అన్వేషించండి

Stock Market News: ఆరంభ లాభాలు ఆవిరి! రేంజ్‌బౌండ్‌లో కదలాడిన సూచీలు చివరికి..!

Stock Market Closing Bell: భారత స్టాక్‌ మార్కెట్లు మంగళవారం నష్టపోయాయి. ఎన్‌ఎస్‌ఈ నిఫ్టీ (NSE Nifty) 16,125 వద్ద ముగిసింది. బీఎస్‌ఈ సెన్సెక్స్‌ (BSE Sensex) 246 పాయింట్లు నష్టపోయింది.

Stock Market Closing Bell: భారత స్టాక్‌ మార్కెట్లు (Indian equity markets) మంగళవారం నష్టపోయాయి. ఆరంభంలో లాభాల్లోనే కదలాడిన సూచీలు సమయం గడిచే కొద్దీ నష్టాల్లోకి జారుకున్నాయి. అంతర్జాతీయ మార్కెట్లను ద్రవ్యోల్బణం భయాలు వెంటాడుతూనే ఉన్నాయి. కంపెనీల ఖర్చులు పెరగడంతో మార్జిన్లు తగ్గుతున్నాయి. ఇదే ప్రభావం ఇండియన్‌ ఇన్వెస్టర్ల మీదా పడింది.  ఎన్‌ఎస్‌ఈ నిఫ్టీ (NSE Nifty) 16,125 వద్ద ముగిసింది. బీఎస్‌ఈ సెన్సెక్స్‌ (BSE Sensex) 246 పాయింట్లు నష్టపోయింది.

BSE Sensex

క్రితం సెషన్లో 54,288 వద్ద ముగిసిన బీఎస్‌ఈ సెన్సెక్స్‌ నేడు 54,307 వద్ద స్వల్ప లాభాల్లో మొదలైంది. ఆద్యంతం రేంజ్‌బౌండ్‌లోనే కదలాడింది. 53,886 వద్ద ఇంట్రాడే కనిష్ఠాన్ని తాకింది. 54,524 వద్ద ఇంట్రాడే గరిష్ఠాన్ని అందుకుంది. చివరికి 246 పాయింట్ల నష్టంతో 54,052 వద్ద ముగిసింది.

NSE Nifty

సోమవారం 16,214 వద్ద ముగిసిన ఎన్‌ఎస్‌ఈ నిఫ్టీ మంగళవారం 16225 వద్ద ఓపెనైంది. ఆరంభంలో లాభపడ్డా ఆ తర్వాత ఒడుదొడుకులకు లోనైంది. 16,078 వద్ద ఇంట్రాడే కనిష్ఠాన్ని చేరుకుంది. 16,262 వద్ద ఇంట్రాడే గరిష్ఠాన్ని అందుకుంది. చివరికి 89 పాయింట్లు నష్టపోయి 16,125 వద్ద ముగిసింది.

Nifty Bank

నిఫ్టీ బ్యాంక్‌ లాభాల్లో ముగిసింది. ఉదయం 34,223 వద్ద మొదలైంది. 34,115 వద్ద ఇంట్రాడే కనిష్ఠాన్ని తాకింది. 34,586 వద్ద ఇంట్రాడే గరిష్ఠాన్ని అందుకుంది. మొత్తంగా 42 పాయింట్ల లాభంతో 34,290 వద్ద స్థిరపడింది.

Gainers and Lossers

నిఫ్టీ 50లో 18 కంపెనీలు లాభాల్లో 32 నష్టాల్లో ముగిశాయి. డాక్టర్‌ రెడ్డీస్‌, హెచ్‌డీఎఫ్‌సీ, కొటక్‌ బ్యాంక్‌, పవర్‌ గ్రిడ్‌, హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్‌ షేర్లు లాభాపడ్డాయి. దివిస్‌ ల్యాబ్‌, టెక్‌ మహీంద్రా, గ్రాసిమ్‌, హిదుస్థాన్‌ యునీలివర్‌, హిందాల్కో నష్టపోయాయి. దాదాపుగా అన్ని రంగాల సూచీలు పతనం అయ్యాయి. ఐటీ, ఫార్మా, మెటల్‌, ఎఫ్‌ఎంసీజీ, పవర్‌, రియాల్టీ ఒక శాతం వరకు నష్టపోయాయి. 

View this post on Instagram
 
A post shared by NSE India (@nseindia)

View this post on Instagram
 
A post shared by BSEIndia (@bseindia)

