అన్వేషించండి

Stock Market News: Q2లో రెట్టింపు లాభాన్ని ప్రకటించే సత్తా ఉన్న 15 కంపెనీలు

ఆటో, ఏవియేషన్, ట్రావెల్, కెమికల్స్, క్యాపిటల్ గూడ్స్, ఫైనాన్షియల్ సర్వీసెస్ బలమైన ఎబిటా (EBIDTA) గ్రోత్‌ను మార్కెట్‌కు నివేదిస్తాయని బ్రోకరేజ్‌లు భావిస్తున్నాయి.

Stock Market News: సెప్టెంబర్‌ త్రైమాసికంలో ప్రతికూల పవనాలతో ప్రపంచ మార్కెట్లు వణికిపోయాయి. లోహాలు (Metals), చమురు & గ్యాస్ (Oil and Gas) రంగాలు పడిపోయి, ఈక్విటీ మార్కెట్లనూ కిందకు లాగేశాయి. దీంతో, సెప్టెంబర్ త్రైమాసికంలో నిఫ్టీ ఆదాయాలు ఫ్లాట్‌గా ఉంటాయన్నది మార్కెట్‌ నిపుణుల అంచనా. 

సోమవారం విడుదలైన TCS ఫలితాలతో రిజల్ట్స్‌ సీజన్‌ ప్రారంభమైంది.

రంగాల వారీగా చూస్తే... ఆటో, ఏవియేషన్, ట్రావెల్, కెమికల్స్, క్యాపిటల్ గూడ్స్, ఫైనాన్షియల్ సర్వీసెస్ బలమైన ఎబిటా (EBIDTA) గ్రోత్‌ను మార్కెట్‌కు నివేదిస్తాయని బ్రోకరేజ్‌లు భావిస్తున్నాయి. చమురు & గ్యాస్ రంగాలు ఎక్కువగా నష్టపోతాయని అంచనా.

లోహాలు, చమురు & గ్యాస్ ఆదాయాల్లో తగ్గుదలను దృష్టిలో పెట్టుకుని.. FY23 కోసం నిఫ్టీ EPS అంచనాను బ్రోకింగ్‌ హౌస్‌ మోతీలాల్‌ ఓస్వాల్‌ ‍‌(Motilal Oswal) 3 శాతం తగ్గించింది, రూ.817కి దించేసింది.

నిఫ్టీ కంపెనీలు
నిఫ్టీలో ఉన్న మారుతీ సుజుకి (Maruti Suzuki), ఏషియన్ పెయింట్స్ (Asian Paints), భారతీ ఎయిర్‌టెల్ (Bharti Airtel) కంపెనీలు వాటి పన్ను తర్వాతి లాభంలో (PAT) 100 శాతం వృద్ధిని నమోదు చేయవచ్చని భావిస్తున్నారు.

భారతదేశంలోనే అతి పెద్ద కార్ల తయారీ సంస్థ అయిన మారుతీ సుజుకి విషయానికి వస్తే.. Q2 నికర లాభంలో 297% YoY వృద్ధితో రూ.1,900 కోట్లను ఈ కంపెనీ నివేదిస్తుందని మోతీలాల్ ఓస్వాల్‌ అంచనా వేస్తోంది. సరఫరా గొలుసు పరిమితులు తగ్గడం, ధరల పెంపు, ఫారెక్స్ ప్రయోజనాలు, ఆపరేటింగ్ లీవరేజ్‌ కారణంగా ఈ ఆటో మేజర్ ఎబిట్‌ (EBIT) మార్జిన్ QoQ ప్రాతిపదికన మెరుగుపడుతుందని భావిస్తున్నారు.

ఏషియన్ పెయింట్స్ విషయానికి వస్తే... నికర లాభం 106.6% వృద్ధితో రూ.1,300 కోట్లకు చేరుతుందని అంచనా. 

టెలికాం ఆపరేటర్ భారతీ ఎయిర్‌టెల్ Q2 PAT 150% YoY వృద్ధితో రూ.1,500 కోట్లకు పెరిగే అవకాశం ఉంది. ARPU (ఒక్కో వినియోగదారుడి నుంచి వచ్చే సగటు ఆదాయం) పెరుగుదల, చందాదారుల (Subscribers) సంఖ్యలో వృద్ధి కారణంగా 3% QoQ రాబడి వృద్ధిని నమోదు చేస్తుందని బ్రోకరేజ్ అంచనా వేసింది.

