IPL, 2022 | Qualifier 2 | Narendra Modi Stadium, Ahmedabad - 27 May, 07:30 pm IST
(Match Yet To Begin)
RR
RR
VS
RCB
RCB
IPL, 2022 | Final | Narendra Modi Stadium, Ahmedabad - 29 May, 08:00 pm IST
(Match Yet To Begin)
GT
GT
VS
TBC
TBC

Petrol-Diesel Price, 23 March: క్రమంగా పెరుగుతున్న ఇంధన ధరలు, నేడు మరింతగా - నేడు Hydలో ఎంత పెరిగిందంటే

Hyderabad Petrol Price: హైదరాబాద్‌లో నేడు పెట్రోల్ ధర లీటరుకు రూ.0.91 పైసలు పెరిగి రూ.110.01గా.. డీజిల్ ధర లీటరుకు రూ.0.88 పైసలు పెరిగి రూ.95.5 కి చేరింది.

FOLLOW US: 

నాలుగు నెలల క్రితం వరకూ ఇంధన ధరలు మన దేశంలో క్రమంగా ఎగబాకుతూ వచ్చి జీవితకాల గరిష్ఠాన్ని చేరాయి. కానీ, కొద్ది నెలల క్రితం కేంద్రం ఎక్సైజ్ సుంకం తగ్గింపుతో పెట్రోల్, డీజిల్ ధరలు కాస్త తగ్గాయి. ఈ తగ్గిన ధరలతో వాహనదారులు కొద్దిగా ఊరట చెందుతున్నారు. అయితే, మళ్లీ ముడి చమురు ధరలు ప్రస్తుతం 110 డాలర్ల మార్కును దాటాయి. తాజాగా ఉక్రెయిన్ - రష్యా యుద్ధ ప్రభావంతో క్రూడాయిల్ ధరలు మరింత ఎగబాకుతున్నాయి. మన దేశంలోనూ ఇంధన ధరలు క్రమంగా పెరుగుతున్నాయి.

తెలంగాణలో (Telangana Petrol Price) ధరలు ఇలా..
హైదరాబాద్‌లో (Hyderabad Petrol Price) పెట్రోల్, డీజిల్ ధరలు ఇలా ఉన్నాయి. నేడు పెట్రోల్ ధర లీటరుకు రూ.0.91 పైసలు పెరిగి రూ.110.01గా.. డీజిల్ ధర లీటరుకు రూ.0.88 పైసలు పెరిగి రూ.95.5 కి చేరింది. దాదాపు అన్ని చోట్లా ఇంధన ధరలు పెరిగాయి. వరంగల్‌లోనూ (Warangal Petrol Price)  ధరలు నేడు పెరిగాయి. నేడు (మార్చి 22) పెట్రోల్ ధర రూ.0.91 పైసలు పెరిగి రూ.109.69 గా ఉంది. డీజిల్ ధర  రూ.0.87 పైసలు పెరిగి రూ.96.06 గా ఉంది. వరంగల్ రూరల్ జిల్లాలో సైతం ఇవే ఇంధన ధరలు కొనసాగుతున్నాయి.

నిజామాబాద్‌లో (Fuel Price in Nizamabad) ఇంధన ధరలు నేడు కాస్త తగ్గాయి. పెట్రోల్ ధర లీటరుకు నేడు రూ.0.01 పైసలు తగ్గి రూ.111.31 గా ఉంది. డీజిల్ ధర (Fuel Price in Telangana) రూ.0.03 పైసలు పెరిగి రూ.97.58 గా ఉంది. గత కొన్ని రోజులుగా నిజామాబాద్‌లో ఇతర ప్రాంతాలతో పోలిస్తే ఇంధన ధరల్లో హెచ్చుతగ్గులు ఎక్కువగా కనిపిస్తున్నాయి.

ఆంధ్రప్రదేశ్‌లో (Andhra Pradesh Petrol Prices) ఇంధన ధరలు ఇలా..
విజయవాడ (Fuel Price in Vijayawada) మార్కెట్‌లో పెట్రోల్ ధర నేడు రూ.0.87 పైసలు పెరిగి రూ.112.10గా ఉంది. డీజిల్ ధర రూ.0.84 పైసలు పెరిగి రూ.98.12కి చేరింది.

ఇక విశాఖపట్నం (Petrol Price in Vizag) మార్కెట్‌లో పెట్రోల్ ధర నేడు పెరిగింది. నేడు లీటరు ధర నేడు రూ.1.39 పైసలు పెరిగి రూ.111.32 గా ఉంది. డీజిల్ ధర (Diesel Price in Visakhapatnam) కూడా నేడు రూ.1.32 పైసలు పెరిగి రూ.97.34గా ఉంది. అయితే, ఇక్కడ కొద్ది రోజుల ఇంధన ధరలు గమనిస్తే ఎక్కువగానే హెచ్చుతగ్గులు ఉంటున్నాయి.

తిరుపతిలో తగ్గిన ధరలు (Petrol Price in Tirupati)
తిరుపతిలో (Tirupati Petrol Price) ఇంధన ధరలు నేడు పెరిగాయి. ప్రస్తుతం లీటరు పెట్రోల్ ధర రూ.0.62 తగ్గి రూ.112.68 గా ఉంది. కొద్ది రోజులుగా ఇక్కడ పెట్రోలు ధరల్లో ఎక్కువగా మార్పులు కనిపిస్తున్నాయి. ఇక డీజిల్ ధర (Diesel Price in Tirupati) రూ.0.59 పైసలు పెరిగి నేడు రూ.98.59కి చేరింది.

