Share Market Opening Today: గ్లోబల్ ఒత్తిళ్లున్నా బులిష్ ట్రెండ్‌లో మార్కెట్లు - లీడింగ్‌లో రియాల్టీ ఇండెక్స్
మార్కెట్ ప్రారంభమైన వెంటనే సెన్సెక్స్ 72,000 మార్క్‌ను దాటింది. నిఫ్టీ 21,750 స్థాయిని చేరింది.
Stock Market News Today in Telugu: దేశీయ స్టాక్ మార్కెట్‌లో గురువారం నాటి బులిష్ ట్రెండ్ ఈ రోజు (శుక్రవారం, 05 జనవరి 2024) కూడా కనిపించింది. ఈ రోజు ట్రేడింగ్‌లో, సెన్సెక్స్ & నిఫ్టీ హైయ్యర్ సైడ్‌లో ట్రేడ్‌ను ప్రారంభించాయి, రెండూ సూచీలు దాదాపు 0.40 శాతం పెరిగాయి. మార్కెట్ ప్రారంభమైన వెంటనే సెన్సెక్స్ 72,000 మార్క్‌ను దాటింది. నిఫ్టీ 21,750 స్థాయిని చేరింది.
2023 డిసెంబర్ నెలకు సంబంధించిన సర్వీసెస్ PMI డేటా ఈ రోజు మార్కెట్ రాడార్‌లో ఉంటుంది.
ఈ రోజు మార్కెట్ ఇలా ప్రారంభమైంది...
నిన్న (గురువారం) 71,848 దగ్గర క్లోజ్ అయిన BSE సెన్సెక్స్, ఈ రోజు 168 పాయింట్లు లేదా 0.29 శాతం పెరుగుదలతో 72,016.71 స్థాయి వద్ద (BSE Sensex Opening Today) ఓపెన్ అయింది. బుధవారం 21,659 దగ్గర ఆగిన NSE నిఫ్టీ, ఈ రోజు 46 పాయింట్లు లేదా 0.36 శాతం లాభంతో 21,705.75 స్థాయి వద్ద (NSE Nifty Opening Today) ప్రారంభమైంది.
బ్రాడర్ మార్కెట్లు కూడా దృఢంగా ఉన్నాయి. BSE మిడ్ క్యాప్ & స్మాల్ క్యాప్ సూచీలు దాదాపు 0.6 శాతం వరకు పెరిగాయి.
రియల్టీ ఇండెక్స్ 2% జంప్ చేసి బలాన్ని చాటింది. మిగిలిన రంగాల లాభాలను లీడ్ చేస్తోంది. 3,410 కోట్ల రూపాయల ప్రీ-సేల్స్‌లో 12 శాతం వృద్ధితో ఏడాది ప్రాతిపదికన క్యూ3లో అత్యుత్తమంగా 8% పెరిగింది.
Q3 2024లో అత్యుత్తమ క్వాటర్లీ సేల్స్‌ను ప్రకటించిన లోధ షేర్లు 8% పెరిగాయి.
ప్రారంభ సెషన్‌లో, లార్జ్ క్యాప్ స్టాక్స్ పెరిగాయి. ఉదయం, సెన్సెక్స్ 30 ప్యాక్‌లో 5 షేర్లు మినహా మిగిలినవన్నీ గ్రీన్ జోన్‌లో ఉన్నాయి. NTPC దాదాపు రెండున్నర శాతం పెరిగింది. విప్రో, SBI, మహీంద్ర అండ్ మహీంద్ర దాదాపు 1% చొప్పున పెరిగాయి. మరోవైపు... నెస్లే ఇండియా ఒకటిన్నర శాతం, సన్ ఫార్మా షేర్లు ఒక శాతానికి పైగా నష్టాల్లో ఉన్నాయి.
నిఫ్టీ50 ప్యాక్‌లో... బజాజ్ ఆటో, హీరో మోటోకార్ప్ ముందంజలో నిలిచాయి. నెస్లే, సన్ ఫార్మా, సిప్లా, బ్రిటానియా, ఇండస్‌ఇండ్ బ్యాంక్ షేర్లు పతనమయ్యాయి.
ప్రి-ఓపెన్ సెషన్
మార్కెట్ ప్రీి-ఓపెన్ సెషన్‌లో దేశీయ మార్కెట్లు గ్రీన్ జోన్‌లో ట్రేడవుతున్నాయి. సెన్సెక్స్ దాదాపు 170 పాయింట్ల లాభంతో 72,000 పాయింట్లను దాటింది. నిఫ్టీ దాదాపు 50 పాయింట్లు బలపడి 21,700 పాయింట్లను దాటింది.
ఈ రోజు ఉదయం 09.55 గంటల సమయానికి, BSE సెన్సెక్స్ 252.54 పాయింట్లు లేదా 0.34% పెరిగి 72,100.11 దగ్గర; NSE నిఫ్టీ 77 పాయింట్లు లేదా 0.36% పెరిగి 21,735.60 వద్ద ట్రేడవుతున్నాయి.
గ్లోబల్ మార్కెట్ల పరిస్థితి
ఈ ఏడాది ప్రారంభం నుంచి ప్రపంచ మార్కెట్‌పై కనిపిస్తున్న ఒత్తిడి ఇప్పటికీ కొనసాగుతోంది. ఈ ఉదయం ఆసియా మార్కెట్లు నీరసంగా ఉన్నాయి. నికాయ్ 0.4 శాతం లాభపడింది. హాంగ్ సెంగ్ 0.4 శాతం క్షీణించింది. కోస్పి, ASX 200 ఫ్లాట్‌గా ఉన్నాయి. ఓవర్‌నైట్‌లో, USలో S&P 500 0.34 శాతం పడిపోయింది, డౌ జోన్స్ 0.03 శాతం లాభపడింది, నాస్‌డాక్ 0.56 శాతం నష్టపోయింది.
Disclaimer: ఈ వార్త కేవలం సమాచారం కోసం మాత్రమే. మ్యూచువల్ ఫండ్లు, స్టాక్ మార్కెట్, క్రిప్టో కరెన్సీ, షేర్లు, ఫారెక్స్, కమొడిటీల్లో పెట్టే పెట్టుబడులు ఒడుదొడుకులకు లోనవుతుంటాయి. మార్కెట్ పరిస్థితులను బట్టి ఆయా పెట్టుబడి సాధనాల్లో రాబడి మారుతుంటుంది. ఫలానా మ్యూచువల్ ఫండ్, స్టాక్, క్రిప్టో కరెన్సీలో పెట్టుబడి పెట్టాలని లేదా ఉపసంహరించుకోవాలని 'abp దేశం' చెప్పడం లేదు. పెట్టుబడి పెట్టే ముందు, లేదా ఉపసంహరించుకునే ముందు అన్ని వివరాలు పరిశీలించడం ముఖ్యం. అవసరమైతే సర్టిఫైడ్ ఫైనాన్షియల్ అడ్వైజర్ల నుంచి సలహా తీసుకోవడం మంచిది.
మరో ఆసక్తికర కథనం: తెలుగు రాష్ట్రాల్లో మారిన పెట్రోల్, డీజిల్ ధరలు - ఈ రోజు రేట్లు ఇవి