News
News
X

Petrol-Diesel Price, 21 February: నేడు అన్ని చోట్లా పెరిగిన పెట్రోల్, డీజిల్ ధరలు - ఈ ఒక్కచోట భారీ తగ్గుదల

తిరుపతిలో ఇంధన ధరలు నేడు బాగా తగ్గాయి. ప్రస్తుతం లీటరు పెట్రోల్ ధర రూ.109.92 వద్ద ఉంది. నేడు ఏకంగా లీటరుకు రూ.1.26 తగ్గింది.

FOLLOW US: 

గత నాలుగు నెలల క్రితం వరకూ ఇంధన ధరలు మన దేశంలో క్రమంగా ఎగబాకుతూ వచ్చి జీవితకాల గరిష్ఠాన్ని చేరాయి. కానీ, కొద్ది నెలల క్రితం కేంద్రం ఎక్సైజ్ సుంకం తగ్గింపుతో పెట్రోల్, డీజిల్ ధరలు కాస్త తగ్గాయి. ఈ తగ్గిన ధరలతో వాహనదారులు కొద్దిగా ఊరట చెందుతున్నారు. అయితే, మళ్లీ ముడి చమురు ధరలు ప్రస్తుతం 90 డాలర్ల మార్కును దాటాయి. దీంతో మళ్లీ ధరలు పెరుగుతాయోననే ఆందోళన నెలకొంది. తెలుగు రాష్ట్రాల్లో పెట్రోల్, డీజిల్ ధరలు నేడు ఇలా ఉన్నాయి.

తెలంగాణలో..
హైదరాబాద్‌లో పెట్రోల్ డీజిల్ ధరలు గత నెల రోజులకు పైగా నిలకడగానే ఉంటున్నాయి. నేడు కూడా పెట్రోల్ ధర లీటరుకు రూ.108.20గా.. డీజిల్ ధర లీటరుకు రూ.94.62 గా నిలకడగానే కొనసాగుతోంది. ఇక వరంగల్‌లోనూ గత వారం రోజుల తర్వాత నేడు ధరలు పెరిగాయి. నేడు (ఫిబ్రవరి 21) పెట్రోల్ ధర రూ.0.08 పైసలు పెరిగి రూ.107.96 గా ఉంది. డీజిల్ ధర రూ.0.08 పైసలు పెరిగి రూ.94.39 గా ఉంది. వరంగల్ రూరల్ జిల్లాలో సైతం ఇవే ఇంధన ధరలు కొనసాగుతున్నాయి.

నిజామాబాద్‌లో ఇంధన ధరలు నేడు కాస్త పెరిగాయి. పెట్రోల్ ధర లీటరుకు నేడు రూ.0.16 పైసలు పెరిగి రూ.110.16 గా ఉంది. డీజిల్ ధర రూ.0.15 పైసలు పెరిగి రూ.96.44 గా ఉంది. గత కొన్ని రోజులుగా నిజామాబాద్‌లో ఇతర ప్రాంతాలతో పోలిస్తే ఇంధన ధరల్లో హెచ్చుతగ్గులు ఎక్కువగా కనిపిస్తుండగా తాజాగా తగ్గాయి.

ఆంధ్రప్రదేశ్‌లో ఇంధన ధరలు ఇలా..
విజయవాడ మార్కెట్‌లో పెట్రోల్ ధర ప్రస్తుతం రూ.0.37 పైసలు పెరిగి రూ.110.45గా ఉంది. డీజిల్ ధర బెజవాడలో రూ.0.32 పైసలు పెరిగి రూ.96.51 గా ఉంది.

ఇక విశాఖపట్నం మార్కెట్‌లో పెట్రోల్ ధర నేడు పెరిగింది. లీటరు ధర నేడు రూ.0.33 పైసలు పెరిగి రూ.109.65 గా ఉంది. డీజిల్ ధర కూడా రూ.0.31 పైసలు పెరిగి రూ.95.74గా ఉంది. అయితే, ఇక్కడి కొద్ది రోజుల ఇంధన ధరలు గమనిస్తే స్వల్పంగా హెచ్చుతగ్గులు ఉంటున్నాయి. తాజాగా పెరిగాయి.

తిరుపతిలో తగ్గిన ధరలు.. 
తిరుపతిలో ఇంధన ధరలు నేడు బాగా తగ్గాయి. ప్రస్తుతం లీటరు పెట్రోల్ ధర రూ.109.92 వద్ద ఉంది. నేడు ఏకంగా లీటరుకు రూ.1.26 తగ్గింది. కొద్ది రోజులుగా ఇక్కడ పెట్రోలు ధరల్లో ఎక్కువగా మార్పులు కనిపిస్తున్నాయి. ఇక డీజిల్ ధర రూ.1.15 తగ్గి తాజాగా రూ.96.01 కి చేరింది.

