By: ABP Desam | Updated at : 29 Apr 2023 03:20 PM (IST)
'బయ్ ఆన్ డిప్స్' పద్ధతి ఫాలో కావచ్చా?
Share Market Highlights: బెంచ్‌మార్క్ నిఫ్టీ50, ఈ ఏడాది మార్చి నెలలోని కనిష్ట స్థాయి 16,800 మార్క్ వద్ద గట్టి పట్టు దొరకబుచ్చుకుంది, అక్కడి నుంచి పైపైకి పాకుతోంది. నిఫ్టీ ర్యాలీకి మే నెలలో మరింత బలం చేకూరవచ్చని బ్రోకరేజ్ ఐసీఐసీఐ డైరెక్ట్ (ICICI Direct) చెబుతోంది.
నిఫ్టీకి 17,200 వద్ద లభించిన బలమైన మద్దతుతో ఉత్సాహంగా ఉంది, మే నెలలో 18,300-18500 స్థాయి వైపు ప్రయాణం సాగుతుందని బ్రోకరేజ్ వెల్లడించింది. ఈ నేపథ్యంలో, పెట్టుబడిదార్లు మిడ్ క్యాప్ స్టాక్స్‌ను దృష్టిలో పెట్టుకుని "బయ్ ఆన్ డిప్స్" (buy on dips) విధానాన్ని ఫాలో కావచ్చని సూచించింది.
బెంచ్‌మార్క్‌ల నుంచి మ్యూటెడ్ రిటర్న్స్
వడ్డీ రేట్ల పెంపు గరిష్ట స్థాయికి చేరినప్పటికీ, ఈ ఏడాదిలో ఇప్పటి వరకు ఈక్విటీ బెంచ్‌మార్క్‌లు చెప్పుకోదగ్గ రాబడి ఇవ్వలేదు. అయితే, సూచీలు ఎటువైపూ ఎక్కువ పడకుండా, ఎక్కువ పెరగకుండా కొద్దిగా స్థిరత్వం ప్రదర్శించాయి. ఈ ఏడాదిలో ఇప్పటి వరకు (YTD)... సెన్సెక్స్, నిఫ్టీ వరుసగా 0.5%, 1.2% చొప్పున తగ్గి, ఎరుపు రంగులో ట్రేడ్ అవుతున్నాయి.
పేలవమైన నాలుగో త్రైమాసిక ఫలితాలు, బలహీనమైన భవిష్యత్ అంచనాల వల్ల ఐటీ స్టాక్స్ భారీ నష్టాన్ని చవి చూశాయి. అయితే... ఐటీ రంగంలోని లోటును ఆర్థిక రంగ స్టాక్స్ భర్తీ చేస్తున్నాయి. మార్చి త్రైమాసిక ఆదాయాల్లో ఇప్పటి వరకు మంచి ఫలితాలను ఫైనాన్షియల్ కంపెనీలు ప్రకటించాయి.
మిడ్ & స్మాల్ క్యాప్ స్టాక్స్‌లో జోరు
మార్చి కనిష్ట స్థాయి నుంచి కనిపిస్తున్న ప్రస్తుత ర్యాలీ గత ఐదు నెలల కాలంలోనే అతి పెద్దదని ICICI డైరెక్ట్ చెబుతోంది. గత నాలుగు నెలల 'ఫాలింగ్ ఛానెల్' ప్యాట్రన్‌ను (falling channel pattern) నిఫ్టీ ఇండెక్స్ బ్రేక్ చేసిందని, అప్‌ట్రెండ్ పునఃప్రారంభానికి ఇది గుర్తని తెలిపింది. ఈ అప్‌ట్రెండ్ కొనసాగితే.. మే నెలలో మిడ్ & స్మాల్ క్యాప్ స్టాక్స్ మంచి జోరు చూపిస్తాయని బ్రోకరేజ్ అంచనా వేసింది.
