By: ABP Desam | Updated at : 07 Mar 2022 07:22 AM (IST)
ప్రతీకాత్మక చిత్రం
గత నాలుగు నెలల క్రితం వరకూ ఇంధన ధరలు మన దేశంలో క్రమంగా ఎగబాకుతూ వచ్చి జీవితకాల గరిష్ఠాన్ని చేరాయి. కానీ, కొద్ది నెలల క్రితం కేంద్రం ఎక్సైజ్ సుంకం తగ్గింపుతో పెట్రోల్, డీజిల్ ధరలు కాస్త తగ్గాయి. ఈ తగ్గిన ధరలతో వాహనదారులు కొద్దిగా ఊరట చెందుతున్నారు. అయితే, మళ్లీ ముడి చమురు ధరలు ప్రస్తుతం 110 డాలర్ల మార్కును దాటాయి. తాజాగా ఉక్రెయిన్ - రష్యా యుద్ధ ప్రభావంతో క్రూడాయిల్ ధరలు మరింత ఎగబాకే సూచనలు కనిపిస్తున్నాయి. దీంతో దేశంలో మళ్లీ ధరలు పెరుగుతాయోననే ఆందోళన నెలకొంది. తెలుగు రాష్ట్రాల్లో పెట్రోల్, డీజిల్ ధరలు నేడు ఇలా ఉన్నాయి.
తెలంగాణలో (Telangana Petrol Price) ధరలు ఇలా..
హైదరాబాద్‌లో (Hyderabad Petrol Price) పెట్రోల్ డీజిల్ ధరలు గత నెల రోజులకు పైగా నిలకడగానే ఉంటున్నాయి. నేడు కూడా పెట్రోల్ ధర లీటరుకు రూ.108.20గా.. డీజిల్ ధర లీటరుకు రూ.94.62 గా నిలకడగానే కొనసాగుతోంది. ఇక వరంగల్‌లోనూ (Warangal Petrol Price) నేడు ధరలు స్థిరంగా ఉన్నాయి. నేడు (మార్చి 7) పెట్రోల్ ధర నేడు నిలకడగా రూ.107.69 గా ఉంది. డీజిల్ ధర కూడా నేడు స్థిరంగా రూ.94.14 గా ఉంది. వరంగల్ రూరల్ జిల్లాలో సైతం ఇవే ఇంధన ధరలు కొనసాగుతున్నాయి.
నిజామాబాద్‌లో (Fuel Price in Nizamabad) ఇంధన ధరలు నేడు కాస్త పెరిగాయి. పెట్రోల్ ధర లీటరుకు నేడు రూ.0.53 పైసలు పెరిగి రూ.110.27 గా ఉంది. డీజిల్ ధర (Fuel Price in Telangana) రూ.0.49 పైసలు పెరిగి రూ.96.54 గా ఉంది. గత కొన్ని రోజులుగా నిజామాబాద్‌లో ఇతర ప్రాంతాలతో పోలిస్తే ఇంధన ధరల్లో హెచ్చుతగ్గులు ఎక్కువగా కనిపిస్తున్నాయి.
ఆంధ్రప్రదేశ్‌లో (Andhra Pradesh Petrol Prices) ఇంధన ధరలు ఇలా..
విజయవాడ (Fuel Price in Vijayawada) మార్కెట్‌లో పెట్రోల్ ధర రూ.0.51 పైసలు తగ్గి నేడు రూ.110.20గా ఉంది. డీజిల్ ధర రూ.0.49 పైసలు తగ్గి రూ.96.28 గా ఉంది.
ఇక విశాఖపట్నం (Petrol Price in Vizag) మార్కెట్‌లో పెట్రోల్ ధర నేడు తగ్గింది. లీటరు ధర నేడు రూ.0.31 పైసలు తగ్గి రూ.109.05 గా ఉంది. డీజిల్ ధర (Diesel Price in Visakhapatnam) కూడా రూ.0.29 పైసలు తగ్గి రూ.95.18గా ఉంది. అయితే, ఇక్కడ కొద్ది రోజుల ఇంధన ధరలు గమనిస్తే స్వల్పంగా హెచ్చుతగ్గులు ఉంటున్నాయి. తాజాగా తగ్గాయి.
