అన్వేషించండి

Scam Alert: బాగా మేపుతారు, లోతుగా దింపుతారు-టెలిగ్రామ్‌, వాట్సాప్‌ యూజర్లకు హెచ్చరిక

Stock Market Scam: ముందూ వెనుక ఆలోచించకుండా తన పెట్టుబడిని పెంచుకుంటూ పోతాడు, స్కామర్ విసిరిన గేలానికి యూజర్‌ చిక్కుతాడు. సదరు స్కామర్‌ ఆ డబ్బుతో అదృశ్యం అవుతాడు.

Pig Butchering Scam: స్టాక్ మార్కెట్‌లో పెట్టుబడులు పెట్టాలనే ఆసక్తి ప్రజల్లో పెరుగుతున్న కొద్దీ కొత్త తరహా మోసాలు కూడా మొదలయ్యాయి. ఇప్పుడు, సోషల్‌ మీడియా ప్లాట్‌ఫామ్‌లను ఉపయోగించి ప్రజలను బురిడీ కొట్టించే కేటుగాళ్లు చెలరేగిపోతున్నారు. ఇటీవల, "పిగ్ బుచరింగ్" పేరిట కొత్త స్కామ్ బయటకు వచ్చింది. దీనికి సంబంధించిన కేసులు కూడా వేగంగా పెరుగుతున్నాయి. 

పిగ్ బుచరింగ్ స్కామ్ అంటే ఏంటి?
ఈ స్కామ్‌ అర్ధం దీని పేరులోనే ఉంది. పిగ్‌ బుచరింగ్‌ అంటే "పందిని ముక్కలుగా నరకడం" అని అర్థం. మాంసం కోసం పందులను వధించే ముందు వాటిని బాగా మేపి, కొవ్వు పట్టేలా చేస్తారు. ఈ మోసంలో స్కామర్లు కూడా ఇలాంటిదే చేస్తారు. తమ ద్వారా స్టాక్‌ మార్కెట్‌లో పెట్టుబడి పెడితే భారీగా సంపాదించొచ్చని స్కామర్ గ్యారెంటీ ఇస్తాడు. ప్రారంభంలో ఆకర్షణీయమైన రాబడిని కూడా అందిస్తాడు. దీనివల్ల పెట్టుబడిదారుడిలో ఆశ పెరుగుతుంది, అత్యాశగా మారుతుంది. అప్పుడు, ముందువెనుక ఆలోచించకుండా తన పెట్టుబడిని పెంచుకుంటూ పోతాడు, స్కామర్ విసిరిన గేలానికి చిక్కుతాడు. సదరు స్కామర్‌ ఆ డబ్బుతో అదృశ్యం అవుతాడు.

డార్క్ వెబ్‌లో నంబర్లు విక్రయం
పిగ్‌ బుచరింగ్‌ స్కామ్‌లో పని చేస్తున్న వ్యక్తులు సాధారణ నేరగాళ్లు కాదు. స్టాక్‌ మార్కెట్‌ మీద, టెక్నాలజీ మీద గట్టి పట్టున్న వ్యక్తులు. స్టాక్ మార్కెట్ ట్రేడింగ్‌ కోసం, సంబంధించిన గుర్తుతెలీని నంబర్ నుంచి మిమ్మల్ని కొత్త వాట్సాప్ గ్రూప్‌లోకి వాళ్లు యాడ్‌ చేస్తారు. మనలో చాలామందికి ఇది ఇప్పటికే అనుభవంలోకి వచ్చి ఉంటుంది. ఎవరో ముక్కు, మొఖం తెలీని వ్యక్తికి మీ ఫోన్‌ నంబర్‌ ఎలా తెలుసనే సందేహం మీకు వచ్చిందా?. వాస్తవానికి, డార్క్ వెబ్‌లో భారీ డేటాబేస్ అమ్మకానికి ఉంది. అందులో, మీ ఫోన్‌ నంబర్ సహా కోట్లాది మంది ప్రజల సమాచారం అందుబాటులో ఉంది.

పిగ్‌ బుచరింగ్‌ స్కామర్‌లు డార్క్ వెబ్ నుంచి డేటా కొనుగోలు చేస్తారు. ఆ తర్వాత, వాట్సాప్‌ (WhatsApp) లేదా టెలిగ్రామ్‌లో (Telegram) ఒక గ్రూప్‌ను సృష్టించి, మీ నంబర్‌ కూడా అందులో యాడ్‌ చేస్తారు. స్టాక్ మార్కెట్ ఎక్స్‌పర్ట్‌ లేదా స్టాక్ గురు అని చెప్పుకునే వ్యక్తి కూడా ఆ గ్రూప్‌లో ఉంటాడు. స్టాక్‌ మార్కెట్‌ లావాదేవీలతో తన తల పండిపోయిందని, తాను పెద్ద అసెట్ మేనేజ్‌మెంట్ కంపెనీల్లో పని చేసినట్లు చెబుతాడు. ఆ గురువే గ్రూప్ సభ్యులకు టిప్స్‌ ఇస్తాడు. మార్కెట్‌ గురించి బాగా తెలిసి వ్యక్తులు కూడా ఆశ్చర్యపోయేలా & మోసపోయేలా ఆ చిట్కాలు పని చేస్తాయి.

