By: ABP Desam | Updated at : 22 Dec 2021 07:27 AM (IST)
ప్రతీకాత్మక చిత్రం
గత నెల రోజుల వరకూ ఇంధన ధరలు మన దేశంలో క్రమంగా ఎగబాకుతూ వచ్చి జీవితకాల గరిష్ఠాన్ని చేరాయి. కానీ, కొద్ది రోజుల క్రితం కేంద్రం ఎక్సైజ్ సుంకం తగ్గింపుతో పెట్రోల్, డీజిల్ ధరలు కాస్త తగ్గాయి. ఈ తగ్గిన ధరలతో వాహనదారులు కొద్దిగా ఊరట చెందుతున్నారు. తెలుగు రాష్ట్రాల్లో పెట్రోల్, డీజిల్ ధరలు నేడు ఇలా ఉన్నాయి. ముందు రోజుతో పోలిస్తే నేడు ఇంధన ధరలు అన్ని చోట్లా స్థిరంగా ఉన్నాయి.
తెలంగాణలో..
హైదరాబాద్‌లో నేడు పెట్రోల్ ధర లీటరుకు రూ.108.20గా స్థిరంగానే ఉంది. డీజిల్ ధర లీటరుకు రూ.94.62 గా నిలకడగానే ఉంది. గత కొన్ని రోజుల నుంచి హైదరాబాద్‌లో ధరలు స్థిరంగానే ఉంటున్నాయి. ఇక వరంగల్‌లో నేడు (డిసెంబరు 22) పెట్రోల్ ధర రూ.107.69 గా స్థిరంగానే కొనసాగుతోంది. డీజిల్ ధర రూ.94.14 గానే ఉంటోంది. రెండు రోజులుగా వరంగల్‌లో ఈ ధరలే ఉంటున్నాయి. వరంగల్ రూరల్ జిల్లాలో సైతం ఇవే ఇంధన ధరలు కొనసాగుతున్నాయి.
నిజామాబాద్‌లో ఇంధన ధరలు నేడు పెరిగాయి. పెట్రోల్ ధర లీటరుకు రూ.0.53 పైసలు పెరిగి రూ.110.46 గా ఉంది. డీజిల్ ధర రూ.0.49 పైసలు పెరిగి రూ.96.72 గా అయింది. గత కొన్ని రోజులుగా నిజామాబాద్‌లో ఇతర ప్రాంతాలతో పోలిస్తే ఇంధన ధరల్లో హెచ్చుతగ్గులు ఎక్కువగా కనిపిస్తున్నాయి.
ఆంధ్రప్రదేశ్‌లో ఇంధన ధరలు ఇలా..
విశాఖపట్నం మార్కెట్‌లో పెట్రోల్ ధర ప్రస్తుతం రూ.109.75గా ఉంది. పాత ధరతో పోలిస్తే ఏకంగా రూ.0.35 పైసలు పెరిగింది. డీజిల్ ధర విశాఖపట్నంలో రూ.95.83 గా ఉంది. ఇది రూ.0.32 పైసలు పెరిగింది.
ఇక విజయవాడ మార్కెట్‌లో పెట్రోల్ ధర నేడు పెరిగింది. లీటరు ధర ప్రస్తుతం రూ.0.13 పైసలు పెరిగి రూ.110.61 గా ఉంది. డీజిల్ ధర రూ.0.12 పైసలు పెరిగి రూ.96.68గా ఉంది. అయితే, అమరావతి ప్రాంతంలో కొద్ది రోజుల ఇంధన ధరలు గమనిస్తే స్వల్పంగా హెచ్చుతగ్గులు ఉన్నాయి.
తిరుపతిలో ఇలా..
తిరుపతిలోనూ ఇంధన ధరలు నేడు తగ్గాయి. లీటరు పెట్రోలు ధర ప్రస్తుతం రూ.111.31 కి చేరింది. పెట్రోల్ ధర లీటరుకు రూ.1.15 పైసలు పెరిగింది. కొద్ది రోజులుగా ఇక్కడ పెట్రోలు ధరల్లో ఎక్కువగా మార్పులు కనిపిస్తున్నాయి. ఇక డీజిల్ ధర రూ.1.06 పైసలు పెరిగి రూ.97.27 కి చేరింది.
