Stocks to watch 19 October 2022: ఇవాళ్టి ట్రేడ్‌లో చూడాల్సిన స్టాక్స్ ఇవి - ఫోకస్‌లో TechM, Tata Motors
మన మార్కెట్ ఇవాళ ఫ్లాట్‌గా ప్రారంభం అవుతుందని SGX నిఫ్టీ సూచిస్తోంది.
![Stocks to watch 19 October 2022: ఇవాళ్టి ట్రేడ్‌లో చూడాల్సిన స్టాక్స్ ఇవి - ఫోకస్‌లో TechM, Tata Motors Stocks to watch in todays trade 19 October 2022 todays stock market shares share market Stocks to watch 19 October 2022: ఇవాళ్టి ట్రేడ్‌లో చూడాల్సిన స్టాక్స్ ఇవి - ఫోకస్‌లో TechM, Tata Motors](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2022/10/19/289b276c23cc1026a0cf575718b893df1666147669793545_original.jpg?impolicy=abp_cdn&imwidth=1200&height=675)
Stocks to watch today, 19 October 2022: ఇవాళ (బుధవారం) ఉదయం 7.45 గంటల సమయానికి, సింగపూర్ ఎక్సేంజ్‌లో నిఫ్టీ ఫ్యూచర్స్ (SGX నిఫ్టీ ఫ్యూచర్స్) 14.5 పాయింట్లు లేదా 0.08 శాతం రెడ్ కలర్‌లో 17,480.5 వద్ద ట్రేడవుతోంది. మన మార్కెట్ ఇవాళ ఫ్లాట్‌గా ప్రారంభం అవుతుందని SGX నిఫ్టీ సూచిస్తోంది.
ఇవాళ Q2 ఫలితాలు ప్రకటించనున్న మేజర్ కంపెనీలు: నెస్లే (ఇండియా), అల్ట్రాటెక్ సిమెంట్, ఇండస్ఇండ్ బ్యాంక్, హావెల్స్ ఇండియా, AU స్మాల్ ఫైనాన్స్ బ్యాంక్, HDFC అసెట్ మేనేజ్‌మెంట్ కంపెనీ, CG పవర్ & ఇండస్ట్రియల్ సొల్యూషన్స్, పెర్సిస్టెంట్ సిస్టమ్స్, మెట్రో బ్రాండ్స్, ఒరాకిల్ ఫైనాన్షియల్ సర్వీసెస్ సాఫ్ట్‌వేర్
నేటి ట్రేడ్‌లో చూడాల్సిన స్టాక్స్ ఇవి:
టెక్ మహీంద్ర: దేశంలోని ఐదో అతి పెద్ద ఐటీ సేవల ఎగుమతి కంపెనీ, గుజరాత్‌లో వచ్చే ఐదేళ్లలో 3,000 మందిని నియమించుకోనున్నట్లు ప్రకటించింది. గుజరాత్‌లో కంపెనీ ప్రస్తుత సిబ్బంది సంఖ్య ఎంతో చెప్పలేదు.
టాటా మోటార్స్: జమ్ము & శ్రీనగర్ కోసం 200 ఎలక్ట్రిక్ బస్సులను అందించడానికి ఈ ఆటో మేజర్ ఆర్డర్ దక్కించుకుంది. జమ్ము స్మార్ట్ సిటీ పథకంలో భాగంగా ఎలక్ట్రిక్ బస్సుల టెండర్ గెలుచుకుంది.
అదానీ ఎంటర్‌ప్రైజెస్: అదానీ గ్రూప్‌లోని ఈ ఫ్లాగ్‌షిప్ కంపెనీకి అనుబంధ సంస్థ అయిన అదానీ డిఫెన్స్ & ఏరోస్పేస్ (Adani Defence & Aerospace), ఎయిర్ వర్క్స్ (Air Works) కంపెనీని రూ.400 కోట్ల ఎంటర్‌ప్రైజ్ వాల్యూకి కొనుగోలు చేయాలని నిర్ణయించింది.
