News
News
వీడియోలు ఆటలు
X

Trading: 9 నెలల్లో అర కోటి మంది ఔట్‌, రిటైల్ ఇన్వెస్టర్ల ఇబ్బంది ఏంటి?

లాక్‌డౌన్ సమయంలో 'వర్క్‌ ఫ్రమ్‌ హోమ్‌' (WFH) నడిచినప్పుడు రిటైల్‌ ఇన్వెస్టర్లు చాలా ఉత్సాహంగా ట్రేడింగ్‌ చేశారు.

FOLLOW US: 
Share:

Stock Market Trading: స్టాక్‌ మార్కెట్‌లో కొత్తగా డీమ్యాట్‌ ఖాతాలు ఓపెన్‌ అవుతున్నా, బయటకు వెళ్లే వాళ్లు వెళ్తూనే ఉన్నారు. గత 9 నెలల్లో, మార్కెట్‌లోని యాక్టివ్ క్లయింట్ సంఖ్య 53 లక్షలు తగ్గింది. 

NSEలో యాక్టివ్ క్లయింట్‌ల సంఖ్య మార్చిలోనూ (వరుసగా తొమ్మిదో నెల) తగ్గింది, 3.27 కోట్లకు చేరింది. 2022 జూన్ నెలలో పెట్టుబడిదార్ల సంఖ్య 3.8 కోట్లకు చేరింది. అప్పట్నుంచి క్రమంగా పడిపోతూ, మొత్తం నంబర్‌ నుంచి 53 లక్షలు తగ్గింది.

గత కాలపు ఉత్సాహం ఇప్పుడేది?
లాక్‌డౌన్ సమయంలో 'వర్క్‌ ఫ్రమ్‌ హోమ్‌' (WFH) నడిచినప్పుడు రిటైల్‌ ఇన్వెస్టర్లు చాలా ఉత్సాహంగా ట్రేడింగ్‌ చేశారు. ఇప్పుడు WFH దశ ముగిసింది. కాబట్టి, గతంలోని ఉత్సాహం ఇప్పుడు లేదు. దీనిని నిరూపించే మరో మూడు సంకేతాలు కూడా ఉన్నాయి.

మొదటి సంకేతం.. FY 2023లో రిటైల్ ఇన్‌ఫ్లోస్‌ గత మూడేళ్లలోనే కనిష్ట స్థాయి దిగి వచ్చాయి, రూ. 49,200 కోట్లుగా ఉన్నాయి. FY 2021-22లో ఇది రూ. 1.65 లక్షల కోట్లుగా, FY 2020-21లో రూ. 68,400 కోట్లుగా ఉంది.

రెండో సంకేతం.. 2023 మార్చిలో, BSE & NSE క్యాష్‌ మార్కెట్లలో రిటైల్ ఇన్వెస్టర్ల రోజువారీ సగటు టర్నోవర్ 29% తగ్గి రూ. 23,700 కోట్లకు చేరుకుంది.

మూడో సంకేతం.. కొత్త డీమ్యాట్ ఖాతాల ప్రారంభాల్లో వేగం మందగిస్తోంది. కొత్త ఖాతాల సంఖ్య ఫిబ్రవరితో పోలిస్తే మార్చిలో 8% క్షీణించి 19 లక్షలకు చేరుకున్నాయి.

రిటైల్ ఇన్వెస్టర్లకు వచ్చిన ఇబ్బంది ఏంటి?
గత ఒకటిన్నర సంవత్సరాలుగా నిఫ్టీ సైడ్‌ వేస్‌-టు-డౌన్‌ ట్రెండ్‌లో కదులుతోంది. మార్కెట్‌ మీద ఎలుగుబంట్ల ఆధిపత్యం కారణంగా ఇన్వెస్టర్లు కొన్ని నెలలుగా నష్టాల్లో ఉన్నారు, లేదా ఒక్క రూపాయి లాభం కూడా సంపాదించలేకపోయారు. ఇలా నష్టాలతో లేదా రాబడి లేకుండా కూర్చోవడం కష్టంగా మారడంతో ఎగ్జిట్‌ తలుపు ఎక్కడుందో వెతుక్కుంటున్నారు. 

కొవిడ్ లాక్‌డౌన్‌ల సమయంలోని 'వర్క్ ఫ్రమ్ హోమ్' కల్చర్, యువతను స్టాక్‌ మార్కెట్‌ వైపు లాక్కొచ్చింది. ట్రేడింగ్‌ను ఫ్యాషన్‌గా మార్చింది. ఓ చేత్తో ఆఫీస్‌ వర్క్‌, మరో చేత్తో స్టాక్స్ ట్రేడింగ్ చేశారు యూత్‌ రిటైల్‌ ట్రేడర్లు.

కొవిడ్ క్రాష్ తర్వాత కనిపించిన వన్ వే ర్యాలీని పట్టుకుని, ఒక్క రాత్రిలో కోటీశ్వరులు కావాలని కలలు కన్నారు అనుభవం లేని ట్రేడర్లు. దిగిన తర్వాత గానీ మార్కెట్‌ లోతెంతో అర్ధం కాలేదు వాళ్లకు. దీంతో, ట్రేడింగ్‌ అంటే అంత ఈజీ కాదని గ్రహించి, ఒకరి తర్వాత ఒకళ్లు నిష్క్రమిస్తున్నారు. గత 9 నెలలుగా ఈ నిష్క్రమణల పర్వం కొనసాగుతోంది.

