By: ABP Desam | Updated at : 03 Sep 2021 07:16 AM (IST)
పెట్రోల్ డీజిల్ ధరలు (ప్రతీకాత్మక చిత్రం)
దేశంలో ముంబయి, చెన్నై, ఢిల్లీ సహా అన్ని ప్రధాన మెట్రో నగరాల్లో పెట్రోల్ ధరలు గత నెల రోజులుగా స్థిరంగానే ఉంటున్నాయి. డీజిల్ ధరల విషయంలో కూడా స్థిరత్వమే కొనసాగుతోంది. కానీ, హైదరాబాద్‌లో మాత్రం తాజాగా ధరల్లో స్వల్ప తగ్గుదల కనిపించింది. వరంగల్ నగరాల్లో కూడా పెట్రోల్ ధరలు నిలకడగానే ఉంటున్నాయి.
తెలంగాణలో సెప్టెంబరు 3న పెట్రోల్, డీజిల్ ధరలు ఇలా..
హైదరాబాద్‌లో పెట్రోల్ ధర రూ.105.40 కాగా.. డీజిల్ ధర రూ.96.84 గా ఉంది. డీజిల్ ధర ముందు రోజుతో పోలిస్తే లీటరుకు రూ.0.15 పైసలు తగ్గింది. పెట్రోల్ ధర రూ.0.14 పైసలు తగ్గింది. కరీంనగర్‌లో పెట్రోల్ ధర ముందు రోజు ధరతో పోలిస్తే రూ.0.19 పైసలు తగ్గి రూ.105.58గా ఉంది. డీజిల్ ధర రూ.0.18 పైసలు తగ్గి రూ.97.00గా ఉంది.
ఇక వరంగల్‌లో కొద్ది రోజులుగా ఇంధన ధరలు నిలకడగా ఉండగా తాజాగా కాస్త తగ్గాయి. పెట్రోల్ ధర రూ.0.19 పైసలు తగ్గి.. రూ.105.58గా ఉంది. డీజిల్ ధర మాత్రం రూ.0.15 పైసలు తగ్గి రూ.96.38 గా ఉంది. వరంగల్ రూరల్ జిల్లాలో సైతం ఇవే ఇంధన ధరలు కొనసాగుతున్నాయి.
నిజామాబాద్‌లో పెట్రోల్ ధరలో ఏ మార్పూ కనిపించలేదు. పెట్రోల్ ధర రూ.106.99 గానే కొనసాగుతోంది. డీజిల్ ధర గత ధరతో పోల్చితే రూ.0.01 పైసలు తగ్గి రూ.98.32 గా ఉంది. గత కొన్ని రోజులుగా ఇక్కడ ఇంధన ధరల్లో ఎక్కువగానే హెచ్చుతగ్గులు ఉంటున్నాయి.
ఆంధ్రప్రదేశ్‌లో ఇంధన ధరలు ఇలా..
ఇక విజయవాడ మార్కెట్‌లో పెట్రోల్ ధర రూ.0.18 పైసలు పెరిగి.. ప్రస్తుతం రూ.107.87 గా ఉంది. డీజిల్ ధర కూడా రూ.0.18 పైసలు పెరిగి రూ.98.79కు చేరింది. అయితే, అమరావతి ప్రాంతంలో గత పది రోజుల ఇంధన ధరలు గమనిస్తే స్వల్పంగా హెచ్చు తగ్గులు నమోదవుతున్నాయి.
విశాఖపట్నం ఇంధన మార్కెట్‌లో పెట్రోల్ ధర ప్రస్తుతం రూ.107.01గా ఉంది. ముందు రోజుతో పోలిస్తే ఏకంగా రూ.0.13 పైసలు తగ్గింది. డీజిల్ ధర కూడా విశాఖపట్నంలో రూ.0.12 పైసలు తగ్గి రూ.97.94గా ఉంది. విశాఖలో కూడా కొద్ది రోజులుగా పెట్రోల్, డీజిల్ ధరల్లో సరాసరిన రూ.0.50 పైసలకు పైబడి హెచ్చు తగ్గులు ఉంటున్నాయి.
