News
News
X

Revlon: సౌందర్యం కోల్పోయిన రెవ్లాన్‌! దివాలా అంచున అతిపెద్ద కాస్మొటిక్‌ కంపెనీ!

Revlon Bankruptcy: కాస్మొటిక్‌ ప్రపంచంలో ఓ వెలుగు వెలిగిన రెవ్లాన్‌ (Revlon) కంపెనీ తన సౌందర్యం కోల్పోయింది! చేసిన అప్పులు చెల్లించకలేక దివాలా అంచున నిలిచింది.

FOLLOW US: 
Share:

Revlon Bankruptcy: కాస్మొటిక్‌ ప్రపంచంలో ఓ వెలుగు వెలిగిన రెవ్లాన్‌ (Revlon) కంపెనీ తన సౌందర్యం కోల్పోయింది! చేసిన అప్పులు చెల్లించకలేక దివాలా అంచున నిలిచింది. తాము దివాలా తీస్తున్నామని అమెరికా కోర్టులో ఛాప్టర్‌ 11 పత్రాలను దాఖలు చేసింది. నానాటికీ పెరుగుతున్న అప్పులు, ముడి వనరుల ధరలు, సరఫరా కొరత ఇందుకు కారణాలని వెల్లడించింది.

తమకు రక్షణ కల్పించాలని రెవ్లాన్‌ అధినేత రాన్‌ పెరెల్‌మ్యాన్‌ న్యూయార్క్‌ కోర్టును ఆశ్రయించారు. ఆస్తులు, అప్పులు చెరో పది బిలియన్‌ డాలర్ల వరకు ఉన్నాయని కోర్టు పత్రాల్లో పేర్కొన్నారు. ఛాప్టర్‌ 11 పత్రాలు దాఖలు చేయడం వల్ల రుణదాతలకు డబ్బులు చెల్లించే ప్రణాళికతో పాటు కంపెనీ సేవలు సజావుగా సాగేందుకు అవకాశం దొరుకుతుంది.

Also Read: రూ.28కే రూ.2 లక్షల ఎల్‌ఐసీ బీమా! ప్రీమియం లేటైనా కవరేజీ!

ప్రపంచ వ్యాప్తంగా కరోనా వైరస్‌ మహమ్మారితో లాక్‌డౌన్లు విధించారు. ఈ సమయంలో ఎవరూ కాస్మొటిక్స్‌ వాడకపోవడంతో  కంపెనీ అమ్మకాలు భారీగా పడిపోయాయి. వినియోగదారుల ఇష్టానిష్టాలు మారాయి. కొత్త కంపెనీలు మార్కెట్లో తమ వాటాను పెంచుకున్నాయి. దాంతో వారిని ఆకట్టుకోవడంలో రెవ్లాన్‌ ఇబ్బంది పడింది. ఈ కంపెనీ 90 ఏళ్ల క్రితం మహా మాంద్యంలో (Great Depression) మొట్ట మొదటిసారి నెయిల్‌ పాలిష్‌లు అమ్మింది. ఆ తర్వాత లిప్‌స్టిక్‌లు తీసుకొచ్చింది. 1955లో అంతర్జాతీయ బ్రాండ్‌గా ఎదిగింది.

Also Read: ఎన్‌పీఎస్‌ కడుతున్నారా! బెనిఫిట్స్‌పై కీలక మార్పులు చేసిన పీఎఫ్ఆర్‌డీఏ!

1985లో రెవ్లాన్‌ నియంత్రణను పెరెల్‌మ్యాన్‌ హోల్డింగ్స్‌ కంపెనీ, మ్యాక్‌ ఆండ్రూస్‌ అండ్‌ ఫోర్బ్స్‌ తీసుకున్నాయి. మైకేల్‌ మిల్కన్‌ సమీకరించిన అప్పులకు వీరు ఫండింగ్‌ చేశారు. 2016లో ఎలిజబెత్‌ ఆర్డెన్‌ను విలీనం చేసుకొనేందుకు 2 బిలియన్‌ డాలర్ల రుణాలు, బాండ్లను రెవ్లాన్‌ అమ్మింది. క్యూటెక్స్‌ (Cutex), ఆల్మే (Almay) బ్రాండ్లనూ సొంతం చేసుకుంది. 150కి పైగా దేశాల్లో విక్రయాలు చేపట్టింది. కరోనా తర్వాతే కంపెనీ దశ మారిపోయింది. సోషల్‌ మీడియాలో ఎంత ప్రచారం చేసినా అమ్మకాలు పెరగలేదు. మార్జిన్లు తగ్గాయి. సమస్యలు పెరిగాయి. అప్పులు తీర్చలేక ఇప్పుడు దివాలాకు దరఖాస్తు చేసింది.

