అన్వేషించండి

RBI MPC Meeting: ఆర్బీఐ వడ్డీ రేట్లు యథాతథం.. వరుసగా రెండోసారి మార్పులు చేయని రిజర్వ్ బ్యాంక్

RBI Monetary Policy Meeting: భారతీయ రిజర్వ్ బ్యాంక్ కీలక వడ్డీ రేట్లు యథాతథంగా ఉంచుతూ నిర్ణయం తీసుకుంది. ఈ విషయాన్ని ఆర్బీఐ గవర్నర్ సంజయ్ మల్హోత్రా వెల్లడించారు.

RBI MPC Meeting: ముంబై: ఆర్బీఐ కీలక వడ్డీ రేట్లను యథాతథంగా ఉంచుతూ నిర్ణయం తీసుకుంది. ఆర్బీఐ గవర్నర్ సంజయ్ మల్హోత్రా అధ్యక్షతన బుధవారం జరిగిన భారతీయ రిజర్వ్ బ్యాంక్ ద్రవ్యోల్బణ విధాన కమిటీ (MPC) రెపో రేటును 5.25 శాతంగా యథాతథంగా ఉంచింది. ప్రపంచ అనిశ్చితి, మారుతున్న ద్రవ్యోల్బణ పరిస్థితుల మధ్య ఈ నిర్ణయాన్ని కమిటీ ఏకగ్రీవంగా తీసుకున్నట్లు వెల్లడించారు.  ఆర్థిక వ్యవస్థపై తటస్థ వైఖరిని కొనసాగించాలని, స్థిరమైన దేశీయ వృద్ధిని బ్యాలెన్స్ చేయడంలో MPC ఈ నిర్ణయం తీసుకుంది.

ఫిబ్రవరి 2025 నుండి RBI ఇప్పటివరకు రేట్లలో మొత్తం 125 బేసిస్ పాయింట్ల కోత విధించింది. 2019 తర్వాత మొదటిసారిగా ఆర్బీఐ ఇంత వేగంగా రేట్లను తగ్గించింది. గతంలో జరిగిన కోతలను అంచనా వేయడానికి ఫిబ్రవరి 2026లో జరిగిన గత సమావేశంలో రిజర్వ్ బ్యాంక్ రేట్లను స్థిరంగా ఉంచింది. డిసెంబర్ 2025లో రెపో రేటులో 25 బేసిస్ పాయింట్ల కోత విధించడం తెలిసిందే.

ప్రధాన రేట్లు యథాతథం
తాజా నిర్ణయంతో స్టాండింగ్ డిపాజిట్ ఫెసిలిటీ (SDF) రేటు 5 శాతంగా ఉంది. మార్జినల్ స్టాండింగ్ ఫెసిలిటీ (MSF), బ్యాంక్ రేటు 5.5 శాతం వద్ద కొనసాగుతున్నాయి. మారుతున్న ఆర్థిక వాతావరణానికి తగ్గట్లుగా వెసులుబాటును సూచిస్తూ MPC తటస్థ విధాన వైఖరిని పాటించింది. 

ఫిబ్రవరి బ్రేక్ తర్వాత కొనసాగింపు
ఆర్థిక సంవత్సరం 2025-26 లో మొత్తం 125 బేసిస్ పాయింట్ల వడ్డీ రేటు కోతల తర్వాత, ఫిబ్రవరి 2026 పాలసీ సమీక్షలో కూడా ఆర్బీఐ వడ్డీ రేట్లను స్థిరంగా ఉంచింది. ఆ నిర్ణయాన్నే ఏప్రిల్ మీటింగ్‌లో ఫాలో అయింది. 

