News
News
X

Stocks to watch 06 February 2023: ఇవాళ్టి ట్రేడ్‌లో చూడాల్సిన స్టాక్స్‌ ఇవి - ఫోకస్‌లో IndiGo, Paytm

మన స్టాక్‌ మార్కెట్‌ ఇవాళ నెగెటివ్‌గా ప్రారంభం అవుతుందని SGX నిఫ్టీ సూచిస్తోంది.

FOLLOW US: 
Share:

మన స్టాక్‌ మార్కెట్‌ ఇవాళ నెగెటివ్‌గా ప్రారంభం అవుతుందని SGX నిఫ్టీ సూచిస్తోంది. 

ఇవాళ్టి ట్రేడ్‌లో చూడాల్సిన స్టాక్స్‌ ఇవి:

ఇండిగో: ఏవియేషన్ దిగ్గజం ఇండిగో డిసెంబర్‌ త్రైమాసిక నికర లాభం అనేక రెట్లు పెరిగి రూ. 1,422 కోట్లకు చేరుకుంది. గత ఏడాది ఇదే కాలంలోని రూ. 129 కోట్లతో పోలిస్తే లాభం 1,000% పెరిగింది. మూడో త్రైమాసికంలో కార్యకలాపాల ద్వారా వచ్చిన ఆదాయం 61% పెరిగి రూ. 14,932 కోట్లకు చేరుకుంది

పేటీఎం: డిసెంబర్ త్రైమాసికంలో ఎబిటా స్థాయిని నెగెటివ్‌ నుంచి పాజిటివ్‌లోకి తీసుకొచ్చింది. మార్గదర్శకత్వం కంటే మూడు త్రైమాసికాల ముందే దీనిని పేటీఎం సాధించింది. డిసెంబర్‌తో ముగిసిన త్రైమాసికంలో కంపెనీ ఏకీకృత నికర నష్టాన్ని రూ. 392 కోట్లకు తగ్గించింది. నికర నష్టం ఏడాది క్రితం రూ. 779 కోట్లుగా ఉంది.

టాటా స్టీల్‌: ప్రస్తుత ఆర్థిక సంవత్సరం మూడో త్రైమాసికంలో టాటా స్టీట్‌ ఆదాయ లెక్కల్లో పురోగతి ఏమీ ఉండకపోవచ్చని భావిస్తున్నారు. డిసెంబర్ త్రైమాసికంలో ఈ కంపెనీ పన్ను తర్వాత లాభం (PAT) సగానికి పైగా తగ్గి రూ. 4,300 కోట్లకు చేరుకోవచ్చని అంచనా.

ITC: డిసెంబర్‌తో ముగిసిన త్రైమాసికంలో ఐటీసీ నికర లాభం సంవత్సరానికి (YoY) 21% పెరిగి రూ. 5,031 కోట్లకు చేరింది. మార్కెట్‌ అంచనా రూ. 4,605 కోట్ల కంటే ఇది ఎక్కువ. కార్యకలాపాల ద్వారా వచ్చి ఆదాయం స్వల్పంగా 2.3% పెరిగి రూ. 16,226 కోట్లకు చేరుకుంది.

మ్యారికో: డిసెంబర్ త్రైమాసికంలో, కన్స్యూమర్ డ్యూరబుల్స్ సంస్థ మ్యారికో ఏకీకృత పన్ను తర్వాతి లాభం రూ. 328 కోట్లుగా నమోదైంది, సంవత్సరానికి (YoY) 6% పెరిగింది. కార్యకలాపాల ఆదాయం సంవత్సరానికి 3% పెరిగి రూ. 2,470 కోట్లకు చేరుకుంది.

ఇమామి: డిసెంబరు త్రైమాసికంలో ఏకీకృత నికర అమ్మకాలు రూ.975 కోట్లుగా ఉన్నాయి, ఇది 2% పెరిగి, కార్యకలాపాల ద్వారా వచ్చే ఆదాయం స్వల్పంగా రూ.983 కోట్లకు పెరిగింది. కంపెనీ పీఏటీ 8 శాతం పెరిగి రూ.237 కోట్లకు చేరింది.

MOIL: 2023 జనవరిలో 1.26 లక్షల టన్నుల ముడి మాంగనీస్‌ను ఈ కంపెనీ తవ్వి తీసింది. MOIL ప్రారంభిన తర్వాత ఏ ఏడాది జనవరి నెలలో చూసినా ఇదే అత్యుత్తమ ఉత్పత్తి. గత సంవత్సరం ఇదే కాలంతో పోలిస్తే ఇది 7.7% ఎక్కువ.

క్వెస్‌ కార్ప్: క్వార్టర్-ఆన్-క్వార్టర్ ప్రాతిపదికన, డిసెంబర్‌ త్రైమాసికంలో క్వెస్‌ కార్పొరేషన్‌ ఆదాయం 4%, ఎబిటా 8% వృద్ది చెందింది. ఎబిటా మార్జిన్‌ 10 బేసిస్ పాయింట్లు మెరుగుపడింది. PAT, గత త్రైమాసికం కంటే 116% పెరిగి రూ. 86 కోట్లకు చేరింది.

