Solar Plant: సోలార్ ప్లాంట్ బిజినెస్ చేయాలనుకుంటున్నారా, ఈ విషయాలు తెలుసుకోండి
Solar Plant News | విద్యుత్ ఉత్పత్తి చేసి వినియోగించుకోవచ్చు, ఎక్కువ ఉత్పత్తి చేస్తే ఆ విద్యుత్ విక్రయించి క్యాష్ చేసుకునే అవకాశం ఉంది. మీకు ప్రతినెలా ఆదాయం వస్తుంది.

Solar Plant Business: గత కొన్నేళ్లుగా చదువుతో సంబంధం లేకుండా బిజినెస్ వైపు మొగ్గు చూపుతున్నారు. గంటల తరబడి ఆఫీసులో కూర్చుని పనిచేసి, నెలాఖరులో జీతం కోసం ఎదురుచూడకుండా సెకండ్ ఇన్‌కం కోసం ప్లాన్ చేస్తున్నారు. ఉద్యోగాల కంటే వ్యాపారానికి ఎక్కువ ప్రాధాన్యత ఇస్తున్నారు. గత కొన్నేళ్లలో దేశంలో చాలా స్టార్టప్‌లు ప్రారంభం కావడానికి కారణం ఇదే. కొంతమంది సాంప్రదాయ వ్యాపారాలను ప్రారంభిస్తుండగా.. మరికొందరు అందరికంటే భిన్నంగా ఆలోచించి బిజినెస్ లోకి ఎంట్రీ ఇస్తున్నారు. మీరు కూడా వ్యాపారం ప్రారంభించాలని ఆలోచిస్తున్నారా, అయితే సోలార్ ప్లాంట్ వ్యాపారం మీకు ప్రయోజనకరంగా మారవచ్చు.
మీరు విద్యుత్తును ఉత్పత్తి చేసి, దానిని మీరు వినియోగించుకోవచ్చు. దాంతో పాటు అదనపు విద్యుత్తును మీరు విక్రయించి క్యాష్ చేసుకోవచ్చు. గత కొన్నేళ్లలో ఇది మంచి బిజినెస్ ఐడియాగా మారింది. ఇతర బిజినెస్ తో పోల్చితే.. ఇందులో మీకు ప్రభుత్వం నుంచి సహకారం లభిస్తుంది. సబ్సిడీ ద్వారా మీపై అదనపు బారం తగ్గుతుంది. సోలార్ ప్లాంట్ తెరిచి మీరు ఎలా సంపాదించవచ్చు, సోలార్ ప్లాంట్ ప్రారంభించడానికి కావాల్సిన వివరాలు ఇక్కడ అందిస్తున్నాం.
సోలార్ ప్లాంట్ (Solar Plant) వ్యాపారాన్ని ఎలా ప్రారంభించాలి?
ఏదైనా వ్యాపారాన్ని ప్రారంభించే ముందు, దాని గురించి సాధ్యమైనన్ని ఎక్కువ వివరాలు తెలుసుకోవడం చాలా ముఖ్యం. మీరు పనికొచ్చే సమాచారం తెలుసుకుంటే మీ బిజినెస్ ప్రారంభం మరింత తేలిక. వ్యాపారం చాలా అరుదైన విషయాలలో చేయాలనుకుంటే, అప్పుడు మరింత రీసెర్చ్ అవసరం. మీరు సోలార్ ప్లాంట్ తెరవాలని ఆలోచిస్తున్నారా, మీకు సూర్యరశ్మి బాగా తగిలే ప్రదేశం కావాలి. అంటే చాలా ఖాళీ స్థలం లేక భవనం పైకప్పు వంటివి ఉంటే సరి.
సోలార్ ప్లాంట్ కోసం, మీరు మొదట్లో 5 కిలోవాట్ల నుండి 1 మెగావాట్ వరకు సోలార్ ప్లాంట్ ఏర్పాటు చేయవచ్చు. తరువాత మీరు భారత ప్రభుత్వ మంత్రిత్వ శాఖ న్యూ అండ్ రెన్యూవబుల్ ఎనర్జీ లేదా రాష్ట్ర సోలార్ ఏజెన్సీ నుంచి పర్మిషన్ తీసుకోవాలి. తరువాత మీరు నెట్ మీటరింగ్ వ్యవస్థను ఏర్పాటు చేసుకోవాలి. దాంతో మీరు నేరుగా గ్రేడ్‌కు విద్యుత్ పంపవచ్చు. మీరు గ్రేడ్‌కు ఎంత ఎక్కువ విద్యుత్తును పంపిస్తే, మీరు యూనిట్ల ప్రకారం నగదు పొందుతారు. ప్రతి నెలా ఈ మొత్తం మీ బ్యాంకు ఖాతాకు బదిలీ చేస్తారు.
ఎంత సంపాదించవచ్చు? (How To Earn from Solar Plant)
మీరు ఎంత సామర్థ్యం గల విద్యుత్తును సోలార్ ప్లాంట్ ద్వారా ఉత్పత్తి చేసి అందిస్తారో దానికి యూనిట్ల చొప్పున ఆదాయం వచ్చే వ్యవస్థను ఏర్పాటు చేయాలి. రోజుకు ఎన్ని యూనిట్ల విద్యుత్తును ఉత్పత్తి చేస్తుందనే దానిపై మీ ఆదాయం ఆధారపడి ఉంటుంది. ఉదాహరణకు, 1 కిలోవాట్ సోలార్ సిస్టమ్ రోజుకు సగటున 4-5 యూనిట్ల విద్యుత్తును ఉత్పత్తి చేస్తుంది. నెలకు దాదాపు 120 నుంచి 150 యూనిట్లు. మీరు గ్రిడ్‌కు విద్యుత్తును యూనిట్‌కు రూ. 3 నుంచి 5 చొప్పున విక్రయిస్తే, నెలకు దాదాపు రూ. 500 నుంచి రూ. 750 వరకు ఆదాయం వస్తుంది.
కమర్షియల్ గా అయితే 10 కిలోవాట్ల నుండి 1 మెగావాట్ వరకు ఉత్పత్తి చేసే ప్లాంట్ల ద్వారా నెలకు లక్షల రూపాయలు సంపాదించవచ్చు. మీ సోలార్ ప్లాంట్ ఎంత ఎక్కువ విద్యుత్తును ఉత్పత్తి చేస్తే, యూనిట్ల మేర అంత ఎక్కువ డబ్బు వస్తుంది. ద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు సోలార్ ఎనర్జీని ప్రోత్సహించడానికి పలు పథకాలు అమలు చేస్తున్నాయి.






