రెపో రేటు అంటే ఏమిటి?
రెపో రేటు అనేది RBI వాణిజ్య బ్యాంకులకు (Commercial Banks) అప్పు ఇచ్చే వడ్డీ రేటు. బ్యాంకుల వద్ద నిధుల కొరత ఉన్న సమయంలో వారు తమ అవసరాలను తీర్చుకోవడానికి RBI నుండి అప్పు తీసుకుంటారు. ఈ అప్పుపై వారు చెల్లించాల్సిన వడ్డీని రెపో రేటు అంటారు. మార్కెట్‌లో ద్రవ్యోల్బణం పెరిగినప్పుడు రిజర్వ్ బ్యాంక్ రెపో రేటును పెంచుతుంది. దీనివల్ల బ్యాంకులకు లోన్స్ మరింత భారమవుతాయి, వారు తమ వినియోగదారులకు ఇచ్చే లోన్ వడ్డీ రేట్లను సైతం పెంచుతారు. లోన్స్ వడ్డీ రేటు ఎక్కువైతే, ప్రజలు ఖర్చులను తగ్గించుకునేందుకు యత్నిస్తారు. ఇది ద్రవ్యోల్బణాన్ని నియంత్రించడంలో దోహదం చేస్తుంది. మరోవైపు ఆర్థిక వ్యవస్థ మందగించినప్పుడు ప్రజలకు చౌకగా లోన్స్ అందుబాటులో ఉండేలా, మార్కెట్‌లో కొనుగోళ్లను ప్రోత్సహించడానికి RBI రెపో రేటును తగ్గిస్తుంది.

 

About the author Shankar Dukanam

జర్నలిజంలో గత పదేళ్లుగా పనిచేస్తున్నారు. గత దశాబ్దకాలంలో పలు ప్రముఖ తెలుగు మీడియా సంస్థలలో పనిచేసిన అనుభవం ఆయనకు ఉంది. ఏపీ, తెలంగాణ, జాతీయ, అంతర్జాతీయ, రాజకీయ, వర్తమాన అంశాలపై కథనాలు అందిస్తారు. గ్రాడ్యుయేషన్ పూర్తయ్యాక జర్నలిజం కోర్సు పూర్తిచేసి కెరీర్‌గా ఎంచుకున్నారు. నేషనల్ మీడియాకు చెందిన పలు తెలుగు మీడియా సంస్థలలో సీనియర్ కంటెంట్ రైటర్‌గా సేవలు అందించారు. జర్నలిజంలో వందేళ్లకు పైగా చరిత్ర ఉన్న ఆనంద్ బజార్ పత్రిక నెట్‌వర్క్ (ABP Network)కు చెందిన తెలుగు డిజిటల్ మీడియా ఏబీపీ దేశంలో గత నాలుగేళ్ల నుంచి న్యూస్ ప్రొడ్యూసర్‌గా పనిచేస్తున్నారు.  

Read More

టాప్ హెడ్ లైన్స్

Gold- Silver Price Today 10 August 2026: ఆగస్టు 10న బంగారం ధర ఎంత? వెండి ధరలు కూడా మారాయా?  
ఆగస్టు 10న బంగారం ధర ఎంత? వెండి ధరలు కూడా మారాయా?  
FMCG Price Hike: ధరలు పెంచడానికి రెడీ అవుతున్న ఎఫ్‌ఎంసిజి బ్రాండ్లు! మీ ఇంటి బడ్జెట్‌పై ఎఫెక్ట్‌! 
ధరలు పెంచడానికి రెడీ అవుతున్న ఎఫ్‌ఎంసిజి బ్రాండ్లు! మీ ఇంటి బడ్జెట్‌పై ఎఫెక్ట్‌! 
మొదటి జీతం రాగానే ఎక్కడ ఇన్వెస్ట్ చేయాలి ? FD, RD లేదా SIP లలో ఏది బెస్ట్ ఆప్షన్?
మొదటి జీతం రాగానే ఎక్కడ ఇన్వెస్ట్ చేయాలి ? FD, RD లేదా SIP లలో ఏది బెస్ట్ ఆప్షన్?
PMFME Scheme: ఫుడ్ బిజినెస్ చేసేవారికి గుడ్ న్యూస్.. రూ. 10 లక్షల రుణంపై 35% సబ్సిడీ.. ఎలా అప్లై చేసుకోవాలంటే?
ఫుడ్ బిజినెస్ చేసేవారికి రూ. 10 లక్షల రుణంపై 35% సబ్సిడీ.. ఎలా అప్లై చేసుకోవాలంటే