ఇంకా చదవండి
Sponsored Links by Taboola

టాప్ హెడ్ లైన్స్

Konaseema ONGC Gas Blowout : ఇరుసుమండలో తగ్గుముఖం పట్టిన నిప్పుల సెగ; ఊపిరి పీల్చుకుంటున్న కోనసీమ, రంగంలోకి ఢిల్లీ నిపుణులు
ఇరుసుమండలో తగ్గుముఖం పట్టిన నిప్పుల సెగ; ఊపిరి పీల్చుకుంటున్న కోనసీమ, రంగంలోకి ఢిల్లీ నిపుణులు
Telangana districts Reorganization: తెలంగాణలో జిల్లాల పునర్‌వ్యవస్థీకరణ - అసెంబ్లీలో మంత్రి పొంగులేటి కీలక ప్రకటన
తెలంగాణలో జిల్లాల పునర్‌వ్యవస్థీకరణ - అసెంబ్లీలో మంత్రి పొంగులేటి కీలక ప్రకటన
Actor Vijay CBI Notice: నటుడు విజయ్‌కి సీబీఐ సమన్లు.. ఈ 12న వ్యక్తిగత విచారణకు హాజరు కావాలని ఆదేశం
నటుడు విజయ్‌కి సీబీఐ సమన్లు.. ఈ 12న వ్యక్తిగత విచారణకు హాజరు కావాలని ఆదేశం
OTT Releases This Week: ఓటీటీలో దుమ్ము రేపుతున్న ఐదు సినిమాలు... 'థామ' నుండి 'హక్' వరకు!
ఓటీటీలో దుమ్ము రేపుతున్న ఐదు సినిమాలు... 'థామ' నుండి 'హక్' వరకు!

వీడియోలు

History Behind Peppé Buddha Relics | భారత్‌కు తిరిగి వచ్చిన బుద్ధుని అస్థికలు! | ABP Desam
అగార్కర్‌పై మహ్మద్ షమి కోచ్ సంచలన కామెంట్స్
రాజస్థాన్ రాయల్స్ కెప్టెన్‌గా రవీంద్ర జడేజా!
ఫార్మ్ లో లేడని తెలుసు  కానీ ఇలా చేస్తారని అనుకోలేదు: రికీ పాంటింగ్
ఇంకా అందని ఆసియా కప్ ట్రోఫీ.. నఖ్వీ షాకింగ్ కామెంట్స్..

ఫోటో గ్యాలరీ

ABP Premium

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Konaseema ONGC Gas Blowout : ఇరుసుమండలో తగ్గుముఖం పట్టిన నిప్పుల సెగ; ఊపిరి పీల్చుకుంటున్న కోనసీమ, రంగంలోకి ఢిల్లీ నిపుణులు
ఇరుసుమండలో తగ్గుముఖం పట్టిన నిప్పుల సెగ; ఊపిరి పీల్చుకుంటున్న కోనసీమ, రంగంలోకి ఢిల్లీ నిపుణులు
Telangana districts Reorganization: తెలంగాణలో జిల్లాల పునర్‌వ్యవస్థీకరణ - అసెంబ్లీలో మంత్రి పొంగులేటి కీలక ప్రకటన
తెలంగాణలో జిల్లాల పునర్‌వ్యవస్థీకరణ - అసెంబ్లీలో మంత్రి పొంగులేటి కీలక ప్రకటన
Actor Vijay CBI Notice: నటుడు విజయ్‌కి సీబీఐ సమన్లు.. ఈ 12న వ్యక్తిగత విచారణకు హాజరు కావాలని ఆదేశం
నటుడు విజయ్‌కి సీబీఐ సమన్లు.. ఈ 12న వ్యక్తిగత విచారణకు హాజరు కావాలని ఆదేశం
OTT Releases This Week: ఓటీటీలో దుమ్ము రేపుతున్న ఐదు సినిమాలు... 'థామ' నుండి 'హక్' వరకు!
ఓటీటీలో దుమ్ము రేపుతున్న ఐదు సినిమాలు... 'థామ' నుండి 'హక్' వరకు!
Mukesh Ambani: ప్రాణమిత్రుడు మోడీకి రూ.1500 కోట్ల విలువైన భవనం రాసిచ్చిన ముఖేష్ అంబానీ - కుబేర మిత్రులు ఉంటే ఎంత ఉపయోగమో కదా!
ప్రాణమిత్రుడు మోడీకి రూ.1500 కోట్ల విలువైన భవనం రాసిచ్చిన ముఖేష్ అంబానీ - కుబేర మిత్రులు ఉంటే ఎంత ఉపయోగమో కదా!
Tata tiago On EMI Finance Plan: మీ ప్రాంతంలో ట్రాఫిక్‌కు టియాగో సరైన ఛాయిస్‌; ధరలు, ఈజీ ఈఎంఐ ప్లాన్‌ ఇదే !
మీ ప్రాంతంలో ట్రాఫిక్‌కు టియాగో సరైన ఛాయిస్‌; ధరలు, ఈజీ ఈఎంఐ ప్లాన్‌ ఇదే !
ONGC Gas Blowout: ఇరుసుమండలో ఇంకా ఆరని మంటలు.. గొడుగు రూపంలో మంటలు ఆర్పుతున్న సిబ్బంది
ఇరుసుమండలో ఇంకా ఆరని మంటలు.. గొడుగు రూపంలో మంటలు ఆర్పుతున్న సిబ్బంది
Nicolas Maduro: ఇంటి నుంచి నన్ను కిడ్నాప్ చేశారు.. నేను యుద్ధ ఖైదీని, నిజాయితీపరుడిని: అమెరికా కోర్టులో నికోలస్ మదురో
నన్ను కిడ్నాప్ చేశారు.. నేను యుద్ధ ఖైదీని, నిజాయితీపరుడిని: అమెరికా కోర్టులో నికోలస్ మదురో
Embed widget