జీ ఎంటర్‌టైన్‌మెంట్: బ్లాక్ డీల్ ప్రకారం, పెట్టుబడి సంస్థ ఇన్వెస్కో, OFI గ్లోబల్ చైనా, మరికొన్ని కంపెనీలు కలిసి 5,29,35,068 జీ షేర్లు లేదా 5.51 శాతం వాటాను ఓపెన్ మార్కెట్ ద్వారా అమ్మేశాయి. సగటు ధర రూ.263.7 చొప్పున విక్రయించాయి. బ్లాక్ డీల్ విలువ రూ.1,396 కోట్లు.
ICICI లాంబార్డ్ జనరల్ ఇన్సూరెన్స్: సెప్టెంబర్ త్రైమాసికంలో ఈ కంపెనీ రూ.591 కోట్ల నికర లాభంతో 32.2 శాతం (YoY) వృద్ధిని నమోదు చేసింది. అయితే, ఇందులో రూ.128 కోట్ల పన్ను రివర్సల్ కూడా కలిసింది. ఈ పన్ను రివర్సల్‌ను మినహాయించి చూస్తే, నికర లాభం 3.4 శాతం మాత్రమే పెరిగింది.
పాలీక్యాబ్ ఇండియా: వైర్లు, కేబుల్స్ తయారు చేసే ఈ కంపెనీ, సెప్టెంబర్ త్రైమాసికంలో ఏకీకృత లాభంలో 36.72 శాతం వృద్ధితో రూ.270.45 కోట్లను చేరుకుంది. 2021-22 సంబంధిత త్రైమాసికంలో కంపెనీ లాభం రూ.197.80గా ఉంది.
L&T టెక్నాలజీ సర్వీసెస్: సెప్టెంబర్ త్రైమాసికంలో ఈ మిడ్ క్యాప్ IT కంపెనీ ఏకీకృత నికర లాభం 22.7 శాతం వృద్ధితో రూ.282.4 కోట్లకు చేరుకుంది. క్రితం సంవత్సరం ఇదే కాలంలో కంపెనీ రూ.230 కోట్ల నికర లాభాన్ని నమోదు చేసింది.
టాటా కమ్యూనికేషన్స్: ప్రస్తుత ఆర్థిక సంవత్సరం జులై-సెప్టెంబర్ త్రైమాసికంలో ఈ టెలికాం ప్లేయర్ ఏకీకృత నికర లాభం 25 శాతం పెరిగి రూ.532.29 కోట్లకు చేరుకుంది. క్రితం ఏడాది ఇదే కాలంలో కంపెనీ రూ.425.38 కోట్ల నికర లాభాన్ని ఆర్జించింది.
Disclaimer: ఈ వార్త కేవలం సమాచారం కోసం మాత్రమే. మ్యూచువల్ ఫండ్లు, స్టాక్ మార్కెట్, క్రిప్టో కరెన్సీ, షేర్లు, ఫారెక్స్, కమొడిటీల్లో పెట్టే పెట్టుబడులు ఒడుదొడుకులకు లోనవుతుంటాయి. మార్కెట్ పరిస్థితులను బట్టి ఆయా పెట్టుబడి సాధనాల్లో రాబడి మారుతుంటుంది. ఫలానా మ్యూచువల్ ఫండ్, స్టాక్, క్రిప్టో కరెన్సీలో పెట్టుబడి పెట్టాలని లేదా ఉపసంహరించుకోవాలని 'abp దేశం' చెప్పడం లేదు. పెట్టుబడి పెట్టే ముందు, లేదా ఉపసంహరించుకునే ముందు అన్ని వివరాలు పరిశీలించడం ముఖ్యం. అవసరమైతే సర్టిఫైడ్ ఫైనాన్షియల్ అడ్వైజర్ల నుంచి సలహా తీసుకోవడం మంచిది.
టాప్ హెడ్ లైన్స్
ట్రెండింగ్ వార్తలు
![ABP Premium](https://cdn.abplive.com/imagebank/metaverse-mid.png)
![Nagesh GV](https://cdn.abplive.com/imagebank/editor.png)