News
News
X

Petrol-Diesel Price, 13 October: మరోసారి పెట్రోల్‌పై బాదుడు.. పెరుగుతూనే ఉన్న ధరలు.. నేడు మీ నగరంలో ఇలా..

కరీంనగర్‌లో పెట్రోల్ ధర ముందు రోజు ధరతో పోలిస్తే రూ.0.01 పైసలు పెరిగి.. రూ.108.82గా ఉంది.

FOLLOW US: 

కొద్ది రోజులుగా ఇంధన ధరలు మన దేశంలో క్రమంగా పెరుగుతూ వస్తున్నాయి. తాజాగా మరోసారి స్వల్ప వ్యత్యాసం చోటు చేసుకుంది. కానీ, హైదరాబాద్‌లో మాత్రం నేడు ధరలు నిలకడగా ఉన్నాయి. హైదరాబాద్‌లో నేడు పెట్రోల్ ధర లీటరుకు రూ.108.64 అయింది. రూ.101.27 గా ఉన్న డీజిల్ ధరలో మాత్రం స్వల్పంగా పెరిగి.. ప్రస్తుతం రూ.101.66కి చేరింది. ఇక వరంగల్‌లో తాజాగా పెట్రోల్ ధర రూ.0.05 పైసలు పెరిగి రూ.108.36గా ఉంది. డీజిల్ ధర రూ.0.05 పైసలు పెరిగి రూ.101.38 గా ఉంది. వరంగల్‌లో గత కొన్ని రోజులుగా నిలకడగా ధరలు ఉంటుండగా.. తాజాగా పెరిగాయి. వరంగల్ రూరల్ జిల్లాలో సైతం ఇవే ఇంధన ధరలు కొనసాగుతున్నాయి.

కరీంనగర్‌లో పెట్రోల్ ధర ముందు రోజు ధరతో పోలిస్తే రూ.0.01 పైసలు పెరిగి.. రూ.108.82గా ఉంది. డీజిల్ ధర రూ.0.01 పైసలు పెరిగి రూ.101.81 కు చేరింది. నిజామాబాద్‌లోనూ ఇంధన ధరలు కాస్త పెరిగాయి. పెట్రోల్ ధర లీటరుకు రూ.0.02 పైసలు పెరిగి రూ.110.11 గా ఉంది. డీజిల్ ధర రూ.0.01 పైసలు పెరిగి రూ.103.01 గా ఉంది. గత కొన్ని రోజులుగా ఇక్కడ ఇంధన ధరల్లో ఎక్కువగా హెచ్చుతగ్గులు ఉంటున్నాయి.

ఆంధ్రప్రదేశ్‌లో ఇంధన ధరలు ఇలా..
ఇక విజయవాడ మార్కెట్‌లో పెట్రోల్ ధరలు తాజాగా కాస్త ఎక్కువగానే పెరిగాయి. ప్రస్తుతం రూ.110.92 గా ఉంది. పెట్రోల్ ధర రూ.0.29 పైసలు పెరిగింది. డీజిల్ ధర రూ.0.27 పైసలు పెరిగి రూ.103.32కు చేరింది. అయితే, అమరావతి ప్రాంతంలో కొద్ది రోజుల ఇంధన ధరలు గమనిస్తే స్వల్పంగా పెరుగుతూనే ఉన్నాయి.

విశాఖపట్నం ఇంధన మార్కెట్‌లో పెట్రోల్ ధర ప్రస్తుతం రూ.109.73గా ఉంది. గత ధరతో పోలిస్తే రూ.0.23 పైసలు పెరిగింది. డీజిల్ ధర విశాఖపట్నంలో రూ.102.19గా ఉంది. విశాఖలో కూడా కొద్ది రోజులుగా పెట్రోల్, డీజిల్ ధరల్లో సరాసరిన రూ.0.60 పైసలకు పైబడి హెచ్చు తగ్గులు ఉంటున్నాయి.

News Reels

తిరుపతిలో ఇంధన ధరల్లో తగ్గుదల కనిపించింది. లీటరు పెట్రోలు ధర ప్రస్తుతం రూ.0.22 పైసలు తగ్గి.. రూ.110.55 కు చేరింది. కొద్ది రోజులుగా ఇక్కడ పెట్రోలు ధరల్లో పెరుగుదల కనిపిస్తుండగా తాజాగా తగ్గింది. ఇక డీజిల్ ధర రూ.102.94గా ఉంది. డీజిల్ ధర లీటరుకు ఏకంగా రూ.0.17 పైసలు తగ్గింది.