చరిత్రలోకి చూస్తే.. గత రెండు దశాబ్దాల కాలంలో, మే నెలలో సగం సమయం అల్లకల్లోలంగా ఉంది. ఎంత ఒత్తిడి ఉన్నా, 83% సందర్భాల్లో, క్యాలెండర్ సంవత్సరం చివరి నాటికి సగటున రెండంకెల రాబడిని మే నెల తెచ్చి ఇచ్చిందని చరిత్ర చెబుతోంది.
మే నెలలో ఐసీఐసీఐ డైరెక్ట్ టాప్ పిక్స్
మే నెలలో, BFSIలో (Banking, Financial Services and Insurance) HDFC బ్యాంక్, ఇండస్‌ఇండ్ బ్యాంక్... PSUల్లో BEL, NHPC, కోల్ ఇండియా.... కన్‌జంప్షన్ & రిటైల్‌లో ITC, ఏషియన్ పెయింట్స్ ICICI డైరెక్ట్ టాప్ పిక్స్‌గా ఉన్నాయి.
Disclaimer: ఈ వార్త కేవలం సమాచారం కోసం మాత్రమే. మ్యూచువల్ ఫండ్లు, స్టాక్ మార్కెట్, క్రిప్టో కరెన్సీ, షేర్లు, ఫారెక్స్, కమొడిటీల్లో పెట్టే పెట్టుబడులు ఒడుదొడుకులకు లోనవుతుంటాయి. మార్కెట్ పరిస్థితులను బట్టి ఆయా పెట్టుబడి సాధనాల్లో రాబడి మారుతుంటుంది. ఫలానా మ్యూచువల్ ఫండ్, స్టాక్, క్రిప్టో కరెన్సీలో పెట్టుబడి పెట్టాలని లేదా ఉపసంహరించుకోవాలని 'abp దేశం' చెప్పడం లేదు. పెట్టుబడి పెట్టే ముందు, లేదా ఉపసంహరించుకునే ముందు అన్ని వివరాలు పరిశీలించడం ముఖ్యం. అవసరమైతే సర్టిఫైడ్ ఫైనాన్షియల్ అడ్వైజర్ల నుంచి సలహా తీసుకోవడం మంచిది.
Gold-Silver Price Today 07 June 2023: పసిడి స్థిరం - ఇవాళ బంగారం, వెండి ధరలు
Cryptocurrency Prices: క్రిప్టో మార్కెట్లో వణుకు - రూ.88వేలు తగ్గిన బిట్‌కాయిన్
Stock Market News: టర్న్ అరౌండ్ అయిన సెన్సెక్స్, నిఫ్టీ - ఎరుపెక్కిన ఐటీ ఇండెక్స్!
LIC Policy: రోజుకు ₹45 పెట్టుబడితో ₹25 లక్షలు మీ సొంతం
BoB: ఫోన్‌తో స్కాన్ చేసి డబ్బు తీసుకోవచ్చు, ఏటీఎం కార్డ్ అక్కర్లేదు
‘ఆదిపురుష్’ టీమ్ 7 నెలలు నిద్రపోకుండా పనిచేశారు, చిరంజీవి ఆశ్చర్యపోయారు: ప్రభాస్ - కన్నీళ్లు పెట్టుకున్న ఓంరౌత్
Academic Calendar: తెలంగాణలో పాఠశాలల కొత్త అకడమిక్ క్యాలెండర్ విడుదల - పరీక్షలు, సెలవుల వివరాలు ఇలా!
Cyclone Biparjoy: అరేబియా సముద్రంలో బిపర్జోయ్ తుపాను, వచ్చే 5 రోజులు ఇక్కడే బీభత్సమే - ఐఎండీ హెచ్చరిక
Odisha Train Accident: రైలు ప్రమాదంలో మృతుల సంఖ్యపై ఒడిశా ప్రభుత్వం కీలక ప్రకటన, మళ్లీ పాత మాటే!