Stock Market News: రివ్వున దూసుకెళ్లిన స్టాక్ మార్కెట్లు! ఎఫ్‌ఎంసీజీ షేర్లకు కొనుగోళ్ల మద్దతు
Stock Market Closing Bell: భారత స్టాక్ మార్కెట్లు (Indian equity markets) గురువారం భారీగా లాభపడ్డాయి. ఎన్‌ఎస్‌ఈ నిఫ్టీ (NSE Nifty) 17,245 వద్ద ముగిసింది.
Stock Market Closing Bell: భారత స్టాక్ మార్కెట్లు (Indian equity markets) గురువారం భారీగా లాభపడ్డాయి. ఆసియా మార్కెట్లు లాభాల్లో ట్రేడవ్వడం మదుపర్లలో సానుకూల సెంటిమెంట్ నింపింది. ఎఫ్‌ఎంసీజీ, ఎనర్జీ షేర్ల దన్నుతో మార్కెట్లు దూసుకుపోయాయి. రిలయన్స్ ఇండస్ట్రీస్ షేరు లాభపడటంతో కంపెనీ మార్కెట్ విలువ రూ.19 లక్షల కోట్లను దాటేసింది. ఎన్‌ఎస్‌ఈ నిఫ్టీ (NSE Nifty) 17,245 వద్ద ముగిసింది. బీఎస్‌ఈ సెన్సెక్స్ (BSE Sensex) 701కి పాయింట్లు లాభపడింది.
BSE Sensex
క్రితం సెషన్లో 56,819 వద్ద ముగిసిన బీఎస్‌ఈ సెన్సెక్స్ నేడు 57,296 వద్ద లాభాల్లో మొదలైంది. ఉదయం నుంచే దూకుడుగా ట్రేడ్ అవుతోంది. 57,790 వద్ద ఇంట్రాడే గరిష్ఠాన్ని నమోదు చేసింది. 56,936 వద్ద ఇంట్రాడే కనిష్ఠాన్ని తాకింది. ఒకానొక దశలో 900 పాయింట్ల లాభపడింది. ఆఖరికి 701 పాయింట్ల లాభంతో 57,521 వద్ద ముగిసింది.
NSE Nifty
బుధవారం 17,038 వద్ద ముగిసిన ఎన్‌ఎస్‌ఈ నిఫ్టీ గురువారం 17,189 వద్ద ఓపెనైంది. కొనుగోళ్ల మద్దతు లభించడంతో ఉదయం నుంచి సూచీ పై స్థాయిలో కదలాడింది. 17,322 వద్ద ఇంట్రాడే గరిష్ఠాన్ని చేరుకుంది. 17,071 వద్ద ఇంట్రాడే కనిష్ఠాన్ని తాకింది. చివరికి 206 పాయింట్ల లాభంతో 17,245 వద్ద ముగిసింది.
Nifty Bank
నిఫ్టీ బ్యాంక్ లాభాల్లో ట్రేడ్ అవుతోంది. ఉదయం 36,189 వద్ద మొదలైంది. 35,951 ఇద్ద ఇంట్రాడే కనిష్ఠాన్ని తాకింది. 36,501 వద్ద ఇంట్రాడే గరిష్ఠాన్ని అందుకుంది. మొత్తంగా 393 పాయింట్ల లాభంతో 36,422 వద్ద ముగిసింది.
Gainers and Lossers
నిఫ్టీ 50లో 45 కంపెనీలు లాభపడగా 4 నష్టాల్లో ముగిశాయి. హెచ్‌డీఎఫ్‌సీ లైఫ్, హిందుస్థాన్ యునీలివర్, ఎస్‌బీఐ లైఫ్, యూపీఎల్, ఏసియన్ పెయింట్స్ లాభపడ్డాయి. బజాజ్ ఆటో, భారతీ ఎయిర్‌టెల్, హిందాల్కో, ఎం అండ్ ఎం, హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్ నష్టపోయాయి. నేడు అన్ని రంగాల సూచీలు ఎగిశాయి. ఎఫ్‌ఎంసీజీ, పవర్, ఆటో, క్యాపిటల్స్ గూడ్స్ షేర్లకు ఎక్కువ డిమాండ్ లభించింది.
View this post on Instagram
View this post on Instagram