అన్వేషించండి

Share Market Opening Today: డైరెక్షన్‌ కోసం మార్కెట్ల వెయిటింగ్‌ - 71500 దగ్గర సెన్సెక్స్ , 21700 పైన నిఫ్టీ

రక్షణ రంగం షేర్లు రైజింగ్‌లో ఉన్నాయి. ఫార్మా, ఐటీ స్టాక్స్‌ నుంచి ప్రధాన సూచీలకు మద్దతు దొరికింది.

Stock Market News Today in Telugu: గురువారం, ఆర్‌బీఐ మానిటరీ పాలసీ నిర్ణయాల తర్వాత నీరసపడిన దేశీయ స్టాక్ మార్కెట్లు, ఈ రోజు (శుక్రవారం, 09 ఫిబ్రవరి 2024) ఫ్లాట్‌గా ప్రారంభమయ్యాయి. ఓపెనింగ్‌ ట్రేడ్‌లో, రక్షణ రంగం షేర్లు రైజింగ్‌లో ఉన్నాయి. ఫార్మా, ఐటీ స్టాక్స్‌ నుంచి ప్రధాన సూచీలకు మద్దతు దొరికింది. 

ఈ రోజు మార్కెట్ ఇలా ప్రారంభమైంది...

గత సెషన్‌లో (గురువారం) 71,428 దగ్గర క్లోజ్‌ అయిన BSE సెన్సెక్స్‌, ఈ రోజు ఫ్లాట్‌గా, కేవలం 18 పాయింట్ల దిగువన 71,410.29 స్థాయి వద్ద (BSE Sensex Opening Today) ఓపెన్‌ అయింది. గురువారం 21,718 దగ్గర ఆగిన NSE నిఫ్టీ, ఈ రోజు 9 పాయింట్లు పెరిగి 21,727 స్థాయి వద్ద (NSE Nifty Opening Today) ప్రారంభమైంది. 

విస్తృత మార్కెట్లలో, BSE మిడ్‌ క్యాప్ ఇండెక్స్‌ 0.2 శాతం, స్మాల్‌ క్యాప్ సూచీ కూడా 0.2 శాతం వరకు బలహీనపడ్డాయి. 

అస్ట్రాజెనికా ఫార్మా Q3 లాభం QoQలో 70% తగ్గడంతో, ఈ కంపెనీ షేర్లు 14% పతనమయ్యాయి.

రికార్డ్‌ స్థాయి Q3 ఫలితాలతో బూస్ట్‌తో జొమాటో స్టాక్‌ 3% శాతం పెరిగింది.

డిసెంబర్‌ త్రైమాసికం లాభంలో 49% YoY జంప్‌ చూసిన LIC స్టాక్‌ 4% ఎగబాకింది.

పేటీఎంలో బలహీనత కొనసాగుతోంది, ఈ రోజు కూడా ఈ షేర్‌ ప్రైస్‌ 6% తగ్గింది. 

Q3 నికర లాభంలో 6% YoY క్షీణతను నివేదించడంతో, RVNL షేర్లు 8% పడిపోయాయి.

సెన్సెక్స్‌ షేర్లు
మార్కెట్‌ ఓపెనింగ్‌ టైమ్‌లో.. సెన్సెక్స్‌లో రిలయన్స్‌ ఇండస్ట్రీస్‌, పవర్ గ్రిడ్, స్టేట్‌ బ్యాంక్‌, బ్రిటానియా, టాటా కన్స్యూమర్‌ స్టాక్స్‌ ముందంజలో ఉన్నాయి. మరోవైపు.. M&M, భారతి ఎయిర్‌టెల్, మారుతి సుజుకీ, ఇన్ఫోసిస్, HDFC బ్యాంక్, కోటక్ మహీంద్ర బ్యాంక్, ఏషియన్ పెయింట్స్. JSW స్టీల్ నష్టాలతో వెనుకబడ్డాయి.

నిఫ్టీ షేర్లు
హిందాల్కో, HDFC లైఫ్ నష్టాలను చవిచూశాయి.

ఈ రోజు ఉదయం 09.55 గంటల సమయానికి, BSE సెన్సెక్స్‌ 35.42 పాయింట్లు లేదా 0.5% తగ్గి 71,393.01 దగ్గర; NSE నిఫ్టీ 40.50 పాయింట్లు లేదా 0.19% తగ్గి 21,677.45 వద్ద ట్రేడవుతున్నాయి. 

