By: ABP Desam | Updated at : 01 Aug 2022 07:57 AM (IST)
ప్రతీకాత్మక చిత్రం
కొద్ది రోజుల క్రితం వరకూ మన దేశంలో ఇంధన ధరలు ఎగబాకుతూ వచ్చి క్రమంగా లీటరుకు రూ.120 దాటాయి. ఇటీవల కేంద్ర ప్రభుత్వం ఎక్సైజ్ సుంకం మరోసారి తగ్గించింది. దీంతో భారీ ఎత్తున ధరల్లో మార్పు కనిపించింది. పెట్రోల్ ధరలో రూ.9 కి పైగా, డీజిల్ ధరలో రూ.7 రూపాయలకు పైగా తగ్గింది. దీంతో కాస్తయినా ఉపశమనం కలిగిందని సామాన్యులు భావిస్తున్నారు.
తెలంగాణలో (Telangana Petrol Price) ధరలు ఇలా..
Hyderabad Petrol Price హైదరాబాద్‌లో పెట్రోల్ డీజిల్ ధరలు గత నెల రోజులకు పైగా నిలకడగా ఉంటున్నాయి. నేడు పెట్రోల్ ధర రూ.109.66గా ఉంది. ఇక డీజిల్ ధర రూ.97.52 గా ఉంది. ఇక వరంగల్‌లో (Warangal Petrol Price) ధరలు నేడు గత వారం రోజులుగా స్థిరంగా ఉండగా, నేడు కాస్త తగ్గాయి. నేడు (ఆగస్టు 1) పెట్రోల్ ధర నేడు రూ.0.06 పైసలు తగ్గి రూ.109.10 గా ఉంది. డీజిల్ ధర రూ.0.06 పైసలు తగ్గి రూ.97.29గా ఉంది. వరంగల్ రూరల్ జిల్లాలో సైతం ఇవే ఇంధన ధరలు కొనసాగుతున్నాయి.
నిజామాబాద్‌లో (Fuel Price in Nizamabad) పెట్రోల్ ధర నేడు రూ.0.61 పైసలు పెరిగి రూ.111.78 గా ఉంది. డీజిల్ ధర (Fuel Price in Telangana) రూ.0.57 పైసలు పెరిగి నేడు రూ.99.79 గా ఉంది. గత కొన్ని రోజులుగా నిజామాబాద్‌లో ఇతర ప్రాంతాలతో పోలిస్తే ఇంధన ధరల్లో మార్పులు బాగా ఉంటున్నాయి.
ఆంధ్రప్రదేశ్‌లో (Andhra Pradesh Petrol Prices) ఇంధన ధరలు ఇలా..
విజయవాడ (Fuel Price in Vijayawada) మార్కెట్‌లో ఇంధన ధరలు నేడు పెరిగాయి. పెట్రోల్ ధర నేడు రూ.0.19 పైసలు పెరిగి రూ.111.82 గా ఉంది. డీజిల్ ధర రూ.0.17 పైసలు పెరిగి రూ.99.54 గా ఉంది.
ఇక విశాఖపట్నం (Petrol Price in Vizag) మార్కెట్‌లో పెట్రోల్ ధర నేడు పెరిగింది. రూ.0.12 పైసలు పెరిగి ఇవాళ పెట్రోల్ ధర రూ.111.35 గా ఉంది. డీజిల్ ధర నేడు రూ.0.10 పైసలు పెరిగి రూ.99.07గా ఉంది. అయితే, ఇక్కడ కొద్ది రోజుల ఇంధన ధరలు గమనిస్తే స్వల్పంగా హెచ్చుతగ్గులు ఉంటున్నాయి.
తిరుపతిలో నేటి ధరలు ఇవీ (Petrol Price in Tirupati)
తిరుపతిలో (Tirupati Petrol Price) పెట్రోల్ ధర నేడు రూ.0.55 పైసలు తగ్గి రూ.111.96 గా ఉంది. కొద్ది రోజులుగా ఇక్కడ పెట్రోలు ధరల్లో ఎక్కువగా మార్పులు కనిపిస్తున్నాయి. ఇక డీజిల్ ధర రూ.0.44 పైసలు తగ్గి రూ.99.64 గా ఉంది.
ధరల పెరుగుదలకు కారణం ఏంటంటే..
గత సంవత్సర కాలంగా మన దేశంలో పెట్రోల్, డీజిల్ ధరలు ఎప్పుడూ లేనంతగా పెరిగిపోతున్నాయి. ఈ ప్రభావం సామాన్యులపై బాగా పడుతోంది. వారి జేబులకు చిల్లు పడుతోంది. గతేడాది ఏప్రిల్‌లో ముడి చమురు ధరలు జీవితకాల కనిష్ఠానికి చేరినా మన దేశంలో మాత్రం తగ్గలేదు. పైగా పెరుగుతూ వస్తున్నాయి. ఆ సమయంలో కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు స్థానిక పన్నులను పెంచి ఇంధన ధరలు తగ్గకుండా చేశాయి. అప్పుడు బ్యారెల్ ముడి చమురు ధర 32.30 డాలర్ల వద్దే ఉండేది. ప్రస్తుతం 100 డాలర్లకు అటు ఇటుగా ఉండగా.. ఆగస్టు 1 నాటి ధరల ప్రకారం ముడి చమురు బ్యారెల్ ధర 97.31 డాలర్ల స్థాయిని చేరింది.
Cryptocurrency Prices: 24 గంటల్లో ఇంత పెరిగిందా! బిట్‌కాయిన్‌ను అస్సలు ఊహించలేదు!
Stock Market Closing: ఎగిసిన సెన్సెక్స్, నిఫ్టీ! ఒక్క రోజులో రూ.2.5 లక్షల కోట్లు లాభపడ్డ ఇన్వెస్టర్లు!
Elon Musk Teases X.com: ట్విటర్‌కు పోటీగా X.com తెస్తానన్న ఎలన్ మస్క్! ఓపెన్ చేస్తే ఏమొస్తుందో తెలుసా?
Raksha Bandan 2022: రాఖీ కడితే డబ్బు, బంగారం ఇవ్వకండి! ఇలా ప్రేమను చాటుకోండి!
Stock Market Opening: స్టాక్ మార్కెట్లు ఫైర్! 60K మరెంతో దూరంలో లేదు! 578 పాయింట్ల లాభంలో సెన్సెక్స్
MP Gorantla Madhav Issue : ఎంపీ గోరంట్ల మాధవ్ వ్యవహారంపై ప్రధానికి లేఖ రాసిన పంజాబ్ ఎంపీ
Bihar: బిహార్‌లో ఈ అనూహ్య మార్పు వెనక ఆమె హస్తం ఉందా? నితీష్ మనసు ఉన్నట్టుండి ఎలా మారింది?
Rayachoti Crime : కోడలి తల నరికిన అత్త, తలతో పోలీస్ స్టేషన్ కు!
NBK108 Announcement : ఇంతకు ముందు ఎప్పుడూ చేయనటువంటి పాత్రలో నందమూరి బాలకృష్ణ