మార్కెట్‌లో ఎవరో చెప్పే టిప్స్‌ ఆధారంగా షేర్లు కొని నష్టాలు మూటగట్టుకున్న వాళ్లు మార్కెట్‌ను తిట్టుకుంటూ వెళ్లిపోవడం సర్వసాధారణంగా కనిపించే విషయం. కానీ... తమ అనుభవం ఎంత, ఏ ప్రాతిపదికన ఆయా ట్రేడ్స్‌ తీసుకున్నారని మాత్రం తమను తాము ఎవరూ ప్రశ్నించుకోరు.

Disclaimer: ఈ వార్త కేవలం సమాచారం కోసం మాత్రమే. మ్యూచువల్‌ ఫండ్లు, స్టాక్‌ మార్కెట్‌, క్రిప్టో కరెన్సీ, షేర్లు, ఫారెక్స్‌, కమొడిటీల్లో పెట్టే పెట్టుబడులు ఒడుదొడుకులకు లోనవుతుంటాయి. మార్కెట్‌ పరిస్థితులను బట్టి ఆయా పెట్టుబడి సాధనాల్లో రాబడి మారుతుంటుంది. ఫలానా మ్యూచువల్‌ ఫండ్‌, స్టాక్‌, క్రిప్టో కరెన్సీలో పెట్టుబడి పెట్టాలని లేదా ఉపసంహరించుకోవాలని 'abp దేశం' చెప్పడం లేదు. పెట్టుబడి పెట్టే ముందు, లేదా ఉపసంహరించుకునే ముందు అన్ని వివరాలు పరిశీలించడం ముఖ్యం. అవసరమైతే సర్టిఫైడ్‌ ఫైనాన్షియల్‌ అడ్వైజర్ల నుంచి సలహా తీసుకోవడం మంచిది.

Published at : 19 Apr 2023 11:47 AM (IST) Tags: WFH Work From Home trading Stock Market

సంబంధిత కథనాలు

Byjus Loan Default: బైజూస్‌కు షాక్‌! రూ.329 కోట్ల వడ్డీ చెల్లించకుంటే లోన్‌ ఎగ్గొట్టినట్టే!

Byjus Loan Default: బైజూస్‌కు షాక్‌! రూ.329 కోట్ల వడ్డీ చెల్లించకుంటే లోన్‌ ఎగ్గొట్టినట్టే!

Stock Market News: మార్కెట్లో బుల్‌ రన్‌! 18,614 మీదే కొనసాగుతున్న నిఫ్టీ!

Stock Market News: మార్కెట్లో బుల్‌ రన్‌! 18,614 మీదే కొనసాగుతున్న నిఫ్టీ!

Gold-Silver Price Today 05 June 2023: పసిడి రేటు స్థిరం - ఇవాళ బంగారం, వెండి ధరలు

Gold-Silver Price Today 05 June 2023: పసిడి రేటు స్థిరం - ఇవాళ బంగారం, వెండి ధరలు

Nissan Magnite Discount: నిస్సాన్ మ్యాగ్నైట్‌పై భారీ డిస్కౌంట్ - కొనాలంటే ఇదే రైట్ టైం!

Nissan Magnite Discount: నిస్సాన్ మ్యాగ్నైట్‌పై భారీ డిస్కౌంట్ -  కొనాలంటే ఇదే రైట్ టైం!

Upcoming Cars: రూ.10 లక్షలలోపు లాంచ్ కానున్న లేటెస్ట్ కార్లు ఇవే - కొత్త కారు కొనాలనుకుంటే కొంచెం ఆగండి!

Upcoming Cars: రూ.10 లక్షలలోపు లాంచ్ కానున్న లేటెస్ట్ కార్లు ఇవే - కొత్త కారు కొనాలనుకుంటే కొంచెం ఆగండి!

టాప్ స్టోరీస్

ప్రకాశం జిల్లా నాయుడుపాలెంలో ఉద్రిక్తత- టీడీపీ ఎమ్మెల్యే అరెస్టు

ప్రకాశం జిల్లా నాయుడుపాలెంలో ఉద్రిక్తత- టీడీపీ ఎమ్మెల్యే అరెస్టు

Bandi Sanjay on TDP: "టీడీపీ, బీజేపీ పొత్తు ఊహాగానాలే, బాబు అమిత్ షా, నడ్డాలను కలిస్తే తప్పేంటి"

Bandi Sanjay on TDP:

Khammam Medico Suicide: మరో వైద్య విద్యార్థిని ఆత్మహత్య, ఒంటికి నిప్పంటించుకుని బలవన్మరణం!

Khammam Medico Suicide: మరో వైద్య విద్యార్థిని ఆత్మహత్య, ఒంటికి నిప్పంటించుకుని బలవన్మరణం!

Wrestlers Protest: బ్రిజ్‌ భూషణ్‌పై స్టేట్‌మెంట్‌ వెనక్కి తీసుకున్న మైనర్ రెజ్లర్, ఇంతలోనే ఏం జరిగింది?

Wrestlers Protest: బ్రిజ్‌ భూషణ్‌పై స్టేట్‌మెంట్‌ వెనక్కి తీసుకున్న మైనర్ రెజ్లర్, ఇంతలోనే ఏం జరిగింది?