అన్వేషించండి

Rajesh Exports Corporate Investigation: కోటి ఆదాయాన్ని లక్షల కోట్లలో చూపించి మోసం - రాజేష్ ఎక్స్ పోర్ట్ ముంచేసిందిగా !

Rajesh Exports : భారత కార్పొరేట్ రంగంలో ఎన్నడూ వినని రీతిలో, ఏకంగా రూ. 15.15 లక్షల కోట్ల అతిపెద్ద ఆర్థిక అక్రమాల సంచలనం వెలుగులోకి వచ్చింది. రాజేష్ ఎక్స్ పోర్ట్స్ కంపెనీపై సెబీ చర్యలు తీసుకుంది.

Rajesh Exports Denies SEBI Reports:  భారత కార్పొరేట్ రంగంలో ఎన్నడూ వినని రీతిలో, ఏకంగా రూ. 15.15 లక్షల కోట్ల అతిపెద్ద ఆర్థిక అక్రమాల  సంచలనం వెలుగులోకి వచ్చింది. ప్రముఖ బంగారం శుద్ధి, ఎగుమతుల సంస్థ రాజేశ్ ఎక్స్‌పోర్ట్స్ లిమిటెడ్ పై దేశీయ మార్కెట్ నియంత్రణ సంస్థ సెబి  సుమారు 109 పేజీలతో కూడిన మధ్యంతర ఆదేశాలను జారీ చేసింది. ఈ నివేదికలో కంపెనీ చూపించిన మొత్తం గ్రూప్ ఆదాయంలో దాదాపు 99.8% ప్రాఫిట్స్, ఆదాయం ఫేక్ అని సెబి నిర్ధారించడం దేశవ్యాప్తంగా పెను సంచలనం రేపుతోంది.  

సెబి జరిపిన ప్రాథమిక విచారణ ప్రకారం, రాజేశ్ ఎక్స్‌పోర్ట్స్ సంస్థ 2021 నుండి 2025 మధ్య కాలంలో తన వ్యాపార సామర్థ్యాన్ని, ఆదాయాన్ని అత్యంత భారీగా చూపించింది. వాస్తవానికి కంపెనీకి వచ్చే రెవెన్యూ కేవలం 1 నుండి 3 శాతం మాత్రమే కాగా, విదేశీ సబ్సిడీ కంపెనీ ముఖ్యంగా స్విట్జర్లాండ్‌కు చెందిన వాల్‌కాంబి ఎస్ఏ  పేరుతో ఏకంగా 97% నుండి 99% వరకు అదనపు బోగస్ టర్నోవర్ సృష్టించినట్లు సెబి గుర్తించింది. ఈ విదేశీ కంపెనీల అడిటెడ్ అకౌంట్లను పరిశీలిస్తే అక్కడ అసలు ఎలాంటి వ్యాపారమే జరగలేదని తేలింది. దీంతో కంపెనీ సీఎండీ రాజేశ్ మెహతాను కంపెనీ షేర్లలో , సెక్యూరిటీస్ మార్కెట్‌లో ఎలాంటి ట్రేడింగ్ చేయకుండా సెబి తక్షణ నిషేధం విధించింది. 

 సెబి జారీ చేసిన మధ్యంతర ఆదేశాలపై కంపెనీ గట్టిగా స్పందించింది. తమ గ్రూప్ ఆదాయంలో ఎలాంటి తప్పుడు లెక్కలు లేవని, సెబి పేర్కొన్న అంశాలన్నీ ప్రాథమిక అంచనాలు మాత్రమేనని బెంగళూరు ప్రధాన కార్యాలయంగా పనిచేసే ఈ స్వర్ణ శుద్ధి, జ్యువెలరీ దిగ్గజం స్పష్టం చేసింది.  గురువారం స్టాక్ ఎక్స్ఛేంజ్ ఫైలింగ్‌లో రాజేశ్ ఎక్స్‌పోర్ట్స్ లిమిటెడ్ ఈ వివాదంపై తొలిసారిగా సుదీర్ఘ వివరణ ఇచ్చింది. సెబి పరిశోధనకు, తమ లెక్కలకు మధ్య ఎక్కడో ‘కమ్యూనికేషన్ గ్యాప్’ వల్ల అయోమయం నెలకొందని సంస్థ అభిప్రాయపడింది. తాము ప్రకటించిన ఆదాయం వంద శాతం వాస్తవమని, నిబంధనలకు విరుద్ధంగా టర్నోవర్‌ను పెంచి చూపించలేదని పేర్కొంది. సెబి లేవనెత్తిన సందేహాలను నివృత్తి చేయడానికి అవసరమైన అన్ని అదనపు పత్రాలు, ప్రామాణిక రికార్డులను సమర్పించే ప్రక్రియలో తాము ఉన్నామని వెల్లడించింది.   

