News
News
X

SBI Interest Rate: వడ్డీలతో నడ్డి విరగ్గొడుతున్న బ్యాంకులు - ఇంకా పెరుగుతున్న EMIలు

వ్యక్తిగత, గృహ రుణాలు, వాహన రుణాల రేట్లు పెరిగే అవకాశం ఉంది. ఫలితంగా నెలవారీ కిస్తీలు (EMI) మరింత ప్రియం కాబోతున్నాయి.

FOLLOW US: 

SBI Interest Rate: రిజర్వ్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా వడ్డీ రేట్లు పెంచుతుండడంతో, ఆ భారాన్ని బ్యాంకులు నేరుగా కస్టమర్ల నెత్తి మీద వేస్తున్నాయి. అంతేకాదు, పొదుపు ఖాతాల మీద ఇచ్చే వడ్డీ రేట్లనూ తగ్గిస్తున్నాయి. అంటే.. ఆ చెంపా, ఈ చెంపా ఎడాపెడా వాయిస్తున్నాయి. 

స్టేట్‌ బ్యాంక్‌, కోటక్‌ మహీంద్రా బ్యాంక్‌, ఫెడరల్‌ బ్యాంక్‌, బ్యాంక్ ఆఫ్ బరోడా తమ వడ్డీ రేట్లలో మార్పులు చేశాయి. మార్జినల్‌ కాస్ట్‌ ఆఫ్‌ ఫండ్‌ బేస్డ్‌ లెండింగ్‌ రేట్లను (MCLR) పెంచాయి. వ్యక్తిగత, గృహ రుణాలు, వాహన రుణాల రేట్లు పెరిగే అవకాశం ఉంది. ఫలితంగా నెలవారీ కిస్తీలు (EMI) మరింత ప్రియం కాబోతున్నాయి.

SBI
స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (SBI), ₹10 కోట్ల లోపు ఉన్న పొదుపు డిపాజిట్లపై వడ్డీ రేటును గతంలోని 2.75 శాతం నుంచి 5 బేసిస్ పాయింట్లు తగ్గించి 2.7 శాతానికి పరిమితం చేసింది. పొదుపు ఖాతాలో ₹10 కోట్లు, అంతకంటే ఎక్కువ ఉంటే వడ్డీ రేటును గతంలోని 2.75 శాతం నుంచి 25 బేసిస్ పాయింట్లు పెంచి 3 శాతానికి చేర్చింది. అంటే, సామాన్య కస్టమర్ల నోటి కాడ కూడు లాక్కుని సంపన్న కస్టమర్లకు గోరుముద్దలుగా పెడుతోందన్నమాట. ఏడాది కాల పరిమితికి MCLR లెండింగ్‌ రేటును 25 బేసిస్‌ పాయింట్లు పెంచి 7.95 శాతానికి చేర్చింది. రెండు, మూడేళ్ల కాలపరిమితి MCLRను కూడా వరుసగా 8.15 శాతం, 8.25 శాతానికి మార్చింది. 

₹2 కోట్ల కంటే తక్కువ ఉన్న ఫిక్స్‌డ్ డిపాజిట్లపై (FDలు) వడ్డీ రేట్లను 10 నుంచి 20 బేసిస్ పాయింట్ల వరకు పెంచింది. 7 రోజుల నుంచి 10 సంవత్సరాల వరకు FDలపై సాధారణ జనానికి 3 శాతం నుంచి 5.85 శాతం వరకు వడ్డీని ఆఫర్ చేస్తోంది. గతంలో ఇది 2.90 శాతం నుంచి 5.65 శాతంగా ఉంది.

News Reels

సీనియర్‌ సిటిజన్ల విషయానికి వస్తే.. ఫిక్స్‌డ్‌ డిపాజిట్ల మీద ఇవే కాలావధుల కోసం గతంలోని 3.4 - 6.45 శాతంతో పోలిస్తే ఈసారి 3.5 శాతం నుంచి 6.65 శాతం మధ్య సంపాదిస్తారు. SBI కొత్త రేట్లు ఈ నెల 15వ తేదీ నుంచి అమలులోకి వచ్చాయి. 

బ్యాంక్ ఆఫ్ బరోడా
ప్రభుత్వ యాజమాన్యంలోని మరో బ్యాంకర్ 'బ్యాంక్ ఆఫ్ బరోడా' (BoB) కూడా ఫారిన్‌ కరెన్సీ నాన్ రెసిడెంట్ (FCNR) డిపాజిట్ల మీద వడ్డీ రేట్లను గరిష్టంగా 135 బేసిస్ పాయింట్లు పెంచింది. వివిధ కరెన్సీలు, వివిధ కాలావధులకు ఈ పెంపుదల వేర్వేరుగా ఉంటుంది. కొత్త వడ్డీ రేట్లు నవంబరు 15 వరకు అమల్లో ఉంటాయి.

