Stock Market News: వెంటాడుతున్న ద్రవ్యల్బణం భయాలు! మార్కెట్లకు మళ్లీ నష్టాలే!
Stock Market closing bell: భారత స్టాక్ మార్కెట్లు (Indian equity markets) మరోసారి నష్టపోయాయి. ఎన్‌ఎస్‌ఈ నిఫ్టీ (NSE Nifty) 17,530 వద్ద ముగిసింది. బీఎస్‌ఈ సెన్సెక్స్ (BSE Sensex) 388 పాయింట్లు నష్టపోయింది.
Stock Market closing bell: భారత స్టాక్ మార్కెట్లు (Indian equity markets) మరోసారి నష్టపోయాయి. అంతర్జాతీయంగా సానుకూల సంకేతాలు కనిపించడం లేదు. ద్రవ్యోల్బణం భయాలు మదుపర్లను వెంటాడుతున్నాయి. ఉదయం నష్టాలతోనే ఆరంభమైనా మధ్యాహ్నం కాస్త పుంజుకున్నాయి. ఎన్‌ఎస్‌ఈ నిఫ్టీ (NSE Nifty) 17,530 వద్ద ముగిసింది. బీఎస్‌ఈ సెన్సెక్స్ (BSE Sensex) 388 పాయింట్లు నష్టపోయింది.
BSE Sensex
క్రితం సెషన్లో 58,964 వద్ద ముగిసిన బీఎస్‌ఈ సెన్సెక్స్ నేడు 58,743 వద్ద నష్టాల్లో మొదలైంది. ఉదయం నుంచీ సూచీ ఒడుదొడుకుల్లోనే ట్రేడైంది. మధ్యాహ్నం ఐరోపా మార్కెట్లు ఓపెనయ్యాక కాస్త పుంజుకుంది. 58,298 వద్ద ఇంట్రాడే కనిష్ఠాన్ని చేరుకుంది. 58,794 వద్ద ఇంట్రాడే గరిష్ఠాన్ని అందుకుంది. చివరికి 388 పాయింట్ల నష్టంతో 58,576 వద్ద ముగిసింది.
NSE Nifty
సోమవారం 17,674 వద్ద ముగిసిన ఎన్‌ఎస్‌ఈ నిఫ్టీ మంగళవారం 17,584 వద్ద ఓపెనైంది. ఉదయం 17,442 వద్ద ఇంట్రాడే కనిష్ఠాన్ని అందుకుంది. ఐరోపా మార్కెట్లు తెరుచుకున్నాక కాస్త పుంజుకొని 17,595 వద్ద ఇంట్రాడే గరిష్ఠాన్ని చేరుకుంది. చివరికి 144 పాయింట్ల నష్టంతో 17,530 వద్ద ముగిసింది.
Nifty Bank
నిఫ్టీ బ్యాంక్ 37,407 వద్ద మొదలైంది. 37,264 ఇద్ద ఇంట్రాడే కనిష్ఠాన్ని తాకింది. 37,820 వద్ద ఇంట్రాడే గరిష్ఠాన్ని అందుకుంది. చివరికి 133 పాయింట్ల లాభంతో 37,747 వద్ద ముగిసింది.
Gainers and Lossers
నిఫ్టీ 50లో 11 కంపెనీలు లాభపడగా 39 నష్టాల్లో ముగిశాయి. యాక్సిస్ బ్యాంక్, కొటక్ బ్యాంక్, పవర్‌గ్రిడ్, ఐసీఐసీఐ బ్యాంక్, ఇండస్ ఇండ్ బ్యాంక్ షేర్లు లాభపడ్డాయి. హిందాల్కో, కోల్ ఇండియా, గ్రాసిమ్, టాటా మోటార్స్, టాటా స్టీల్ నష్టపోయాయి. బ్యాంకు తప్ప మిగతా అన్ని రంగాల సూచీలు ఎరుపెక్కాయి. ఐటీ, మెటల్, రియాల్టీ, ఆయిల్, గ్యాస్, క్యాపిటల్స్ గూడ్స్ 1-3 శాతం తగ్గిపోయాయి.