By: ABP Desam | Updated at : 01 Jan 2022 07:51 AM (IST)
పెట్రోల్, డీజిల్ ధరలు (File Photo)
Petrol-Diesel Price: ఢిల్లీలో గత కొన్ని రోజులుగా పెట్రోల్, డీజిల్ ధరలు నిలకడగా ఉన్నాయి. ఢిల్లీ ప్రభుత్వం ధరలు తగ్గించడంతో అక్కడ పెట్రోల్ లీటర్ ధర రూ.95.41, డీజిల్ ధర రూ.86.67 వద్ద ధరలు స్థిరంగా ఉన్నాయి. ఇటీవల ఝార్ఖండ్ ప్రభుత్వం రూ.25 మేర ధర తగ్గిస్తూ కీలక నిర్ణయం తీసుకుంది. ఏపీ, తెలంగాణ ప్రభుత్వాలు మాత్రం అలాంటి నిర్ణయాలు తీసుకోలేదు.
హైదరాబాద్‌లో గత ఏడాది డిసెంబర్ నుంచి ఇంధన ధరలు స్థిరంగా ఉన్నాయి. డిసెంబర్ నెల మొదట్నుంచీ నేడు సైతం పెట్రోల్ ధర లీటరుకు రూ.108.20 వద్ద ఉండగా.. డీజిల్ ధర లీటరుకు రూ.94.62 వద్ద విక్రయాలు జరుగుతున్నాయి. ఇక వరంగల్‌లోనూ పెట్రోల్, డీజిల్ ధర స్థిరంగా ఉండగా.. లీటర్ పెట్రోల్ ధర రూ.107.96 కాగా.. డీజిల్ ధర రూ.94.39 అయింది. వరంగల్ రూరల్ జిల్లాలో పెట్రోల్‌పై 19 పైసలు తగ్గడంతో లీటర్ ధర రూ.107.88 కాగా, డీజిల్‌పై 18 పైసలు తగ్గడంతో లీటర్ ధర రూ.94.31కి పతనమైంది.
కరీంనగర్ లో పెట్రోల్, డీజిల్ ధరలు నిలకడగా ఉన్నాయి. నేడు పెట్రోల్ లీటర్ ధర రూ.108.57 కాగా, డీజిల్ ధర రూ.94.95 గా ఉంది. నిజామాబాద్‌లో ఇంధన ధరలు భారీగా పెరిగాయి. పెట్రోల్ ధర లీటరుకు రూ.0.56 పైసలు పెరగడంతో రూ.110.09 అయింది. డీజిల్ ధర రూ.0.53 పైసలు తగ్గడంతో రూ.96.38 అయింది. గత కొన్ని రోజులుగా నిజామాబాద్‌లో ఇతర ప్రాంతాలతో పోలిస్తే ఇంధన ధరల్లో హెచ్చుతగ్గులు ఎక్కువగా కనిపిస్తున్నాయి.
ఆంధ్రప్రదేశ్‌లో ఇంధన ధరలు ఇలా..
ఇక విజయవాడలో పెట్రోల్ ధర 24 పైసలు తగ్గడంతో లీటర్ ధర రూ.110.41 అయింది. 20 పైసల చొప్పున తగ్గడంతో ఇక్కడ డీజిల్ ధర రూ.96.49కు దిగొచ్చింది. అయితే, అమరావతి ప్రాంతంలో కొద్ది రోజుల ఇంధన ధరలు గమనిస్తే స్వల్పంగా హెచ్చుతగ్గులు ఉన్నాయి. విశాఖపట్నం మార్కెట్‌లో పెట్రోల్ ధర 0.85 పైసలు తగ్గి లీటర్ పెట్రోల్ ధర రూ.109.05 కి దిగొచ్చింది. డీజిల్ ధర 0.79 పైసలు తగ్గడంతో విశాఖపట్నంలో డీజిల్ ధర లీటర్ రూ.95.18 అయింది.
చిత్తూరు జిల్లాలో ఇలా..
చిత్తూరులోనూ ఇంధన ధరలు భారీగా నిలకడగా ఉన్నాయి. లీటరు పెట్రోలు ధర ప్రస్తుతం రూ.110.54 కి చేరింది. ఇక్కడ నిన్న లీటరుకు రూ.0.62 పైసలు పెరిగింది. కొద్ది రోజులుగా ఇక్కడ పెట్రోలు ధరల్లో ఎక్కువగా మార్పులు కనిపిస్తున్నాయి. ఇక డీజిల్ ధర నిన్న రూ.0.55 పైసల మేర పెరగడంతో ధర లీటర్ ధర రూ.96.56 అయింది.