ధరల పెరుగుదలకు కారణం ఏంటంటే..
గత సంవత్సర కాలంగా మన దేశంలో పెట్రోల్, డీజిల్ ధరలు ఎప్పుడూ లేనంతగా పెరిగిపోతున్నాయి. ఈ ప్రభావం సామాన్యులపై బాగా పడుతోంది. వారి జేబులకు చిల్లు పడుతోంది. గతేడాది ఏప్రిల్‌లో ముడి చమురు ధరలు జీవితకాల కనిష్ఠానికి చేరినా మన దేశంలో మాత్రం తగ్గలేదు. పైగా పెరుగుతూ వస్తున్నాయి. ఆ సమయంలో కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు స్థానిక పన్నులను పెంచి ఇంధన ధరలు తగ్గకుండా చేశాయి. ఆ సమయంలో బ్యారెల్ ముడి చమురు ధర 32.33 డాలర్ల వద్దే ఉండేది. ఆ తర్వాత క్రమంగా ముడి చమురు ధర పెరుగుతూ, స్వల్పంగా తగ్గుతూ తాజాగా అక్టోబరు 13 నాటి ధరల ప్రకారం 80.14 డాలర్ల వద్ద ఉంది. వీటి ధరలు పెరుగుతున్నా కేంద్ర, రాష్ట్రా ప్రభుత్వాలు మాత్రం ఆ పెంచిన పన్నులను తగ్గించలేదు. అందుకే ఇంధన ధరలు మన దేశంలో జీవితాల గరిష్ఠానికి చేరుతూ సామాన్యులను ఆర్థికంగా ఇబ్బందులకు గురి చేస్తున్నాయి.

Published at : 13 Oct 2021 06:59 AM (IST) Tags: Petrol Price Diesel Price Fuel Cost Petrol Diesel Price Today Hyderabad Petrol Price Telangana Petrol Price Andhra Pradesh Petrol Prices

సంబంధిత కథనాలు

House Hacking: హైదరాబాద్‌లో ఇల్లు కొనేందుకు డబ్బుల్లేవా? హౌజ్‌ హ్యాకింగ్‌తో కల నిజం చేసుకోండి!

House Hacking: హైదరాబాద్‌లో ఇల్లు కొనేందుకు డబ్బుల్లేవా? హౌజ్‌ హ్యాకింగ్‌తో కల నిజం చేసుకోండి!

New Pension Vs Old Pension: ఓపీఎస్‌, ఎన్‌పీఎస్‌లో ఏది బెస్ట్‌! రెండింట్లో తేడాలేంటి - ఎక్కువ డబ్బు ఎందులో పొందొచ్చు!

New Pension Vs Old Pension: ఓపీఎస్‌, ఎన్‌పీఎస్‌లో ఏది బెస్ట్‌! రెండింట్లో తేడాలేంటి - ఎక్కువ డబ్బు ఎందులో పొందొచ్చు!

Cryptocurrency Prices: పడుతూ లేస్తూ! ఒకే రేంజ్‌లో కదలాడుతున్న బిట్‌కాయిన్‌

Cryptocurrency Prices: పడుతూ లేస్తూ! ఒకే రేంజ్‌లో కదలాడుతున్న బిట్‌కాయిన్‌

Petrol-Diesel Price, 26 November 2022: బెజవాడలో భారీగా పెరిగిన పెట్రోల్‌ రేటు, మిగిలిన ప్రాంతాల్లోనూ మార్పులు

Petrol-Diesel Price, 26 November 2022: బెజవాడలో భారీగా పెరిగిన పెట్రోల్‌ రేటు, మిగిలిన ప్రాంతాల్లోనూ మార్పులు

Gold-Silver Price 26 November 2022: చాప కింద నీరులా పెరుగుతున్న స్వర్ణం - మళ్లీ ₹53 వేలకు చేరింది

Gold-Silver Price 26 November 2022: చాప కింద నీరులా పెరుగుతున్న స్వర్ణం - మళ్లీ ₹53 వేలకు చేరింది

టాప్ స్టోరీస్

YS Jagan: రాజ్యాంగం స్ఫూర్తితో 35 నెలల పాలనలో ఏపీలో ఎన్నో మార్పులు: సీఎం జగన్

YS Jagan: రాజ్యాంగం స్ఫూర్తితో 35 నెలల పాలనలో ఏపీలో ఎన్నో మార్పులు: సీఎం జగన్

Attack on TDP leader: నెల్లూరులో దారుణం, సిటీ టీడీపీ ఇన్ ఛార్జ్‌పై కారుతో దాడి

Attack on TDP leader: నెల్లూరులో దారుణం, సిటీ టీడీపీ ఇన్ ఛార్జ్‌పై కారుతో దాడి

Konaseema District: చేపల వేట హద్దుల కోసం Boat Race, ఎంచక్కా వీడియో వీక్షించండి

Konaseema District: చేపల వేట హద్దుల కోసం Boat Race, ఎంచక్కా వీడియో వీక్షించండి

Manjima Mohan Pre Wedding Pics: హీరో హీరోయిన్ల ప్రీ వెడ్డింగ్ ఫొటోలు ట్రెండింగ్ , మీరు ఓ లుక్కేయండి

Manjima Mohan Pre Wedding Pics: హీరో హీరోయిన్ల ప్రీ వెడ్డింగ్ ఫొటోలు ట్రెండింగ్ , మీరు ఓ లుక్కేయండి