Stock Market News: 50% డిస్కౌంట్‌లో 4 స్ట్రాంగ్ స్మాల్ క్యాప్స్, భలే చౌక బేరం బ్రదరూ!
ఈ కంపెనీల షేర్ ధరలు 2022లో 33-66 శాతం వరకు పడిపోయాయి. ఈ సంవత్సరం ప్రారంభంతో పోలిస్తే భారీ డిస్కౌంట్‌లో ట్రేడవుతున్నాయి.
Stock Market News: మార్కెట్లు ఇటీవల మంచి పుల్‌బ్యాక్ ర్యాలీని చూశాయి. 2022లో ఇప్పటివరకు, బెంచ్‌మార్క్ ఇండెక్స్ సెన్సెక్స్ సుమారు 2.5 శాతం లాభపడగా, BSE స్మాల్ క్యాప్ ఇండెక్స్ 2 శాతం తగ్గింది. ఫండమెంటల్స్ స్ట్రాంగ్‌గా ఉన్నప్పటికీ కొన్ని స్మాల్ క్యాప్ స్టాక్స్‌లో షార్ప్ కరెక్షన్ కనిపించింది. అలాంటి స్టాక్స్‌ను విశ్లేషించి; గత నాలుగు త్రైమాసికాల్లో 10 శాతం (YoY) పైగా లాభాల వృద్ధిని, దాదాపు రెండంకెల నికర లాభ మార్జిన్‌ను కొనసాగించగలిగిన 4 స్మాల్ క్యాప్ కంపెనీలను వేరు చేశాం.
ఈ కంపెనీల షేర్ ధరలు 2022లో 33-66 శాతం వరకు పడిపోయాయి. ఈ సంవత్సరం ప్రారంభంతో పోలిస్తే భారీ డిస్కౌంట్‌లో ట్రేడవుతున్నాయి. Trendlyne.com ప్రకారం, ఈ 4 స్టాక్స్ SWOT విశ్లేషణ ఇది:
బ్రైట్‌కామ్ గ్రూప్ (Brightcom Group)
2022లో ఇప్పటివరకు స్టాక్ రిటర్న్స్: -65.75%
త్రైమాసికంలో అధిక ఆదాయం, లాభాల వృద్ధి, మూలధనంపై అధిక రాబడి (ROCE), తక్కువ PE రేషియో
నికర లాభంలో (QoQ) వృద్ధి, పెరుగుతున్న లాభ మార్జిన్
నికర లాభంలో (YoY) వృద్ధి, పెరుగుతున్న లాభ మార్జిన్
అప్పులు లేని కంపెనీ ఇది
వార్షిక నికర లాభాల్లో గత 2 సంవత్సరాలుగా మెరుగుదల
FIIs/FPIs, పెట్టుబడి సంస్థలు ఈ కంపెనీలో వాటా పెంచుకుంటున్నాయి
ఇండియన్ మెటల్స్ & ఫెర్రో అల్లాయ్స్ (Indian Metals & Ferro Alloys)
2022లో ఇప్పటివరకు స్టాక్ రిటర్న్స్: -43.68%
లాభాలు సంపాదించేలా మూలధనాన్ని సమర్థవంతంగా ఉపయోగిస్తోంది - గత 2 సంవత్సరాలుగా RoCE మెరుగుపడుతోంది
వాటాదారుల నిధిని సమర్థవంతంగా ఉపయోగిస్తోంది - గత 2 సంవత్సరాలుగా RoE మెరుగుపడుతోంది
లాభాలు తీసుకొచ్చేలా ఆస్తులనూ సమర్థవంతంగా నిర్వహిస్తోంది - గత 2 సంవత్సరాలుగా RoA మెరుగుపడుతోంది
తక్కువ రుణం ఉన్న కంపెనీ ఇది
వార్షిక నికర లాభాలు గత 2 సంవత్సరాలుగా మెరుగుపడుతున్నాయి
ప్రమోటర్ వాటాలో ఒక్క షేరు కూడా తాకట్టులో లేదు
FIIs/FPIs, పెట్టుబడి సంస్థలు ఈ కంపెనీలో వాటా పెంచుకుంటున్నాయి
కోఫోర్జ్ (Coforge)
2022లో ఇప్పటివరకు స్టాక్ రిటర్న్స్: -34.20%
అప్పులు లేని కంపెనీ ఇది
గత 4 త్రైమాసికాలుగా, ప్రతి త్రైమాసికంలోనూ ఆదాయం పెరుగుతోంది
ప్రధాన వ్యాపారం నుంచి పెద్ద మొత్తంలో నగదు సంపాదించగల సామర్థ్యం - గత 2 సంవత్సరాలుగా కార్యకలాపాల నుంచి క్యాష్ ఫ్లోస్ మెరుగుపడుతున్నాయి
గత 2 సంవత్సరాలుగా వార్షిక నికర లాభాలు మెరుగుపడుతున్నాయి
గత 2 సంవత్సరాలుగా ఒక్కో షేరుకు బుక్ వాల్యూ మెరుగుపడుతోంది
ప్రమోటర్ వాటాలో ఒక్క షేరు కూడా తాకట్టులో లేదు
అక్రిసిల్ (Acrysil)
2022లో ఇప్పటివరకు స్టాక్ రిటర్న్స్: -33.05%
వాటాదారుల నిధిని సమర్థవంతంగా ఉపయోగిస్తోంది - గత 2 సంవత్సరాలుగా RoE మెరుగుపడుతోంది
లాభాలు తీసుకొచ్చేలా ఆస్తులనూ సమర్థవంతంగా నిర్వహిస్తోంది - గత 2 సంవత్సరాలుగా RoA మెరుగుపడుతోంది
గత 4 త్రైమాసికాలుగా, ప్రతి త్రైమాసికంలోనూ ఆదాయం పెరుగుతోంది
గత 2 సంవత్సరాలుగా వార్షిక నికర లాభాలు మెరుగుపడుతున్నాయి
గత 2 సంవత్సరాలుగా ఒక్కో షేరుకు బుక్ వాల్యూ మెరుగుపడుతోంది
ప్రమోటర్ వాటాలో ఒక్క షేరు కూడా తాకట్టులో లేదు
Disclaimer: ఈ వార్త కేవలం సమాచారం కోసం మాత్రమే. మ్యూచువల్ ఫండ్లు, స్టాక్ మార్కెట్, క్రిప్టో కరెన్సీ, షేర్లు, ఫారెక్స్, కమొడిటీల్లో పెట్టే పెట్టుబడులు ఒడుదొడుకులకు లోనవుతుంటాయి. మార్కెట్ పరిస్థితులను బట్టి ఆయా పెట్టుబడి సాధనాల్లో రాబడి మారుతుంటుంది. ఫలానా మ్యూచువల్ ఫండ్, స్టాక్, క్రిప్టో కరెన్సీలో పెట్టుబడి పెట్టాలని లేదా ఉపసంహరించుకోవాలని 'abp దేశం' చెప్పడం లేదు. పెట్టుబడి పెట్టే ముందు, లేదా ఉపసంహరించుకునే ముందు అన్ని వివరాలు పరిశీలించడం ముఖ్యం. అవసరమైతే సర్టిఫైడ్ ఫైనాన్షియల్ అడ్వైజర్ల నుంచి సలహా తీసుకోవడం మంచిది.