Stocks to watch 21 October 2022: ఇవాళ్టి ట్రేడ్‌లో చూడాల్సిన స్టాక్స్ ఇవి - RIL, Axis Bank, ITC దుమ్మురేపొచ్చు!
మన మార్కెట్ ఇవాళ పాజిటివ్‌గా ప్రారంభం అవుతుందని SGX నిఫ్టీ సూచిస్తోంది.
Stocks to watch today, 21 October 2022: ఇవాళ (శుక్రవారం) ఉదయం 7.45 గంటల సమయానికి, సింగపూర్ ఎక్సేంజ్‌లో నిఫ్టీ ఫ్యూచర్స్ (SGX నిఫ్టీ ఫ్యూచర్స్) 12.5 పాయింట్లు లేదా 0.07 శాతం గ్రీన్ కలర్‌లో 17,532.5 వద్ద ట్రేడవుతోంది. మన మార్కెట్ ఇవాళ పాజిటివ్‌గా ప్రారంభం అవుతుందని SGX నిఫ్టీ సూచిస్తోంది.
ఇవాళ Q2 ఫలితాలు ప్రకటించనున్న మేజర్ కంపెనీలు: రిలయన్స్ ఇండస్ట్రీస్, హిందుస్థాన్ యూనిలీవల్, బజాజ్ ఫిన్‌సర్వ్, JSW స్టీల్, SBI లైఫ్ ఇన్సూరెన్స్ కంపెనీ, హిందుస్థాన్ జింక్, HDFC లైఫ్ ఇన్సూరెన్స్ కంపెనీ, అంబుజా సిమెంట్స్, DLF, యునైటెడ్ స్పిరిట్స్, టొరెంట్ ఫార్మాస్యూటికల్స్, IDBI బ్యాంక్, లారాస్ ల్యాబ్స్, వొడాఫోన్ ఐడియా
నేటి ట్రేడ్‌లో చూడాల్సిన స్టాక్స్ ఇవి:
ITC: FY23 రెండో త్రైమాసికంలో ఈ FMCG మేజర్ ఏకీకృత నికర లాభం 24.08 శాతం పెరిగి రూ. 4,670.32 కోట్లకు చేరుకుంది. సిగరెట్లు, వ్యవసాయ వ్యాపారం సహా అన్ని విభాగాల్లో బలమైన పనితీరు కనబరిచింది. క్రితం ఆర్థిక సంవత్సరం జులై-సెప్టెంబర్ త్రైమాసికంలో ఈ కంపెనీ రూ.3,763.73 కోట్ల నికర లాభాన్ని ఆర్జించింది.
యాక్సిస్ బ్యాంక్: మూడో అతి పెద్ద ప్రైవేట్ బ్యాంక్, సెప్టెంబర్ త్రైమాసికానికి ఏకీకృత నికర లాభంలో 66.29 శాతం జంప్ చేసి రూ. 5,625.25 కోట్లకు చేరుకుంది. బ్యాడ్ లోన్లకు కేటాయింపులు భారీగా తగ్గడం, మార్జిన్ పెరగడంతో ఈ స్థాయిలో లాభపడింది. స్వతంత్ర ప్రాతిపదికన, జులై-సెప్టెంబర్ కాలంలో లాభం 70 శాతం పెరిగి రూ. 5,329.77 కోట్లుగా నమోదైంది.
బజాజ్ ఫైనాన్స్: సెప్టెంబర్ త్రైమాసికంలో ఈ NBFC ఏకీకృత నికర లాభం 88 శాతం జంప్ చేసి రూ. 2,781 కోట్లకు చేరింది. అంతకు ముందు ఆర్థిక సంవత్సరం ఇదే కాలంలో రూ. 1,481 కోట్ల నికర లాభాన్ని నమోదు చేసింది.