ధరల పెరుగుదలకు కారణం..
గత సంవత్సర కాలంగా మన దేశంలో పెట్రోల్, డీజిల్ ధరలు ఎప్పుడూ లేనంతగా పెరిగిపోతున్నాయి. ఈ ప్రభావం సామాన్యులపై బాగా పడుతోంది. వారి జేబులకు చిల్లు పడుతోంది. గతేడాది ఏప్రిల్‌లో ముడి చమురు ధరలు జీవితకాల కనిష్ఠానికి చేరినా మన దేశంలో మాత్రం తగ్గలేదు. పైగా పెరుగుతూ వస్తున్నాయి. ఆ సమయంలో కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు స్థానిక పన్నులను పెంచి ఇంధన ధరలు తగ్గకుండా చేశాయి. ఆ సమయంలో బ్యారెల్ ముడి చమురు ధర 32.30 డాలర్ల వద్దే ఉండేది. ఆ తర్వాత క్రమంగా ముడి చమురు ధర పెరుగుతూ, స్వల్పంగా తగ్గుతూ తాజాగా డిసెంబరు 2 నాటి ధరల ప్రకారం 66.52 డాలర్ల వద్ద ఉంది. వీటి ధరలు పెరుగుతున్నా కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు మాత్రం ఆ పెంచిన పన్నులను తగ్గించలేదు. అందుకే ఇంధన ధరలు మన దేశంలో జీవితాల గరిష్ఠానికి చేరుతూ సామాన్యులను ఆర్థికంగా ఇబ్బందులకు గురి చేస్తున్నాయి. తాజాగా సుంకాన్ని స్వల్పంగా తగ్గించడం ద్వారా రూ.5 నుంచి రూ.10 మేర ఇంధన ధరలు తగ్గాయి.
Also Read: Gold Silver Price: కొత్త సంవత్సరంలో పసిడి ప్రియులకు షాక్.. పెరిగిన బంగారం ధర.. మళ్లీ దిగొచ్చిన వెండి.. లేటెస్ట్ రేట్లు ఇవీ..
Also Read: Lost Aadhar Card: ఆధార్ కార్డు పోయిందా.. స్మార్ట్ ఫోన్‌లో ఇలా చేస్తే చాలు.. కొత్త ఆధార్ ఇంటికి!
Also Read: Moto G51 5G: అత్యంత చవకైన మోటో 5జీ ఫోన్ వచ్చేస్తుంది.. మరో వారంలో లాంచ్.. ధర ఎంతంటే?
Gold Rate Today 08 August 2022: ఆగస్టులో ఎగబాకిన బంగారం ధర, పసిడి దారిలోనే వెండి - లేటెస్ట్ రేట్లు ఇవీ
Cryptocurrency Prices: ఆదివారం నష్టాల్లోనే! బిట్‌కాయిన్ ధర ఎంతంటే?
Petrol-Diesel Price, 7 August: నేడు ఈ నగరాల్లో తగ్గిన పెట్రోల్, డీజిల్ ధర - మీ నగరంలో తాజా రేట్లు ఇవీ
Gold-Silver Price: నేడు దిగివచ్చిన గోల్డ్ రేట్, వెండి ఏకంగా 800 దిగువకు - లేటెస్ట్ ధరలు ఇవీ!
Cryptocurrency Prices: బిట్ కాయిన్ డౌన్ - ఎథీరియమ్ అప్! ఎందుకిలా?
ఫైనల్స్‌లో పోరాడి ఓడిన టీమిండియా - రజతంతోనే సరి!
Nikhat Zareen Gold Medal : నిఖత్ జరీన్ కు సీఎం కేసీఆర్ ఫోన్, స్వర్ణ పతకం సాధించడంపై సంతోషం వ్యక్తం
Shruti Haasan: నాకోసం అమ్మ నాన్న ఎవరికీ ఫోన్లు చేయలేదు - కష్టం ఎవరికైనా ఒకటే: శ్రుతిహాసన్
TS EAMCET Results: టీఎస్ ఎంసెట్ ఫలితాలు వచ్చేస్తున్నాయ్, రిజల్ట్స్ ఎప్పుడంటే?