Petrol-Diesel Price, 7 November: ఇవాళ కొన్ని ప్రాంతాల్లోనే పెరిగిన పెట్రోల్, డీజిల్ ధరలు - మీ ప్రాంతంలో నేటి రేట్లు ఇవీ
Hyderabad Petrol Price హైదరాబాద్‌లో పెట్రోల్ డీజిల్ ధరలు గత నాలుగు నెలలకు పైగా నిలకడగా ఉంటున్నాయి. నేడు పెట్రోల్ ధర రూ.109.66గా ఉంది. ఇక డీజిల్ ధర రూ.97.82 గా ఉంది.
![Petrol-Diesel Price, 7 November: ఇవాళ కొన్ని ప్రాంతాల్లోనే పెరిగిన పెట్రోల్, డీజిల్ ధరలు - మీ ప్రాంతంలో నేటి రేట్లు ఇవీ Petrol Diesel Price Today 7 November 2022 know rates fuel price in your city Telangana Andhra Pradesh Amaravati Hyderabad Petrol-Diesel Price, 7 November: ఇవాళ కొన్ని ప్రాంతాల్లోనే పెరిగిన పెట్రోల్, డీజిల్ ధరలు - మీ ప్రాంతంలో నేటి రేట్లు ఇవీ](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2022/11/07/3ca1d34727a14f63d57789767550818b1667786219793234_original.jpg?impolicy=abp_cdn&imwidth=1200&height=675)
బ్యారెల్ బ్రెంట్ క్రూడ్ ధర 1.31 డాలర్లు తగ్గి ప్రస్తుతం 91.29 డాలర్ల వద్ద ఉంది. బ్యారెల్ WTI క్రూడ్ ఆయిల్ ధర 0.32 డాలర్లు పెరిగి 86.14 డాలర్ల వద్దకు చేరింది. ఈ పరిస్థితుల్లో మన తెలుగు రాష్ట్రాల్లోని వివిధ నగరాల్లో పెట్రోలు, డీజిల్ రేట్లు ఇలా ఉన్నాయి.
తెలంగాణలో (Telangana Petrol Price) ధరలు ఇలా..
Hyderabad Petrol Price హైదరాబాద్‌లో పెట్రోల్ డీజిల్ ధరలు గత నాలుగు నెలలకు పైగా నిలకడగా ఉంటున్నాయి. నేడు పెట్రోల్ ధర రూ.109.66గా ఉంది. ఇక డీజిల్ ధర రూ.97.82 గా ఉంది. ఇక వరంగల్‌లో (Warangal Petrol Price) ధరలు నేడు కాస్త పెరిగాయి. నేడు (అక్టోబరు 6) రూ.0.18 పైసలు పెరిగి పెట్రోల్ ధర నేడు రూ.109.28 గా ఉంది. డీజిల్ ధర రూ.0.17 పైసలు పెరిగి రూ.97.46గా ఉంది. వరంగల్ రూరల్ జిల్లాలో సైతం ఇవే ఇంధన ధరలు కొనసాగుతున్నాయి.
నిజామాబాద్‌లో (Fuel Price in Nizamabad) పెట్రోల్ ధర నేడు రూ.0.03 పైసలు తగ్గి రూ.111.33 గా ఉంది. డీజిల్ ధర (Fuel Price in Telangana) రూ.0.03 పైసలు తగ్గి నేడు రూ.99.37 గా ఉంది. గత కొన్ని రోజులుగా నిజామాబాద్‌లో ఇతర ప్రాంతాలతో పోలిస్తే ఇంధన ధరల్లో మార్పులు బాగా ఉంటున్నాయి.
ఆంధ్రప్రదేశ్‌లో (Andhra Pradesh Petrol Prices) ఇంధన ధరలు ఇలా..
విజయవాడ (Fuel Price in Vijayawada) మార్కెట్‌లో ఇంధన ధరలు నేడు తగ్గాయి. పెట్రోల్ ధర నేడు రూ.0.16 పైసలు పెరిగి రూ.111.92 గా ఉంది. డీజిల్ ధర రూ.0.14 పైసలు పెరిగి రూ.99.65 గా ఉంది.
ఇక విశాఖపట్నం (Petrol Price in Vizag) మార్కెట్‌లో పెట్రోల్ ధర నేడు స్థిరంగా ఉంది. ఇవాళ పెట్రోల్ ధర రూ.111.48 గా ఉంది. డీజిల్ ధర నేడు రూ.98.27 గా ఉంది. అయితే, ఇక్కడ కొద్ది రోజుల ఇంధన ధరలు గమనిస్తే స్వల్పంగా హెచ్చుతగ్గులు ఉంటున్నాయి.
తిరుపతిలో నేటి ధరలు ఇవీ (Petrol Price in Tirupati)
తిరుపతిలో (Tirupati Petrol Price) పెట్రోల్ ధర నేడు రూ.0.36 పైసలు తగ్గి రూ.111.16 గా ఉంది. కొద్ది రోజులుగా ఇక్కడ పెట్రోలు ధరల్లో ఎక్కువగా మార్పులు కనిపిస్తున్నాయి. ఇక డీజిల్ ధర రూ.0.34 పైసలు తగ్గి రూ.98.90 గా ఉంది.
ధరల పెరుగుదలకు కారణం ఏంటంటే..
గత సంవత్సర కాలంగా మన దేశంలో పెట్రోల్, డీజిల్ ధరలు ఎప్పుడూ లేనంతగా పెరిగిపోతున్నాయి. ఈ ప్రభావం సామాన్యులపై బాగా పడుతోంది. వారి జేబులకు చిల్లు పడుతోంది. గతేడాది ఏప్రిల్‌లో ముడి చమురు ధరలు జీవితకాల కనిష్ఠానికి చేరినా మన దేశంలో మాత్రం తగ్గలేదు. పైగా పెరుగుతూ వస్తున్నాయి. ఆ సమయంలో కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు స్థానిక పన్నులను పెంచి ఇంధన ధరలు తగ్గకుండా చేశాయి. అప్పుడు బ్యారెల్ ముడి చమురు ధర 32.30 డాలర్ల వద్దే ఉండేది. ప్రస్తుతం 100 డాలర్లకు అటు ఇటుగా ఉండగా.. నవంబరు 7 ధరల ప్రకారం ముడి చమురు బ్యారెల్ ధర 91.35 డాలర్ల స్థాయిని చేరింది.
టాప్ హెడ్ లైన్స్
ట్రెండింగ్ వార్తలు
![ABP Premium](https://cdn.abplive.com/imagebank/metaverse-mid.png)
![Nagesh GV](https://cdn.abplive.com/imagebank/editor.png)