 మార్చి 2024లో ఒక షేర్‌హోల్డర్ ఇచ్చిన ఫిర్యాదు ఆధారంగా సెబి ఈ దర్యాప్తును ప్రారంభించింది. కంపెనీ ఆదాయంలో దాదాపు 97% నుండి 99% వరకు స్విట్జర్లాండ్‌కు చెందిన ‘వాల్‌కాంబి ఎస్ఏ’ (Valcambi SA) వంటి విదేశీ సబ్సిడీ సంస్థల నుంచే వస్తోందని, అయితే గ్రూప్ స్థాయిలో చూపిస్తున్న ఆదాయానికి, క్షేత్రస్థాయి పరిశీలనలో తేలిన నివేదికలకు మధ్య భారీ వ్యత్యాసం ఉందనేది సెబి ప్రధాన ఆరోపణ. ఈ క్రమంలోనే సంస్థ సీఎండీ రాజేశ్ మెహతాపై సెబి షేర్ల ట్రేడింగ్‌కు సంబంధించి తాత్కాలిక నిషేధం విధించింది.

 సెబి జారీ చేసిన ఈ 109 పేజీల నివేదిక కేవలం ఒక తాత్కాలిక నివారణ చర్య మాత్రమేనని, దీనిపై ఇంకా ఎలాంటి తుది నిర్ణయం ,  తీర్పు వెలువడలేదని కంపెనీ గుర్తుచేసింది. దర్యాప్తు కొనసాగుతున్న తరుణంలో మార్కెట్ ప్రయోజనాల కోసం తీసుకునే ఇటువంటి ముందస్తు చర్యలపై తాము చట్టపరంగా స్పందించి, పూర్తి ఆధారాలతో తమ నిర్దోషిత్వాన్ని నిరూపించుకుంటామని కంపెనీ చైర్మన్ రాజేశ్ మెహతా ధీమా వ్యక్తం చేశారు.  ఈ పరిణామాల నేపథ్యంలో గురువారం మార్కెట్‌లో రాజేశ్ ఎక్స్‌పోర్ట్స్ షేర్లు తీవ్ర ఒడిదుడుకులను ఎదుర్కొని 5 శాతం లోయర్ సర్క్యూట్‌ను తాకి రూ. 104.65 వద్ద ముగిశాయి. లీగల్ నిపుణుల అభిప్రాయం ప్రకారం, ఇలాంటి కార్పొరేట్ విచారణలు ముగిసి తుది తీర్పు రావడానికి కొన్ని నెలల సమయం పట్టే అవకాశం ఉంది. ఒకవేళ కంపెనీ సరైన ఆధారాలు సమర్పించలేకపో తే భారీ జరిమానాలు ఎదుర్కోవాల్సి వస్తుంది.   

 

Advertisement

టాప్ హెడ్ లైన్స్

Kondagattu Accident: కొండగట్టు సమీపంలో ఆర్టీసీ బస్సు, లారీ ఢీ.. 20 మందికి గాయాలు, ఐదుగురి పరిస్థితి విషమం
కొండగట్టు సమీపంలో ఆర్టీసీ బస్సు, లారీ ఢీ.. 20 మందికి గాయాలు, ఐదుగురి పరిస్థితి విషమం
Telangana Voter List 2026: తెలంగాణ ఓటర్ల జాబితా ముసాయిదా విడుదల! డేంజర్‌లో 92 లక్షల ఓట్లు! మీ పేరును ఈలింక్‌లో చెక్ చేసుకోండి!
తెలంగాణ ఓటర్ల జాబితా ముసాయిదా విడుదల! డేంజర్‌లో 92 లక్షల ఓట్లు! మీ పేరును ఈలింక్‌లో చెక్ చేసుకోండి!
Andhra Pradesh and Telangana BJP: జాతీయ కార్యవర్గంలో పురంధేశ్వరికి చోటుతో అధిష్ఠానం గట్టి సంకేతాలు! డీలాపడ్డ ఏపీ నేతలు! సంతోషంలో తెలంగాణ లీడర్స్‌! 
జాతీయ కార్యవర్గంలో పురంధేశ్వరికి చోటుతో అధిష్ఠానం గట్టి సంకేతాలు! డీలాపడ్డ ఏపీ నేతలు! సంతోషంలో తెలంగాణ లీడర్స్‌! 
Nitin Nabin New Team: నితిన్ నబీన్ కొత్త జట్టులోకి పురంధేశ్వరి! డీకే అరుణకు షాక్! జాతీయ కార్యవర్గాన్ని ప్రకటించిన బీజేపీ!
నితిన్ నబీన్ కొత్త జట్టులోకి పురంధేశ్వరి! డీకే అరుణకు షాక్! జాతీయ కార్యవర్గాన్ని ప్రకటించిన బీజేపీ!
Advertisement

