By: ABP Desam | Updated at : 22 Mar 2023 08:02 AM (IST)
Edited By: Arunmali
స్టాక్స్ టు వాచ్ - 22 మార్చి 2023
Stocks to watch today, 22 March 2023: ఇవాళ (బుధవారం) ఉదయం 7.30 గంటల సమయానికి, సింగపూర్ ఎక్సేంజ్‌లో నిఫ్టీ ఫ్యూచర్స్ (SGX Nifty Futures) 15 పాయింట్లు లేదా 0.09 శాతం గ్రీన్ కలర్‌లో 17,159 వద్ద ట్రేడవుతోంది. మన స్టాక్ మార్కెట్ ఇవాళ పాజిటివ్‌గా ప్రారంభం అవుతుందని SGX నిఫ్టీ సూచిస్తోంది.
ఇవాళ్టి ట్రేడ్‌లో చూడాల్సిన స్టాక్స్ ఇవి:
దేవయాని ఇంటర్నేషనల్: మంగళవారం ఒక బ్లాక్ డీల్ ద్వారా దేవయాని ఇంటర్నేషనల్‌లో 0.5% వాటాను ఫ్రాంక్లిన్ టెంపుల్టన్ ఫండ్ (Franklin Templeton Fund) కొనుగోలు చేసింది. అయితే, దేవయాని ఇంటర్నేషనల్‌లో దాదాపు 3% వాటాను టెమాసెక్ (Temasek) ఆఫ్‌లోడ్ చేసింది.
టాటా పవర్: టాటా పవర్ అనుబంధ కంపెనీ అయిన టాటా పవర్ రెన్యువబుల్ ఎనర్జీ (Tata Power Renewable Energy), షోలాపూర్‌లో 200 మెగావాట్ల సోలార్ PV ప్రాజెక్ట్‌ను ఏర్పాటు చేయడానికి మహారాష్ట్ర స్టేట్ ఎలక్ట్రిసిటీ డిస్ట్రిబ్యూషన్ కంపెనీ (MSEDCL) నుంచి ‘లెటర్ ఆఫ్ అవార్డ్’ (LoA) అందుకుంది.
ఇండియన్ ఆయిల్: పారాదీప్ పెట్రో కెమికల్ కాంప్లెక్స్ ఏర్పాటు కోసం ముందస్తు ప్రణాళిక ప్రకారం కార్యకలాపాలు ప్రారంభించించేందుకు ఇండియన్ ఆయిల్ కంపెనీ బోర్డు ఆమోదం తెలిపింది. ఈ ప్రాజెక్ట్ అంచనా వ్యయం రూ. 61,077 కోట్లు.
హిందుస్థాన్ జింక్: ప్రస్తుత ఆర్థిక సంవత్సరం 2022-23 కోసం, ఒక్కో ఈక్విటీ షేరుకు రూ. 26 చొప్పున నాలుగో మధ్యంతర డివిడెండ్‌ను హిందుస్థాన్ జింక్ (Hindustan Zinc dividend) ప్రకటించింది.
SBI కార్డ్: ప్రస్తుత ఆర్థిక సంవత్సరం 2022-23 కోసం, ఒక్కో ఈక్విటీ షేరుకు రూ. 2.5 మధ్యంతర డివిడెండ్‌ను ఎస్‌బీఐ కార్డ్ (SBI Card dividend) ప్రకటించింది. రికార్డు తేదీగా 2023 మార్చి 29ను ఈ కంపెనీ నిర్ణయించింది.
పవర్ ఫైనాన్స్ కార్పొరేషన్: FY24 కోసం, దేశీయ & అంతర్జాతీయ మార్కెట్ల నుంచి బాండ్లు, టర్మ్ లోన్లు, ఇతర మార్గాల ద్వారా రూ. 80,000 కోట్ల వరకు సేకరించేందుకు పవర్ ఫైనాన్స్ కార్పొరేషన్ బోర్డు ఆమోదం తెలిపింది.
జైడస్ లైఫ్ సైన్సెస్: ఈ కంపెనీ అనుబంధ విభాగం అయిన జైడస్ ఫార్మాస్యూటికల్స్ ఇంక్ (Zydus Pharmaceuticals Inc), టోఫాసిటినిబ్ టాబ్లెట్‌లను అమెరికాలో మార్కెట్ చేయడానికి యునైటెడ్ స్టేట్స్ ఫుడ్ అండ్ డ్రగ్ అడ్మినిస్ట్రేషన్ (USFDA) నుంచి తుది ఆమోదం పొందింది.