ధరల పెరుగుదలకు కారణం ఏంటంటే..
గత సంవత్సర కాలంగా మన దేశంలో పెట్రోల్, డీజిల్ ధరలు ఎప్పుడూ లేనంతగా పెరిగిపోతున్నాయి. ఈ ప్రభావం సామాన్యులపై బాగా పడుతోంది. వారి జేబులకు చిల్లు పడుతోంది. గతేడాది ఏప్రిల్‌లో ముడి చమురు ధరలు జీవితకాల కనిష్ఠానికి చేరినా మన దేశంలో మాత్రం తగ్గలేదు. పైగా పెరుగుతూ వస్తున్నాయి. ఆ సమయంలో కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు స్థానిక పన్నులను పెంచి ఇంధన ధరలు తగ్గకుండా చేశాయి. ఆ సమయంలో బ్యారెల్ ముడి చమురు ధర 32.30 డాలర్ల వద్దే ఉండేది. ఆ తర్వాత క్రమంగా ముడి చమురు ధర పెరుగుతూ, స్వల్పంగా తగ్గుతూ తాజాగా ఫిబ్రవరి 21 నాటి ధరల ప్రకారం 92.45 డాలర్ల వద్ద ఉంది. వీటి ధరలు పెరుగుతున్నా కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు మాత్రం ఆ పెంచిన పన్నులను తగ్గించలేదు. అందుకే ఇంధన ధరలు మన దేశంలో జీవితాల గరిష్ఠానికి చేరుతూ సామాన్యులను ఆర్థికంగా ఇబ్బందులకు గురి చేస్తున్నాయి. తాజాగా సుంకాన్ని స్వల్పంగా తగ్గించడం ద్వారా రూ.5 నుంచి రూ.10 మేర ఇంధన ధరలు తగ్గాయి.

Published at : 21 Feb 2022 07:02 AM (IST) Tags: Petrol Price Diesel Price Fuel Cost Petrol Diesel Price Today Hyderabad Petrol Price Telangana Petrol Price Andhra Pradesh Petrol Prices

సంబంధిత కథనాలు

Best Saving Plans: మీ వయసు 30కి చేరువైందా, ఇన్వెస్టిమెంట్ ప్లాన్స్ మొదలుపెట్టలేదా ! - ఈ తప్పులు చేయొద్దు

Best Saving Plans: మీ వయసు 30కి చేరువైందా, ఇన్వెస్టిమెంట్ ప్లాన్స్ మొదలుపెట్టలేదా ! - ఈ తప్పులు చేయొద్దు

Rakesh Jhunjhunwala: మరణించాక, తొలి ట్రేడింగ్‌ సెషన్లో ఝున్‌ఝున్‌వాలా షేర్లు ఎలా ఉన్నాయంటే?

Rakesh Jhunjhunwala: మరణించాక, తొలి ట్రేడింగ్‌ సెషన్లో ఝున్‌ఝున్‌వాలా షేర్లు ఎలా ఉన్నాయంటే?

Stock Market Opening: 60,000కు మరో 90 పాయింట్లే దూరం! దూకుడు మీదున్న సెన్సెక్స్‌, నిఫ్టీ

Stock Market Opening: 60,000కు మరో 90 పాయింట్లే దూరం! దూకుడు మీదున్న సెన్సెక్స్‌, నిఫ్టీ

Petrol-Diesel Price, 16 August: ఆగస్టు 15 ఎఫెక్ట్! నేడు అన్ని చోట్లా నిలకడగా ఇంధన ధరలు - నగరాలవారీ రేట్లు ఇవీ

Petrol-Diesel Price, 16 August: ఆగస్టు 15 ఎఫెక్ట్! నేడు అన్ని చోట్లా నిలకడగా ఇంధన ధరలు - నగరాలవారీ రేట్లు ఇవీ

Gold-Silver Price: బంగారం, వెండి కొనాలా? నేటి ధరలు ఇక్కడ తెలుసుకోండి, ప్లాటినం కూడా

Gold-Silver Price: బంగారం, వెండి కొనాలా? నేటి ధరలు ఇక్కడ తెలుసుకోండి, ప్లాటినం కూడా

టాప్ స్టోరీస్

CM Jagan: వచ్చే రెండేళ్లలో లక్షకుపైగా జాబ్స్ - విశాఖలో సీఎం జగన్, ఏటీసీ టైర్స్ ప్లాంటు ప్రారంభం

CM Jagan: వచ్చే రెండేళ్లలో లక్షకుపైగా జాబ్స్ - విశాఖలో సీఎం జగన్, ఏటీసీ టైర్స్ ప్లాంటు ప్రారంభం

Big Boss Fame Samrat: ‘బిగ్ బాస్’ ఫేమ్ సామ్రాట్‌ ఇంట్లో సంబరాలు - కూతురి ఫస్ట్ ఫొటో షేర్ చేసిన నటుడు

Big Boss Fame Samrat: ‘బిగ్ బాస్’ ఫేమ్ సామ్రాట్‌ ఇంట్లో సంబరాలు - కూతురి ఫస్ట్ ఫొటో షేర్ చేసిన నటుడు

Khammam Politics: ఖమ్మంలో మళ్లీ మొదలైన హత్యా రాజకీయాలు - తెల్దారుపల్లి ఎందుకంత కీలకం !

Khammam Politics: ఖమ్మంలో మళ్లీ మొదలైన హత్యా రాజకీయాలు - తెల్దారుపల్లి ఎందుకంత కీలకం !

Amitabh Chaudhry Passes Away: అమితాబ్‌ చౌదరి కన్నుమూత - బీసీసీఐ సహా క్రికెటర్ల దిగ్భ్రాంతి!

Amitabh Chaudhry Passes Away: అమితాబ్‌ చౌదరి కన్నుమూత - బీసీసీఐ సహా క్రికెటర్ల దిగ్భ్రాంతి!