Budget 2024: వచ్చే బడ్జెట్‌లో హ్యాపీ న్యూస్! - స్టాక్ మార్కెట్ ఇన్వెస్టర్లు పండగ చేసుకోవచ్చు
Union Budget 2024: దీర్ఘకాలిక మూలధన లాభాల పన్నును విధించే పరిమితిని లక్ష రూపాయల నుంచి 3 లక్షల రూపాయలకు పెంచవచ్చని భావిస్తున్నారు.
Union Budget 2024 Expectations: ఆర్థిక మంత్రి నిర్మల సీతారామన్ (Finance Minister Nirmala Sitharaman) వచ్చే వారం కొత్త బడ్జెట్ ప్రవేశపెట్టనున్నారు. ఈ బడ్జెట్, స్టాక్ మార్కెట్ పెట్టుబడిదార్లకు శుభవార్తను అందించే అవకాశం ఉంది. మూలధన లాభాల పన్నుపై (Capital Gains Tax) క్యాపిటల్ గెయిన్స్ ట్యాక్స్‌పై ఉపశమనం కల్పించేందుకు బడ్జెట్‌లో కొన్ని చర్యలు తీసుకోవచ్చని ఊహాగానాలు ఉన్నాయి.
నేషనల్ మీడియా నివేదికల ప్రకారం, మూలధన లాభాల పన్ను విషయంలో, ఆస్తి వర్గం (Asset Class) & దానిని హోల్డ్ చేసిన కాలానికి సంబంధించి పెట్టుబడిదార్లలో ఇప్పటికీ కొన్ని అనుమానాలు, గందరగోళం ఉన్నాయి. పెట్టుబడిదార్ల ఆందోళనలను కేంద్ర ప్రభుత్వం అర్థం చేసుకుందని, రాబోయే బడ్జెట్‌లో ఆ సమస్య పరిష్కారానికి చర్యలు తీసుకోవచ్చని తెలుస్తోంది. క్యాపిటల్ గెయిన్స్ ట్యాక్స్‌ను మరింత సరళీకరించి ఇన్వెస్టర్లకు ఉపశమనం కల్పించాలని ప్రభుత్వం భావిస్తే, షేర్ మార్కెట్‌లో పెట్టుబడి పెట్టినవారు సహా వివిధ ఆస్తుల పెట్టుబడిదాలర్లకు మేలు జరుగుతుంది.
ఈ బడ్జెట్‌లో ఎలాంటి మార్పును చూడవచ్చు?
2018లో, అప్పటి ఆర్థిక మంత్రి అరుణ్ జైట్లీ రూ. 1 లక్ష కంటే ఎక్కువ లాభంపై 10 శాతం చొప్పున దీర్ఘకాలిక మూలధన లాభాల పన్ను (Long-term Capital Gains Tax) విధించారు, ఇండెక్సేషన్ ప్రయోజనాన్ని రద్దు చేశారు. ఇండెక్సేషన్ ప్రయోజనాలను మళ్లీ ఈ బడ్జెట్‌లో ప్రవేశపెట్టవచ్చని విశ్లేషకులు భావిస్తున్నారు. దీంతోపాటు లాంగ్ టర్మ్ క్యాపిటల్ గెయిన్స్ ట్యాక్స్ విధించే పరిమితిని రూ. 1 లక్ష నుంచి రూ. 3 లక్షలకు పెంచాలన్న డిమాండ్ కూడా వినిపిస్తోంది. ఇది స్టాక్ మార్కెట్ పెట్టుబడిదార్లకు, ముఖ్యంగా మ్యూచువల్ ఫండ్స్‌లో పెట్టుబడి పెట్టేవారికి లాభదాయకమైన డీల్ అవుతుంది.
షేర్లపై మూలధన లాభాల పన్ను విషయంలో ప్రస్తుతం ఉన్న రూల్స్
ప్రస్తుత నిబంధనల ప్రకారం, లిస్టెడ్ షేర్‌ను కొన్న నాటి నుంచి ఒక సంవత్సరం లోపులో తిరిగి అమ్మేస్తే, 15 శాతం చొప్పున మూలధన లాభాల పన్ను చెల్లించాలి. దీనిని స్వల్పకాలిక మూలధన లాభాల పన్ను (Short-term Capital Gains Tax) అంటారు. అంటే, ఒక పెట్టుబడిదారు లిస్టెడ్ షేర్‌ని కొనుగోలు చేసిన ఒక సంవత్సరంలోపు విక్రయిస్తే, దానిలో వచ్చే లాభంపై 15 శాతం చొప్పున స్వల్పకాలిక మూలధన లాభాల పన్ను చెల్లించాలి. ఈ వ్యవధి ఏడాది కంటే ఎక్కువ & లాభం రూ. 1 లక్ష కంటే ఎక్కువ ఉంటే, 10 శాతం చొప్పున దీర్ఘకాలిక మూలధన లాభాల పన్ను కట్టాలి.
ఆస్తి తరగతిని బట్టి వర్గం మార్పు
పన్ను చెల్లింపుదార్లు వివిధ అసెట్ క్లాస్‌ల్లో పెట్టుబడులపై మూలధన లాభాల పన్ను చెల్లించాలి. నేరుగా షేర్లలో పెట్టుబడి పెడితే, వాటిని అమ్మినప్పుడు మూలధన లాభాల పన్ను చెల్లించాలి. మ్యూచువల్ ఫండ్స్ ద్వారా ఈక్విటీ లేదా డెట్‌లో పెట్టుబడి పెట్టినా కూడా క్యాపిటల్ గెయిన్స్ టాక్స్ వర్తిస్తుంది. బంగారం, వెండి వంటి లోహాలపై వచ్చిన లాభాలు కూడా మూలధన లాభాల పన్ను పరిధిలోకి వస్తాయి. అయితే, ఆస్తి వర్గం, దానిని హోల్డ్ చేసిన వ్యవధి, పరిమితులపై మూలధన లాభాల పన్ను ఆధారపడి ఉంటుంది.
మరో ఆసక్తికర కథనం: కొడుకు పెళ్లి కోసం అంబానీ ఎంత ఖర్చు చేశారో తెలిస్తే కచ్చితంగా షాక్ అవుతారు