అన్వేషించండి

Share Market Opening Today 21 November 2023: పచ్చగా ప్రారంభమైన భారత స్టాక్‌ మార్కెట్లు, గ్లోబల్‌ సిగ్నల్స్‌తో మళ్లీ ఉత్సాహం

Share Markets : మార్కెట్ హెవీ వెయిట్స్‌ అయిన రిలయన్స్ ఇండస్ట్రీస్, HDFC బ్యాంక్‌ నుంచి నేటి మార్కెట్‌ మద్దతు తీసుకుంది.

Stock Market Today News in Telugu: రెండు వరుస సెషన్ల (శుక్రవారం, సోమవారం) పతనం తర్వాత, భారత స్టాక్ మార్కెట్లు ఈ రోజు (మంగళవారం) మళ్లీ ఊపందుకున్నాయి. అమెరికన్‌ మార్కెట్లలో నిన్న జరిగిన బలమైన ర్యాలీ ప్రభావం ఈ రోజు దేశీయ షేర్ మార్కెట్‌పై (Share Market Opening Today) కనిపించింది. ఇక్కడ కూడా పాజిటివ్‌ రెస్పాన్స్‌ రావడంతో భారత స్టాక్ మార్కెట్ హైయ్యర్‌ సైడ్‌లో ట్రేడ్‌ అవుతోంది. మార్కెట్ హెవీ వెయిట్స్‌ అయిన రిలయన్స్ ఇండస్ట్రీస్, HDFC బ్యాంక్‌ నుంచి నేటి మార్కెట్‌ మద్దతు తీసుకుంది. ఆ రెండు షేర్లు లాభాల్లో ప్రారంభమయ్యాయి. 

ఈ రోజు మార్కెట్ ఇలా ప్రారంభమైంది...
నిన్న (సోమవారం, 20 నవంబర్‌ 2023) 65,655 దగ్గర క్లోజ్‌ అయిన BSE సెన్సెక్స్‌, ఈ రోజు 205.31 పాయింట్లు లేదా 0.31 శాతం పెరుగుదలతో 65,860 స్థాయి వద్ద (BSE Sensex Opening Today) ఓపెన్‌ అయింది. గత సెషన్‌లో 19,694 దగ్గర ఆగిన NSE నిఫ్టీ, ఈ రోజు 76.90 పాయింట్లు లేదా 0.39 శాతం పెరుగుదలతో 19,770 వద్ద (NSE Nifty Opening Today) ప్రారంభమైంది. 

గత రెండు సెషన్లుగా మార్కెట్‌ను కిందకు లాగిన బ్యాంక్ నిఫ్టీ ఈ రోజు బలాన్ని ప్రదర్శించింది. 157 పాయింట్లు పెరిగి 43,742 వద్ద ట్రేడవుతోంది. HDFC బ్యాంక్ మంచి బ్యాకప్‌ ఇచ్చింది.

సెన్సెక్స్ షేర్ల పరిస్థితి
ఈ రోజు ఓపెనింగ్‌ ట్రేడ్‌లో... సెన్సెక్స్ 30 ప్యాక్‌లోని 23 షేర్లు పెరిగాయి. 7 షేర్లు మాత్రమే నష్టాల్లో ఉన్నాయి. టాప్ గెయినర్స్‌లో.. JSW స్టీల్ 1.16 శాతం, టాటా స్టీల్ 1.08 శాతం, HDFC బ్యాంక్ 0.80 శాతం, రిలయన్స్ ఇండస్ట్రీస్ 0.69 శాతం, ఇన్ఫోసిస్ 0.67 శాతం, HCL టెక్ 0.62 శాతం పెరిగాయి. 

నిఫ్టీ చిత్రం
నిఫ్టీ 50 స్టాక్స్‌లో 37 స్టాక్స్‌ లాభాలతో ట్రేడవ్వగా, 13 స్టాక్స్ తిరోగమనంలో ఉన్నాయి. టాప్ గెయినర్స్‌లో.. అదానీ ఎంటర్‌ప్రైజెస్ అత్యధికంగా 2 శాతం ఎగబాకింది. హిందాల్కో 1.85 శాతం, JSW స్టీల్ 1.32 శాతం, టాటా స్టీల్ 1.21 శాతం, బజాజ్ ఫైనాన్స్ 1.02 శాతం లాభంతో ట్రేడయ్యాయి. 