ఈ రోజు Q3 ఫలితాలు ప్రకటించే కంపెనీలు: ఆల్కెమ్ ల్యాబ్‌, బజాజ్ హిందుస్థాన్ షుగర్, బంధన్ బ్యాంక్, క్యాంపస్ యాక్టివ్‌వేర్, క్యాప్లిన్ లేబొరేటరీస్, సెల్లో వరల్డ్, డేటామాటిక్స్ గ్లోబల్ సర్వీసెస్, డిష్ టీవీ ఇండియా, డోమ్స్ ఇండస్ట్రీస్, ఈజీ ట్రిప్ ప్లానర్స్, ఇమామీ, ఫినోలెక్స్ కేబుల్స్, గుజరాత్ మినరల్స్‌, గోద్రెజ్ ఇండస్ట్రీస్, హ్యాపీ ఫోర్జింగ్స్, హీరో మోటోకార్ప్, హోనాస కన్స్యూమర్, హౌసింగ్ అండ్ అర్బన్ డెవలప్‌మెంట్, IFCI, ఇండిగో పెయింట్స్, ఐనాక్స్ గ్రీన్ ఎనర్జీ, ఐనాక్స్ విండ్, ఇండియన్ రైల్వే ఫైనాన్స్ కార్ప్, ఇండియన్ టూరిజం డెవలప్‌మెంట్ కార్ప్, ఐనాక్స్ విండ్ ఎనర్జీ, జైన్ ఇరిగేషన్ సిస్టమ్స్, జూపిటర్ లైఫ్ లైన్ హాస్పిటల్స్, కెన్నమెటల్ ఇండియా, కిర్లోస్కర్ ఇండస్ట్రీస్, ల్యాండ్‌మార్క్ కార్స్, మాక్స్ ఎస్టేట్, మోల్డ్-టెక్ ప్యాకేజింగ్, MRF, నియోజెన్ కెమికల్, ది న్యూ ఇండియా అస్యూరెన్స్ కంపెనీ, పరాస్ డిఫెన్స్, ఫైజర్ పీఐ ఇండస్ట్రీస్, PSP ప్రాజెక్ట్స్, రిలయన్స్ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్, శ్రీ రేణుక షుగర్, సఫైర్ ఫుడ్స్, సారెగమ ఇండియా, షిప్పింగ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా, SJVN, సన్‌ఫ్లాగ్ ఐరన్ అండ్ స్టీల్, టాటా పవర్, తేగా ఇండస్ట్రీస్, జైడస్ లైఫ్ సైన్సెస్.

గ్లోబల్ మార్కెట్లు
ఆసియా మార్కెట్లు మిక్స్‌డ్‌గా ఉన్నాయి. ఈ ఉదయం, నికాయ్‌ 0.6 శాతం పెరిగి 34 ఏళ్ల గరిష్టాన్ని తాకింది. ASX 200 0.18 శాతం పెరిగితే, హాంగ్ సెంగ్ 1.7 శాతం పతనమైంది. లూనార్‌ న్యూ ఇయర్‌ సందర్భంగా ఇతర మార్కెట్లకు ఈ రోజు సెలవు. నిన్న US మార్కెట్లు సానుకూలంగా ట్రేడ్‌ అయ్యాయి. S&P 500 0.06 శాతం, డౌ జోన్స్‌ 0.13 శాతం, నాస్‌డాక్ 0.24 శాతం పెరిగాయి.

Disclaimer: ఈ వార్త కేవలం సమాచారం కోసం మాత్రమే. మ్యూచువల్‌ ఫండ్లు, స్టాక్‌ మార్కెట్‌, క్రిప్టో కరెన్సీ, షేర్లు, ఫారెక్స్‌, కమొడిటీల్లో పెట్టే పెట్టుబడులు ఒడుదొడుకులకు లోనవుతుంటాయి. మార్కెట్‌ పరిస్థితులను బట్టి ఆయా పెట్టుబడి సాధనాల్లో రాబడి మారుతుంటుంది. ఫలానా మ్యూచువల్‌ ఫండ్‌, స్టాక్‌, క్రిప్టో కరెన్సీలో పెట్టుబడి పెట్టాలని లేదా ఉపసంహరించుకోవాలని 'abp దేశం' చెప్పడం లేదు. పెట్టుబడి పెట్టే ముందు, లేదా ఉపసంహరించుకునే ముందు అన్ని వివరాలు పరిశీలించడం ముఖ్యం. అవసరమైతే సర్టిఫైడ్‌ ఫైనాన్షియల్‌ అడ్వైజర్ల నుంచి సలహా తీసుకోవడం మంచిది.