ఏషియన్ పెయింట్స్: మన దేశంలో వినైల్ అసిటేట్ ఇథిలీన్ ఎమల్షన్, వినైల్ అసిటేట్ మోనోమర్ ఉత్పత్తి కోసం కొత్త ప్లాంట్‌ను ఏర్పాటు చేయడానికి దశలవారీగా రూ. 2,100 కోట్ల పెట్టుబడిని పెయింట్ తయారీ సంస్థ ప్రకటించింది. UAEలో రెండు స్థానిక సంస్థల భాగస్వామ్యంతో వైట్ సిమెంట్ ప్లాంట్‌ను ఏర్పాటు చేసేందుకు మరో రూ.550 కోట్ల పెట్టుబడిని కూడా కంపెనీ ప్రకటించింది.
టాటా కన్స్యూమర్ ప్రొడక్ట్స్: దేశీయ మార్కెట్‌లో బలమైన వృద్ధితో, రెండో త్రైమాసికంలో ఏకీకృత నికర లాభం రూ. 389.43 కోట్లకు చేరిందని, 36.25 శాతం పెరిగిందని టాటా గ్రూప్స్ పానీయాల సంస్థ గురువారం నివేదించింది. ఏడాది క్రితం ఇదే కాలానికి కంపెనీ రూ.285.80 కోట్ల నికర లాభాన్ని ఆర్జించింది.
కోఫోర్జ్: సెప్టెంబర్ 30తో ముగిసిన రెండో త్రైమాసికంలో ఏకీకృత పన్ను తర్వాత లాభం 37 శాతం పెరిగి రూ. 201.1 కోట్లకు చేరుకుందని ఈ ఐటీ కంపెనీ రిపోర్ట్ చేసింది. క్రితం సంవత్సరం ఇదే కాలంలో కంపెనీ పన్ను తర్వాతి లాభం రూ. 146.7 కోట్లుగా ఉంది.
శ్రీరామ్ ట్రాన్స్‌పోర్ట్ ఫైనాన్స్: వాణిజ్య వాహనాలకు ఫైనాన్స్ చేసే ఈ కంపెనీ సెప్టెంబర్ త్రైమాసికం నికర లాభం 38 శాతం పెరిగి రూ. 1,066.87 కోట్లకు చేరుకుంది. క్రితం సంవత్సరం ఇదే త్రైమాసికంలో రూ. 771.24 కోట్ల నికర లాభాన్ని సాధించింది.
కోల్‌గేట్-పామోలివ్ ఇండియా: ఈ ఆర్థిక సంవత్సరం రెండో త్రైమాసికంలో ఈ FMCG మేజర్ నికర లాభం 3.28 శాతం పెరిగి రూ. 278.02 కోట్లుగా నమోదైంది. ఏడాది క్రితం జులై-సెప్టెంబర్ కాలంలో కంపెనీ రూ.269.17 కోట్ల నికర లాభాన్ని ఆర్జించింది.
Disclaimer: ఈ వార్త కేవలం సమాచారం కోసం మాత్రమే. మ్యూచువల్ ఫండ్లు, స్టాక్ మార్కెట్, క్రిప్టో కరెన్సీ, షేర్లు, ఫారెక్స్, కమొడిటీల్లో పెట్టే పెట్టుబడులు ఒడుదొడుకులకు లోనవుతుంటాయి. మార్కెట్ పరిస్థితులను బట్టి ఆయా పెట్టుబడి సాధనాల్లో రాబడి మారుతుంటుంది. ఫలానా మ్యూచువల్ ఫండ్, స్టాక్, క్రిప్టో కరెన్సీలో పెట్టుబడి పెట్టాలని లేదా ఉపసంహరించుకోవాలని 'abp దేశం' చెప్పడం లేదు. పెట్టుబడి పెట్టే ముందు, లేదా ఉపసంహరించుకునే ముందు అన్ని వివరాలు పరిశీలించడం ముఖ్యం. అవసరమైతే సర్టిఫైడ్ ఫైనాన్షియల్ అడ్వైజర్ల నుంచి సలహా తీసుకోవడం మంచిది.