News
News
వీడియోలు ఆటలు
X

Russia Ukraine Crisis: ఉక్రెయిన్‌లో విద్యార్థులను చూసి చలించిన మనసు- ఆనంద్ మహీంద్ర సంచలన నిర్ణయం

దేశంలో వైద్య కళాశాలను ఏర్పాటు చేయాలని ప్రముఖ వ్యాపారవేత్త ఆనంద్ మహేంద్ర నిర్ణయం తీసుకున్నారు. ఉక్రెయిన్‌లో విద్యార్థుల కష్టాలను చూసి ఈ నిర్ణయం తీసుకున్నారు.

FOLLOW US: 
Share:

ఉక్రెయిన్‌లో వైద్య విద్యను అభ్యసించడానికి వెళ్లిన భారత విద్యార్థులు యుద్ధం వేళ పడుతోన్న కష్టాలు అన్నీ ఇన్నీ కావు. రష్యా సైనికులు చేసిన షెల్లింగ్‌లో ఏకంగా ఓ భారత విద్యార్థి ప్రాణాలే కోల్పోయాడు. ఈ అవస్థలు చూసి చలించిపోయిన ప్రముఖ వ్యాపారవేత్త ఆనంద్ మహీంద్రా కీలక నిర్ణయం తీసుకున్నారు. మహీంద్రా గ్రూపు ఆధ్వర్యంలో మెడికల్‌ కాలేజీ నిర్మించాలని తలపెట్టారు.

భారతీయులు ఎక్కువగా మెడిసన్ కోసం ఉక్రెయిన్‌కు వెళ్తుంటారు. ఇప్పుడు యుద్ధం జరుగుతోన్న వేళ అక్కడ చిక్కుకున్న మన దేశ విద్యార్థులను కేంద్రం స్వదేశానికి తీసుకువస్తోంది.

మహీంద్రా ముందడుగు

మహీంద్రా గ్రూపు ఆధ్వర్యంలో మెడికల్‌ కాలేజీ  నిర్మించాలని మహీంద్రా నిర్ణయం తీసుకున్నారు. ఈ మేరకు తగు చర్యలు తీసుకోవాలంటూ మహీంద్రా యూనివర్సిటీ బాధ్యులకు సూచనలు చేశారు. ఈ విషయాన్ని స్వయంగా ట్విట్టర్‌ ద్వారా ఆనంద్ మహీంద్రా ప్రకటించారు.

" మన దేశంలో మెడికల్‌ కాలేజీలు లేవా..? ఎందుకు ఇంత మంది వైద్య విద్య కోసం వేరే దేశాలకు వెళ్తున్నారు.? ఈ విషయంపై దృష్టి పెట్టాల్సిన అవసరం ఉంది. ఇందుకోసం మహీంద్రా యూనివర్సిటీ ఆధ్వర్యంలో మెడికల్‌ కాలేజీ పెట్టేందుకు అవకాశం ఉందా? @ టెక్ మహీంద్రా చీఫ్ సీపీ గుర్నాని.                                               "
-ఆనంద్ మహీంద్రా, వ్యాపారవేత్త

ఈ మేరకు టెక్‌ మహీంద్రా చీఫ్‌ సీపీ గుర్నానిని ట్యాగ్ చేసి ఆయన ట్వీట్ చేశారు. ఇప్పుడు ఆనంద్ మహీంద్రా ట్వీట్ సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. మహీంద్రా చేసిన ట్వీట్‌పై పలువురు ఆనందం వ్యక్తం చేశారు. అయితే ఫీజులు కూడా అందరికీ అందుబాటులో ఉండాలని, కోట్లు వసూలు చేయొద్దని ఓ నెటిజన్ ట్వీట్ చేశాడు. దానికి ఆనంద్ 'నోటెడ్' అని రిప్లై ఇచ్చాడు.

హైదరాబాద్‌లోనే

అయితే ఇప్పుడు మహీంద్రా.. వైద్య కళాశాల ఎక్కడ పెడతారనే దానిపై చర్చ జరుగుతోంది. అయితే మహీంద్రా యూనివర్సిటీ హైదరాబాద్‌లోనే ఉన్నందున వైద్య కళాశాల ఇక్కడే పెట్టే అవకాశం ఉంది.

