Share Market Opening Today: 22,300 దగ్గర నిఫ్టీ - టాప్ గేర్‌లో ఐటీ సెక్టార్, రివర్స్ గేర్‌లో ఆటో సెక్టార్
Stock Market Opening Bell: BSE మిడ్ క్యాప్ ఇండెక్స్ 0.44 శాతం, స్మాల్ క్యాప్ ఇండెక్స్ 0.68 శాతం చొప్పున పెరిగాయి.
Stock Market News Today in Telugu: గ్లోబల్ మార్కెట్ల సానుకూలతల నడుమ భారతీయ స్టాక్ మార్కెట్లు ఈ రోజు (గురువారం, 16 మే 2024) పాజిటివ్ మూడ్‌లో ప్రారంభమయ్యాయి. సెన్సెక్స్ 73,300 పైన, నిఫ్టీ 22,300 పైన ట్రేడ్ స్టార్ట్ చేశాయి. ఐటీ ఇండెక్స్ బలంగా ఉంది. మిడ్ & స్మాల్ క్యాప్ సూచీలు ఈ రోజు కూడా జోరు చూపిస్తున్నాయి.
ఈ రోజు మన మార్కెట్ ఇలా ప్రారంభమైంది...
గత సెషన్‌లో (బుధవారం) 72,987 దగ్గర క్లోజ్ అయిన BSE సెన్సెక్స్, ఈ రోజు 351 పాయింట్లు లేదా 0.48 శాతం పెరిగి 73,338.24 దగ్గర (BSE Sensex Opening Today) ఓపెన్ అయింది. బుధవారం 22,200 దగ్గర ఆగిన NSE నిఫ్టీ, ఈ రోజు 119 పాయింట్లు లేదా 0.53 శాతం లాభంతో 22,319.20 స్థాయి వద్ద (NSE Nifty Opening Today) ప్రారంభమైంది.
విస్తృత మార్కెట్లలో... BSE మిడ్ క్యాప్ ఇండెక్స్ 0.44 శాతం, స్మాల్ క్యాప్ ఇండెక్స్ 0.68 శాతం చొప్పున పెరిగాయి.
మార్కెట్ ఓపెనింగ్ టైమ్‌లో, సెన్సెక్స్ టాప్ గెయినర్స్‌లో... టెక్ మహీంద్ర 2 శాతం లాభాలతో ముందుంది. దీని తర్వాత విప్రో, భారతి ఎయిర్‌టెల్, హెచ్‌సీఎల్ టెక్, ఇన్ఫోసిస్, ఎం అండ్ ఎం, ఐసీఐసీఐ బ్యాంక్, టాటా స్టీల్ ఉన్నాయి. మరోవైపు.. పవర్ గ్రిడ్, మారుతి సుజుకి, టాటా మోటార్స్, ఎల్ అండ్ టీ, ఎన్‌టీపీసీ అత్యధికంగా నష్టపోయాయి.
నిఫ్టీ50 ప్యాక్‌లో... ఎల్‌టీఐ మైండ్‌ట్రీ, భారతి ఎయిర్‌టెల్, టెక్‌మహీంద్ర, హెచ్‌సీఎల్ టెక్, విప్రో టాప్ గెయినర్స్‌గా నిలిచాయి. మరోవైపు... ఎస్‌బీఐ లైఫ్, టాటా మోటార్స్, కోల్ ఇండియా, మారుతి, పవర్ గ్రిడ్ టాప్ లూజర్స్ లిస్ట్‌లో ఉన్నాయి.
రంగాల వారీగా చూస్తే.. చాలా సెక్టార్లు పచ్చగా ఉన్నాయి. నిఫ్టీ ఐటీ ఇండెక్స్ 1 శాతం పెరుగుదల, నిఫ్టీ ఫైనాన్షియల్ సర్వీసెస్ ఇండెక్స్ 0.5 శాతం పెరుగుదలతో నేతృత్వం వహిస్తున్నాయి. ఆటో, ఎఫ్‌ఎంసీజీ, ఫార్మా రంగాలు మాత్రం రెడ్ కలర్‌లో ఉన్నాయి.