షిప్పింగ్‌ కార్పొరేషన్‌ ఆఫ్‌ ఇండియా: డిసెంబర్ త్రైమాసికానికి, షిప్పింగ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా పన్ను తర్వాతి లాభం రూ. 280 కోట్లకు చేరగా, మొత్తం ఆదాయం రూ. 2,602 కోట్లుగా ఉంది.

Disclaimer: ఈ వార్త కేవలం సమాచారం కోసం మాత్రమే. మ్యూచువల్‌ ఫండ్లు, స్టాక్‌ మార్కెట్‌, క్రిప్టో కరెన్సీ, షేర్లు, ఫారెక్స్‌, కమొడిటీల్లో పెట్టే పెట్టుబడులు ఒడుదొడుకులకు లోనవుతుంటాయి. మార్కెట్‌ పరిస్థితులను బట్టి ఆయా పెట్టుబడి సాధనాల్లో రాబడి మారుతుంటుంది. ఫలానా మ్యూచువల్‌ ఫండ్‌, స్టాక్‌, క్రిప్టో కరెన్సీలో పెట్టుబడి పెట్టాలని లేదా ఉపసంహరించుకోవాలని 'abp దేశం' చెప్పడం లేదు. పెట్టుబడి పెట్టే ముందు, లేదా ఉపసంహరించుకునే ముందు అన్ని వివరాలు పరిశీలించడం ముఖ్యం. అవసరమైతే సర్టిఫైడ్‌ ఫైనాన్షియల్‌ అడ్వైజర్ల నుంచి సలహా తీసుకోవడం మంచిది.

Published at : 06 Feb 2023 08:10 AM (IST) Tags: Stock market INDIGO Paytm Tata Power Share Market Tata Steel ITC Q3 Results

సంబంధిత కథనాలు

ప్ర‌పంచంలోని టాప్ 10 సంప‌న్న దేశాలివే!

ప్ర‌పంచంలోని టాప్ 10 సంప‌న్న దేశాలివే!

Car Modification: కొత్త కారుకు యాక్సెసరీస్ ఇన్‌స్టాల్ చేస్తున్నారా - వీటిని చేస్తే వారంటీ పోతుంది జాగ్రత్త!

Car Modification: కొత్త కారుకు యాక్సెసరీస్ ఇన్‌స్టాల్ చేస్తున్నారా - వీటిని చేస్తే వారంటీ పోతుంది జాగ్రత్త!

Price Hike on Two Wheelers: నాలుగు నెలల్లో రెండో సారి - ఏప్రిల్ నుంచి మళ్లీ పెరగనున్న హీరో బైక్స్ ధరలు!

Price Hike on Two Wheelers: నాలుగు నెలల్లో రెండో సారి - ఏప్రిల్ నుంచి మళ్లీ పెరగనున్న హీరో బైక్స్ ధరలు!

Income Tax: ఏప్రిల్ నుంచి మారనున్న టాక్స్‌ రూల్స్‌, కొత్త విషయాలేంటో తెలుసుకోండి

Income Tax: ఏప్రిల్ నుంచి మారనున్న టాక్స్‌ రూల్స్‌, కొత్త విషయాలేంటో తెలుసుకోండి

Tax Saving: 8.1% వడ్డీతో పాటు పన్ను ఆదా కూడా, మంచి ఆఫర్‌ ఇచ్చిన బ్యాంకులు

Tax Saving: 8.1% వడ్డీతో పాటు పన్ను ఆదా కూడా, మంచి ఆఫర్‌ ఇచ్చిన బ్యాంకులు

టాప్ స్టోరీస్

YSRCP Reverse : దెబ్బ మీద దెబ్బ - వ్యూహాత్మక తప్పిదాలే వైఎస్ఆర్‌సీపీకి నష్టం చేస్తున్నాయా ?

YSRCP Reverse :   దెబ్బ మీద దెబ్బ  - వ్యూహాత్మక తప్పిదాలే వైఎస్ఆర్‌సీపీకి నష్టం చేస్తున్నాయా ?

MIW Vs UPW Highlights: యూపీని ఎలిమినేటర్‌లోనే ఆపేసిన ముంబై - 72 పరుగుల విజయంతో ఫైనల్లోకి ఎంట్రీ!

MIW Vs UPW Highlights: యూపీని ఎలిమినేటర్‌లోనే ఆపేసిన ముంబై - 72 పరుగుల విజయంతో ఫైనల్లోకి ఎంట్రీ!

AP Cag Report : 13.99 శాతం వడ్డీకి అప్పులు తెస్తున్న ఏపీ సర్కార్ - కాగ్ రిపోర్టులో సంచలన విషయాలు

AP Cag Report :  13.99 శాతం వడ్డీకి అప్పులు తెస్తున్న ఏపీ సర్కార్ - కాగ్ రిపోర్టులో సంచలన విషయాలు

రైతులపై కేసీఆర్ ది ఎన్నికల ప్రేమ, మీరిచ్చే రూ.10 వేలు ఏ మూలకు సరిపోతాయి - వైఎస్ షర్మిల

రైతులపై కేసీఆర్ ది ఎన్నికల ప్రేమ,  మీరిచ్చే రూ.10 వేలు ఏ మూలకు సరిపోతాయి - వైఎస్ షర్మిల