Stocks to watch 19 January 2023: ఇవాళ్టి ట్రేడ్‌లో చూడాల్సిన స్టాక్స్ ఇవి - లాభాల మోత మోగించిన IndusInd Bank
మన స్టాక్ మార్కెట్ ఇవాళ నెగెటివ్‌గా ప్రారంభం అవుతుందని SGX నిఫ్టీ సూచిస్తోంది.
Stocks to watch today, 19 January 2023: ఇవాళ (గురువారం) ఉదయం 7.30 గంటల సమయానికి, సింగపూర్ ఎక్సేంజ్‌లో నిఫ్టీ ఫ్యూచర్స్ (SGX Nifty Futures) 86 పాయింట్లు లేదా 0.47 శాతం రెడ్ కలర్‌లో 18,136 వద్ద ట్రేడవుతోంది. మన స్టాక్ మార్కెట్ ఇవాళ నెగెటివ్‌గా ప్రారంభం అవుతుందని SGX నిఫ్టీ సూచిస్తోంది.
ఇవాళ్టి ట్రేడ్‌లో చూడాల్సిన స్టాక్స్ ఇవి:
ఇండస్‌ఇండ్ బ్యాంక్: 2022 డిసెంబరు త్రైమాసికంలో నికర లాభం రూ. 1,959 కోట్లకు పెరిగింది. గత సంవత్సరం ఇదే త్రైమాసికం కంటే ఇది దాదాపు 69% (YoY) వృద్ధి. మార్కెట్ అంచనా రూ. 1,950 కోట్ల కంటే కొంచెం ఎక్కువే సంపాదించింది. ఈ త్రైమాసికంలో నికర వడ్డీ ఆదాయం 19% పెరిగి రూ. 4,495 కోట్లకు చేరుకుంది.
ఏషియన్ పెయింట్స్: డిసెంబరు త్రైమాసిక ఆదాయాలను పరిగణనలోకి తీసుకుని ఆమోదించడానికి బోర్డు సమావేశమవుతుంది. అమ్మకాల వృద్ధిలో మితంగా ఉంటుందని, వాల్యూమ్స్‌లో క్షీణతను నివేదించే అవకాశం ఉందని మార్కెట్ అంచనా వేస్తోంది. ఆదాయం 11% YoY పెరుగుదలతో రూ. 9,480 కోట్లుగా, నికర లాభం రూ. 1,156 కోట్లుగా ఉండవచ్చని విశ్లేషకులు అంచనా వేశారు.
హిందుస్థాన్ యూనిలీవర్: డిసెంబర్ త్రైమాసిక ఆదాయాలను పరిశీలించి, ఆమోదించేందుకు బోర్డు సమావేశం కానుంది. కంపెనీ రెండంకెల ఆదాయ వృద్ధిని నమోదు చేస్తుందని అంచనా. అయినప్పటికీ, వాల్యూమ్ పెరుగుదల సింగిల్ డిజిట్‌కే పరిమితమయ్యే అవకాశం ఉంది. ప్రధానంగా ద్రవ్యోల్బణ ఒత్తిడి కారణంగా స్థూల మార్జిన్లు గత సంవత్సరం కంటే తగ్గుతాని అంచనా.
HCL టెక్నాలజీస్: ఈ కంపెనీ షేర్లకు ఇవాళ (19 జనవరి 2023) ఎక్స్ డివిడెండ్ డేట్. ఈ కంపెనీ గత వారం ఒక్కో షేరుకు రూ. 10 డివిడెండ్ ప్రకటించింది.
పెర్సిస్టెంట్ సిస్టమ్స్: డిసెంబరుతో ముగిసిన త్రైమాసికంలో ఈ కంపెనీ నికర లాభం సంవత్సరానికి (YoY) 35% పెరిగి రూ. 237.9 కోట్లకు చేరుకుంది. ఆదాయంలో 45.4% వృద్ధితో రూ. 2,169.3 కోట్లకు చేరుకుంది.
ఒరాకిల్ ఫైనాన్షియల్ సర్వీసెస్ సాఫ్ట్‌వేర్: డిసెంబరు త్రైమాసికంలో కంపెనీ ఏకీకృత నికర లాభం గత సంవత్సరం ఇదే కాలంతో పోలిస్తే ఫ్లాట్‌గా ఉంది. గత త్రైమాసికంతో పోలిస్తే 10% పెరిగి రూ. 437 కోట్లుగా నమోదైంది. ఆదాయం ఏడాదిలో 14%, త్రైమాసికంలో 5.3% పెరిగి రూ. 1,450 కోట్లకు చేరుకుంది.
KDDL: రూ. 21 కోట్ల విలువైన 1,75,000 షేర్లను ఒక్కొక్కటి రూ. 2,100 చొప్పున బైబ్యాక్ చేసేందుకు ఈ కంపెనీ బోర్డు ఆమోదం తెలిపింది.
సౌత్ ఇండియన్ బ్యాంక్: తన మార్జినల్ కాస్ట్ ఆఫ్ ఫండ్స్ బేస్డ్ లెండింగ్ రేట్లను (MCLR) శుక్రవారం (20 జనవరి 2023) నుంచి అన్ని కాలావధి రుణాల మీద 10 బేసిస్ పాయింట్లు లేదా 0.10% శాతం పెంచనుంది. రుణాలపై సవరించిన రేట్లు 8.45-9.20% పరిధిలో ఉంటాయి.
భారతి ఎయిర్‌టెల్: తెలంగాణలో భారీ హైపర్‌స్కేల్ డేటా సెంటర్‌ను ఏర్పాటు చేసేందుకు రూ. 2,000 కోట్ల పెట్టుబడి పెట్టనున్నట్లు ఈ గ్రూప్ బుధవారం ప్రకటించింది.
Disclaimer: ఈ వార్త కేవలం సమాచారం కోసం మాత్రమే. మ్యూచువల్ ఫండ్లు, స్టాక్ మార్కెట్, క్రిప్టో కరెన్సీ, షేర్లు, ఫారెక్స్, కమొడిటీల్లో పెట్టే పెట్టుబడులు ఒడుదొడుకులకు లోనవుతుంటాయి. మార్కెట్ పరిస్థితులను బట్టి ఆయా పెట్టుబడి సాధనాల్లో రాబడి మారుతుంటుంది. ఫలానా మ్యూచువల్ ఫండ్, స్టాక్, క్రిప్టో కరెన్సీలో పెట్టుబడి పెట్టాలని లేదా ఉపసంహరించుకోవాలని 'abp దేశం' చెప్పడం లేదు. పెట్టుబడి పెట్టే ముందు, లేదా ఉపసంహరించుకునే ముందు అన్ని వివరాలు పరిశీలించడం ముఖ్యం. అవసరమైతే సర్టిఫైడ్ ఫైనాన్షియల్ అడ్వైజర్ల నుంచి సలహా తీసుకోవడం మంచిది.