Share Market Opening Today: మార్కెట్‌లో బ్లాస్టర్ ఓపెనింగ్ - రికార్డ్ స్థాయుల్లో సెన్సెక్స్, నిఫ్టీ
బ్యాంక్ నిఫ్టీలోని మొత్తం 12 బ్యాంక్ షేర్లు లాభాలతో ట్రేడవుతున్నాయి.
Stock Market News Today in Telugu: ఈ రోజు (గురువారం, 14 డిసెంబర్ 2023) ఇండియన్ స్టాక్ మార్కెట్ అట్టహాసంగా, రికార్డ్ స్థాయుల్లో (Stock market opens at record levels) ప్రారంభమైంది. వడ్డీ రేట్లను స్థిరంగా ఉంచుతూ నిర్ణయం తీసుకోవడంతో పాటు, 2024లో మూడు రేట్ కట్స్ ఉంటాయని అమెరికా ఫెడరల్ రిజర్వ్ (US FED Rate Cuts) సిగ్నల్స్ ఇవ్వడంతో నిన్న అమెరికన్ మార్కెట్స్ రికార్డు స్థాయిలో పెరిగాయి. ఆ ప్రభావం ఈ రోజు ఇండియన్ ఈక్విటీలపైనా పడింది, అవి మహా జోరుగా ప్రారంభమయ్యాయి.
ఈ రోజు మార్కెట్ ఇలా ప్రారంభమైంది...
గత సెషన్‌లో (బుధవారం, 13 డిసెంబర్ 2023) 69,585 దగ్గర క్లోజ్ అయిన BSE సెన్సెక్స్, ఈ రోజు 561.49 పాయింట్లు లేదా 0.81 శాతం పెరుగుదలతో 70,146 వద్ద (BSE Sensex Opening Today) ఓపెన్ అయింది. ఆ తర్వాత అర గంట వ్యవధిలో 70,429.33 స్థాయికి చేరుకుంది. ఆ సమయానికి, ఇది సెన్సెక్స్ కొత్త జీవన కాల గరిష్ట స్థాయి (Sensex fresh all-time high).
గత సెషన్‌లో 20,926 దగ్గర ఆగిన NSE నిఫ్టీ, ఈ రోజు 194 పాయింట్లు లేదా 0.98 శాతం లాభంతో 21,120.55 స్థాయి వద్ద (NSE Nifty Opening Today) ప్రారంభమైంది. ఆ తర్వాత 30 నిమిషాల్లో 21,149.70 స్థాయికి వెళ్లింది. ఈ వార్త రాసే సమయానికి, ఇది నిఫ్టీ ఫ్రెష్ ఆల్ టైమ్ హై (Nifty fresh all-time high).
బ్యాంక్ నిఫ్టీలో ఉరకలెత్తిన ఉత్సాహం
మార్కెట్ ప్రారంభమైన తర్వాత బ్యాంక్ నిఫ్టీ 47,718 స్థాయికి చేరుకుంది, 626.30 పాయింట్లు లేదా 1.33 శాతం జంప్ చేసింది. బ్యాంక్ నిఫ్టీలోని మొత్తం 12 బ్యాంక్ షేర్లు లాభాలతో ట్రేడవుతున్నాయి. బ్యాంక్ నిఫ్టీ టాప్ గెయినర్స్ లిస్ట్‌లో బంధన్ బ్యాంక్ అగ్రస్థానంలో ఉంది.
నిఫ్టీ షేర్ల చిత్రం
మార్కెట్ ప్రారంభ సమయంలో, నిఫ్టీ 50 ప్యాక్‌లోని మొత్తం 50 స్టాక్స్ పచ్చగా కళకళలాడాయి. నిఫ్టీ టాప్ గెయినర్స్‌లో... HCL టెక్ 2.74 శాతం, టెక్ మహీంద్ర 2.45 శాతం లాభంతో ట్రేడవుతున్నాయి. ఇన్ఫోసిస్ 1.93 శాతం పెరిగింది, విప్రో 1.89 శాతం బలం చూపించింది.