కొత్త వాళ్లు ట్రేడింగ్ నేర్చుకునేందుకు స్టడీ మెటీరియల్‌ను కూడా గ్రూప్‌లో పోస్ట్‌ చేస్తాడు. కొన్నిసార్లు ఇది ఫ్రీగా ఇస్తాడు లేదా నామమాత్రపు సబ్‌స్క్రిప్షన్ ఛార్జ్ అడుగుతాడు. దీనివల్ల, అన్నీ నిజాయితీగా జరుగుతున్నాయని గ్రూప్ సభ్యులు భ్రమ పడతారు. ఇప్పుడు, స్కామర్‌ చెప్పిన చిట్కాల నుంచి ప్రయోజనం పొందినట్లు చెప్పుకునే వ్యక్తులు గ్రూప్‌లో యాక్టివ్‌గా మారతారు. తాము భారీ లాభాలు ఆర్జించినట్లు చూపించే స్క్రీన్‌షాట్‌లను పోస్ట్‌ చేస్తారు. ఈ తరహా మోసం కోసం పెద్ద బ్రోకరేజ్ కంపెనీలను పోలి ఉండే నకిలీ వెబ్‌సైట్‌లు, యాప్‌లను స్కామర్‌ ఉపయోగిస్తాడు. ఆ సైట్‌ లేదా యాప్‌లో వాస్తవ ట్రేడ్స్‌ తరహాలోనే అన్నీ జరుగుతాయి. మీరు పెట్టుబడి పెడితే, ప్రారంభంలో లాభాలను మాత్రమే వస్తాయి. లాభాలు కళ్లజూసిన గ్రూప్‌ సభ్యులు త్వరగా బుట్టలో పడతారు. ఆ తర్వాత పెట్టుబడిని పెంచుకుంటూ వెళ్లి, చివరకు డబ్బు మొత్తం పోగొట్టుకుంటారు. 

జీరోధ (Zerodha) సహ వ్యవస్థాపకుడు నితిన్ కామత్ కూడా ఈ స్కామ్ గురించి ఇటీవల ప్రజలను హెచ్చరించారు. పిగ్‌ బుచరింగ్‌ మాత్రమే కాదు, ఈ తరహా స్కామ్‌ల నుంచి మీ డబ్బును రక్షించుకోవడానికి అప్రమత్తత అవసరం. అత్యాశకు పోయి ఊహించలేనంత రాబడికి బలి కావద్దు. వాట్సాప్‌ లేదా టెలిగ్రామ్‌ గ్రూప్‌ల్లో కనిపించే చిట్కాలకు దూరంగా ఉండండి. అనుమానాస్పద లింక్‌లపై క్లిక్ చేయవద్దు. 

మరో ఆసక్తికర కథనం: బ్యాంకు అకౌంట్‌, క్రెడిట్‌ కార్డు ఉన్నవారి బీపీ పెంచే న్యూస్ - ఇలా డిపాజిట్‌ చేస్తే ఐటీ నోటీసు ఖాయం!

టాప్ హెడ్ లైన్స్

మొదటి జీతం రాగానే ఎక్కడ ఇన్వెస్ట్ చేయాలి ? FD, RD లేదా SIP లలో ఏది బెస్ట్ ఆప్షన్?
మొదటి జీతం రాగానే ఎక్కడ ఇన్వెస్ట్ చేయాలి ? FD, RD లేదా SIP లలో ఏది బెస్ట్ ఆప్షన్?
PMFME Scheme: ఫుడ్ బిజినెస్ చేసేవారికి గుడ్ న్యూస్.. రూ. 10 లక్షల రుణంపై 35% సబ్సిడీ.. ఎలా అప్లై చేసుకోవాలంటే?
ఫుడ్ బిజినెస్ చేసేవారికి రూ. 10 లక్షల రుణంపై 35% సబ్సిడీ.. ఎలా అప్లై చేసుకోవాలంటే
Care Health Insurance: తెలంగాణలో కేర్ హెల్త్ ఇన్సూరెన్స్ ఉన్నా, ప్రజలకు ఇబ్బందులే... షాక్ ఇచ్చిన టీఎస్‌హెచ్‌ఏ!
తెలంగాణలో కేర్ హెల్త్ ఇన్సూరెన్స్ ఉన్నా, ప్రజలకు ఇబ్బందులే... షాక్ ఇచ్చిన టీఎస్‌హెచ్‌ఏ!
Air India New CEO: ఎయిర్ ఇండియా కొత్త సీఈఓ- ఎండీగా టేవోల్డే గెబ్రేమారియం.. ఎయిర్‌లైన్స్ దశ మారుతుందా?
ఎయిర్ ఇండియా కొత్త సీఈఓ- ఎండీగా టేవోల్డే గెబ్రేమారియం.. ఎయిర్‌లైన్స్ దశ మారుతుందా?