టాటా మోటార్స్: టాటా మోటార్స్ తన వాహనాల ధరలు పెంచింది. మరింత కఠినమైన BS6 ఫేజ్ II ఉద్గార నిబంధనలను పాటిస్తున్న నేపథ్యంలో, వాణిజ్య వాహనాలపై 5% వరకు ధరలు పెంచుతున్నట్లు టాటా మోటార్స్ ప్రకటించింది. 2023 ఏప్రిల్ 1 నుంచి ఈ పెంపు అమలులోకి వస్తుందని ఈ వాహన సంస్థ వెల్లడించింది.
HG ఇన్‌ఫ్రా ఇంజనీరింగ్: రూ. 677 కోట్ల విలువైన రైల్వే ప్రాజెక్ట్ కోసం HG ఇన్‌ఫ్రా ఇంజినీరింగ్‌ను L-I బిడ్డర్‌గా సెంట్రల్ రైల్వే ప్రకటించింది.
బ్లూ స్టార్: రూ. 575 కోట్ల విలువైన రైల్వే ఎలక్ట్రిఫికేషన్ ఆర్డర్‌లను పొందినట్లు బ్లూ స్టార్ ప్రకటించింది. తద్వారా, రైల్వే విద్యుదీకరణ పనుల్లోకీ విజయవంతంగా అడుగు పెట్టి, ఈ రంగంలో తన ఉనికిని చాటింది.
Disclaimer: ఈ వార్త కేవలం సమాచారం కోసం మాత్రమే. మ్యూచువల్ ఫండ్లు, స్టాక్ మార్కెట్, క్రిప్టో కరెన్సీ, షేర్లు, ఫారెక్స్, కమొడిటీల్లో పెట్టే పెట్టుబడులు ఒడుదొడుకులకు లోనవుతుంటాయి. మార్కెట్ పరిస్థితులను బట్టి ఆయా పెట్టుబడి సాధనాల్లో రాబడి మారుతుంటుంది. ఫలానా మ్యూచువల్ ఫండ్, స్టాక్, క్రిప్టో కరెన్సీలో పెట్టుబడి పెట్టాలని లేదా ఉపసంహరించుకోవాలని 'abp దేశం' చెప్పడం లేదు. పెట్టుబడి పెట్టే ముందు, లేదా ఉపసంహరించుకునే ముందు అన్ని వివరాలు పరిశీలించడం ముఖ్యం. అవసరమైతే సర్టిఫైడ్ ఫైనాన్షియల్ అడ్వైజర్ల నుంచి సలహా తీసుకోవడం మంచిది.
Nissan Magnite Discount: నిస్సాన్ మ్యాగ్నైట్‌పై భారీ డిస్కౌంట్ - కొనాలంటే ఇదే రైట్ టైం!
Upcoming Cars: రూ.10 లక్షలలోపు లాంచ్ కానున్న లేటెస్ట్ కార్లు ఇవే - కొత్త కారు కొనాలనుకుంటే కొంచెం ఆగండి!
TDS: ఏ పోస్టాఫీసు పథకాల్లో TDS కట్ అవుతుంది, వేటికి మినహాయింపు ఉంది?
Form 16: ఇంకా ఫామ్-16 అందలేదా?, ఆన్‌లైన్‌లో చూసే ఆప్షన్ కూడా ఉంది
EPFO: 6 కోట్ల మంది సబ్‌స్క్రైబర్‌లకు EPFO మెసేజ్‌లు, అందులో ఏం ఉంది?
Khammam Medico Suicide: మరో వైద్య విద్యార్థిని ఆత్మహత్య, ఒంటికి నిప్పంటించుకుని బలవన్మరణం!
Telugu Indian Idol 2 Winner : అమ్మకు 'ఆహా' తెలుగు ఇండియన్ ఐడల్ 2 కిరీటం - విజేతను ప్రకటించిన అల్లు అర్జున్
KCR In Nirmal: నిర్మల్ జిల్లాకు సీఎం కేసీఆర్ వరాలు- ఒక్కో మున్సిపాలిటీకి రూ. 25 కోట్లు, ఒక్కో పంచాయతీకి రూ.10 లక్షలు
Coromandel Express Accident: మృతుల సంఖ్య 288 కాదు, 275 - రెండు సార్లు లెక్కపెట్టడం వల్లే కన్‌ఫ్యూజన్