ఉదయం 10.30 గంటల సమయానికి, సెన్సెక్స్ 266 పాయింట్లు లేదా 0.41% పెరిగి 65,921 వద్ద; నిఫ్టీ 85.80 పాయింట్లు లేదా 0.44% పెరిగి 19,779.80 వద్ద ట్రేడవుతున్నాయి.

OpenAI మాజీ CEO సామ్ ఆల్ట్‌మాన్‌, మైక్రోసాఫ్ట్‌లో చేరనున్నట్లు సత్య నాదెళ్ల ప్రకటించడంతో నిన్న అమెరికన్‌ టెక్ స్టాక్స్‌ లాభపడ్డాయి, నాస్‌డాక్‌ 1 శాతానికి పైగా పెరిగి 22 నెలల గరిష్టానికి చేరింది. వాల్ స్ట్రీట్ లాభాలకు ఆసియా మార్కెట్లు అద్దం పట్టాయి. ఓపెనింగ్‌ సెషన్‌లో... హాంగ్ సెంగ్, కోస్పి తలో 1 శాతం పెరిగాయి. 

Disclaimer: ఈ వార్త కేవలం సమాచారం కోసం మాత్రమే. మ్యూచువల్‌ ఫండ్లు, స్టాక్‌ మార్కెట్‌, క్రిప్టో కరెన్సీ, షేర్లు, ఫారెక్స్‌, కమొడిటీల్లో పెట్టే పెట్టుబడులు ఒడుదొడుకులకు లోనవుతుంటాయి. మార్కెట్‌ పరిస్థితులను బట్టి ఆయా పెట్టుబడి సాధనాల్లో రాబడి మారుతుంటుంది. ఫలానా మ్యూచువల్‌ ఫండ్‌, స్టాక్‌, క్రిప్టో కరెన్సీలో పెట్టుబడి పెట్టాలని లేదా ఉపసంహరించుకోవాలని 'abp దేశం' చెప్పడం లేదు. పెట్టుబడి పెట్టే ముందు, లేదా ఉపసంహరించుకునే ముందు అన్ని వివరాలు పరిశీలించడం ముఖ్యం. అవసరమైతే సర్టిఫైడ్‌ ఫైనాన్షియల్‌ అడ్వైజర్ల నుంచి సలహా తీసుకోవడం మంచిది.

మరో ఆసక్తికర కథనం: తెలుగు రాష్ట్రాల్లో మారిన పెట్రోల్‌, డీజిల్‌ ధరలు - ఈ రోజు రేట్లు ఇవి

మరిన్ని చూడండి
Advertisement

టాప్ హెడ్ లైన్స్

EVs Registration Fee: తెలంగాణ ప్రభుత్వం గుడ్ న్యూస్ - ఎలక్ట్రిక్ వాహనాలకు రిజిస్ట్రేషన్ ఫీజు మినహాయింపు
తెలంగాణ ప్రభుత్వం గుడ్ న్యూస్ - ఎలక్ట్రిక్ వాహనాలకు రిజిస్ట్రేషన్ ఫీజు మినహాయింపు
Andhra News: ఏపీలో తీవ్ర విషాదాలు - సెల్‌ఫోన్‌లో ఆడుతూ సాంబారులో పడి బాలుడు మృతి, రోడ్డు ప్రమాదంలో ముగ్గురు బాలురు మృతి
ఏపీలో తీవ్ర విషాదాలు - సెల్‌ఫోన్‌లో ఆడుతూ సాంబారులో పడి బాలుడు మృతి, రోడ్డు ప్రమాదంలో ముగ్గురు బాలురు మృతి
Devi Sri Prasad: ప్రతి ఫ్రేమ్‌లో వినిపించింది నేనే - ట్రైలర్ లాంచ్ అయ్యాక దేవిశ్రీ ట్వీట్!
ప్రతి ఫ్రేమ్‌లో వినిపించింది నేనే - ట్రైలర్ లాంచ్ అయ్యాక దేవిశ్రీ ట్వీట్!
Jio New Plan: ఒక్క రీఛార్జ్‌తో 98 రోజుల వ్యాలిడిటీ, 196 జీబీ డేటా - జియో సూపర్ ప్లాన్ ఇదే!
ఒక్క రీఛార్జ్‌తో 98 రోజుల వ్యాలిడిటీ, 196 జీబీ డేటా - జియో సూపర్ ప్లాన్ ఇదే!
Advertisement
Advertisement
Advertisement
ABP Premium

