News
News
X

IDBI Bank Shares: ఐడీబీఐ బ్యాంక్ షేర్లలో ప్రైవేటీకరణ హుషారు

ఇంట్రా డే ట్రేడింగ్‌లో IDBI బ్యాంక్ షేర్లు 11 శాతం ర్యాలీ చేసి రూ.47.40కి చేరుకున్నాయి.

FOLLOW US: 
 

IDBI Bank Shares: ప్రైవేటీకరణ మాట ఐడీబీఐ బ్యాంక్‌ నెత్తిన పాలు పోసింది. ఈ బ్యాంక్‌లో వ్యూహాత్మక పెట్టుబడుల ఉపసంహరణ కోసం ఇనీషియల్‌ బిడ్లను కేంద్ర ప్రభుత్వం ఆహ్వానించడంతో IDBI బ్యాంక్‌ షేర్లకు డిమాండ్‌ పెరిగింది. ఇవాళ్టి (సోమవారం) బలహీనమైన మార్కెట్‌లోనూ, ఇంట్రా డే ట్రేడింగ్‌లో IDBI బ్యాంక్ షేర్లు 11 శాతం ర్యాలీ చేసి రూ.47.40కి చేరుకున్నాయి. 

మధ్యాహ్నం 1.40 గంటల సమయానికి S&P BSE సెన్సెక్స్‌లో 0.51 శాతం క్షీణతతో పోలిస్తే, ఈ స్టాక్ 9.25 శాతం పెరిగి రూ.46.65 వద్ద ట్రేడవుతోంది. ఇవాళ్టి ట్రేడింగ్ ప్రారంభమైన కొన్ని నిమిషాల్లోనే NSE, BSEలో కలిపి 6.9 మిలియన్ షేర్లు చేతులు మారాయి. 

60.72 శాతం వాటా విక్రయం
ఈ బ్యాంకులో తమకు ఉన్న మొత్తం 94.72 శాతం వాటాలో 60.72 శాతం వాటాను విక్రయిస్తామని కేంద్ర ప్రభుత్వం, లైఫ్‌ ఇన్సూరెన్స్‌ కార్పొరేషన్‌ (LIC) ప్రకటించాయి. ఈ వాటా కొనుగోలు చేయాలనుకునే వాళ్లు ఈ ఏడాది డిసెంబరు 16వ తేదీ లోపు బిడ్లు (Expression of Interest - EoI) దాఖలు చేయాలి.

ప్రస్తుతం, ఐడీబీఐ బ్యాంక్‌లో ఎల్‌ఐసీకి 49.24 శాతం (529.41 కోట్ల షేర్లు), కేంద్ర ప్రభుత్వానికి 45.48 శాతం (488.99 కోట్ల షేర్లు) వాటాలున్నాయి. ఇందులో ఎల్‌ఐసీ 30.24 శాతం, కేంద్ర ప్రభుత్వం 30.48 శాతం వాటాలను అమ్మకానికి పెట్టాయి. రెండూ కలిపి 60.72 శాతం స్టేక్‌ను విక్రయించబోతున్నాయి. ఈ లావాదేవీ పూర్తయితే, ఈ బ్యాంకులో కేంద్ర ప్రభుత్వానికి 15 శాతం వాటా, 19 శాతం వాటా మిగులుతుంది. ఈ రెండింటి బలం 94.72 శాతం నుంచి 34 శాతానికి దిగి వస్తుంది. ఫలితంగా ఐడీబీఐ బ్యాంక్‌ మీద ఇవి రెండూ యాజమాన్య నియంత్రణ కోల్పోతాయి. ఇక్కడే అసలు పాయింట్‌ ఉంది. ప్రభుత్వం కోల్పోయే యాజమాన్య నియంత్రణ ప్రైవేటు వ్యక్తుల చేతుల్లోకి వెళ్లిపోతుంది. ప్రైవేటు పరం అయిన తర్వాత అయినా ఈ బ్యాంక్‌ దశ - దిశ మారుతుందని, భవిష్యత్తులో షేర్లు సర్రున దూసుకెళ్తాయని ఇన్వెస్టర్ల ఆశ. అందుకే, ఇప్పట్నుంచే IDBI బ్యాంక్‌ షేర్లను ఎగబడి కొంటున్నారు.

