News
News
X

SBI Q3 Result: రికార్డ్‌ సృష్టించిన స్టేట్‌ బ్యాంక్‌, గతం ఎన్నడూ ఇన్ని లాభాలు కళ్లజూడలేదు

స్టేట్‌ బ్యాంక్‌ రూ. 13,360 కోట్ల లాభం ఆర్జిస్తుందని మార్కెట్‌ అంచనా వేస్తే, అంతకుమించి భారీగా లాభపడింది.

FOLLOW US: 
Share:

SBI Q3 Result: త్రైమాసిక ఫలితాల విషయంలో స్టేట్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా (SBI) రికార్డ్ సృష్టించింది. 'న భూతో' అన్నట్లుగా చెలరేగింది, 2022 అక్టోబరు-డిసెంబరు కాలంలో (Q3FY23) రికార్డ్‌ స్థాయి లాభాలను ఆర్జించింది. 

Q3FY23, స్టేట్‌ బ్యాంక్‌ సంపాదించిన ఏకీకృత నికర లాభం రూ. 15,477 కోట్లు. 2021-22 ఇదే కాలంలోని (Q3FY22) రూ. 9,555 కోట్ల లాభంతో పోలిస్తే ఇప్పుడు 62% ఎక్కువ లాభాన్ని స్టేట్‌ బ్యాంక్‌ కళ్లజూసింది. ప్రధాన ఆదాయంలో (core income) గణనీయమైన వృద్ధి, ఆస్తుల నాణ్యత మెరుగవ్వడం రికార్డ్‌ స్థాయి లాభాలకు కారణం.

స్వతంత్ర ప్రాతిపదికన చూసినా, నికర లాభం రూ. 8,432 కోట్ల నుంచి రూ. 14,205 కోట్లకు పెరిగింది. ఇది కూడా ఏకంగా 68% వృద్ధి. స్టేట్‌ బ్యాంక్‌ రూ. 13,360 కోట్ల లాభం ఆర్జిస్తుందని మార్కెట్‌ అంచనా వేస్తే, అంతకుమించి భారీగా లాభపడింది.

డిసెంబర్ త్రైమాసికంలో నికర వడ్డీ ఆదాయం (net interest income - NII) 24% YoY పెరిగి రూ. 38,069 కోట్లకు చేరింది. ఇది కూడా మార్కెట్‌ అంచనాల కంటే ఎక్కువ. రూ. 36,948 కోట్ల NII లెక్క తేలొచ్చని ఫలితాలకు ముందు మార్కెట్‌ లెక్కగట్టింది. నికర వడ్డీ మార్జిన్‌ ‍‌(NIM) 0.35 శాతం పెరిగి 3.5 శాతానికి చేరడం, బ్యాంక్‌ ఇచ్చిన రుణాలు 18.61 శాతం పెరగడంతో నికర వడ్డీ ఆదాయం బలంగా పెరిగింది. 

బ్యాంక్‌ ఇతర ఆదాయాలు 2021 డిసెంబర్‌ త్రైమాసికంలోని రూ. 8,673 కోట్ల నుంచి 2022 డిసెంబర్‌ త్రైమాసికంలో రూ. 11,468 కోట్లకు పెరిగాయి.

స్టేట్‌ బ్యాంక్‌ డిపాజిట్ల వృద్ధి చాలా స్వల్పంగా 8 శాతంగా నమోదైంది. డిపాజిట్‌ వృద్ధిని పెంచుకునేందుకు తగిన చర్యలు ఇప్పటికే చేపట్టినట్లు SBI ఛైర్మన్‌ దినేశ్‌ ఖరా వెల్లడించారు. 

మెరుగుపడిన ఆస్తుల నాణ్యత 
2022 డిసెంబర్‌ త్రైమాసికంలో స్టేట్‌ బ్యాంక్‌ ఆస్తుల నాణ్యత మెరుగు పడింది. స్థూల నిరర్థక ఆస్తులు (GNPAs) 4.5 శాతం ‍‌(YoY) నుంచి 3.14 శాతానికి తగ్గాయి. ఇదే ఆర్థిక సంవత్సరం సెప్టెంబర్‌ త్రైమాసికంలో (QoQ) ఇవి 3.52 శాతంగా ఉన్నాయి. 

డిసెంబర్ త్రైమాసికంలో కేటాయింపులు ‍‌(provisions) 17 శాతం క్షీణించి రూ. 5,760 కోట్లకు చేరుకున్నాయి. గత ఏడాది ఇదే కాలంలో ఉన్న కేటాయింపుల మొత్తం రూ. 6,974 కోట్లు. లోన్ లాస్ ప్రొవిజనింగ్ లేదా మొండి బకాయిలకు సంబంధించిన కేటాయింపులు ఏకంగా 49 శాతం తగ్గి రూ. 1,586 కోట్లకు తగ్గాయి. డిసెంబర్‌ త్రైమాసికంలో రూ. 3,098 కోట్ల రుణాలు మొండి బకాయిలుగా మారాయి. గత ఆర్థిక సంవత్సరం ఇదే కాలంలో ఇవి రూ. 2,334 కోట్లుగా ఉన్నాయి. 2016 తర్వాత తొలిసారి SBI మొండి బకాయిలు రూ. 1 లక్ష కోట్ల మార్క్‌ దిగి వచ్చాయి. 