వీడియోలు

Ajinkya Rahane Reveals MS Dhoni's Secret | ధోనీ రూమ్ సీక్రెట్ రూల్ బయటపెట్టిన రహానే
Women's Asia Cup 2026 Schedule | ఉమెన్స్ ఆసియా కప్ 2026 షెడ్యూల్ విడుదల
Dhoni Riding KTM in Chennai | చెన్నై రేసింగ్ ట్రాక్‌పై ధోనీ బైక్ స్టంట్
Kalyan in Bigg Boss 10 Agnipareeksha Probables List | బిగ్ బాస్ 10 ప్రొబబుల్స్‌లో కళ్యాణ్
Gundenininda Gudigantalu Serial August 7 | రోహిణి అని లేడీ కానిస్టేబుల్‌తో మనోజ్ గొడవ

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Mamata Banerjee Car Attack: మమతా బెనర్జీ కారుపై దాడి.. టీఎంసీ అధినేత్రి ఏ కారును ఉపయోగిస్తారు? అది ఎంత సురక్షితం
మమతా బెనర్జీ కారుపై దాడి.. టీఎంసీ అధినేత్రి ఏ కారును ఉపయోగిస్తారు? అది ఎంత సురక్షితం
BWF Title Win: కొరియా మాస్టర్స్ లో అశ్మిత చాలిహా హిస్టారిక్ విక్టరీ.. చైనా షట్లర్ పై మైండ్ బ్లాకింగ్ కంబ్యాక్, ఫస్ట్ వరల్డ్ టూర్ టైటిల్ సొంతం!
కొరియా మాస్టర్స్ లో అశ్మిత చాలిహా హిస్టారిక్ విక్టరీ.. చైనా షట్లర్ పై మైండ్ బ్లాకింగ్ కంబ్యాక్, ఫస్ట్ వరల్డ్ టూర్ టైటిల్ సొంతం!
KCR: దశదినకర్మకు హాజరై పెద్ది సుదర్శన్‌రెడ్డి కుటుంబాన్ని పరామర్శించిన కేసీఆర్, అండగా ఉంటామని భరోసా
దశదినకర్మకు హాజరై పెద్ది సుదర్శన్‌రెడ్డి కుటుంబాన్ని పరామర్శించిన కేసీఆర్, అండగా ఉంటామని భరోసా
Rajahmundry Medico Passes Away: రాజమండ్రి రోడ్డు ప్రమాదం విషాదాంతం.. మెడికో ప్రియాంక మృతి, వెల్లడించిన డాక్టర్లు
రాజమండ్రి రోడ్డు ప్రమాదం విషాదాంతం.. మెడికో ప్రియాంక మృతి, వెల్లడించిన డాక్టర్లు
AP CM Chandrababu: ప్రకాశం బ్యారేజ్ వద్ద గోదావరి జలాలను పరిశీలించిన సీఎం చంద్రబాబు, అధికారులకు కీలక సూచనలు
ప్రకాశం బ్యారేజ్ వద్ద గోదావరి జలాలను పరిశీలించిన సీఎం చంద్రబాబు, అధికారులకు కీలక సూచనలు
Spider Man OTT : ఆ ఓటీటీలోకి స్పైడర్ మ్యాన్ - 12 వేల కోట్ల మూవీ ఎప్పుడు స్ట్రీమింగ్ కావొచ్చంటే?
ఆ ఓటీటీలోకి స్పైడర్ మ్యాన్ - 12 వేల కోట్ల మూవీ ఎప్పుడు స్ట్రీమింగ్ కావొచ్చంటే?
Rajahmundry Medico Priyanka: మీకు ఆడపిల్లలు లేరా? సీఎం, డిప్యూటీ సీఎం పట్టించుకోకపోవడం దారుణం: ప్రియాంక తండ్రి వెంకటేష్
మీకు ఆడపిల్లలు లేరా? సీఎం, డిప్యూటీ సీఎం పట్టించుకోకపోవడం దారుణం: ప్రియాంక తండ్రి వెంకటేష్
Rahane -Jaiswal Incident:  గ‌తంలో బ్యాన్ నుంచి జైస్వాల్ ను త‌ప్పించిన ర‌హానే.. స్మార్ట్ మూవ్ తో యువ క్రికెట‌ర్ కెరీర్ కాపాడిన అజింక్య‌.. 
గ‌తంలో బ్యాన్ నుంచి జైస్వాల్ ను త‌ప్పించిన ర‌హానే.. యువ క్రికెట‌ర్ కెరీర్ కాపాడిన సీనియర్
Embed widget