News Reels

ప్రైవేటీకరణకు బిడ్లు పిలుస్తారన్న వార్త ముందుగానే బయటకు పొక్కడంతో, గత రెండు వారాల నుంచి ఈ స్టాక్‌ నిట్టనిలువుగా పెరుగుతోంది. ఈ రెండు వారాల్లోనే 16 శాతం పైగా పెరిగింది. గత మూడు నెలల కాలంలో, బెంచ్‌మార్క్ ఇండెక్స్‌లో 6 శాతం పెరుగుదలతో పోలిస్తే, IDBI బ్యాంక్ మార్కెట్ ధర దాదాపు 50 శాతం పెరిగింది. గత ఆరు నెలల కాలంలో మాత్రం 1 శాతం పైగా నష్టంతో దాదాపు ఫ్లాట్‌గా ట్రేడవుతోంది.

Disclaimer: ఈ వార్త కేవలం సమాచారం కోసం మాత్రమే. మ్యూచువల్‌ ఫండ్లు, స్టాక్‌ మార్కెట్‌, క్రిప్టో కరెన్సీ, షేర్లు, ఫారెక్స్‌, కమొడిటీల్లో పెట్టే పెట్టుబడులు ఒడుదొడుకులకు లోనవుతుంటాయి. మార్కెట్‌ పరిస్థితులను బట్టి ఆయా పెట్టుబడి సాధనాల్లో రాబడి మారుతుంటుంది. ఫలానా మ్యూచువల్‌ ఫండ్‌, స్టాక్‌, క్రిప్టో కరెన్సీలో పెట్టుబడి పెట్టాలని 'ఏబీపీ దేశం' చెప్పడం లేదు. పెట్టుబడి పెట్టే ముందు అన్ని వివరాలు పరిశీలించడం ముఖ్యం. అవసరమైతే సర్టిఫైడ్‌ ఫైనాన్షియల్‌ అడ్వైజర్ల నుంచి సలహా తీసుకోవడం మంచిది.

Published at : 10 Oct 2022 02:46 PM (IST) Tags: IDBI Bank Lic privatisation IDBI Bank selling

టాప్ స్టోరీస్

President Droupadi Murmu : నేడు ఏపీకి ద్రౌపదీ ముర్ము, నేవీ డే కార్యక్రమాల్లో పాల్గోనున్న రాష్ట్రపతి

President Droupadi Murmu : నేడు ఏపీకి ద్రౌపదీ ముర్ము, నేవీ డే కార్యక్రమాల్లో పాల్గోనున్న రాష్ట్రపతి

YS Sharmila Padayatra: వైఎస్ షర్మిలకు వరంగల్ పోలీసులు షాక్, పాదయాత్రకు బ్రేక్!

YS Sharmila Padayatra: వైఎస్ షర్మిలకు వరంగల్ పోలీసులు షాక్, పాదయాత్రకు బ్రేక్!

Weather Latest Update: ముంచుకొస్తున్న మాండస్ తుపాను, ఏపీకి వర్షసూచన!

Weather Latest Update:  ముంచుకొస్తున్న మాండస్ తుపాను, ఏపీకి వర్షసూచన!

Bigg Boss 6 Telugu:ఈ సీజన్లో బెస్ట్ కెప్టెన్ ఎవరు? వరస్ట్ కెప్టెన్ ఎవరు? - ఇక ఆపెయ్ ఆదిరెడ్డి, నాగార్జున వేడుకోలు

Bigg Boss 6 Telugu:ఈ సీజన్లో బెస్ట్ కెప్టెన్ ఎవరు? వరస్ట్ కెప్టెన్ ఎవరు? - ఇక ఆపెయ్ ఆదిరెడ్డి, నాగార్జున వేడుకోలు