నిఫ్టీ సెక్టోరల్ ఇండెక్స్‌లు
నిన్న మార్కెట్‌ను కిందకు లాగిన ఐటీ రంగం, ఈ రోజు విపరీతంగా పుంజుకుంది. ఈ రోజు నిఫ్టీ ఐటీ ఇండెక్స్ 3 శాతం పైకి చేరింది. మార్కెట్ ఓపెనింగ్ టైమ్‌లోనే ఐటీ ఇండెక్స్ 2 శాతం పెరిగి 33,713 వద్ద ట్రేడయింది.
ప్రి-ఓపెన్‌లోనూ రికార్డ్ స్థాయిలో మార్కెట్
మార్కెట్ ప్రారంభానికి ముందు, ప్రి-ఓపెన్ సెషన్‌లోనే, బెంచ్‌మార్క్ ఇండెక్స్‌లు సెన్సెక్స్ & నిఫ్టీ రికార్డు స్థాయికి చేరుకున్నాయి. మిడ్ క్యాప్ ఇండెక్స్ తొలిసారిగా 45,000 మైలురాయిని దాటింది. మార్కెట్ ప్రారంభమైన వెంటనే, నిఫ్టీ మిడ్ క్యాప్100 405 పాయింట్లు లేదా 0.90 శాతం పెరిగింది.
ఈ రోజు ఉదయం 9.50 గంటల సమయానికి, BSE సెన్సెక్స్ 833.61 పాయింట్లు లేదా 1.20% పెరిగి 70,418.21 దగ్గర; NSE నిఫ్టీ 222.95 పాయింట్లు లేదా 1.07% పెరిగి 21,149.30 వద్ద ట్రేడవుతున్నాయి.
గ్లోబల్ మార్కెట్ల పరిస్థితి
అమెరికాలో వడ్డీ రేట్లపై యథాతథ స్థితిని కొనసాగించడంతో పాటు వచ్చే ఏడాది కనీసం 3 దఫాల్లో వడ్డీ రేట్ల తగ్గింపు ఉండొచ్చని యూఎస్ ఫెడ్ సంకేతాలు ఇవ్వడంతో.. అమెరికన్ మార్కెట్లలో ర్యాలీకి గట్టి ప్రోత్సాహం లభించింది. డౌ జోన్స్ 1.4 శాతం ఎగబాకి తాజా గరిష్టాన్ని తాకింది. S&P 500 & నాస్‌డాక్ కాంపోజిట్ కూడా 1.38 శాతం చొప్పున లాభపడ్డాయి. ఆసియా మార్కెట్లలో... ఓపెనింగ్ టైమ్‌లో నికాయ్ 0.3 శాతం క్షీణించింది. హాంగ్ సెంగ్, కోస్పి, S&P /ASX 200 1.4 శాతం చొప్పున పెరిగాయి.
Disclaimer: ఈ వార్త కేవలం సమాచారం కోసం మాత్రమే. మ్యూచువల్ ఫండ్లు, స్టాక్ మార్కెట్, క్రిప్టో కరెన్సీ, షేర్లు, ఫారెక్స్, కమొడిటీల్లో పెట్టే పెట్టుబడులు ఒడుదొడుకులకు లోనవుతుంటాయి. మార్కెట్ పరిస్థితులను బట్టి ఆయా పెట్టుబడి సాధనాల్లో రాబడి మారుతుంటుంది. ఫలానా మ్యూచువల్ ఫండ్, స్టాక్, క్రిప్టో కరెన్సీలో పెట్టుబడి పెట్టాలని లేదా ఉపసంహరించుకోవాలని 'abp దేశం' చెప్పడం లేదు. పెట్టుబడి పెట్టే ముందు, లేదా ఉపసంహరించుకునే ముందు అన్ని వివరాలు పరిశీలించడం ముఖ్యం. అవసరమైతే సర్టిఫైడ్ ఫైనాన్షియల్ అడ్వైజర్ల నుంచి సలహా తీసుకోవడం మంచిది.
మరో ఆసక్తికర కథనం: తెలుగు రాష్ట్రాల్లో మారిన పెట్రోల్, డీజిల్ ధరలు - ఈ రోజు రేట్లు ఇవి