Also Read: Russia Ukraine War: అలాంటిదేం లేదు, ఉక్రెయిన్‌లో మా విద్యార్థులు బందీలుగా లేరు: భారత్

Also Read: Russia Ukraine War: ఇది వాళ్ల టైం- బైడెన్‌ను చేతకానివాడిగా చూస్తున్నారు: ట్రంప్ షాకింగ్ కామెంట్స్

Published at : 03 Mar 2022 06:29 PM (IST) Tags: Anand Mahindra Russia Ukraine Conflict Russia ukraine crisis Russia Ukraine War Medical Institution

సంబంధిత కథనాలు

Cryptocurrency Prices: క్రిప్టో మార్కెట్లో నెగెటివ్‌ సెంటిమెంట్‌ - బిట్‌కాయిన్‌ 5వేలు జంప్‌!

Cryptocurrency Prices: క్రిప్టో మార్కెట్లో నెగెటివ్‌ సెంటిమెంట్‌ - బిట్‌కాయిన్‌ 5వేలు జంప్‌!

Shloka Necklace: అంబానీ కోడలి డైమండ్‌ నెక్లెస్‌కు రిపేర్‌, దాని రేటు తెలిస్తే షాకవుతారు

Shloka Necklace: అంబానీ కోడలి డైమండ్‌ నెక్లెస్‌కు రిపేర్‌, దాని రేటు తెలిస్తే షాకవుతారు

Stock Market News: 18,600 కిందకు నిఫ్టీ - సెన్సెక్స్‌ 223 పాయింట్లు ఫాల్‌, పెరిగిన రూపాయి

Stock Market News: 18,600 కిందకు నిఫ్టీ - సెన్సెక్స్‌ 223 పాయింట్లు ఫాల్‌, పెరిగిన రూపాయి

Paytm Shares: పేటీఎం 'కరో.. కరో.. కరో జల్సా'! వారంలో 22% గెయిన్‌ - 10 నెలల గరిష్ఠానికి షేర్లు!

Paytm Shares: పేటీఎం 'కరో.. కరో.. కరో జల్సా'! వారంలో 22% గెయిన్‌ - 10 నెలల గరిష్ఠానికి షేర్లు!

Forex Trading: మీ ఫారెక్స్‌ ఫ్లాట్‌ఫామ్‌ ఒరిజినలా, నకిలీనా? ఈ లిస్ట్‌లో చెక్‌ చేసుకోండి

Forex Trading: మీ ఫారెక్స్‌ ఫ్లాట్‌ఫామ్‌ ఒరిజినలా, నకిలీనా? ఈ లిస్ట్‌లో చెక్‌ చేసుకోండి

టాప్ స్టోరీస్

2024 ఎన్నికలకు బీజేపీ బిగ్ ప్లాన్, RSS సలహాతో బ్రహ్మాస్త్రం సిద్ధం చేసిన హైకమాండ్

2024 ఎన్నికలకు బీజేపీ బిగ్ ప్లాన్, RSS సలహాతో బ్రహ్మాస్త్రం సిద్ధం చేసిన హైకమాండ్

WTC Final 2023: అజింక్య అదుర్స్‌! WTC ఫైనల్లో హాఫ్‌ సెంచరీ కొట్టిన తొలి భారతీయుడిగా రికార్డు!

WTC Final 2023: అజింక్య అదుర్స్‌! WTC ఫైనల్లో హాఫ్‌ సెంచరీ కొట్టిన తొలి భారతీయుడిగా రికార్డు!

Saroornagar Murder: నా కొడుకు అందుకే హత్య చేసి ఉండొచ్చు - కీలక విషయాలు చెప్పిన నిందితుడి తండ్రి

Saroornagar Murder: నా కొడుకు అందుకే హత్య చేసి ఉండొచ్చు - కీలక విషయాలు చెప్పిన నిందితుడి తండ్రి

Magunta Raghav : మాగుంట రాఘవ్ మధ్యంతర బెయిల్ రద్దు - 12న సరెండర్ కావాలని సుప్రీంకోర్టు ఆదేశం !

Magunta Raghav : మాగుంట రాఘవ్ మధ్యంతర బెయిల్ రద్దు - 12న సరెండర్ కావాలని సుప్రీంకోర్టు ఆదేశం !