ధరల పెరుగుదలకు కారణం ఏంటంటే..
గత ఏడాదిన్నరగా మన దేశంలో పెట్రోల్, డీజిల్ ధరలు ఎప్పుడూ లేనంతగా పెరిగిపోతున్నాయి. ఈ ప్రభావం సామాన్యులపై బాగా పడుతోంది. వారి జేబులకు చిల్లు పడుతోంది. 2020 ఏప్రిల్‌లో ముడి చమురు ధరలు జీవితకాల కనిష్ఠానికి చేరినా మన దేశంలో మాత్రం తగ్గలేదు. పైగా పెరుగుతూ వస్తున్నాయి. ఆ సమయంలో కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు పన్నులను పెంచి ఇంధన ధరలు తగ్గకుండా చేశాయి. ఆ సమయంలో బ్యారెల్ ముడి చమురు ధర 32.30 డాలర్ల వద్దే ఉండేది. ఆ తర్వాత 70 నుంచి 80 డాలర్ల మధ్య హెచ్చుతగ్గులు ఉండేది. ఇప్పుడు రష్యా-ఉక్రెయిన్ యుద్ధ ప్రభావంతో మార్చి 23 నాటి ధరల ప్రకారం ముడి చమురు బ్యారెల్ ధర 110.57 డాలర్లుగా ఉంది. దీంతో మన దేశంలో పెట్రోల్ రూ.140 దాటుతుందనే విశ్లేషణలు వస్తుండడంతో సర్వత్రా ఆందోళన నెలకొని ఉంది.

Published at : 23 Mar 2022 08:38 AM (IST) Tags: Petrol Price Diesel Price Fuel Cost Petrol Diesel Price Today Hyderabad Petrol Price Telangana Petrol Price Andhra Pradesh Petrol Prices

సంబంధిత కథనాలు

New Brezza: కొత్త బ్రెజాలో అదే హైలెట్ - లాంచ్ త్వరలోనే - లుక్ ఎలా ఉందంటే?

New Brezza: కొత్త బ్రెజాలో అదే హైలెట్ - లాంచ్ త్వరలోనే - లుక్ ఎలా ఉందంటే?

Kotak Mutual Fund: రూ.10 వేల సిప్‌ - 3 ఏళ్లలో రూ.5 లక్షల రిటర్న్‌ ఇచ్చిన మ్యూచువల్‌ ఫండ్‌ ఇది

Kotak Mutual Fund: రూ.10 వేల సిప్‌ - 3 ఏళ్లలో రూ.5 లక్షల రిటర్న్‌ ఇచ్చిన మ్యూచువల్‌ ఫండ్‌ ఇది

Stock Market News: సెన్సెక్స్‌ - 250 నుంచి + 500కు! ఐరోపా మార్కెట్లు ఓపెనవ్వగానే ఎగబడ్డ ఇన్వెస్టర్లు!

Stock Market News: సెన్సెక్స్‌ - 250 నుంచి + 500కు! ఐరోపా మార్కెట్లు ఓపెనవ్వగానే ఎగబడ్డ ఇన్వెస్టర్లు!

Cryptocurrency Prices Today: రోజురోజుకీ పతనమవుతున్న బిట్‌కాయిన్‌, ఎథీరియమ్‌!

Cryptocurrency Prices Today: రోజురోజుకీ పతనమవుతున్న బిట్‌కాయిన్‌, ఎథీరియమ్‌!

Infosys CEO Salary: ఆ సీఈవో వేతనం రూ.42.50 కోట్ల నుంచి రూ.80 కోట్లకు పెంపు!

Infosys CEO Salary: ఆ సీఈవో వేతనం రూ.42.50 కోట్ల నుంచి రూ.80 కోట్లకు పెంపు!
SHOPPING
Top Mobiles
LAPTOP AND ACCESORIES
Best Deals

టాప్ స్టోరీస్

KCR Comments In Bengalore : రెండు, మూడు నెలల్లో సంచలన వార్త - మార్పును ఎవరూ ఆపలేరన్న కేసీఆర్

KCR Comments In Bengalore : రెండు, మూడు నెలల్లో సంచలన వార్త - మార్పును ఎవరూ ఆపలేరన్న కేసీఆర్

Ante Sundaraniki: ‘అంటే సుందరానికి’ మేకింగ్, షూటింగ్‌లో నాని ఫన్‌కు పకపకా నవ్వులు, ఇదిగో వీడియో!

Ante Sundaraniki: ‘అంటే సుందరానికి’ మేకింగ్, షూటింగ్‌లో నాని ఫన్‌కు పకపకా నవ్వులు, ఇదిగో వీడియో!

Vivo T2 5G: వివో కొత్త ఫోన్ లాంచ్ వాయిదా - కారణం ఏంటంటే?

Vivo T2 5G: వివో కొత్త ఫోన్ లాంచ్ వాయిదా - కారణం ఏంటంటే?

IND vs INA, Asia Cup Hockey: ఇండోనేషియాపై టీమిండియా గోల్స్ వర్షం - ఏకంగా 16-0తో విజయం - ఇంటి బాట పట్టిన పాకిస్తాన్!

IND vs INA, Asia Cup Hockey: ఇండోనేషియాపై టీమిండియా గోల్స్ వర్షం - ఏకంగా 16-0తో విజయం - ఇంటి బాట పట్టిన పాకిస్తాన్!