మరికొన్ని కంపెనీలు
సెప్టెంబర్‌ త్రైమాసికంలో, రెట్టింపు నికర లాభాన్ని నివేదిస్తాయని భావిస్తున్న మరికొన్ని కంపెనీలు... నోసిల్‌ (NOCIL), ఇండిగో పెయింట్స్‌ ‍(IndiGo Paints), ఐఆర్‌బీ ఇన్‌ఫ్రా (IRB Infra), ఆయిల్ ఇండియా (Oil India), గోద్రెజ్ ప్రాపర్టీస్ (Godrej Properties), ఒబెరాయ్ రియాల్టీ (Oberoi Realty), ఆదిత్య బిర్లా ఫ్యాషన్ (Aditya Birla Fashion), బాటా ఇండియా (Bata India), టాటా కెమికల్స్ (Tata Chemicals), ఈక్విటాస్ హోల్డింగ్స్ (Equitas Holdings), ఆర్‌బీఎల్ బ్యాంక్ ‍‌(RBL Bank), ఎల్‌ఐసీ హౌసింగ్ ఫైనాన్స్ ‍‌(LIC Housing Finance).

ఆదిత్య బిర్లా ఫ్యాషన్ లాభం YoYలో 8 రెట్లు పెరిగి రూ.47.2 కోట్లకు చేరుకోవచ్చని మోతీలాల్ ఓస్వాల్‌ అంచనా వేస్తోంది. గోద్రెజ్ ప్రాపర్టీస్ లాభం 4 రెట్లు పెరిగి రూ.143.5 కోట్లకు చేరుకునే అవకాశం ఉందని చెబుతోంది. ఆర్‌బీఎల్‌ బ్యాంక్ నికర లాభం 560.8% YoY జంప్ చేసి రూ.203.5 కోట్లకు చేరుకుంటుందని బ్రోకరేజ్‌ అంచనా.

Disclaimer: ఈ వార్త కేవలం సమాచారం కోసం మాత్రమే. మ్యూచువల్‌ ఫండ్లు, స్టాక్‌ మార్కెట్‌, క్రిప్టో కరెన్సీ, షేర్లు, ఫారెక్స్‌, కమొడిటీల్లో పెట్టే పెట్టుబడులు ఒడుదొడుకులకు లోనవుతుంటాయి. మార్కెట్‌ పరిస్థితులను బట్టి ఆయా పెట్టుబడి సాధనాల్లో రాబడి మారుతుంటుంది. ఫలానా మ్యూచువల్‌ ఫండ్‌, స్టాక్‌, క్రిప్టో కరెన్సీలో పెట్టుబడి పెట్టాలని 'ఏబీపీ దేశం' చెప్పడం లేదు. పెట్టుబడి పెట్టే ముందు అన్ని వివరాలు పరిశీలించడం ముఖ్యం. అవసరమైతే సర్టిఫైడ్‌ ఫైనాన్షియల్‌ అడ్వైజర్ల నుంచి సలహా తీసుకోవడం మంచిది.

మరిన్ని చూడండి
Advertisement

టాప్ హెడ్ లైన్స్

ABP CVoter Opinion poll Telangana  : లోక్‌సభ ఎన్నికల్లో రేవంత్  పట్టు నిలబడుతుందా ? బీఆర్ఎస్ ఖాతా తెరుస్తుందా ? బీజేపీకి ఎన్ని సీట్లు ?
లోక్‌సభ ఎన్నికల్లో రేవంత్ పట్టు నిలబడుతుందా ? బీఆర్ఎస్ ఖాతా తెరుస్తుందా ? బీజేపీకి ఎన్ని సీట్లు ?
Chhattisgarh Encounter: ఛత్తీస్ గఢ్‌లో భారీ ఎన్‌కౌంటర్, 18 మంది మావోయిస్టులు మృతి
ఛత్తీస్ గఢ్‌లో భారీ ఎన్‌కౌంటర్, 18 మంది మావోయిస్టులు మృతి
Devara Movie: 'దేవర' కోసం పోటీ పడుతున్న మూడు అగ్ర నిర్మాణ సంస్థలు- చివరికి ఎవరి చేతికో!
'దేవర' కోసం పోటీ పడుతున్న మూడు అగ్ర నిర్మాణ సంస్థలు- చివరికి ఎవరి చేతికో!
YS Avinash Reddy : సునీత చెప్పేవన్నీ అవాస్తవాలు  - అవినాష్ రెడ్డి కౌంటర్
సునీత చెప్పేవన్నీ అవాస్తవాలు - అవినాష్ రెడ్డి కౌంటర్
Advertisement
Advertisement
Advertisement
for smartphones
and tablets

