PSU Banks: Q4 ఫలితాలకు ముందే కొనాల్సిన బ్యాంక్ షేర్లు, టాప్ బ్రోకరేజ్ రికమెండేషన్
ఈ ప్రభుత్వ రంగ బ్యాంకుల స్టాక్స్ ఇన్వెస్టర్లకు మంచి అవకాశాలను అందిస్తాయన్నది బ్రోకరేజ్ అభిప్రాయం.
PSU Bank Stocks: Q4FY23 (మార్చి త్రైమాసికం) ఫలితాలకు ముందు, దేశీయ బ్రోకరేజ్ సంస్థ మోతీలాల్ ఓస్వాల్ మంచి రాబడిని అందించగల బలం ఉన్న కొన్ని PSU బ్యాంక్ స్టాక్స్‌ను ఎంపిక చేసింది. అవి.. ఇండియన్ బ్యాంక్, బ్యాంక్ ఆఫ్ బరోడా, స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా, కెనరా బ్యాంక్, యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా. ఈ ప్రభుత్వ రంగ బ్యాంకుల స్టాక్స్ ఇన్వెస్టర్లకు మంచి అవకాశాలను అందిస్తాయన్నది బ్రోకరేజ్ అభిప్రాయం.
Q4 ఆదాయాల కంటే ముందే కొనాల్సిన 5 PSU బ్యాంక్ స్టాక్స్ లిస్ట్ ఇది:
ఇండియన్ బ్యాంక్ (Indian Bank) | ప్రస్తుత మార్కెట్ ధర: రూ. 283
దేశీయ బ్రోకరేజ్ సంస్థ మోతీలాల్ ఓస్వాల్, ఇండియన్ బ్యాంక్‌కు "బయ్" రేటింగ్, రూ. 340 టార్గెట్ ధరను ఇచ్చింది. ప్రస్తుత మార్కెట్ ధర కంటే 20% ర్యాలీ చేసే అవకాశం ఉందని ఈ టార్గెట్ ధర అర్ధం. Q4లో బ్యాంకు రుణ వృద్ధి స్వల్పంగానే ఉంటుందని బ్రోకరేజ్ సంస్థ అంచనా వేస్తోంది. SME విభాగంలో ఒత్తిడి, రుణ పునర్నిర్మాణాలను ఇన్వెస్టర్లు చూడాలని సూచించింది.
బ్యాంక్ ఆఫ్ బరోడా (Bank of Baroda) | ప్రస్తుత మార్కెట్ ధర: రూ. 166
బ్యాంక్ ఆఫ్ బరోడాకు రూ. 240 టార్గెట్ ధరతో "బయ్" సిఫార్సును బ్రోకరేజ్ సంస్థ కొనసాగించింది. ప్రస్తుత మార్కెట్ ధర నుండి 45% పెరుగుదల అవకాశాన్ని ఇది సూచిస్తోంది. "ఆపెక్స్ (Opex) ట్రెండ్, ముఖ్యంగా వేతన సవరణ కారణంగా ఉద్యోగుల ఖర్చుల మీద ప్రధానంగా దృష్టి పెట్టాలి. డిపాజిట్లలో పెరుగుదల, డిపాజిట్ల వ్యయాలు, మార్జిన్ పథాన్ని కూడా కీలకంగా చూడాలి" అని బ్రోకరేజ్ సంస్థ తెలిపింది.
స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (State Bank of India) | ప్రస్తుత మార్కెట్ ధర: రూ. 526
SBIకి రూ. 700 టార్గెట్ ధరతో "బయ్" కాల్‌ని ఈ బ్రోకింగ్ హౌస్ కలిగి ఉంది. ప్రస్తుత మార్కెట్ ధర నుంచి 33% అప్‌సైడ్ పొటెన్షియల్‌ను ఇది సూచిస్తోంది. Q4లో SBI రుణ వ్యయాలు తక్కువగానే ఉంటాయని బ్రోకరేజ్ సంస్థ అంచనా వేస్తోంది. దీనివల్ల సంస్థ మార్జిన్ దాదాపు 3.6%కి మెరుగుపడుతుందని కూడా అంచనా వేసింది. ఆపెక్స్, డిపాజిట్లలో ట్రాక్షన్, డిపాజిట్ల వ్యయాల్లో పెరుగుదలపై మార్కెట్ దృష్టి పెడుతుంది.
యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (Union Bank of India) | ప్రస్తుత మార్కెట్ ధర: రూ. 67
ఓస్వాల్ యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా మీద "బయ్" రేటింగ్‌ను, రూ. 100 టార్గెట్ ధరను బ్రోకరేజ్ సంస్థ మోతీలాల్ ప్రకటించింది. ప్రస్తుత మార్కెట్ ధర నుంచి 49% పెరుగుదల బలాన్ని ఇది సూచిస్తోంది. యూనియన్ బ్యాంక్ మార్జిన్ 3.3%తో ఆరోగ్యకరంగా ఉంటుందని బ్రోకరేజ్ సంస్థ అంచనా వేసింది. రుణ వృద్ధిలో స్థిరత్వాన్ని కూడా ఆశిస్తోంది.
కెనరా బ్యాంక్ (Canara Bank) | ప్రస్తుత మార్కెట్ ధర: రూ. 283
కెనరా బ్యాంక్‌కు రూ. 400 టార్గెట్ ధరను ప్రకటించిన బ్రోకింగ్ హౌస్, "బయ్" కాల్ ఇచ్చింది. ప్రస్తుత మార్కెట్ ధర నుంచి 41% అప్‌సైడ్ పొటెన్షియల్‌ను ఇది సూచిస్తోంది. "వ్యాపార వృద్ధి స్థిరంగా ఉంటుందని, ఆస్తుల నాణ్యత, స్లిప్‌పేజ్‌లు స్వల్పంగా ఉంటాయి. మార్జిన్ దాదాపు 3.1% వద్ద స్థిరంగా ఉంటుందని అంచనా. ఒపెక్స్, డిపాజిట్లలో ట్రాక్షన్, డిపాజిట్ల వ్యయాల్లో మార్పులను కీలకంగా చూడాలి" అని బ్రోకరేజ్ సంస్థ తెలిపింది.
Disclaimer: ఈ వార్త కేవలం సమాచారం కోసం మాత్రమే. మ్యూచువల్ ఫండ్లు, స్టాక్ మార్కెట్, క్రిప్టో కరెన్సీ, షేర్లు, ఫారెక్స్, కమొడిటీల్లో పెట్టే పెట్టుబడులు ఒడుదొడుకులకు లోనవుతుంటాయి. మార్కెట్ పరిస్థితులను బట్టి ఆయా పెట్టుబడి సాధనాల్లో రాబడి మారుతుంటుంది. ఫలానా మ్యూచువల్ ఫండ్, స్టాక్, క్రిప్టో కరెన్సీలో పెట్టుబడి పెట్టాలని లేదా ఉపసంహరించుకోవాలని 'abp దేశం' చెప్పడం లేదు. పెట్టుబడి పెట్టే ముందు, లేదా ఉపసంహరించుకునే ముందు అన్ని వివరాలు పరిశీలించడం ముఖ్యం. అవసరమైతే సర్టిఫైడ్ ఫైనాన్షియల్ అడ్వైజర్ల నుంచి సలహా తీసుకోవడం మంచిది.