తిరుపతిలో స్వల్పంగా తగ్గుదల
తిరుపతిలో ఇంధన ధరల్లో బాగానే పెరుగుదల కనిపించింది. లీటరు పెట్రోలు ధర ప్రస్తుతం రూ.0.58 పైసలు పెరిగి రూ.108.48 కు చేరింది. కొద్ది రోజులుగా ఇక్కడ పెట్రోలు ధరల్లో పెరుగుదల కనిపిస్తోంది. ఇక డీజిల్ ధర కూడా రూ.0.55 పైసలు పెరిగి రూ.99.31గా ఉంది.
ధరల పెరుగుదలకు కారణం ఏంటంటే..
గత సంవత్సర కాలంగా మన దేశంలో పెట్రోల్, డీజిల్ ధరలు ఎప్పుడూ లేనంతగా పెరిగిపోతున్నాయి. ఈ ప్రభావం సామాన్యులపై బాగా పడుతోంది. వారి జేబులకు చిల్లు పడుతోంది. గతేడాది ఏప్రిల్‌లో ముడి చమురు ధరలు జీవితకాల కనిష్ఠానికి చేరినా మన దేశంలో మాత్రం తగ్గలేదు. పైగా పెరుగుతూ వస్తున్నాయి. ఆ సమయంలో కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు స్థానిక పన్నులను పెంచి ఇంధన ధరలు తగ్గకుండా చేశాయి. ఆ సమయంలో బ్యారెల్ ముడి చమురు ధర 32.33 డాలర్ల వద్దే ఉండేది. ఆ తర్వాత క్రమంగా ముడి చమురు ధర పెరుగుతూ, స్వల్పంగా తగ్గుతూ తాజాగా సెప్టెంబరు 2 నాటి ధరల ప్రకారం 68.41 డాలర్ల వద్ద ఉంది. వీటి ధరలు పెరుగుతున్నా కేంద్ర, రాష్ట్రా ప్రభుత్వాలు మాత్రం ఆ పెంచిన పన్నులను తగ్గించలేదు. అందుకే ఇంధన ధరలు మన దేశంలో జీవితాల గరిష్ఠానికి చేరుతూ సామాన్యులను ఆర్థికంగా ఇబ్బందులకు గురి చేస్తున్నాయి.
Petrol - Diesel Rates Today: తెలుగు రాష్ట్రాల్లో మారిన పెట్రోల్, డీజిల్ ధరలు - ఈ రోజు రేట్లు ఇవి
Gold-Silver Prices Today: జాబ్స్ దెబ్బకు భారీగా తగ్గిన గోల్డ్ రేటు - ఈ రోజు బంగారం, వెండి ధరలు ఇవి
Upcoming Cars on January 2024: 2024 జనవరిలోనే లాంచ్ కానున్న టాప్ కార్లు ఇవే - కొనాలంటే కాస్త వెయిట్ చేయండి!
Top Mutual Funds: ఇలాంటి ఫండ్స్ చేతిలో ఉంటే చాలు, టాప్ క్లాస్ రిటర్న్స్‌తో మీ కోసం డబ్బు సంపాదిస్తాయి
Forex Reserves: పెరుగుతున్న ఆర్థిక బలం, 600 బిలియన్ మార్క్ దాటిన ఫారెక్స్ నిల్వలు
Navy Day: విశాఖలో ఆకట్టుకున్న నేవీ డే విన్యాసాలు - ముఖ్య అతిథిగా గవర్నర్ అబ్దుల్ నజీర్
Nizamabad Conductor Charged women: ఆర్టీసీలో మహిళల నుంచి ఛార్జీ వసూలు, కండక్టర్ పై విచారణకు సజ్జనార్ ఆదేశాలు
General elections in February : ఫిబ్రవరిలోనే సాధారణ ఎన్నికలు ? కేంద్ర ఎన్నికల సంఘం ఏర్పాట్లు చేస్తోందా ?
Guntur: అంబేడ్కర్ విగ్రహం ముందు బట్టలిప్పి అసభ్య ప్రవర్తన! పొన్నూరులో రేగిన దుమారం
/body>