ట్రతో ఓరియంట్ సిమెంట్ నాన్ బైండింగ్ ఒప్పందాన్ని కుదుర్చుకుంది.
హీరో మోటోకార్ప్: బెంగళూరు, దిల్లీ, జైపూర్‌లో పబ్లిక్ ఛార్జింగ్ మౌలిక సదుపాయాల కార్యకలాపాలను ప్రారంభించింది. హీరో కంపెనీ ద్వారా నడుస్తున్న Vida, ప్రజల ఉపయోగం కోసం ఈ మూడు నగరాల్లోని 50 ప్రదేశాలలో దాదాపు 300 ఛార్జింగ్ పాయింట్లను ఏర్పాటు చేసింది.
విప్రో: ఈ కంపెనీ ఇన్నోవేషన్ ల్యాబ్ అయిన Wipro Lab45, డీసెంట్రలైజ్డ్ ఐడెంటిటీ & క్రెడెన్షియల్ ఎక్స్ఛేంజ్ (DICE) IDని ప్రారంభించినట్లు ప్రకటించింది. ఇది వినియోగదార్ల వ్యక్తిగత డేటాను నియంత్రణలో ఉంచుతుంది. వ్యక్తుల ప్రైవేట్ సమాచారాన్ని ఆన్‌లైన్‌లో వేగంగా, సులభంగా, సురక్షితంగా పంచుకోవడానికి వీలు కల్పిస్తుంది.
గ్రీవ్స్ కాటన్: కంపెనీ మరింత వృద్ధి కోసం.. రిటైల్, ఫైనాన్స్, ఈ-మొబిలిటీ వ్యాపారాల్లో కొత్త నాయకత్వాన్ని గ్రీవ్స్ కాటన్ ప్రకటించింది. ఇందులో భాగంగా... రిటైల్ బిజినెస్ సీఈఓగా నరసింహ జయకుమార్, గ్రీవ్స్ ఫైనాన్స్ సీఈవోగా సందీప్ దివాకరన్, గ్రీవ్స్ ఎలక్ట్రిక్ మొబిలిటీకి సీఎఫ్‌ఓగా చంద్రశేఖర్ త్యాగరాజన్‌ను నియామించింది.
వీనస్ రెమెడీస్: క్యాన్సర్ ఔషధాల జెనరిక్ వెర్షన్లను విక్రయించుకోవడానికి ఉజ్బెకిస్తాన్, పాలస్తీనా నుంచి అనుమతి పొందింది.
ZEE ఎంటర్‌టైన్‌మెంట్: ఎస్సెల్ గ్రూప్‌నకు ఎదురుదెబ్బ తలిగింది. దీని లిస్టెడ్ కంపెనీలైన జీ ఎంటర్‌టైన్‌మెంట్ ఎంటర్‌ప్రైజెస్ లిమిటెడ్ (ZEEL), Siti నెట్‌వర్క్ లిమిటెడ్‌ను కార్పొరేట్ ఇన్‌సాల్వెన్సీ రిజల్యూషన్ ప్రాసెస్ (CIRP) కిందకు తీసుకురావడానికి బ్యాంక్‌రప్ట్సీ కోర్టు ఆమోదం తెలిపింది. కల్వర్ మాక్స్ ఎంటర్‌టైన్‌మెంట్‌తో (Sony) ZEEL విలీనానికి ఈ న్యూస్ అడ్డుపడే అవకాశం ఉంది.
బయోకాన్: కోటక్ ఇన్వెస్ట్‌మెంట్ అడ్వైజర్స్ నిర్వహిస్తున్న కోటక్ మహీంద్రా బ్యాంక్ విభాగమైన కోటక్ స్పెషల్ సిట్యుయేషన్స్ ఫండ్, బయోకాన్‌లో రూ. 1,070 కోట్ల పెట్టుబడి పెట్టనున్నట్లు ప్రకటించింది. వయాట్రిస్‌కు చెందిన బయోసిమిలర్స్ వ్యాపారాన్ని బయోకాన్ బయోలాజిక్స్ కొనుగోలు చేయడానికి, తద్వారా గ్లోబల్ ఇంటిగ్రేటెడ్ బయోసిమిలర్స్ ప్లేయర్‌గా ఎదగడానికి ఈ డబ్బును బయోకాన్ ఉపయోగిస్తుంది.
Disclaimer: ఈ వార్త కేవలం సమాచారం కోసం మాత్రమే. మ్యూచువల్ ఫండ్లు, స్టాక్ మార్కెట్, క్రిప్టో కరెన్సీ, షేర్లు, ఫారెక్స్, కమొడిటీల్లో పెట్టే పెట్టుబడులు ఒడుదొడుకులకు లోనవుతుంటాయి. మార్కెట్ పరిస్థితులను బట్టి ఆయా పెట్టుబడి సాధనాల్లో రాబడి మారుతుంటుంది. ఫలానా మ్యూచువల్ ఫండ్, స్టాక్, క్రిప్టో కరెన్సీలో పెట్టుబడి పెట్టాలని లేదా ఉపసంహరించుకోవాలని 'abp దేశం' చెప్పడం లేదు. పెట్టుబడి పెట్టే ముందు, లేదా ఉపసంహరించుకునే ముందు అన్ని వివరాలు పరిశీలించడం ముఖ్యం. అవసరమైతే సర్టిఫైడ్ ఫైనాన్షియల్ అడ్వైజర్ల నుంచి సలహా తీసుకోవడం మంచిది.
టాప్ హెడ్ లైన్స్
ట్రెండింగ్ వార్తలు
![ABP Premium](https://cdn.abplive.com/imagebank/metaverse-mid.png)
![Nagesh GV](https://cdn.abplive.com/imagebank/editor.png)