వీడియోలు

Kadali Satyanarayana in Bigg Boss 10 | బిగ్ బాస్ 10 లోకి రచయిత్రి కడలి సత్యనారాయణ?
Rahane Saved Jaiswal From 4-Match Ban | జైస్వాల్‌ను గ్రౌండ్ నుంచి బయటకు పంపిన రహానే
Ganguly & Yuvraj Singh In Delhi Capitals Camp | ఢిల్లీ క్యాపిటల్స్‌లోకి దాదా, యువి
PM Modi Meets CWG 2026 Medal Winners | ప్రధాని మోడీని కలిసిన గ్లాస్గో కామన్వెల్త్ విజేతలు
Gundenininda Gudigantalu Serial August 10 | రోహిణిని రోడ్డుపైకి నెట్టేసిన ప్రభావతి

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Ministers vs BRS MLA: కమలాపూర్‌లో రసాభాస.. డబుల్ బెడ్రూమ్ ఇళ్ల ప్రారంభోత్సవంలో మంత్రులు వర్సెస్ బీఆర్ఎస్ ఎమ్మెల్యే
కమలాపూర్‌లో రసాభాస.. డబుల్ బెడ్రూమ్ ఇళ్ల ప్రారంభోత్సవంలో మంత్రులు వర్సెస్ బీఆర్ఎస్ ఎమ్మెల్యే
Hyderabad News: యాప్ లేదు, బైక్‌ నెంబర్ ప్లేట్ లేదు.. హైదరాబాద్‌లో ఫేక్ రాపిడో డ్రైవర్‌ను నిలదీసిన మహిళ !
యాప్ లేదు, బైక్‌ నెంబర్ ప్లేట్ లేదు.. హైదరాబాద్‌లో ఫేక్ రాపిడో డ్రైవర్‌ను నిలదీసిన మహిళ !
Ongole Politics: బాలినేని, దామచర్ల వివాదంపై టీడీపీ, జనసేన అధిష్టానాలు సీరియస్.. బహిరంగ విమర్శలు వద్దని క్లాస్
బాలినేని, దామచర్ల వివాదంపై టీడీపీ, జనసేన అధిష్టానాలు సీరియస్.. బహిరంగ విమర్శలు వద్దని క్లాస్
Adilabad News: కేంద్ర ప్రభుత్వం ప్రజా వ్యతిరేక విధానాలు ఆపాలి.. 4 లేబర్ కోడ్ లను రద్దు చేయాలి
కేంద్ర ప్రభుత్వం ప్రజా వ్యతిరేక విధానాలు ఆపాలి.. 4 లేబర్ కోడ్ లను రద్దు చేయాలి
Jharkhand Students Protest:జార్ఖండ్‌ విద్యార్థుల రణభేరీ! సీజీఎల్ రద్దు కోరుతూ అసెంబ్లీ ముట్టడి!
జార్ఖండ్‌ విద్యార్థుల రణభేరీ! సీజీఎల్ రద్దు కోరుతూ అసెంబ్లీ ముట్టడి!
Work From Home OTT : ఓటీటీలోకి లేటెస్ట్ తెలుగు మూవీ - మూడు నెలల తర్వాత స్ట్రీమింగ్... యూత్ డోంట్ మిస్
ఓటీటీలోకి లేటెస్ట్ తెలుగు మూవీ - మూడు నెలల తర్వాత స్ట్రీమింగ్... యూత్ డోంట్ మిస్
Amaravati Seed Access Road: అమరావతికి సరికొత్త రాజమార్గం! మూడు రోజుల్లో సీడ్ యాక్సిస్ రోడ్డు పూర్తి వివరాలు ఇవే!
అమరావతికి సరికొత్త రాజమార్గం! మూడు రోజుల్లో సీడ్ యాక్సిస్ రోడ్డు పూర్తి వివరాలు ఇవే!
Kiran Abbavaram : ఇంద్రపుత్రగా కిరణ్ అబ్బవరం - ఫస్ట్ పాన్ ఇండియా మూవీ
ఇంద్రపుత్రగా కిరణ్ అబ్బవరం - ఫస్ట్ పాన్ ఇండియా మూవీ
Embed widget