News
News
X

Stocks to watch 09 November 2022: ఇవాళ్టి ట్రేడ్‌లో చూడాల్సిన స్టాక్స్‌ ఇవి - బొగ్గును బంగారంగా మార్చిన Coal India

మన మార్కెట్‌ ఇవాళ పాజిటివ్‌గా ప్రారంభం అవుతుందని SGX నిఫ్టీ సూచిస్తోంది.

FOLLOW US: 

Stocks to watch today, 09 November 2022: ఇవాళ (బుధవారం) ఉదయం 7.45 గంటల సమయానికి, సింగపూర్‌ ఎక్సేంజ్‌లో నిఫ్టీ ఫ్యూచర్స్‌ (SGX నిఫ్టీ ఫ్యూచర్స్) 61 పాయింట్లు లేదా 0.33 శాతం గ్రీన్‌ కలర్‌లో 18,408.5 వద్ద ట్రేడవుతోంది. మన మార్కెట్‌ ఇవాళ పాజిటివ్‌గా ప్రారంభం అవుతుందని SGX నిఫ్టీ సూచిస్తోంది. 

ఇవాళ Q2 ఫలితాలు ప్రకటించనున్న మేజర్‌ కంపెనీలు: టాటా మోటార్స్, పిడిలైట్ ఇండస్ట్రీస్, ప్రోక్టర్ & గాంబుల్ హైజీన్ & హెల్త్, స్టార్ హెల్త్ అండ్ అలైడ్ ఇన్సూరెన్స్ కంపెనీ, గోద్రెజ్ ప్రాపర్టీస్, దీపక్ నైట్రేట్, 3ఎం ఇండియా, జనరల్ ఇన్సూరెన్స్ కంపెనీ, బేయర్ క్రాప్‌సైన్స్, పిరామల్ ఎంటర్‌ప్రైజెస్

నేటి ట్రేడ్‌లో చూడాల్సిన స్టాక్స్‌ ఇవి:

కోల్ ఇండియా: FY23 సెప్టెంబర్ త్రైమాసికంలో, ప్రభుత్వ యాజమాన్యంలోని ఈ బొగ్గు గని సంస్థ ఏకీకృత లాభం రెట్టింపై (106 శాతం) రూ. 6,043.99 కోట్లకు చేరుకుంది. కార్యకలాపాల ద్వారా అధిక రాబడి కారణంగా లాభం డబులైంది. గత ఏడాది ఇదే కాలంలో రూ. 2,932.73 కోట్ల ఏకీకృత లాభాన్ని నమోదు చేసింది. 

News Reels

హిందాల్కో: ఆదిత్య బిర్లా గ్రూప్‌నకు చెందిన హిందాల్కోకు అనుబంధ సంస్థ అయిన నోవెలిస్ నికర ఆదాయం సెప్టెంబర్ 30తో ముగిసిన త్రైమాసికంలో 23 శాతం తగ్గి $183 మిలియన్లకు చేరుకుంది. మునుపటి ఆర్థిక సంవత్సరం ఇదే కాలంలో ఇది $237 మిలియన్లుగా ఉంది.

గోద్రెజ్ కన్స్యూమర్ ప్రొడక్ట్స్: సెప్టెంబరుతో ముగిసిన రెండో త్రైమాసికంలో ఈ FMCG మేజర్ ఏకీకృత నికర లాభం 25.06 శాతం క్షీణించి రూ. 358.86 కోట్లుగా నమోదైంది. ఏడాది క్రితం జులై-సెప్టెంబర్ త్రైమాసికంలో రూ. 478.89 కోట్ల నికర లాభాన్ని ఈ కంపెనీ నమోదు చేసింది.

One97 కమ్యూనికేషన్స్: Paytm బ్రాండ్‌తో వ్యాపారం చేస్తున్న ఈ డిజిటల్ ఫైనాన్షియల్ సర్వీసెస్ సంస్థ, 2022 సెప్టెంబర్ త్రైమాసికంలో ఏకీకృత నష్టాన్ని రూ. 593.9 కోట్లకు పెంచుకుంది. కంపెనీ ఒక సంవత్సరం క్రితం ఇదే కాలంలో రూ. 481 కోట్ల నష్టాన్ని భరించింది.

PB ఫిన్‌టెక్ (Policybazaar): FY23 రెండో త్రైమాసికంలో ఈ కంపెనీ రూ. 186.63 కోట్ల ఏకీకృత నష్టాన్ని నమోదు చేసింది. గత ఆర్థిక సంవత్సరం సంబంధిత త్రైమాసికంలోని రూ. 204.44 కోట్ల నష్టాన్ని ఇప్పుడు తగ్గించింది. కార్యకలాపాల ద్వారా వచ్చిన ఆదాయం రూ. 573.5 కోట్లుగా ఉంది, YoYలో ఇది 105 శాతం పెరిగింది.

డా.లాల్ పాత్ ల్యాబ్స్: సెప్టెంబరుతో ముగిసిన రెండో త్రైమాసికంలో ఏకీకృత పన్ను తర్వాతి లాభం 24.8 శాతం క్షీణించి రూ. 72.4 కోట్లకు చేరుకుంది. క్రితం ఏడాది కాలంలో కంపెనీ పన్ను తర్వాతి లాభం రూ.96.3 కోట్లుగా ఉంది.

భారత్ ఎలక్ట్రానిక్స్: స్వదేశీ సమాచార ఆధారిత రైలు నియంత్రణ వ్యవస్థను సంయుక్తంగా అభివృద్ధి చేయడం కోసం ఢిల్లీ మెట్రో రైల్ కార్పొరేషన్‌తో (DMRC) ఈ నవరత్న కంపెనీ ఒక అవగాహన ఒప్పందం (MoU) కుదుర్చుకుంది.