మరో ఆసక్తికర కథనం: తెలుగు రాష్ట్రాల్లో మారిన పెట్రోల్‌, డీజిల్‌ ధరలు - ఈ రోజు రేట్లు ఇవి

మరిన్ని చూడండి
Advertisement

టాప్ హెడ్ లైన్స్

Telangana Jobs: జాబ్ కాలెండర్ ప్రకారమే తెలంగాణలో ఉద్యోగాల భర్తీ: సీఎం రేవంత్ రెడ్డి
జాబ్ కాలెండర్ ప్రకారమే తెలంగాణలో ఉద్యోగాల భర్తీ: సీఎం రేవంత్ రెడ్డి
MLC Kavitha: తిహార్ జైలులో కవితను కేటీఆర్, హరీష్ రావు - అప్పటివరకూ ఇద్దరూ ఢిల్లీలోనే మకాం!
తిహార్ జైలులో కవితను కేటీఆర్, హరీష్ రావు - అప్పటివరకూ ఇద్దరూ ఢిల్లీలోనే మకాం!
Andhra Pradesh: ఎమ్మెల్సీలుగా సి. రామచంద్రయ్య, హరి ప్రసాద్ ఏకగ్రీవం
ఎమ్మెల్సీలుగా సి. రామచంద్రయ్య, హరి ప్రసాద్ ఏకగ్రీవం
UK Elections 2024: యూకే ఎన్నికల్లో తెలుగు వ్యక్తులు ఓటమి - భారత సంతతి అభ్యర్థుల పరిస్థితి ఏంటంటే?
యూకే ఎన్నికల్లో తెలుగు వ్యక్తులు ఓటమి - భారత సంతతి అభ్యర్థుల పరిస్థితి ఏంటంటే?
Advertisement
Advertisement
Advertisement
ABP Premium

వీడియోలు

Doddi Komaraiah Death Anniversary | కడవెండి పౌరుషం తెలంగాణ మట్టిని ముద్దాడి 78 సంవత్సరాలు పూర్తిVirat Kohli Emotional Speech About Jasprit Bumrah | బుమ్రా ఈ దేశపు ఆస్తి అంటున్న కోహ్లీ | ABP DesamVirat Kohli Emotional About Rohit Sharma |15 ఏళ్లలో రోహిత్ శర్మను అలా చూడలేదంటున్న విరాట్ కోహ్లీJagtial Pencil Artist | పెన్సిల్ ఆర్ట్ తో అదరగొడుతున్న జగిత్యాల జిల్లా కళాకారుడు | ABP Desam

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Telangana Jobs: జాబ్ కాలెండర్ ప్రకారమే తెలంగాణలో ఉద్యోగాల భర్తీ: సీఎం రేవంత్ రెడ్డి
జాబ్ కాలెండర్ ప్రకారమే తెలంగాణలో ఉద్యోగాల భర్తీ: సీఎం రేవంత్ రెడ్డి
MLC Kavitha: తిహార్ జైలులో కవితను కేటీఆర్, హరీష్ రావు - అప్పటివరకూ ఇద్దరూ ఢిల్లీలోనే మకాం!
తిహార్ జైలులో కవితను కేటీఆర్, హరీష్ రావు - అప్పటివరకూ ఇద్దరూ ఢిల్లీలోనే మకాం!
Andhra Pradesh: ఎమ్మెల్సీలుగా సి. రామచంద్రయ్య, హరి ప్రసాద్ ఏకగ్రీవం
ఎమ్మెల్సీలుగా సి. రామచంద్రయ్య, హరి ప్రసాద్ ఏకగ్రీవం
UK Elections 2024: యూకే ఎన్నికల్లో తెలుగు వ్యక్తులు ఓటమి - భారత సంతతి అభ్యర్థుల పరిస్థితి ఏంటంటే?
యూకే ఎన్నికల్లో తెలుగు వ్యక్తులు ఓటమి - భారత సంతతి అభ్యర్థుల పరిస్థితి ఏంటంటే?
Electric Cars Sale Declined: భారీగా పడిపోయిన ఎలక్ట్రిక్ కార్ల సేల్స్ - కారణం ఏంటి?
భారీగా పడిపోయిన ఎలక్ట్రిక్ కార్ల సేల్స్ - కారణం ఏంటి?
Anasuya Bharadwaj: అనసూయకు లవ్ లెటర్ రాసేశాడు, ఎవరో తెలుసా? - ఆ ముద్దులు వద్దంటోన్న శేఖర్ మాస్టర్
అనసూయకు లవ్ లెటర్ రాసేశాడు, ఎవరో తెలుసా? - ఆ ముద్దులు వద్దంటోన్న శేఖర్ మాస్టర్
Viral News: నిద్రపోతుండగా కాటు వేసిన పాము, కసి తీరా కొరికి చంపిన బాధితుడు
నిద్రపోతుండగా కాటు వేసిన పాము, కసి తీరా కొరికి చంపిన బాధితుడు
Telangana Politics: తెలంగాణ శాసన మండలికి రద్దు ముప్పు, చంద్రబాబును రేవంత్ సాయం కోరాలన్న బీఆర్ఎస్
తెలంగాణ శాసన మండలికి రద్దు ముప్పు, చంద్రబాబును రేవంత్ సాయం కోరాలన్న బీఆర్ఎస్
Embed widget