ఈ రోజు Q4 ఫలితాలు ప్రకటించే కంపెనీలు: M&M, గెయిల్ ఇండియా, సోలార్ ఇండస్ట్రీస్, ఇన్ఫో ఎడ్జ్ ఇండియా, వోడాఫోన్ ఐడియా, కంటైనర్ కార్ప్ ఆఫ్ ఇండియా, బయోకాన్, మదర్సన్ సుమీ వైరింగ్ ఇండియా, ఎండ్యూరెన్స్ టెక్నాలజీస్, రత్నమణి మెటల్స్ అండ్ ట్యూబ్స్, క్రాంప్టన్ గ్రీవ్స్ కన్స్యూమర్, త్రివేణి టర్బైన్, కేన్స్ టెక్నాలజీ, కృష్ణా ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్, V-గార్డ్ ఇండస్ట్రీస్, ఎక్‌లెర్క్స్ సర్వీసెస్, ప్రిజమ్ జాన్సన్, ప్రిన్స్ పైప్స్, వండర్లా హాలిడేస్, JK పేపర్, సన్సెరా ఇంజనీరింగ్, రెస్టారెంట్ బ్రాండ్స్ ఆసియా, హర్ష ఇంజినీర్స్ ఇంటర్నేషనల్, అవలోన్ టెక్నాలజీస్, ఇండోకో రెమెడీస్, TCNS దుస్తులు, అక్జో నోబెల్ ఇండియా, కాప్లిన్ పాయింట్ లాబొరేటరీస్, ఇన్ఫీబీమ్ అవెన్యూస్.
ఈ రోజు ఉదయం 09.55 గంటల సమయానికి, BSE సెన్సెక్స్ 208.55 పాయింట్లు లేదా 0.29% పెరిగి 73,195.58 దగ్గర; NSE నిఫ్టీ 54.95 పాయింట్లు లేదా 0.25% పెరిగి 22,255.50 వద్ద ట్రేడవుతున్నాయి.
గ్లోబల్ మార్కెట్లు
ఆసియా మార్కెట్లలో, ఈ ఉదయం, కొరియాకు చెందిన కోస్పి 1.19 శాతం పెరుగుదలతో ముందుండగా, హాంకాంగ్‌కు చెందిన హాంగ్ సెంగ్ 0.99 శాతం పెరిగింది. జపాన్‌కు చెందిన నికాయ్ కూడా 0.53 శాతం పెరిగింది.
అమెరికన్ మార్కెట్లలో, నిన్న, నాస్‌డాక్ 1.40 శాతం, S&P 500 1.17 శాతం, డౌ జోన్స్ 0.88 శాతం లాభాలతో ముగిశాయి.
అమెరికాలో ద్రవ్యోల్బణం గణాంకాల తర్వాత 10-సంవత్సరాల బాండ్ ఈల్డ్ 4.324 శాతానికి తగ్గింది. అంతర్జాతీయ మార్కెట్‌లో చమురు ధరలు పుంజుకున్నాయి, బ్రెంట్ క్రూడ్ ఆయిల్ బ్యారెల్‌కు $83 పైకి చేరింది. గ్లోబల్ మార్కెట్‌లో గోల్డ్ రేటు భారీగా పెరిగి పుంజుకుంది, ఔన్సుకు $2,400 దగ్గర ట్రేడ్ అవుతోంది.
Disclaimer: ఈ వార్త కేవలం సమాచారం కోసం మాత్రమే. మ్యూచువల్ ఫండ్లు, స్టాక్ మార్కెట్, క్రిప్టో కరెన్సీ, షేర్లు, ఫారెక్స్, కమొడిటీల్లో పెట్టే పెట్టుబడులు ఒడుదొడుకులకు లోనవుతుంటాయి. మార్కెట్ పరిస్థితులను బట్టి ఆయా పెట్టుబడి సాధనాల్లో రాబడి మారుతుంటుంది. ఫలానా మ్యూచువల్ ఫండ్, స్టాక్, క్రిప్టో కరెన్సీలో పెట్టుబడి పెట్టాలని లేదా ఉపసంహరించుకోవాలని 'abp దేశం' చెప్పడం లేదు. పెట్టుబడి పెట్టే ముందు, లేదా ఉపసంహరించుకునే ముందు అన్ని వివరాలు పరిశీలించడం ముఖ్యం. అవసరమైతే సర్టిఫైడ్ ఫైనాన్షియల్ అడ్వైజర్ల నుంచి సలహా తీసుకోవడం మంచిది.
మరో ఆసక్తికర కథనం: తెలుగు రాష్ట్రాల్లో మారిన పెట్రోల్, డీజిల్ ధరలు - ఈ రోజు రేట్లు ఇవి