By: ABP Desam | Updated at : 25 Feb 2022 11:14 AM (IST)
Edited By: Ramakrishna Paladi
stock market
Stock market updates Telugu: భారత స్టాక్ మార్కెట్లు (Indian Stock Markets) నేడు భారీ లాభాల్లో ట్రేడ్ అవుతున్నాయి. గురువారం నాటి నష్టాలను పూడ్చుకొనేలా కనిపిస్తున్నాయి. ఆసియా మార్కెట్లు, ఎస్‌జీఎక్స్ నిఫ్టీ (SGX Nifty) మెరుగ్గా ఉండటం మదుపర్లలో విశ్వాసం పెంచింది. రష్యా-ఉక్రెయిన్ యుద్ధ భయాలు (Russia Ukraine War) ఇంకా కొనసాగుతున్నా ఇన్వెస్టర్లు పెట్టుబడి పెట్టేందుకు ఆసక్తి చూపిస్తున్నారు. ముడిచమురు ధరలు (Crude Oil) పెరుగుతున్నా భయపడటం లేదు! మదుపర్ల సంపదగా (Investors) భావించే బీఎస్‌ఈ సెన్సెక్స్ (BSE Sensex) 1500 పాయింట్ల లాభంతో ఉంది. ఎన్‌ఎస్‌ఈ నిఫ్టీ (NSE Nifty) 16,650 పై స్థాయిల్లో కొనసాగుతోంది. బీఎస్‌ఈ ప్రకారం మదుపర్ల సంపద దాదాపుగా రూ.8 లక్షల కోట్లు పెరిగింది.
BSE Sensex
క్రితం సెషన్లో 54,529 వద్ద ముగిసిన బీఎస్‌ఈ సెన్సెక్స్ నేడు 55,321 వద్ద భారీ గ్యాప్ అప్‌తో మొదలైంది. 55,299 వద్ద కనిష్ఠాన్ని తాకినప్పటికీ కొనుగోళ్ల జోరుతో 56,120 వద్ద గరిష్ఠ స్థాయిల్లో ట్రేడ్ అవుతోంది. ప్రస్తుతం 1600 పాయింట్ల లాభంతో 56,130 వద్ద కొనసాగుతోంది.
NSE Nifty
గురువారం 16,247 వద్ద ముగిసిన ఎన్ఎస్‌ఈ నిఫ్టీ శుక్రవారం 16,515 వద్ద మొదలైంది. మదుపర్లు షేర్లను కొనుగోళ్లు చేస్తుండటంతో 16,747 వద్ద ఇంట్రాడే గరిష్ఠాన్ని అందుకుంది. ప్రస్తుతం 473 పాయింట్ల లాభంతో 17,721 వద్ద కొనసాగుతోంది.
Bank Nifty
బ్యాంకు నిఫ్టీ జోరుమీదుంది. ఉదయం 35,901 వద్ద మెరుగ్గా ఆరంభమైంది. 35,768 వద్ద ఇంట్రాడే కనిష్ఠాన్ని తాకినప్పటికీ వెంటనే తేరుకొని 36,538 వద్ద ఇంట్రాడే గరిష్ఠాన్ని అందుకుంది. ప్రస్తుతం 1221 పాయింట్ల లాభంతో 36,450 వద్ద ట్రేడ్ అవుతోంది.
Gainers and Lossers
నిఫ్టీలో 47 కంపెనీలు లాభాల్లో ఉన్నాయి. 3 నష్టాల్లో కొనసాగుతున్నాయి. టాటా మోటార్స్, అదానీ పోర్ట్స్, టాటా స్టీల్, ఇండస్‌ఇండ్ బ్యాంక్, కోల్ ఇండియా 4-7 శాతం వరకు పుంజుకున్నాయి. బ్రిటానియా, నెస్లే ఇండియా, హిందుస్థాన్ యునీలివర్ స్వల్ప నష్టాల్లో ఉన్నాయి. మార్కెట్లోని అన్ని సూచీలు ఆకుపచ్చ రంగులో కళకళలాడుతున్నాయి. పీఎస్‌యూ బ్యాంక్, పవర్, మెటల్, రియాల్టీ సూచీలు ఏకంగా 4-6 శాతం వరకు ఎగిశాయి.
Gold-Silver Price Today 04 June 2023: కొండ దిగొచ్చిన పసిడి - ఇవాళ బంగారం, వెండి ధరలు ఇవి
Taiwanese Shipping Firms: ఉద్యోగులకు షిప్పింగ్ కంపెనీల బంపర్ ఆఫర్లు, మందగమనంలో ఉన్నా మస్తు బోనస్‌లు
FD Rates: ఫిక్స్‌డ్ డిపాజిట్ల వడ్డీలో కోత, ఈ లిస్ట్‌లో మీ బ్యాంక్ ఉందేమో చూసుకోండి
ICICI Bank: ఐసీఐసీఐ బ్యాంక్ హోమ్ లోన్ కావాలా, మీ కోసమే ఈ గుడ్‌న్యూస్
Mutual Funds: స్మార్ట్‌గా డబ్బు సంపాదించిన స్మాల్ క్యాప్ ఫండ్స్, మూడేళ్లలో 65% రిటర్న్
Chandrababu Delhi Tour: ఢిల్లీలో అమిత్ షా, జేపీ నడ్డాతో ముగిసిన చంద్రబాబు భేటీ - పొత్తు కుదురుతుందా?
Odisha Train Accident: తొలిసారి భార్య మాట పాటించిన భర్త, రైలు ప్రమాదం నుంచి తప్పించుకున్న కొత్త జంట!
PM Modi on Train Accident: నోట మాట రావడం లేదు, ప్రమాదం తీవ్రంగా కలచివేసింది - రైలు ప్రమాదంపై ప్రధాని మోదీ
ChatGPT: షాకిస్తున్న ఛాట్ జీపీటీ - గూగుల్ అసిస్టెంట్, యాపిల్ సిరి తరహాలో!
Chiranjeevi Cancer - Fact Check : చిరంజీవికి క్యాన్సర్ వచ్చిందా? అసలు నిజం ఏమిటి? మెగాస్టార్ చెప్పింది ఏమిటి?