అన్వేషించండి

Petrol-Diesel Price, 25 February: ఇంధన ధరల్లో కొనసాగుతున్న హెచ్చుతగ్గులు, రష్యా-ఉక్రెయిన్ ప్రభావంతో ధరలపై ఆందోళన

Todays Petrol Diesel Price: ముడి చమురు ధరలు ప్రస్తుతం 95 డాలర్ల మార్కును దాటాయి. తాజాగా ఉక్రెయిన్ - రష్యా యుద్ధ ప్రభావంతో క్రూడాయిల్ ధరలు మరింత ఎగబాకే సూచనలు కనిపిస్తున్నాయి.

Petrol Diesel Price Today: గత నాలుగు నెలల క్రితం వరకూ ఇంధన ధరలు మన దేశంలో క్రమంగా ఎగబాకుతూ వచ్చి జీవితకాల గరిష్ఠాన్ని చేరాయి. కానీ, కొద్ది నెలల క్రితం కేంద్రం ఎక్సైజ్ సుంకం తగ్గింపుతో పెట్రోల్, డీజిల్ ధరలు కాస్త తగ్గాయి. ఈ తగ్గిన ధరలతో వాహనదారులు కొద్దిగా ఊరట చెందుతున్నారు. అయితే, మళ్లీ ముడి చమురు ధరలు ప్రస్తుతం 95 డాలర్ల మార్కును దాటాయి. తాజాగా ఉక్రెయిన్ - రష్యా యుద్ధ ప్రభావంతో క్రూడాయిల్ ధరలు మరింత ఎగబాకే సూచనలు కనిపిస్తున్నాయి. దీంతో దేశంలో మళ్లీ ధరలు పెరుగుతాయోననే ఆందోళన నెలకొంది. తెలుగు రాష్ట్రాల్లో పెట్రోల్, డీజిల్ ధరలు నేడు ఇలా ఉన్నాయి.

తెలంగాణలో..
హైదరాబాద్‌లో పెట్రోల్ డీజిల్ ధరలు గత నెల రోజులకు పైగా నిలకడగానే ఉంటున్నాయి. నేడు కూడా పెట్రోల్ ధర లీటరుకు రూ.108.20గా.. డీజిల్ ధర లీటరుకు రూ.94.62 గా నిలకడగానే కొనసాగుతోంది. ఇక వరంగల్‌లోనూ గత వారం రోజుల తర్వాత నేడు ధరలు పెరిగాయి. నేడు (ఫిబ్రవరి 25) పెట్రోల్ ధర రూ.0.19 పైసలు పెరిగి రూ.107.88 గా ఉంది. డీజిల్ ధర రూ.0.17 పైసలు పెరిగి రూ.94.31 గా ఉంది. వరంగల్ రూరల్ జిల్లాలో సైతం ఇవే ఇంధన ధరలు కొనసాగుతున్నాయి.

నిజామాబాద్‌లో ఇంధన ధరలు నేడు కాస్త తగ్గాయి. పెట్రోల్ ధర లీటరుకు నేడు రూ.0.37 పైసలు పెరిగి రూ.110.09 గా ఉంది. డీజిల్ ధర రూ.0.34 పైసలు తగ్గి రూ.96.38 గా ఉంది. గత కొన్ని రోజులుగా నిజామాబాద్‌లో ఇతర ప్రాంతాలతో పోలిస్తే ఇంధన ధరల్లో హెచ్చుతగ్గులు ఎక్కువగా కనిపిస్తుండగా తాజాగా తగ్గాయి.

ఆంధ్రప్రదేశ్‌లో ఇంధన ధరలు ఇలా..
విజయవాడ మార్కెట్‌లో పెట్రోల్ ధర ప్రస్తుతం రూ.0.36 పైసలు పెరిగి రూ.110.65గా ఉంది. డీజిల్ ధర బెజవాడలో రూ.0.33 పైసలు పెరిగి రూ.96.69 గా ఉంది.