వీడియోలు

India vs Sri Lanka 1st Test Day 2 Highlights | గాలే టెస్టులో దంచికొట్టిన పడిక్కల్
Sunil Gavaskar Questions Players Fitness | టీమిండియా ఫిట్‌నెస్‌పై గవాస్కర్ షాకింగ్ కామెంట్స్
Bigg Boss Agnipariksha Uppal Balu | అగ్నిపరీక్షపై ఉప్పల్ బాలు సంచలన వ్యాఖ్యలు
Jadeja Comments On His Batting Position | బ్యాటింగ్ స్థానాలపై జడేజా తీవ్ర అసంతృప్తి
Anupama Parameswaran about Her Best Friend | అనుపమ పరమేశ్వరన్ షాకింగ్ కామెంట్స్
Advertisement

ఫోటో గ్యాలరీ

Advertisement

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Kondagattu Accident: కొండగట్టు సమీపంలో ఆర్టీసీ బస్సు, లారీ ఢీ.. 20 మందికి గాయాలు, ఐదుగురి పరిస్థితి విషమం
కొండగట్టు సమీపంలో ఆర్టీసీ బస్సు, లారీ ఢీ.. 20 మందికి గాయాలు, ఐదుగురి పరిస్థితి విషమం
Telangana Voter List 2026: తెలంగాణ ఓటర్ల జాబితా ముసాయిదా విడుదల! డేంజర్‌లో 92 లక్షల ఓట్లు! మీ పేరును ఈలింక్‌లో చెక్ చేసుకోండి!
తెలంగాణ ఓటర్ల జాబితా ముసాయిదా విడుదల! డేంజర్‌లో 92 లక్షల ఓట్లు! మీ పేరును ఈలింక్‌లో చెక్ చేసుకోండి!
Andhra Pradesh and Telangana BJP: జాతీయ కార్యవర్గంలో పురంధేశ్వరికి చోటుతో అధిష్ఠానం గట్టి సంకేతాలు! డీలాపడ్డ ఏపీ నేతలు! సంతోషంలో తెలంగాణ లీడర్స్‌! 
జాతీయ కార్యవర్గంలో పురంధేశ్వరికి చోటుతో అధిష్ఠానం గట్టి సంకేతాలు! డీలాపడ్డ ఏపీ నేతలు! సంతోషంలో తెలంగాణ లీడర్స్‌! 
Nitin Nabin New Team: నితిన్ నబీన్ కొత్త జట్టులోకి పురంధేశ్వరి! డీకే అరుణకు షాక్! జాతీయ కార్యవర్గాన్ని ప్రకటించిన బీజేపీ!
నితిన్ నబీన్ కొత్త జట్టులోకి పురంధేశ్వరి! డీకే అరుణకు షాక్! జాతీయ కార్యవర్గాన్ని ప్రకటించిన బీజేపీ!
NTR Health Update : ఎన్టీఆర్‌కు ఫిజియోథెరపీ - లేటెస్ట్ హెల్త్ అప్డేట్ ఏంటంటే?
ఎన్టీఆర్‌కు ఫిజియోథెరపీ - లేటెస్ట్ హెల్త్ అప్డేట్ ఏంటంటే?
Chinnareddy Politics: 48 ఏళ్ల రాజకీయ జీవితం నాశనం, జీవన్‌రెడ్డిలా కాంగ్రెస్ పార్టీపై తిరగబడతా!: చిన్నారెడ్డి
48 ఏళ్ల రాజకీయ జీవితం నాశనం, జీవన్‌రెడ్డిలా కాంగ్రెస్ పార్టీపై తిరగబడతా!: చిన్నారెడ్డి
DC Review : లోకేశ్ కనగరాజ్ నటన అద్భుతం - DC మూవీపై మహేశ్ బాబు, అల్లు అర్జున్ రివ్యూ
లోకేశ్ కనగరాజ్ నటన అద్భుతం - DC మూవీపై మహేశ్ బాబు, అల్లు అర్జున్ రివ్యూ
Galle Rain Threat: టీమిండియా 462కి ఆలౌట్.. తొలి ఓవ‌ర్లోనే సిరాజ్ పంజా..గాలే డే త్రీలో వ‌రుణుడి ముప్పు త‌ప్ప‌దా..!
టీమిండియా 462కి ఆలౌట్.. తొలి ఓవ‌ర్లోనే సిరాజ్ పంజా..గాలే డే త్రీలో వ‌రుణుడి ముప్పు త‌ప్ప‌దా..!
Embed widget