2022 డిసెంబరు 31 నాటికి ఈ రుణదాత కనీస మూలధన నిష్పత్తి 13.27 శాతంగా ఉంది.

రుణ వృద్ధి
బ్యాంక్ లోన్‌ బుక్‌ 17.60 శాతం పెరిగింది, రిటైల్ రుణాలు దీనిని లీడ్‌ చేశాయి. రిటైల్‌ రుణాలు గత సంవత్సరం ఇదే కాలం కంటే 18 శాతం పెరిగాయి. రిటైల్‌లో, గృహ రుణాలు 14 శాతం వృద్ధితో, అత్యధిక వాటాను కలిగి ఉన్నాయి. అయితే, అత్యంత వేగంగా అభివృద్ధి చెందుతున్న విభాగాలుగా సురక్షితం కాని వ్యక్తిగత రుణాలు, బంగారు రుణాలు. 

రాబోయే త్రైమాసికాల్లో క్రెడిట్ వృద్ధిపై బ్యాంక్‌ ఛైర్మన్ దినేష్ ఖరా ఆశాజనకంగా ఉన్నారు, అయితే ఇదే వేగం కొనసాగకపోవచ్చని చెప్పారు.

Published at : 04 Feb 2023 09:41 AM (IST) Tags: State Bank Of India SBI Q3 result SBI Q3 Net profit SBI beats estimates

సంబంధిత కథనాలు

Best Bikes: రూ.లక్షలోపు ఈ ఫీచర్ ఉన్న బెస్ట్ బైక్స్ ఇవే - ఇది ఉంటేనే మోడర్న్ బైక్!

Best Bikes: రూ.లక్షలోపు ఈ ఫీచర్ ఉన్న బెస్ట్ బైక్స్ ఇవే - ఇది ఉంటేనే మోడర్న్ బైక్!

Cryptocurrency Prices: రూ.24 లక్షల వైపు బిట్‌కాయిన్‌ పరుగు - దాటితే!

Cryptocurrency Prices: రూ.24 లక్షల వైపు బిట్‌కాయిన్‌ పరుగు - దాటితే!

Stock Market News: ఎఫ్‌ఎంసీజీ మినహా అన్ని సూచీలు డౌన్‌ - సాయంత్రానికి సెన్సెక్స్‌, నిఫ్టీ రికవరీ!

Stock Market News: ఎఫ్‌ఎంసీజీ మినహా అన్ని సూచీలు డౌన్‌ - సాయంత్రానికి సెన్సెక్స్‌, నిఫ్టీ రికవరీ!

SBI Sarvottam Scheme: భారీ వడ్డీ ఆదాయాన్ని అందించే ఎస్‌బీఐ స్పెషల్‌ స్కీమ్‌

SBI Sarvottam Scheme: భారీ వడ్డీ ఆదాయాన్ని అందించే ఎస్‌బీఐ స్పెషల్‌ స్కీమ్‌

Honda City: రూ.1.3 లక్షలు కట్టి హోండా సిటీ ఇంటికి తీసుకెళ్లిపోవచ్చు - పూర్తి వివరాలు తెలుసుకోండి!

Honda City: రూ.1.3 లక్షలు కట్టి హోండా సిటీ ఇంటికి తీసుకెళ్లిపోవచ్చు - పూర్తి వివరాలు తెలుసుకోండి!

టాప్ స్టోరీస్

KCR Message: మీరే నా బలం! మీరే నా బలగం!! బీఆర్ఎస్ శ్రేణులకు సీఎం కేసీఆర్ ఆత్మీయ సందేశం

KCR Message: మీరే నా బలం! మీరే నా బలగం!! బీఆర్ఎస్ శ్రేణులకు సీఎం కేసీఆర్ ఆత్మీయ సందేశం

MIW Vs DCW Highlights: ముంబైకి ఢిల్లీ మాస్టర్ స్ట్రోక్ - తొమ్మిది ఓవర్లలోనే 110 అవుట్ - టాప్‌కు చేరుకున్న క్యాపిటల్స్!

MIW Vs DCW Highlights: ముంబైకి ఢిల్లీ మాస్టర్ స్ట్రోక్ - తొమ్మిది ఓవర్లలోనే 110 అవుట్ - టాప్‌కు చేరుకున్న క్యాపిటల్స్!

Visakha Metro Rail : విశాఖ మెట్రో ప్రాజెక్టుపై ఏపీ ప్రభుత్వం నుంచి ప్రతిపాదన రాలేదు, జీవీఎల్ ప్రశ్నకు కేంద్రం క్లారిటీ!

Visakha Metro Rail : విశాఖ మెట్రో ప్రాజెక్టుపై ఏపీ ప్రభుత్వం నుంచి ప్రతిపాదన రాలేదు, జీవీఎల్ ప్రశ్నకు కేంద్రం క్లారిటీ!

బాలయ్య మంచి మనసు - తారకరత్న పరిస్థితి మరెవ్వరికీ రాకూడదని కీలక నిర్ణయం, సెల్యూట్ చేస్తున్న ఫ్యాన్స్

బాలయ్య మంచి మనసు - తారకరత్న పరిస్థితి మరెవ్వరికీ రాకూడదని కీలక నిర్ణయం, సెల్యూట్ చేస్తున్న ఫ్యాన్స్