Stocks to watch 16 March 2023: ఇవాళ్టి ట్రేడ్‌లో చూడాల్సిన స్టాక్స్ ఇవి - ఫోకస్‌లో Patanjali, Samvardhana
మన స్టాక్ మార్కెట్ ఇవాళ పాజిటివ్‌గా ప్రారంభం అవుతుందని SGX నిఫ్టీ సూచిస్తోంది.
Stocks to watch today, 15 March 2023: ఇవాళ (గురువారం) ఉదయం 7.30 గంటల సమయానికి, సింగపూర్ ఎక్సేంజ్‌లో నిఫ్టీ ఫ్యూచర్స్ (SGX Nifty Futures) 39 పాయింట్లు లేదా 0.23 శాతం గ్రీన్ కలర్‌లో 17,013 వద్ద ట్రేడవుతోంది. మన స్టాక్ మార్కెట్ ఇవాళ పాజిటివ్‌గా ప్రారంభం అవుతుందని SGX నిఫ్టీ సూచిస్తోంది.
ఇవాళ్టి ట్రేడ్‌లో చూడాల్సిన స్టాక్స్ ఇవి:
సంవర్ధన మదర్సన్: జపనీస్ ప్రమోటర్ కంపెనీ సుమిటోమో వైరింగ్ సిస్టమ్స్, సంవర్ధన మదర్సన్ ఇంటర్నేషనల్ లిమిటెడ్‌లో 3.4% వాటాను గురువారం బ్లాక్ డీల్ ద్వారా విక్రయించే అవకాశం ఉందని నివేదికలు చెబుతున్నాయి.
పతంజలి ఫుడ్స్: పతంజలి ఫుడ్స్ లిమిటెడ్ ప్రమోటర్ గ్రూప్ కంపెనీలకు చెందిన 292.58 మిలియన్ షేర్లను స్టాక్ ఎక్స్ఛేంజీలు ఫ్రీజ్ చేశాయి. నిర్ణీత గడువులోగా కనీస పబ్లిక్ షేర్ హోల్డింగ్ ప్రమాణాన్ని పాటించనందుకు ఈ చర్య తీసుకున్నాయి.
3i ఇన్ఫోటెక్: సింగపూర్ NuRe Infotech Solutions Pte Ltdలో పూర్తి-యాజమాన్య అనుబంధ సంస్థను 3i ఇన్ఫోటెక్ ఏర్పాటు చేసింది. సమాచార సాంకేతికత ఉత్పత్తుల సంబంధిత వ్యాపారాన్ని అనుబంధ సంస్థ నిర్వహిస్తుంది.
ఇండియన్ ఆయిల్: దేశంలోని అగ్రశ్రేణి రిఫైనర్ అయిన ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్, తన పునరుత్పాదక ఇంధన పోర్ట్‌ఫోలియోను ప్రస్తుతమున్న 239 మెగావాట్ల నుంచి 2050 నాటికి 200 గిగావాట్లకు (GW) పెంచాలని లక్ష్యంగా పెట్టుకుంది. 2046 నెట్-జీరో లక్ష్యంలో భాగంగా ఈ నిర్ణయం తీసుకుంది.
KPI గ్రీన్ ఎనర్జీ: క్యాప్టివ్ పవర్ ప్రొడ్యూసర్ (CPP) విభాగంలో 31 MWdc సౌర విద్యుత్ ప్రాజెక్ట్ ఫ్లాంటు కోసం గుజరాత్ ఎనర్జీ డెవలప్‌మెంట్ ఏజెన్సీ (GEDA) నుంచి కమీషనింగ్ సర్టిఫికేట్‌ను KPI గ్రీన్ ఎనర్జీ పొందింది.
మైండ్‌స్పేస్ బిజినెస్ పార్క్స్ REIT: గ్రీన్ బాండ్ల జారీ ద్వారా రూ. 550 కోట్లను మైండ్‌స్పేస్ బిజినెస్ పార్క్స్ REIT (మైండ్‌స్పేస్ REIT) సమీకరించింది.
వేదాంత: మార్చి 10న ఎన్‌కంబరెన్స్‌ను రిలీజ్ ద్వారా స్టాండర్డ్ చార్టర్డ్ బ్యాంక్‌కు $100 మిలియన్లను తిరిగి చెల్లించినట్లు వేదాంత లిమిటెడ్ ప్రకటించింది.
రామకృష్ణ ఫోర్జింగ్స్: ‘ఆత్మనిర్భర్ భారత్’ కార్యక్రమంలో భాగంగా, ఫోర్జ్‌డ్ వీల్స్ తయారీ & సరఫరా కోసం రామకృష్ణ ఫోర్జింగ్స్ కన్సార్టియం అత్యల్ప బిడ్డర్‌గా (L1) నిలిచింది. టిటాగర్ వ్యాగన్స్ కూడా కన్సార్టియంలో ఒక భాగం.
జూబిలెంట్ ఫుడ్‌వర్క్స్: వచ్చే ఏడాదిలో పొపాయ్స్ ఇండియా నెట్‌వర్క్‌ను 50 రెస్టారెంట్లకు పెంచాలని జూబిలెంట్ ఫుడ్‌వర్క్స్ యోచిస్తోంది.
Disclaimer: ఈ వార్త కేవలం సమాచారం కోసం మాత్రమే. మ్యూచువల్ ఫండ్లు, స్టాక్ మార్కెట్, క్రిప్టో కరెన్సీ, షేర్లు, ఫారెక్స్, కమొడిటీల్లో పెట్టే పెట్టుబడులు ఒడుదొడుకులకు లోనవుతుంటాయి. మార్కెట్ పరిస్థితులను బట్టి ఆయా పెట్టుబడి సాధనాల్లో రాబడి మారుతుంటుంది. ఫలానా మ్యూచువల్ ఫండ్, స్టాక్, క్రిప్టో కరెన్సీలో పెట్టుబడి పెట్టాలని లేదా ఉపసంహరించుకోవాలని 'abp దేశం' చెప్పడం లేదు. పెట్టుబడి పెట్టే ముందు, లేదా ఉపసంహరించుకునే ముందు అన్ని వివరాలు పరిశీలించడం ముఖ్యం. అవసరమైతే సర్టిఫైడ్ ఫైనాన్షియల్ అడ్వైజర్ల నుంచి సలహా తీసుకోవడం మంచిది.