జూబిలెంట్ ఫుడ్‌వర్క్స్: 2022 సెప్టెంబరు 30తో ముగిసిన రెండో త్రైమాసికంలో డోమినోస్ పిజ్జా, డంకిన్ డోనట్స్ అమ్మే ఈ ఫాస్ట్-ఫుడ్ చైన్స్‌ కంపెనీ ఏకీకృత నికర లాభం 9.76 శాతం పెరిగి రూ. 131.52 కోట్లకు చేరింది. ఏడాది క్రితం జులై-సెప్టెంబర్ త్రైమాసికంలో రూ. 119 కోట్ల నికర లాభాన్ని నమోదు చేసింది.

Disclaimer: ఈ వార్త కేవలం సమాచారం కోసం మాత్రమే. మ్యూచువల్‌ ఫండ్లు, స్టాక్‌ మార్కెట్‌, క్రిప్టో కరెన్సీ, షేర్లు, ఫారెక్స్‌, కమొడిటీల్లో పెట్టే పెట్టుబడులు ఒడుదొడుకులకు లోనవుతుంటాయి. మార్కెట్‌ పరిస్థితులను బట్టి ఆయా పెట్టుబడి సాధనాల్లో రాబడి మారుతుంటుంది. ఫలానా మ్యూచువల్‌ ఫండ్‌, స్టాక్‌, క్రిప్టో కరెన్సీలో పెట్టుబడి పెట్టాలని లేదా ఉపసంహరించుకోవాలని 'abp దేశం' చెప్పడం లేదు. పెట్టుబడి పెట్టే ముందు, లేదా ఉపసంహరించుకునే ముందు అన్ని వివరాలు పరిశీలించడం ముఖ్యం. అవసరమైతే సర్టిఫైడ్‌ ఫైనాన్షియల్‌ అడ్వైజర్ల నుంచి సలహా తీసుకోవడం మంచిది.

Published at : 09 Nov 2022 08:10 AM (IST) Tags: Share Market Stocks to watch stocks in news Stock Market Buzzing stocks

సంబంధిత కథనాలు

Gold-Silver Price 27 November 2022: స్వల్పంగా తగ్గిన బంగారం ధర, రూ.53 వేల దిగువకు - ఊరటనిచ్చిన వెండి

Gold-Silver Price 27 November 2022: స్వల్పంగా తగ్గిన బంగారం ధర, రూ.53 వేల దిగువకు - ఊరటనిచ్చిన వెండి

Petrol-Diesel Price, 27 November 2022: వాహనదారులకు ఊరట - తెలంగాణలో భారీగా తగ్గిన పెట్రోల్, డీజిల్ ధరలు - ఏపీలో ఇలా

Petrol-Diesel Price, 27 November 2022: వాహనదారులకు ఊరట - తెలంగాణలో భారీగా తగ్గిన పెట్రోల్, డీజిల్ ధరలు - ఏపీలో ఇలా

House Hacking: హైదరాబాద్‌లో ఇల్లు కొనేందుకు డబ్బుల్లేవా? హౌజ్‌ హ్యాకింగ్‌తో కల నిజం చేసుకోండి!

House Hacking: హైదరాబాద్‌లో ఇల్లు కొనేందుకు డబ్బుల్లేవా? హౌజ్‌ హ్యాకింగ్‌తో కల నిజం చేసుకోండి!

New Pension Vs Old Pension: ఓపీఎస్‌, ఎన్‌పీఎస్‌లో ఏది బెస్ట్‌! రెండింట్లో తేడాలేంటి - ఎక్కువ డబ్బు ఎందులో పొందొచ్చు!

New Pension Vs Old Pension: ఓపీఎస్‌, ఎన్‌పీఎస్‌లో ఏది బెస్ట్‌! రెండింట్లో తేడాలేంటి - ఎక్కువ డబ్బు ఎందులో పొందొచ్చు!

Cryptocurrency Prices: పడుతూ లేస్తూ! ఒకే రేంజ్‌లో కదలాడుతున్న బిట్‌కాయిన్‌

Cryptocurrency Prices: పడుతూ లేస్తూ! ఒకే రేంజ్‌లో కదలాడుతున్న బిట్‌కాయిన్‌

టాప్ స్టోరీస్

CM KCR : అంతరిక్ష రంగంలో దూసుకెళ్తున్న హైదరాబాద్ స్టార్టప్ లు- స్కైరూట్, ధృవ సంస్థలకు సీఎం కేసీఆర్ అభినందనలు

CM KCR : అంతరిక్ష రంగంలో దూసుకెళ్తున్న హైదరాబాద్ స్టార్టప్ లు- స్కైరూట్, ధృవ సంస్థలకు సీఎం కేసీఆర్ అభినందనలు

YS Jagan: రాజ్యాంగం స్ఫూర్తితో 35 నెలల పాలనలో ఏపీలో ఎన్నో మార్పులు: సీఎం జగన్

YS Jagan: రాజ్యాంగం స్ఫూర్తితో 35 నెలల పాలనలో ఏపీలో ఎన్నో మార్పులు: సీఎం జగన్

Attack on TDP leader: నెల్లూరులో దారుణం, సిటీ టీడీపీ ఇన్ ఛార్జ్‌పై కారుతో దాడి

Attack on TDP leader: నెల్లూరులో దారుణం, సిటీ టీడీపీ ఇన్ ఛార్జ్‌పై కారుతో దాడి

Konaseema District: చేపల వేట హద్దుల కోసం Boat Race, ఎంచక్కా వీడియో వీక్షించండి

Konaseema District: చేపల వేట హద్దుల కోసం Boat Race, ఎంచక్కా వీడియో వీక్షించండి