కోటక్‌ మహీంద్ర బ్యాంక్‌ & ఫెడరల్‌ బ్యాంక్‌
వివిధ కాలావధుల కోసం 'మార్జినల్‌ బేస్డ్‌ కాస్ట్ లెండింగ్‌ రేట్ల'ను 7.7 నుంచి 8.95 శాతం వరకు కోటక్‌ మహీంద్ర బ్యాంక్‌ సవరించింది. ఏడాది MCLRను 8.75 శాతానికి పెంచింది. ఫెడరల్‌ బ్యాంక్‌ కూడా.. ఏడాది కాల పరిమితి MCLRను 8.7 శాతానికి పెంచింది. 

Published at : 18 Oct 2022 10:14 AM (IST) Tags: SBI Bank of baroda Interest Rate Kotak Mahindra Bank Federal Bank State Bank

సంబంధిత కథనాలు

Stock Market New Highs: బుల్‌ రైజ్‌! 63వేల మార్క్‌ టచ్‌ చేసిన సెన్సెక్స్‌, 18750పైనే క్లోజైన నిఫ్టీ

Stock Market New Highs: బుల్‌ రైజ్‌! 63వేల మార్క్‌ టచ్‌ చేసిన సెన్సెక్స్‌, 18750పైనే క్లోజైన నిఫ్టీ

Cryptocurrency Prices: మేజర్‌ క్రిప్టోలు పైకి.. మైన్‌ కాయిన్లు కిందకి! రూ.25వేలు పెరిగిన BTC

Cryptocurrency Prices: మేజర్‌ క్రిప్టోలు పైకి.. మైన్‌ కాయిన్లు కిందకి! రూ.25వేలు పెరిగిన BTC

New Rules from December 2022: గ్యాస్‌ ధరల్లో మార్పు! డిసెంబర్లో మారుతున్న ఆర్థిక నిబంధనలు!

New Rules from December 2022: గ్యాస్‌ ధరల్లో మార్పు! డిసెంబర్లో మారుతున్న ఆర్థిక నిబంధనలు!

India GDP Growth: నేడే విడుదల! జీడీపీ వృద్ధిరేటుపై ఇన్వెస్టర్ల టెన్షన్‌.. టెన్షన్‌!

India GDP Growth: నేడే విడుదల! జీడీపీ వృద్ధిరేటుపై ఇన్వెస్టర్ల టెన్షన్‌.. టెన్షన్‌!

Stock Market Opening: జీడీపీ డేటా టెన్షన్‌! ఫ్లాట్‌గా ట్రేడవుతున్న సెన్సెక్స్‌, నిఫ్టీ!

Stock Market Opening: జీడీపీ డేటా టెన్షన్‌! ఫ్లాట్‌గా ట్రేడవుతున్న సెన్సెక్స్‌, నిఫ్టీ!

టాప్ స్టోరీస్

Jagan On Vidya Deevena : గత పాలకులు బటన్ నొక్కి డబ్బులెందుకు ఇవ్వలేకపోయారు ? - మదనపల్లిలో సీఎం జగన్ ప్రశ్న !

Jagan On Vidya Deevena : గత పాలకులు బటన్ నొక్కి డబ్బులెందుకు ఇవ్వలేకపోయారు ?  - మదనపల్లిలో సీఎం జగన్ ప్రశ్న !

Praja Sangrama Yatra: 6 నెలల్లో తెలంగాణలో ఎన్నికలు- వచ్చేది బీజేపీ ప్రభుత్వమే: బండి సంజయ్

Praja Sangrama Yatra: 6 నెలల్లో తెలంగాణలో ఎన్నికలు- వచ్చేది బీజేపీ ప్రభుత్వమే: బండి సంజయ్

IND vs NZ 3rd ODI: వర్షంతో మూడో వన్డే రద్దు- 1-0తో సిరీస్ కైవసం చేసుకున్న కివీస్

IND vs NZ 3rd ODI: వర్షంతో మూడో వన్డే రద్దు- 1-0తో సిరీస్ కైవసం చేసుకున్న కివీస్

Lucky Lakshman Teaser : లక్ష్మణ్ గారి లక్ ఎంత? పాన్ ఇండియా రూటులో 'బిగ్ బాస్' సోహైల్

Lucky Lakshman Teaser : లక్ష్మణ్ గారి లక్ ఎంత? పాన్ ఇండియా రూటులో 'బిగ్ బాస్' సోహైల్