Share Market Opening Today: బలహీనత పరార్ - సెన్సెక్స్ 350 పాయింట్లు జంప్, 21,600 పైన నిఫ్టీ
BSE- NEFT News: బ్రాడర్ మార్కెట్లలో, BSE మిడ్ క్యాప్ & స్మాల్ క్యాప్ ఇండెక్స్‌లు 0.77 శాతం వరకు లాభపడ్డాయి.
Stock Market News Today in Telugu: దేశీయ స్టాక్ మార్కెట్లు 3 రోజుల బలహీనత నుంచి బయటపడ్డాయి. ఈ రోజు (గురువారం, 04 జనవరి 2024) బుల్స్ బలం చూపడంతో మార్కెట్లు గ్రీన్ జోన్‌లో ప్రారంభమయ్యాయి. మిడ్ క్యాప్ & స్మాల్ క్యాప్ బూమ్ కారణంగా మార్కెట్‌లో మంచి ఉత్సాహం కనిపించింది.
ఈ రోజు మార్కెట్ ఇలా ప్రారంభమైంది...
నిన్న (బుధవారం, 03 జనవరి 2024) 71,357 దగ్గర క్లోజ్ అయిన BSE సెన్సెక్స్, ఈ రోజు 322.33 పాయింట్లు లేదా 0.45 శాతం పెరుగుదలతో 71,678 స్థాయి వద్ద (BSE Sensex Opening Today) ఓపెన్ అయింది. బుధవారం 21,517 దగ్గర ఆగిన NSE నిఫ్టీ, ఈ రోజు 88.45 పాయింట్లు లేదా 0.41 శాతం లాభంతో 21,605 స్థాయి వద్ద (NSE Nifty Opening Today) ప్రారంభమైంది.
ఓపెనింగ్ టైమ్‌లో, అడ్వాన్స్-డిక్లైన్ రేషియోను పరిశీలిస్తే, అడ్వాన్స్ అయిన స్టాక్స్ సంఖ్య చాలా ఎక్కువగా ఉంది. దాదాపు 2000 షేర్లు పెరగ్గా, 200 షేర్లలో మాత్రమే క్షీణత కనిపించింది.
బ్రాడర్ మార్కెట్లలో, BSE మిడ్ క్యాప్ & స్మాల్ క్యాప్ ఇండెక్స్‌లు 0.77 శాతం వరకు లాభపడ్డాయి.
నిఫ్టీ ఫార్మా ఇండెక్స్ రికార్డ్ గరిష్ట స్థాయికి చేరుకుంది. నిఫ్టీ ఫైనాన్షియల్స్, ఐటీ రంగాలు లాభాల్లో ఉన్నాయి. FMCG షేర్లు కూడా పరుగులు తీస్తున్నాయి.
సెన్సెక్స్‌లో బజాజ్ ట్విన్స్, ఇన్ఫోసిస్, టాటా మోటార్స్, NTPC, విప్రో షేర్లు లాభపడ్డాయి. నిఫ్టీలో అదానీ పోర్ట్స్ ముందంజలో ఉంది. మరోవైపు... టాటా స్టీల్, మారుతి, BPCL, బజాజ్ ఆటో టాప్ లూజర్స్ లిస్ట్‌లో కనిపించాయి.
2023 డిసెంబర్ త్రైమాసికంలో మొదటిసారిగా రూ.3 లక్షల కోట్ల AUM మైలురాయిని దాటిన బజాజ్ ఫైనాన్స్, దాదాపు 4 శాతం పెరిగింది.
ప్రి-ఓపెనింగ్ సెషన్
ప్రి-ఓపెనింగ్‌లో మార్కెట్ చాలా బుల్లిష్‌గా ఉంది. సెన్సెక్స్ 337.27 పాయింట్లు లేదా 0.47 శాతం పెరుగుదలతో 71,693 వద్ద ట్రేడయింది. నిఫ్టీ 93.90 పాయింట్లు లేదా 0.44 శాతం వృద్ధితో 21,611 వద్ద ఉంది.
ఈ రోజు ఉదయం 09.55 గంటల సమయానికి, BSE సెన్సెక్స్ 294.24 పాయింట్లు లేదా 0.41% పెరిగి 71,650.84 దగ్గర; NSE నిఫ్టీ 77.20 పాయింట్లు లేదా 0.36% పెరిగి 21,594.55 వద్ద ట్రేడవుతున్నాయి.
గ్లోబల్ మార్కెట్ల పరిస్థితి
గ్లోబల్ మార్కెట్లలో బలహీనత కంటిన్యూ అవుతోంది. ఆసియా మార్కెట్లలో... సుదీర్ఘ విరామం తర్వాత ట్రేడ్ ప్రారంభించిన జపాన్ నికాయ్ 2 శాతం నష్టపోయింది. హాంగ్ సెంగ్ ఫ్లాట్‌గా ఉంది, ASX 200 & కోస్పి 0.8 శాతం వరకు పడిపోయాయి. బుధవారం, USలో S&P 500 0.8 శాతం, డౌ జోన్స్ 0.76 శాతం, నాస్‌డాక్ 1.18 శాతం క్షీణించాయి. అమెరికాలో ఈ సంవత్సరం వడ్డీ రేట్లు తగ్గొచ్చని ఫెడ్ మినిట్స్ సూచిస్తున్నా, ఎప్పటికి తగ్గుతాయన్న సమయాన్ని మాత్రం నిర్దిష్టంగా చెప్పలేకపోయాయి.
మధ్యప్రాచ్యంలో తీవ్ర ఉద్రిక్తతలతో అంతర్జాతీయ మార్కెట్‌లో క్రూడ్ ఆయిల్ ధర 3% పెరిగి 78 డాలర్లకు చేరుకుంది.
Disclaimer: ఈ వార్త కేవలం సమాచారం కోసం మాత్రమే. మ్యూచువల్ ఫండ్లు, స్టాక్ మార్కెట్, క్రిప్టో కరెన్సీ, షేర్లు, ఫారెక్స్, కమొడిటీల్లో పెట్టే పెట్టుబడులు ఒడుదొడుకులకు లోనవుతుంటాయి. మార్కెట్ పరిస్థితులను బట్టి ఆయా పెట్టుబడి సాధనాల్లో రాబడి మారుతుంటుంది. ఫలానా మ్యూచువల్ ఫండ్, స్టాక్, క్రిప్టో కరెన్సీలో పెట్టుబడి పెట్టాలని లేదా ఉపసంహరించుకోవాలని 'abp దేశం' చెప్పడం లేదు. పెట్టుబడి పెట్టే ముందు, లేదా ఉపసంహరించుకునే ముందు అన్ని వివరాలు పరిశీలించడం ముఖ్యం. అవసరమైతే సర్టిఫైడ్ ఫైనాన్షియల్ అడ్వైజర్ల నుంచి సలహా తీసుకోవడం మంచిది.
మరో ఆసక్తికర కథనం: తెలుగు రాష్ట్రాల్లో మారిన పెట్రోల్, డీజిల్ ధరలు - ఈ రోజు రేట్లు ఇవి