![ABP Premium](https://cdn.abplive.com/imagebank/Premium-ad-Icon.png)
Petrol-Diesel Price, 25 August: పెరిగిన పెట్రోల్, డీజిల్ ధరలు.. వివిధ నగరాల్లో తాజా ధరలివీ..
హైదరాబాద్‌లో మాత్రం కొద్ది రోజులుగా స్వల్ప మార్పులు చోటు చేసుకుంటున్నాయి. హైదరాబాద్‌లో రూ.0.15 పైసలు తగ్గగా.. డీజిల్ ధర రూ.0.16 పైసలు దిగువకు చేరింది.
![Petrol-Diesel Price, 25 August: పెరిగిన పెట్రోల్, డీజిల్ ధరలు.. వివిధ నగరాల్లో తాజా ధరలివీ.. Petrol Diesel Price Today 25 August 2021 know rates fuel price in your city Telangana Andhra Pradesh Amaravati Hyderabad Petrol-Diesel Price, 25 August: పెరిగిన పెట్రోల్, డీజిల్ ధరలు.. వివిధ నగరాల్లో తాజా ధరలివీ..](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2021/08/24/276d6331f4e75cc627fa1f216ff62af7_original.png?impolicy=abp_cdn&imwidth=1200&height=675)
దేశంలో కొద్ది రోజులుగా మెట్రో నగరాల్లో పెట్రోల్, డీజిల్ ధరలు స్థిరంగా ఉంటుండగా.. హైదరాబాద్‌లో మాత్రం కొద్ది రోజులుగా స్వల్ప మార్పులు చోటు చేసుకుంటున్నాయి. హైదరాబాద్‌లో రూ.0.15 పైసలు తగ్గగా.. డీజిల్ ధర రూ.0.16 పైసలు దిగువకు చేరింది.
తెలంగాణలో ఆగస్టు 25న పెట్రోల్, డీజిల్ ధరలు ఇలా..
హైదరాబాద్‌లో పెట్రోల్ ధర రూ.105.54 కు తగ్గగా.. డీజిల్ ధర కూడా రూ.96.99 గా ఉంది. కరీంనగర్‌లో పెట్రోల్ ధర ముందు రోజు ధరతో పోలిస్తే ఏకంగా రూ.0.14 పైసలు తగ్గింది. తాజాగా పెట్రోల్ ధర కరీంనగర్‌లో రూ.105.72గా ఉంది. ఇక డీజిల్ ధర రూ.0.15 పైసలు పెరిగి రూ.97.15 గా అయింది.
ఇక వరంగల్‌లో తాజాగా పెట్రోల్ ధర రూ.105.06 కాగా.. డీజిల్ ధర రూ.96.53 గా ఉంది. పెట్రోల్ రూ.0.14 పైసలు పెరగ్గా.. డీజిల్ రూ.0.16 పైసల చొప్పున పెరిగింది. కొద్దిరోజులుగా వరంగల్‌లో నిలకడగా ఉంటున్న ధరలు తాజాగా స్వల్పంగా తగ్గాయి. ఉమ్మడి వరంగల్ జిల్లా వ్యాప్తంగా కూడా ఇవే ఇంధన ధరలు ఉంటున్నాయి.
నిజామాబాద్‌లో పెట్రోల్ ధరలో లీటరుకు సుమారు రూ.0.35 పైసల చొప్పున పెరిగింది. డీజిల్ ధర గత ధరతో పోల్చితే రూ.0.30 పైసలు పెరిగింది. దీంతో తాజాగా పెట్రోల్ రూ.107.66 గా ఉంది. డీజిల్ ధర రూ.98.96గా ఉంది. గత కొన్ని రోజులుగా ఇక్కడ ఇంధన ధరల్లో స్వల్ప హెచ్చుతగ్గులు ఉంటున్నాయి.
ఆంధ్రప్రదేశ్‌లో ఇంధన ధరలు ఇలా..
ఇక విజయవాడ మార్కెట్‌లో ఇంధన ధరల్లో అతి స్వల్ప మార్పులు చోటు చేసుకున్నాయి. పెట్రోల్ ధర రూ.0.03 చొప్పున స్వల్పంగా తగ్గగా.. ప్రస్తుతం పెట్రోల్ రేటు లీటరుకు రూ.107.88 గా ఉంది. డీజిల్ ధర కూడా రూ.0.05 పైసలు తగ్గి రూ.98.82కు చేరింది.
విశాఖపట్నం ఇంధన మార్కెట్‌లో పెట్రోల్ ధర ప్రస్తుతం రూ.107.15గా ఉంది. ముందు రోజుతో పోలిస్తే రూ.0.28 పైసలు పెరిగింది. డీజిల్ ధర కూడా విశాఖపట్నంలో రూ.0.23 పైసలు పెరిగి రూ.98.09గా ఉంది. విశాఖలో కూడా కొద్ది రోజులుగా పెట్రోల్, డీజిల్ ధరల్లో సరాసరిన రూ.0.50 పైసలకు పైబడి హెచ్చు తగ్గులు ఉంటున్నాయి.
తిరుపతిలో భారీ మార్పు
తిరుపతిలో ఇంధన ధరల్లో కొద్ది రోజులుగా భారీ మార్పులే చోటు చేసుకుంటున్నాయి. కానీ, తాజాగా ఇంధన ధరలు పెరిగాయి. పెట్రోల్ లీటరుకు రూ.0.54 పెరగ్గా.. డీజిల్ రూ.0.48 పైసలు పెరిగింది. దీంతో తాజాగా లీటరు పెట్రోలు ధర రూ.108.62కు చేరింది. కొద్ది రోజులుగా ఇక్కడ పెట్రోలు ధరల్లో పెరుగుదల కనిపిస్తోంది. ఇక డీజిల్ ధర రూ.99.46గా ఉంది.
ధరల పెరుగుదలకు కారణం ఏంటంటే..
గత సంవత్సర కాలంగా మన దేశంలో పెట్రోల్, డీజిల్ ధరలు ఎప్పుడూ లేనంతగా పెరిగిపోతున్నాయి. ఈ ప్రభావం సామాన్యులపై బాగా పడుతోంది. వారి జేబులకు చిల్లు పడుతోంది. గతేడాది ఏప్రిల్‌లో ముడి చమురు ధరలు జీవితకాల కనిష్ఠానికి చేరినా మన దేశంలో మాత్రం తగ్గలేదు. పైగా పెరుగుతూ వస్తున్నాయి. ఆ సమయంలో కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు స్థానిక పన్నులను పెంచి ఇంధన ధరలు తగ్గకుండా చేశాయి. ఆ సమయంలో బ్యారెల్ ముడి చమురు ధర 32.33 డాలర్ల వద్దే ఉండేది. ఆ తర్వాత క్రమంగా ముడి చమురు ధర పెరుగుతూ, స్వల్పంగా తగ్గుతూ తాజాగా ఆగస్టు 25 నాటి ధరల ప్రకారం 67.35 డాలర్ల వద్ద ఉంది. వీటి ధరలు పెరుగుతున్నా కేంద్ర, రాష్ట్రా ప్రభుత్వాలు మాత్రం ఆ పెంచిన పన్నులను అలాగే ఉంచుతున్నాయి. అందుకే ఇంధన ధరలు మన దేశంలో జీవితాల గరిష్ఠానికి చేరుతూ సామాన్యులను ఆర్థికంగా ఇబ్బందుల పాలు చేస్తున్నాయి.
టాప్ హెడ్ లైన్స్
ట్రెండింగ్ వార్తలు
![ABP Premium](https://cdn.abplive.com/imagebank/metaverse-mid.png)