తిరుపతిలో తగ్గిన ధరలు (Petrol Price in Tirupati)
తిరుపతిలో (Tirupati Petrol Price) ఇంధన ధరలు నేడు పెరిగాయి. ప్రస్తుతం లీటరు పెట్రోల్ ధర రూ.111.18 వద్ద ఉంది. నేడు లీటరుకు రూ.0.60 పైసలు పెరిగింది. కొద్ది రోజులుగా ఇక్కడ పెట్రోలు ధరల్లో ఎక్కువగా మార్పులు కనిపిస్తున్నాయి. ఇక డీజిల్ ధర (Diesel Price in Tirupati) రూ.0.56 పైసలు పెరిగి రూ.97.16 కి చేరింది.
ధరల పెరుగుదలకు కారణం ఏంటంటే..
గత సంవత్సర కాలంగా మన దేశంలో పెట్రోల్, డీజిల్ ధరలు ఎప్పుడూ లేనంతగా పెరిగిపోతున్నాయి. ఈ ప్రభావం సామాన్యులపై బాగా పడుతోంది. వారి జేబులకు చిల్లు పడుతోంది. గతేడాది ఏప్రిల్‌లో ముడి చమురు ధరలు జీవితకాల కనిష్ఠానికి చేరినా మన దేశంలో మాత్రం తగ్గలేదు. పైగా పెరుగుతూ వస్తున్నాయి. ఆ సమయంలో కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు స్థానిక పన్నులను పెంచి ఇంధన ధరలు తగ్గకుండా చేశాయి. ఆ సమయంలో బ్యారెల్ ముడి చమురు ధర 32.30 డాలర్ల వద్దే ఉండేది. ఆ తర్వాత 70 నుంచి 80 డాలర్ల మధ్య హెచ్చుతగ్గులు ఉండేది. ఇప్పుడు రష్యా-ఉక్రెయిన్ యుద్ధ ప్రభావంతో మార్చి 3 నాటి ధరల ప్రకారం ముడి చమురు బ్యారెల్ ధర 124.36 డాలర్ల గరిష్ఠ స్థాయిని చేరింది. దీంతో మన దేశంలో పెట్రోల్ రూ.140 దాటుతుందనే విశ్లేషణలు వస్తుండడంతో సర్వత్రా ఆందోళన నెలకొని ఉంది.
Stock Market News: శుక్రవారం డబ్బుల వర్షం! రూ.5.5 లక్షల కోట్లు ఆర్జించిన ఇన్వెస్టర్లు, సెన్సెక్స్ 1163+
Petrol Diesel Price 20th May 2022 : తెలుగు రాష్ట్రాలో నిలకడగా పెట్రోల్, డీజిల్ ధరలు, ఇవాళ్టి ఇంధన ధరలు ఇలా
Gold Silver Price Today 20th May 2022 : మళ్లీ పెరిగిన బంగారం ధరలు, కాస్త తగ్గిన వెండి ధరలు, ప్రధాన నగరాల్లో ఇవాళ్టి రేట్స్ ఇలా
Elon Musk Political Views: ట్రంప్ అంటే మస్క్ మామకి ఎందుకింత లవ్?
Employees Layoffs: ఉద్యోగులకు షాకిచ్చిన మరో స్టార్టప్! 600 మందిని తీసేసిన కార్స్ 24
Ram Charan-NTR: నీతో నా బంధాన్ని మాటల్లో చెప్పలేను - రామ్ చరణ్ ఎమోషనల్ పోస్ట్
Nara Lokesh : ఎమ్మెల్సీ కారులో మృతదేహం ఘటనపై లోకేశ్ ఫైర్, హత్యను యాక్సిడెంట్ గా చిత్రీకరిస్తున్నారని ఆరోపణ!
CBI Raids: లాలూ యాదవ్కు మరో షాక్- కొత్త అభియోగాలు మోపిన సీబీఐ
Covid-19 Cases India: దేశంలో కొత్తగా 2259 కరోనా కేసులు- 20 మంది మృతి