వీడియోలు

సచ్చిపోదామని యాసిడ్ తాగినా!! ఇతని స్టోరీకి కన్నీళ్లు ఆగవు!బై నాన్నా.. వెక్కివెక్కి ఏడ్చిన నారా రోహిత్Nayanthara vs Dhanush Netflix Documentary | తమిళ్ సినీ ఇండస్ట్రీలో వివాదం..నయనతార vs ధనుష్ | ABP Desamరోహిత్ కి ధోని చేసిన మేలు, తిలక్ కి సూర్య చేస్తున్నాడు

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
EVs Registration Fee: తెలంగాణ ప్రభుత్వం గుడ్ న్యూస్ - ఎలక్ట్రిక్ వాహనాలకు రిజిస్ట్రేషన్ ఫీజు మినహాయింపు
తెలంగాణ ప్రభుత్వం గుడ్ న్యూస్ - ఎలక్ట్రిక్ వాహనాలకు రిజిస్ట్రేషన్ ఫీజు మినహాయింపు
Andhra News: ఏపీలో తీవ్ర విషాదాలు - సెల్‌ఫోన్‌లో ఆడుతూ సాంబారులో పడి బాలుడు మృతి, రోడ్డు ప్రమాదంలో ముగ్గురు బాలురు మృతి
ఏపీలో తీవ్ర విషాదాలు - సెల్‌ఫోన్‌లో ఆడుతూ సాంబారులో పడి బాలుడు మృతి, రోడ్డు ప్రమాదంలో ముగ్గురు బాలురు మృతి
Devi Sri Prasad: ప్రతి ఫ్రేమ్‌లో వినిపించింది నేనే - ట్రైలర్ లాంచ్ అయ్యాక దేవిశ్రీ ట్వీట్!
ప్రతి ఫ్రేమ్‌లో వినిపించింది నేనే - ట్రైలర్ లాంచ్ అయ్యాక దేవిశ్రీ ట్వీట్!
Jio New Plan: ఒక్క రీఛార్జ్‌తో 98 రోజుల వ్యాలిడిటీ, 196 జీబీ డేటా - జియో సూపర్ ప్లాన్ ఇదే!
ఒక్క రీఛార్జ్‌తో 98 రోజుల వ్యాలిడిటీ, 196 జీబీ డేటా - జియో సూపర్ ప్లాన్ ఇదే!
Group 3 Exams: భార్యకు పరీక్ష, భర్తకు బాధ్యత - గ్రూప్ 3 పరీక్షా కేంద్రాల వద్ద వైరల్ 'సిత్రాలు'
భార్యకు పరీక్ష, భర్తకు బాధ్యత - గ్రూప్ 3 పరీక్షా కేంద్రాల వద్ద వైరల్ 'సిత్రాలు'
Pushpa 2 Trailer: మాసు డోసు పెరిగింది బాసూ - ‘పుష్ప 2’ ట్రైలర్ రిలీజ్ - సినిమా ఈ రేంజ్ అయితే ‘బాహుబలి 2’ అవుట్!
మాసు డోసు పెరిగింది బాసూ - ‘పుష్ప 2’ ట్రైలర్ రిలీజ్ - సినిమా ఈ రేంజ్ అయితే ‘బాహుబలి 2’ అవుట్!
Lagacherla News: వచ్చేది ఫార్మా ఇండస్ట్రీ కాదు, ఇండస్ట్రియల్ అండ్‌ టెక్స్‌టైల్ పార్కు- లగచర్ల వివాదంలో భారీ ట్విస్ట్
వచ్చేది ఫార్మా ఇండస్ట్రీ కాదు, ఇండస్ట్రియల్ అండ్‌ టెక్స్‌టైల్ పార్కు- లగచర్ల వివాదంలో భారీ ట్విస్ట్
Nara Rammurthy Naidu: సోదరుని పాడె మోసిన సీఎం చంద్రబాబు - అధికారిక లాంఛనాలతో రామ్మూర్తినాయుడు అంత్యక్రియలు పూర్తి
సోదరుని పాడె మోసిన సీఎం చంద్రబాబు - అధికారిక లాంఛనాలతో రామ్మూర్తినాయుడు అంత్యక్రియలు పూర్తి
Embed widget