Stocks to watch 06 March 2023: ఇవాళ్టి ట్రేడ్‌లో చూడాల్సిన స్టాక్స్ ఇవి - Dish TVకి చేదు అనుభవం
మన స్టాక్ మార్కెట్ ఇవాళ గ్యాప్ అప్‌లో ప్రారంభం అవుతుందని SGX నిఫ్టీ సూచిస్తోంది.
Stocks to watch today, 06 March 2023: ఇవాళ (మంగళవారం) ఉదయం 7.45 గంటల సమయానికి, సింగపూర్ ఎక్సేంజ్‌లో నిఫ్టీ ఫ్యూచర్స్ (SGX Nifty Futures) 75 పాయింట్లు లేదా 0.43 శాతం గ్రీన్ కలర్‌లో 17,707 వద్ద ట్రేడవుతోంది. మన స్టాక్ మార్కెట్ ఇవాళ గ్యాప్ అప్‌లో ప్రారంభం అవుతుందని SGX నిఫ్టీ సూచిస్తోంది.
ఇవాళ్టి ట్రేడ్‌లో చూడాల్సిన స్టాక్స్ ఇవి:
LIC: లైఫ్ ఇన్సూరెన్స్ కార్పొరేషన్ టాప్ మేనేజ్‌మెంట్ అదానీ గ్రూప్‌తో సమావేశం నిర్వహించింది. నివేదికల ప్రకారం, అదానీ గ్రూప్ వ్యాపార అవకాశాలపై జీవిత బీమా సంస్థ మరింత నమ్మకం వ్యక్తం చేసింది.
డిష్ టీవీ: కంపెనీ బోర్డులో నాన్ ఎగ్జిక్యూటివ్ ఇండిపెండెంట్ డైరెక్టర్‌లుగా నలుగురు అభ్యర్థుల నియామకాలను డిష్ టీవీ ఇండియా షేర్‌హోల్డర్‌లు తిరస్కరించారు, దీని వల్ల వాళ్లంతా కేవలం డైరెక్టర్‌లు మాత్రమే మిగిలారు.
బజాజ్ ఎలక్ట్రికల్స్: RDSS పథకం కింద, దేశీయ సంస్థ SBPDCL నుంచి గూడ్స్ & సర్వీసెస్ పంపిణీ కోసం రూ. 565 కోట్ల విలువైన కాంట్రాక్టులను బజాజ్ ఎలక్ట్రికల్స్ దక్కించుకుంది.
ఆర్కిడ్ ఫార్మా: 7ACA టెక్నాలజీని లైసెన్స్ కోసం ఓవర్సీస్ టెక్నాలజీ ప్రొవైడర్‌తో ఆర్కిడ్ ఫార్మా ఒక అవగాహన ఒప్పందం (MOU) కుదుర్చుకుంది.
మహానగర్ గ్యాస్: పెట్రోలియం, నేచురల్ గ్యాస్ రెగ్యులేటరీ బోర్డ్ నుంచి అనుమతి తర్వాత, 'యునిసన్ ఎన్విరో'లో 100% వాటాను మహానగర్ గ్యాస్ కొనుగోలు చేస్తుంది. యునిసన్ ఎన్విరో ప్రస్తుత వాటాదార్ల నుంచి ఈ వాటాలను కొనుగోలు చేస్తుంది.
పవర్ గ్రిడ్: బిల్డ్, ఓన్, ఆపరేట్, ట్రాన్స్‌ఫర్ (BOOT) ప్రాతిపదికన రెండు ప్రాజెక్ట్‌ల కోసం అంతర్-రాష్ట్ర విద్యుత్ పంపిణీ వ్యవస్థను ఏర్పాటు చేయడానికి, టారిఫ్ ఆధారిత పోటీ బిడ్డింగ్‌లో పవర్ గ్రిడ్ గెలిచింది.
కన్సాయ్ నెరోలాక్: పాలిగెల్‌కు నెరోఫిక్స్‌లో మిగిలిన 40% వాటాను కొనుగోలు చేయడానికి కన్సాయ్ నెరోలాక్ డైరెక్టర్ల బోర్డ్ ఆమోదించింది. ఈ షేర్ల కొనుగోలు తర్వాత, నెరోఫిక్స్ కన్సాయ్ నెరోలాక్ పెయింట్స్ పూర్తి యాజమాన్య అనుబంధ సంస్థగా మారుతుంది.
జైడస్ లైఫ్ సైన్సెస్: విగాబాట్రిన్ ఫర్ ఓరల్ సొల్యూషన్ USPని అమెరికాలో మార్కెట్ చేయడానికి యునైటెడ్ స్టేట్స్ ఫుడ్ అండ్ డ్రగ్ అడ్మినిస్ట్రేషన్ (USFDA) నుంచి కోసం తుది ఆమోదం పొందింది. రెండు సంవత్సరాలు, అంతకంటే ఎక్కువ వయస్సు ఉన్న పాక్షిక మూర్చ రోగుల్లో అనుబంధ చికిత్సగా విగాబాట్రిన్ ఉపయోగిస్తారు.
Disclaimer: ఈ వార్త కేవలం సమాచారం కోసం మాత్రమే. మ్యూచువల్ ఫండ్లు, స్టాక్ మార్కెట్, క్రిప్టో కరెన్సీ, షేర్లు, ఫారెక్స్, కమొడిటీల్లో పెట్టే పెట్టుబడులు ఒడుదొడుకులకు లోనవుతుంటాయి. మార్కెట్ పరిస్థితులను బట్టి ఆయా పెట్టుబడి సాధనాల్లో రాబడి మారుతుంటుంది. ఫలానా మ్యూచువల్ ఫండ్, స్టాక్, క్రిప్టో కరెన్సీలో పెట్టుబడి పెట్టాలని లేదా ఉపసంహరించుకోవాలని 'abp దేశం' చెప్పడం లేదు. పెట్టుబడి పెట్టే ముందు, లేదా ఉపసంహరించుకునే ముందు అన్ని వివరాలు పరిశీలించడం ముఖ్యం. అవసరమైతే సర్టిఫైడ్ ఫైనాన్షియల్ అడ్వైజర్ల నుంచి సలహా తీసుకోవడం మంచిది.