ఇక విశాఖపట్నం మార్కెట్‌లో పెట్రోల్ ధర నేడు తగ్గింది. లీటరు ధర నేడు రూ.0.27 పైసలు తగ్గి రూ.109.05 గా ఉంది. డీజిల్ ధర కూడా రూ.0.25 పైసలు తగ్గి రూ.95.18గా ఉంది. అయితే, ఇక్కడి కొద్ది రోజుల ఇంధన ధరలు గమనిస్తే స్వల్పంగా హెచ్చుతగ్గులు ఉంటున్నాయి. తాజాగా తగ్గాయి.

తిరుపతిలో తగ్గిన ధరలు.. 
తిరుపతిలో ఇంధన ధరలు నేడు తగ్గాయి. ప్రస్తుతం లీటరు పెట్రోల్ ధర రూ.110.58 వద్ద ఉంది. నేడు లీటరుకు రూ.0.60 తగ్గింది. కొద్ది రోజులుగా ఇక్కడ పెట్రోలు ధరల్లో ఎక్కువగా మార్పులు కనిపిస్తున్నాయి. ఇక డీజిల్ ధర రూ.0.56 పైసలు తగ్గి రూ.96.60 కి చేరింది.

ధరల పెరుగుదలకు కారణం ఏంటంటే..
గత సంవత్సర కాలంగా మన దేశంలో పెట్రోల్, డీజిల్ ధరలు ఎప్పుడూ లేనంతగా పెరిగిపోతున్నాయి. ఈ ప్రభావం సామాన్యులపై బాగా పడుతోంది. వారి జేబులకు చిల్లు పడుతోంది. గతేడాది ఏప్రిల్‌లో ముడి చమురు ధరలు జీవితకాల కనిష్ఠానికి చేరినా మన దేశంలో మాత్రం తగ్గలేదు. పైగా పెరుగుతూ వస్తున్నాయి. ఆ సమయంలో కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు స్థానిక పన్నులను పెంచి ఇంధన ధరలు తగ్గకుండా చేశాయి. ఆ సమయంలో బ్యారెల్ ముడి చమురు ధర 32.30 డాలర్ల వద్దే ఉండేది. ఆ తర్వాత క్రమంగా ముడి చమురు ధర పెరుగుతూ, స్వల్పంగా తగ్గుతూ తాజాగా ఫిబ్రవరి 25 నాటి ధరల ప్రకారం 95.42 డాలర్ల వద్ద ఉంది. వీటి ధరలు పెరుగుతున్నా కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు మాత్రం ఆ పెంచిన పన్నులను తగ్గించలేదు. అందుకే ఇంధన ధరలు మన దేశంలో జీవితాల గరిష్ఠానికి చేరుతూ సామాన్యులను ఆర్థికంగా ఇబ్బందులకు గురి చేస్తున్నాయి. తాజాగా సుంకాన్ని స్వల్పంగా తగ్గించడం ద్వారా రూ.5 నుంచి రూ.10 మేర ఇంధన ధరలు తగ్గాయి.

మరిన్ని చూడండి
Advertisement

టాప్ హెడ్ లైన్స్

IPL 2024: మెరిసిన విరాట్‌ కోహ్లీ, కోల్‌కత్తా లక్ష్యం ఎంతంటే ?
మెరిసిన విరాట్‌ కోహ్లీ, కోల్‌కత్తా లక్ష్యం ఎంతంటే ?
Telangana News: తెలంగాణ ప్రజలకు అలర్ట్ - భానుడి ఉగ్రరూపం, ఈ జిల్లాలో వడగాల్పులు
తెలంగాణ ప్రజలకు అలర్ట్ - భానుడి ఉగ్రరూపం, ఈ జిల్లాలో వడగాల్పులు
Paruchuri Gopala Krishna: ‘హనుమాన్’లో రొమాన్స్ పెంచి ఉంటే బాగుండు, శివుడిని ఎందుకు చూపించారో అర్థం కాలేదు: పరుచూరి రివ్యూ
‘హనుమాన్’లో రొమాన్స్ పెంచి ఉంటే బాగుండు, శివుడిని ఎందుకు చూపించారో అర్థం కాలేదు: పరుచూరి రివ్యూ
Chandrababu: 'రూ.10 ఇచ్చి రూ.100 లాగేస్తున్నారు' - 40 ఏళ్ల రాజకీయ జీవితంలో ఇలాంటి సీఎంను చూడలేదని చంద్రబాబు తీవ్ర విమర్శలు
'రూ.10 ఇచ్చి రూ.100 లాగేస్తున్నారు' - 40 ఏళ్ల రాజకీయ జీవితంలో ఇలాంటి సీఎంను చూడలేదని చంద్రబాబు తీవ్ర విమర్శలు
Advertisement
Advertisement
Advertisement
for smartphones
and tablets

