Stocks to watch 21 February 2023: ఇవాళ్టి ట్రేడ్‌లో చూడాల్సిన స్టాక్స్ ఇవి - భారీ ప్లాన్స్‌లో BPCL, HDFC Bank
మన స్టాక్ మార్కెట్ ఇవాళ పాజిటివ్‌గా ప్రారంభం అవుతుందని SGX నిఫ్టీ సూచిస్తోంది.
Stocks to watch today, 21 February 2023: ఇవాళ (మంగళవారం) ఉదయం 7.30 గంటల సమయానికి, సింగపూర్ ఎక్సేంజ్‌లో నిఫ్టీ ఫ్యూచర్స్ (SGX Nifty Futures) 13 పాయింట్లు లేదా 0.08 శాతం గ్రీన్ కలర్‌లో 17,878 వద్ద ట్రేడవుతోంది. మన స్టాక్ మార్కెట్ ఇవాళ పాజిటివ్‌గా ప్రారంభం అవుతుందని SGX నిఫ్టీ సూచిస్తోంది.
ఇవాళ్టి ట్రేడ్‌లో చూడాల్సిన స్టాక్స్ ఇవి:
BPCL: అన్ సెక్యూర్డ్ నాన్-కన్వర్టబుల్ డిబెంచర్ల ప్రైవేట్ ప్లేస్‌మెంట్ ద్వారా ప్రస్తుత ఆర్థిక సంవత్సరం 2022-23లో రూ. 1,500 కోట్ల వరకు సమీకరించాలని BPCL యోచిస్తోంది.
GR ఇన్‌ఫ్రా ప్రాజెక్ట్స్: రెండు NHAI ప్రాజెక్ట్‌ల కోసం, 20 ఫిబ్రవరి 2023న ఓపెన్ చేసిన ఫైనాన్షియల్ బిడ్స్‌లో L-1 బిడ్డర్‌గా ఈ కంపెనీ నిలిచింది.
HDFC బ్యాంక్: ఏడాదిన్నర తర్వాత మొదటిసారిగా, USD డినామినేట్ బాండ్ విక్రయాన్ని HDFC బ్యాంక్ ప్లాన్ చేస్తోంది.
BEML: దిల్లీ మెట్రో రైల్ కార్పొరేషన్ (DMRC) నేతృత్వంలోని SPVతో (ప్రత్యేక ప్రయోజన సంస్థ) BEML ఒక MOU కుదుర్చుకుంది. బహ్రెయిన్ మెట్రో రైలు ప్రాజెక్ట్ ఫేజ్-1 నిర్మాణం కోసం ఎంపిక చేసిన కంపెనీల ఫైనల్ లిస్ట్‌లోనూ దీని పేరుంది.
ఏషియన్ పెయింట్స్: దహేజ్‌లో వినైల్ అసిటేట్ ఇథిలీన్ ఎమల్షన్ (VAE) & వినైల్ అసిటేట్ మోనోమర్ (VAM) ఉత్పత్తి కేంద్రాన్ని ఏర్పాటు చేసేందుకు గుజరాత్ ప్రభుత్వంతో ఏషియన్ పెయింట్స్ (పాలిమర్స్) ఒప్పందం కుదుర్చుకుంది. ఇది ఏషియన్ పెయింట్స్‌కు పూర్తి స్థాయి అనుబంధ సంస్థ.
NHPC: ప్రభుత్వ యాజమాన్యంలోని హైడ్రో పవర్ దిగ్గజం NHPC, ప్రైవేట్ ప్లేస్‌మెంట్ ప్రాతిపదికన నాన్-కన్వర్టబుల్ బాండ్ల జారీ ద్వారా రూ. 996 కోట్లను సమీకరించింది. ఫలితంగా ఈ కంపెనీ చేసే పెట్టుబడులు పెరుగుతాయి.
ఆక్సిజెంటా ఫార్మాస్యూటికల్: ఆక్సిజెంటా ఫార్మాస్యూటికల్‌కు సంబంధించిన విషయంలో నిబంధనలను ఉల్లంఘించినందుకు, క్యాపిటల్ మార్కెట్ రెగ్యులేటర్ సెబీ మొత్తం ఏడు కంపెనీలపై రూ. 11 లక్షల జరిమానా విధించింది.
అదానీ పోర్ట్స్: USకు చెందిన హిండెన్‌బర్గ్ రీసెర్చ్ రిపోర్ట్ తర్వాత నష్ట నివారణ చర్యలు చేపట్టిన అదానీ గ్రూప్ సంస్థ అదానీ పోర్ట్స్, రూ. 1,500 కోట్ల రుణాన్ని చెల్లించింది. మరింత రుణం తిరిగి చెల్లిస్తానని హామీ ఇచ్చింది.
ఇండిగో: 2023 జనవరిలో, తన దేశీయ మార్కెట్ వాటాను వరుసగా ఐదో నెలలోనూ ఇండిగో కోల్పోయింది, 54.6% వద్దకు చేరింది. గత నెలలో 68.47 లక్షల మంది ప్రయాణికులు ఈ విమానయాన సంస్థకు చెందిన విమానాల్లో ప్రయాణించారు.
యునైటెడ్ బ్రూవరీస్: బీర్ కార్టెల్ కేసులో యునైటెడ్ బ్రూవరీస్‌పై రూ. 751.83 కోట్ల పెనాల్టీని విధించిన NCLAT ఉత్తర్వుపై సుప్రీంకోర్టు స్టే విధించింది.
Disclaimer: ఈ వార్త కేవలం సమాచారం కోసం మాత్రమే. మ్యూచువల్ ఫండ్లు, స్టాక్ మార్కెట్, క్రిప్టో కరెన్సీ, షేర్లు, ఫారెక్స్, కమొడిటీల్లో పెట్టే పెట్టుబడులు ఒడుదొడుకులకు లోనవుతుంటాయి. మార్కెట్ పరిస్థితులను బట్టి ఆయా పెట్టుబడి సాధనాల్లో రాబడి మారుతుంటుంది. ఫలానా మ్యూచువల్ ఫండ్, స్టాక్, క్రిప్టో కరెన్సీలో పెట్టుబడి పెట్టాలని లేదా ఉపసంహరించుకోవాలని 'abp దేశం' చెప్పడం లేదు. పెట్టుబడి పెట్టే ముందు, లేదా ఉపసంహరించుకునే ముందు అన్ని వివరాలు పరిశీలించడం ముఖ్యం. అవసరమైతే సర్టిఫైడ్ ఫైనాన్షియల్ అడ్వైజర్ల నుంచి సలహా తీసుకోవడం మంచిది.