StockMarket update: బ్లాక్ మండే..! మార్కెట్లపై బేర్ పట్టు.. సెన్సెక్స్ 1170, నిఫ్టీ 348 డౌన్..
బెంచ్‌మార్క్ సూచీలు రెండు శాతానికి పైగా నష్టాల్లో ముగిశాయి. ద్రవ్యోల్బణం పెరుగుదల, ప్రపంచ మార్కెట్లు నష్టాల్లో ట్రేడవ్వడం సెన్సెక్స్, నిఫ్టీ భారీ పతనం అయ్యాయి.
భారత స్టాక్ మార్కెట్లు సోమవారం బేర్.. బేర్‌మన్నాయి! బెంచ్‌మార్క్ సూచీలు రెండు శాతానికి పైగా నష్టాల్లో ముగిశాయి. అంతర్జాతీయంగా ద్రవ్యోల్బణం పెరుగుదల ప్రకంపనలు, ప్రపంచ మార్కెట్లు నష్టాల్లో ట్రేడవ్వడం, కొన్ని కంపెనీల షేర్లను మదుపర్లు తెగనమ్మడంతో సెన్సెక్స్, నిఫ్టీ భారీ పతనం అయ్యాయి. సెన్సెక్స్ 1000+, నిఫ్టీ 400 పాయింట్ల వరకు నష్టపోయాయి.
క్రితం ముగింపు 59,636తో పోలిస్తే సెన్సెక్స్ సోమవారం 59,710 వద్ద మెరుగ్గానే ఆరంభమైంది. ఆ తర్వాత మార్కెట్లో నెగెటివ్ సెంటిమెంట్ కనిపించడంతో మదుపర్లు విక్రయాలకు పాల్పడ్డారు. దాంతో సెన్సెక్స్ 1500 పాయింట్ల వరకు పతనమై 58,011 వద్ద ఇంట్రాడే కనిష్ఠాన్ని తాకింది. ఆఖరి గంటలో కాస్త కొనుగోళ్లు ఆరంభం కావడంతో చివరికి 1170 నష్టంతో 58,465 వద్ద ముగిసింది. 17,764 వద్ద ఆరంభమైన నిఫ్టీ ఇంట్రాడేలో 400 పాయింట్ల మేర నష్టపోయింది. 17,280 వద్ద కనిష్ఠాన్ని తాకి చివరికి 348 పాయింట్ల నష్టంతో 17,416 వద్ద ముగిసింది.
బజాజ్ ఫైనాన్స్, బజాజ్ ఫిన్‌సర్వ్, ఓఎన్‌జీసీ, టాటా మోటార్స్, రిలయన్స్ ఇండస్ట్రీస్ ఎక్కువగా నష్టపోయాయి. భారతీ ఎయిర్‌టెల్, ఆసియన్ పెయింట్స్, జేఎస్‌డబ్ల్యూ స్టీల్, పవర్ గ్రిడ్, హిందాల్కో ఇండస్ట్రీస్ కాస్త లాభపడ్డాయి. స్థిరాస్తి, హెల్త్‌కేర్, ఆటో, ఆయిల్ అండ్ గ్యాస్, పీఎస్‌యూ బ్యాంకు సూచీలు 2-4 శాతం వరకు నష్టపోయాయి. పేటీఎం షేరు రెండో రోజు తీవ్రంగా నష్టపోయింది. 12 శాతం అంటే రూ.201 తగ్గి రూ.1359 వద్ద ముగిసింది. సౌదీ ఆరామ్‌కో పునర్ మూల్యాంకనం నేపథ్యంలో రిలయన్స్ షేరు రూ.109 నష్టపోయి 2363 వద్ద ముగిసింది.
22.11.2021
— BSE India (@BSEIndia) November 22, 2021
Pre-opening Sensex Update pic.twitter.com/xCBS2iywe5
Also Read: Multibagger share: 6 నెలల్లో లక్షకు రూ.2.62 కోట్ల రాబడి ఇచ్చిన పెన్నీ స్టాక్ ఇది!
Also Read: Go Fashion IPO: గ్రే మార్కెట్ ప్రీమియం ఏం చెబుతోంది? గో ఫ్యాషన్ సూపర్ హిట్టవుతుందా?
Also Read: GST Hike: బట్టలు, పాదరక్షలు కొనాలా? వెంటనే చేసేయండి.. లేదంటే జనవరిలో ధరల మోత తప్పదు!
ఇంట్రస్టింగ్ వీడియోలు, విశ్లేషణల కోసం ABP Desam YouTube Channel సబ్‌స్క్రైబ్ చేయండి
Sensex opens at 59710 with a gain of 74 points. pic.twitter.com/vOgEfGabhj
— BSE India (@BSEIndia) November 22, 2021