వీడియోలు

Dil Raju Trolls Tamil Trollers | Family Star తమిళ్ ప్రమోషన్స్ లో దిల్ రాజు ఫన్ | ABP DesamCM Revanth Reddy on Phone Tapping | ఫోన్ ట్యాపింగు కేసులో KTR పై CM Revanth Reddy సంచలన వ్యాఖ్యలుKadiyam Srihari Joins Congress | కాంగ్రెస్ నేతలతో కడియం భేటీ..మరి పాతమాటల సంగతేంటీ.? | ABP DesamPrabhakar Chowdary Followers Angry | ప్రభాకర్ చౌదరికి టీడీపీ దక్కకపోవటంపై టీడీపీ నేతల ఫైర్ | ABP

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
IPL 2024: మెరిసిన విరాట్‌ కోహ్లీ, కోల్‌కత్తా లక్ష్యం ఎంతంటే ?
మెరిసిన విరాట్‌ కోహ్లీ, కోల్‌కత్తా లక్ష్యం ఎంతంటే ?
Telangana News: తెలంగాణ ప్రజలకు అలర్ట్ - భానుడి ఉగ్రరూపం, ఈ జిల్లాలో వడగాల్పులు
తెలంగాణ ప్రజలకు అలర్ట్ - భానుడి ఉగ్రరూపం, ఈ జిల్లాలో వడగాల్పులు
Paruchuri Gopala Krishna: ‘హనుమాన్’లో రొమాన్స్ పెంచి ఉంటే బాగుండు, శివుడిని ఎందుకు చూపించారో అర్థం కాలేదు: పరుచూరి రివ్యూ
‘హనుమాన్’లో రొమాన్స్ పెంచి ఉంటే బాగుండు, శివుడిని ఎందుకు చూపించారో అర్థం కాలేదు: పరుచూరి రివ్యూ
Chandrababu: 'రూ.10 ఇచ్చి రూ.100 లాగేస్తున్నారు' - 40 ఏళ్ల రాజకీయ జీవితంలో ఇలాంటి సీఎంను చూడలేదని చంద్రబాబు తీవ్ర విమర్శలు
'రూ.10 ఇచ్చి రూ.100 లాగేస్తున్నారు' - 40 ఏళ్ల రాజకీయ జీవితంలో ఇలాంటి సీఎంను చూడలేదని చంద్రబాబు తీవ్ర విమర్శలు
Andhra Pradesh: దటీజ్ సీఎం జగన్, రెండేళ్ల ముందే రాజ్యసభ అభ్యర్థిని ప్రకటించిన వైసీపీ అధినేత
దటీజ్ సీఎం జగన్, రెండేళ్ల ముందే రాజ్యసభ అభ్యర్థిని ప్రకటించిన వైసీపీ అధినేత
Revanth Reddy vs KTR: కేటీఆర్‌ చర్లపల్లి జైలులో చిప్పకూడు తింటాడు! - ఫోన్ ట్యాపింగ్ పై సీఎం రేవంత్ రెడ్డి
కేటీఆర్‌కు సిగ్గుండాలి! చర్లపల్లి జైలులో చిప్పకూడు తింటాడు - ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంపై సీఎం రేవంత్ రెడ్డి
Tirumala News: శ్రీవారి భక్తులకు అలర్ట్ - తిరుమల నడకదారిలో చిరుత కలకలం
శ్రీవారి భక్తులకు అలర్ట్ - తిరుమల నడకదారిలో చిరుత కలకలం
Manchu Manoj Comments: ఎట్టకేలకు మెగా ఫ్యామిలీతో గోడవలపై నోరు విప్పిన మంచు మనోజ్‌ - ఏమన్నాడంటే..!‌ 
ఎట్టకేలకు మెగా ఫ్యామిలీతో గోడవలపై నోరు విప్పిన మంచు మనోజ్‌ - ఏమన్నాడంటే..!‌ 
Embed widget