ధరల పెరుగుదలకు కారణం ఏంటంటే..
గత సంవత్సర కాలంగా మన దేశంలో పెట్రోల్, డీజిల్ ధరలు ఎప్పుడూ లేనంతగా పెరిగిపోతున్నాయి. ఈ ప్రభావం సామాన్యులపై బాగా పడుతోంది. వారి జేబులకు చిల్లు పడుతోంది. గతేడాది ఏప్రిల్‌లో ముడి చమురు ధరలు జీవితకాల కనిష్ఠానికి చేరినా మన దేశంలో మాత్రం తగ్గలేదు. పైగా పెరుగుతూ వస్తున్నాయి. ఆ సమయంలో కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు స్థానిక పన్నులను పెంచి ఇంధన ధరలు తగ్గకుండా చేశాయి. ఆ సమయంలో బ్యారెల్ ముడి చమురు ధర 32.30 డాలర్ల వద్దే ఉండేది. ఆ తర్వాత క్రమంగా ముడి చమురు ధర పెరుగుతూ, స్వల్పంగా తగ్గుతూ తాజాగా డిసెంబరు 21 నాటి ధరల ప్రకారం 70.31 డాలర్ల వద్ద ఉంది. వీటి ధరలు పెరుగుతున్నా కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు మాత్రం ఆ పెంచిన పన్నులను తగ్గించలేదు. అందుకే ఇంధన ధరలు మన దేశంలో జీవితాల గరిష్ఠానికి చేరుతూ సామాన్యులను ఆర్థికంగా ఇబ్బందులకు గురి చేస్తున్నాయి. తాజాగా సుంకాన్ని స్వల్పంగా తగ్గించడం ద్వారా రూ.5 నుంచి రూ.10 మేర ఇంధన ధరలు తగ్గాయి.
Also Read: New Online Payment Rules: జనవరి 1 నుంచి ఆన్‌లైన్ పేమెంట్ నిబంధనల్లో మార్పు.. తెలియకపోతే కష్టం!
Also Read: Multibagger stock: ఐదేళ్లు: ఈ షేరులో లక్షకు రూ.5 లక్షల లాభం!
Petrol-Diesel Price, 26 May: ఈ నగరాల్లో వారికి శుభవార్త! ఇక్కడ ఇంధన ధరలు తగ్గుముఖం, ఈ సిటీల్లో మాత్రం పైపైకి
Gold-Silver Price: వరుసగా రెండోరోజూ బంగారం ధర షాక్! పెరిగిన పసిడి, వెండి ధరలు
Cash Deposits Rules: ప్రజలకు అలర్ట్! రేపట్నుంచి మారుతున్న నగదు డిపాజిట్ రూల్స్
Cryptocurrency Prices Today: బిట్‌కాయిన్ ఓకే! ఆ రెండో కాయిన్ మాత్రం భయపెడుతోంది!
Stock Market News: సూచీల నేల చూపులు! సెన్సెక్స్ 303, నిఫ్టీ 99 డౌన్ - ఫెడ్ మినిట్స్ కోసం వెయిటింగ్!
Telangana Police Jobs: పోలీసు ఉద్యోగాలకు ఇంకా అప్లై చేయలేదా? ఇవాళే లాస్ట్ డేట్!
Modi Hyderabad Tour Today: నేడే హైదరాబాద్‌కు ప్రధాని, రంగంలోకి 2 వేల మంది పోలీసులు - పూర్తి షెడ్యూల్ ఇదీ
Amalapuram Violence: అమలాపురం అల్లర్ల కేసులో కీలక వ్యక్తి అరెస్టు, అసలు ఎవరీ అన్యం సాయి?
Khammam: సీఎం జగన్‌పై తెలంగాణ మంత్రి వ్యాఖ్యల దుమారం! అదే పనిగా విమర్శలు, అందులో ఆంతర్యంటి?