View this post on Instagram
 
A post shared by Revlon (@revlon)

Published at : 16 Jun 2022 02:56 PM (IST) Tags: corona virus covid Debt Revlon Bankruptcy Supply chain revlon bankruptcy

సంబంధిత కథనాలు

GitHub Layoffs: భారతదేశంలో ఇంజినీరింగ్ టీం మొత్తాన్ని తొలగించిన గిట్‌హబ్ - ఏకంగా 142 మందిపై వేటు!

GitHub Layoffs: భారతదేశంలో ఇంజినీరింగ్ టీం మొత్తాన్ని తొలగించిన గిట్‌హబ్ - ఏకంగా 142 మందిపై వేటు!

Paytm on UPI charges: యూపీఐ లావాదేవీలపై ఛార్జీల్లేవ్‌ - అదంతా తప్పుడు సమాచారమే!

Paytm on UPI charges: యూపీఐ లావాదేవీలపై ఛార్జీల్లేవ్‌ - అదంతా తప్పుడు సమాచారమే!

Stock Market News: ఈక్విటీ మార్కెట్లో ఈ జోష్‌ ఎక్కడిదీ! భారీగా పెరిగిన సెన్సెక్స్‌, నిఫ్టీ

Stock Market News: ఈక్విటీ మార్కెట్లో ఈ జోష్‌ ఎక్కడిదీ! భారీగా పెరిగిన సెన్సెక్స్‌, నిఫ్టీ

Kia EV9 SUV: టెస్లా కంటే మెరుగైన ఆటోపైలట్ ఫీచర్‌తో కియా కొత్త కారు - మస్క్‌కి మంట పెడతారా?

Kia EV9 SUV: టెస్లా కంటే మెరుగైన ఆటోపైలట్ ఫీచర్‌తో కియా కొత్త కారు - మస్క్‌కి మంట పెడతారా?

Income Tax Rules: ఏప్రిల్ 1 నుంచి మారుతున్న టాక్స్‌ రూల్స్‌ - లాభమో, నష్టమో తెలుసుకోండి

Income Tax Rules: ఏప్రిల్ 1 నుంచి మారుతున్న టాక్స్‌ రూల్స్‌ - లాభమో, నష్టమో తెలుసుకోండి

టాప్ స్టోరీస్

ABP CVoter Karnataka Opinion Poll: కర్ణాటకలో కింగ్ కాంగ్రెస్, ఆసక్తికర విషయాలు చెప్పిన ABP CVoter ఒపీనియన్ పోల్‌

ABP CVoter Karnataka Opinion Poll: కర్ణాటకలో కింగ్ కాంగ్రెస్, ఆసక్తికర విషయాలు చెప్పిన ABP CVoter ఒపీనియన్ పోల్‌

Supreme Court Notice To CM Jagan : సాక్షి పత్రిక కొనుగోలుకు వాలంటీర్లకు ప్రజాధనం - సీఎం జగన్‌కు సుప్రీంకోర్టు నోటీసులు !

Supreme Court Notice To CM Jagan : సాక్షి పత్రిక కొనుగోలుకు వాలంటీర్లకు ప్రజాధనం  - సీఎం జగన్‌కు సుప్రీంకోర్టు నోటీసులు !

PS2 Telugu Trailer: వావ్ అనిపించే విజువల్స్, మైమరపించే మ్యూజిక్ - ‘పొన్నియిన్ సెల్వన్ 2’ ట్రైలర్ వచ్చేసింది!

PS2 Telugu Trailer: వావ్ అనిపించే విజువల్స్, మైమరపించే మ్యూజిక్ - ‘పొన్నియిన్ సెల్వన్ 2’ ట్రైలర్ వచ్చేసింది!

TSPSC AEE Exam: ఏఈఈ నియామక పరీక్షల షెడ్యూలు ఖరారు, సబ్జెక్టులవారీగా తేదీలివే!

TSPSC AEE Exam: ఏఈఈ నియామక పరీక్షల షెడ్యూలు ఖరారు, సబ్జెక్టులవారీగా తేదీలివే!