వీడియోలు

ABP C Voter Opinion Poll Telangana | లోక్ సభ ఎన్నికల్లో తెలంగాణలో సత్తా చాటే పార్టీ ఏది? | ABP DesamABP C Voter Opinion Poll Andhra pradesh | లోక్ సభ ఎన్నికల్లో ఏపీలో సత్తా చాటే పార్టీ ఏది? | ABPNirai Mata Temple | గర్భగుడిలో దేవత ఉండదు... కానీ ఉందనుకుని పూజలు చేస్తారుSiricilla Gold Saree | Ram Navami | మొన్న అయోధ్య.. నేడు భద్రాద్రి సీతమ్మకు... సిరిసిల్ల బంగారు చీర

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
ABP CVoter Opinion poll Telangana  : లోక్‌సభ ఎన్నికల్లో రేవంత్  పట్టు నిలబడుతుందా ? బీఆర్ఎస్ ఖాతా తెరుస్తుందా ? బీజేపీకి ఎన్ని సీట్లు ?
లోక్‌సభ ఎన్నికల్లో రేవంత్ పట్టు నిలబడుతుందా ? బీఆర్ఎస్ ఖాతా తెరుస్తుందా ? బీజేపీకి ఎన్ని సీట్లు ?
Chhattisgarh Encounter: ఛత్తీస్ గఢ్‌లో భారీ ఎన్‌కౌంటర్, 18 మంది మావోయిస్టులు మృతి
ఛత్తీస్ గఢ్‌లో భారీ ఎన్‌కౌంటర్, 18 మంది మావోయిస్టులు మృతి
Devara Movie: 'దేవర' కోసం పోటీ పడుతున్న మూడు అగ్ర నిర్మాణ సంస్థలు- చివరికి ఎవరి చేతికో!
'దేవర' కోసం పోటీ పడుతున్న మూడు అగ్ర నిర్మాణ సంస్థలు- చివరికి ఎవరి చేతికో!
YS Avinash Reddy : సునీత చెప్పేవన్నీ అవాస్తవాలు  - అవినాష్ రెడ్డి కౌంటర్
సునీత చెప్పేవన్నీ అవాస్తవాలు - అవినాష్ రెడ్డి కౌంటర్
Cantonment Bypoll: కంటోన్మెంట్‌ ఉప ఎన్నికకు అభ్యర్థిని ప్రకటించిన బీజేపీ - ఏ పార్టీ నుంచి ఎవరంటే!
కంటోన్మెంట్‌ ఉప ఎన్నికకు అభ్యర్థిని ప్రకటించిన బీజేపీ - ఏ పార్టీ నుంచి ఎవరంటే!
Akhanda 2: ఎన్నికల తర్వాతే 'అఖండ 2' ఉంటుంది - ఈసారి అలాంటి కాన్సెప్ట్‌తో వస్తున్నాం: బోయపాటి శ్రీను
ఎన్నికల తర్వాతే 'అఖండ 2' ఉంటుంది - ఈసారి అలాంటి కాన్సెప్ట్‌తో వస్తున్నాం: బోయపాటి శ్రీను
Thota Trimurtulu Case :  అసలు శిరోముండనం కేసు ఏంటి ? తోట త్రిమూర్తులు ఏం చేశారు ?
అసలు శిరోముండనం కేసు ఏంటి ? తోట త్రిమూర్తులు ఏం చేశారు ?
UPSC: సివిల్స్ ఫలితాల్లో పాల‌మూరు అమ్మాయికి మూడో ర్యాంకు, తెలుగు రాష్ట్రాల నుంచి 50 మందికి పైగా ఎంపిక
UPSC: సివిల్స్ ఫలితాల్లో పాల‌మూరు అమ్మాయికి మూడో ర్యాంకు, తెలుగు రాష్ట్రాల నుంచి 50 మందికి పైగా ఎంపిక
Embed widget