![ABP Premium](https://cdn.abplive.com/imagebank/Premium-ad-Icon.png)
Shloka Necklace: అంబానీ కోడలి డైమండ్ నెక్లెస్‌కు రిపేర్, దాని రేటు తెలిస్తే షాకవుతారు
పెళ్లి సందర్భంగా, మామ ముఖేష్ అంబానీ & అత్త నీత అంబానీ పెద్ద కోడలికి అత్యంత విలువైన, అరుదైన గిఫ్ట్ ఇచ్చారు.
![Shloka Necklace: అంబానీ కోడలి డైమండ్ నెక్లెస్‌కు రిపేర్, దాని రేటు తెలిస్తే షాకవుతారు Shloka Mehta Rs 451 Crore Necklace 91 Diamonds Gifted by Mukesh Ambani-Nita Ambani to Bahu Goes Out Of Market Shloka Necklace: అంబానీ కోడలి డైమండ్ నెక్లెస్‌కు రిపేర్, దాని రేటు తెలిస్తే షాకవుతారు](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2023/06/09/15427e15740c615dd0d5272b722c27b21686302871650545_original.jpg?impolicy=abp_cdn&imwidth=1200&height=675)
Shloka Mehta's Rs 451 Crore Necklace: రిలయన్స్ ఇండస్ట్రీస్ అధిపతి ముకేష్ అంబానీ పెద్ద కోడలు మరోమారు వార్తల్లోకి వచ్చారు. అంబానీ పెద్ద కుమారుడు ఆకాష్ అంబానీ, ఆయన భార్య శ్లోక మెహతా ఇటీవలే రెండోసారి తల్లిదండ్రులయ్యారు. గత నెల 31న (31 మే 2023), శ్లోక మెహత హాస్పిటల్‌లో ఆడబిడ్డకు జన్మనిచ్చారు. వీరికి ఈ పాప రెండో సంతానం. ఈ దంపతులకు తొలి సంతానంగా, కుమారుడు పృథ్వి 2020 డిసెంబర్‌లో జన్మించాడు.
రూ. 451 కోట్ల విలువైన గిఫ్ట్
ఆకాశ్ అంబానీ, శ్లోక మెహత 2019 మార్చి నెలలో వివాహం చేసుకున్నారు. ఆ పెళ్లి సందర్భంగా, మామ ముఖేష్ అంబానీ & అత్త నీత అంబానీ పెద్ద కోడలికి అత్యంత విలువైన, అరుదైన గిఫ్ట్ ఇచ్చారు. అది ఒక డైమండ్ నెక్లెస్. దాని విలువ 451 కోట్ల రూపాయలు. 91 వజ్రాలతో దానిని డిజైన్ చేశారు.
ఫ్యాషన్ సెన్స్‌తో తరచూ మీడియా దృష్టిని ఆకర్షించే శ్లోక వద్ద ఖరీదైన వజ్రాభరణాల కలెక్షన్ ఉంది. వివాహ సమయంలో అంబానీ కుటుంబం నుంచి బహుమతిగా వచ్చిన మౌవాద్ (Mouawad) డైమండ్ నెక్లెస్ ఆ కలెక్షన్స్‌లో ఒకటి. ఈ నెక్లెస్ పేరు 'ఇన్‌కంపారబుల్' (Incomparable). 'సాటిలేనిది' అని దాని అర్ధం.
ఎంటర్‌టైన్‌మెంట్ టైమ్స్ రిపోర్ట్ ప్రకారం, గత సంవత్సరం సథెబీలో (Sotheby) 'మౌవాద్ ఎల్ ఇన్‌కంపారబుల్ 91 డైమండ్ నెక్లెస్'ను ప్రదర్శించారు. అప్పుడు రూ. 451 కోట్ల ధర పలికింది.
మరో ఆసక్తికర కథనం: షాక్ ఇచ్చిన పసిడి - ఇవాళ బంగారం, వెండి కొత్త ధరలు
ఇక మార్కెట్‌లో కనిపించదు
తాజా నివేదికల ప్రకారం, ఈ ఖరీదైన డైమండ్ నెక్లెస్ సెట్ ఇకపై మార్కెట్‌లో కనిపించదు. ఆ నెక్లెస్ డిజైన్ మారుస్తున్నారు. హారంలోని "పసుపు రంగు వజ్రాల రంగును మరింత పెంచడానికి, ప్రకాశవంతం చేయడానికి, ఆకారాన్ని మెరుగుపరచడానికి" దానిని రీకట్ చేశారని తెలుస్తోంది. దీనివల్ల వజ్రాభరణం బరువు 100 క్యారెట్‌లకు పైగా తగ్గింది.
రూ.451 కోట్ల వజ్రాలహారం గురించి మరిన్ని వివరాలు
'మౌవాద్ ఎల్ ఇన్‌కంపారబుల్'కు ప్రపంచంలోనే అత్యంత ఖరీదైన వజ్రాభరణంగా (55 మిలియన్ డాలర్లు) రికార్డ్ కెక్కింది. 18 కారట్ గులాబీ బంగారంలో 229.52 క్యారెట్ వైట్ డైమండ్స్, దోషరహిత 407.48 క్యారెట్ పసుపు వజ్రం పొదిగారు.
రాళ్ల కుప్పలో దొరికిన డైమండ్
1980 దశకంలో, ఆఫ్రికాలోని కాంగోలో సెంటర్‌పీస్ డైమండ్‌ను కనుగొన్నారు. ఒక అమ్మాయి వదిలేసిన మైనింగ్ శిథిలాల కుప్ప నుంచి దీనిని వెలికితీశారు. 2013లో దోహా జ్యువెలరీ అండ్ వాచ్ ఎగ్జిబిషన్‌లో తొలిసారిగా ఆవిష్కరించారు. ఆ తర్వాత, వాషింగ్టన్ DCలోని స్మిత్సోనియన్ ఇన్‌స్టిట్యూషన్ సహా చాలా మ్యూజియాల్లో దీనిని ప్రదర్శించారు. ఆ తర్వాత మౌవాద్ నెక్లెస్‌లో చేరి 'ఇన్‌కంపారబుల్' అయింది.
మరో ఆసక్తికర కథనం: 'పపర్' తగ్గిన ఐఈఎక్స్, రెండ్రోజుల్లో 23% ఆవిరి - ఏం జరుగుతోంది?
టాప్ హెడ్ లైన్స్
ట్రెండింగ్ వార్తలు
![ABP Premium](https://cdn.abplive.com/imagebank/metaverse-mid.png)